బాలికపై సామూహిక అత్యాచారం | Adilabad Town 4 Guy's Gang Rape | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక అత్యాచారం

Published Tue, Mar 6 2018 9:24 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Adilabad Town 4 Guy's Gang Rape - Sakshi

ఆదిలాబాద్‌:  ఆదిలాబాద్‌కు చెందిన బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ కే.నర్సింహారెడ్డి సోమవారం స్థానిక వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం ఇంద్రవెల్లికి చెందిన రాథోడ్‌ సంజీవ్‌(30) బాలికకు ఫోన్‌లో మాయమాటలు చెప్పడంతోపాటు ఆమె స్నేహితురాలు తనతోనే ఉందంటూ నమ్మబలికాడు.

 ఆదిలాబాద్‌లోని స్టార్‌ మెడికల్‌ దగ్గరికి పిలుపించుకున్నాడు. సంజీవ్‌ తన స్నేహితులైన ఉట్నూర్‌కు చెందిన కే.విశాల్‌(35), ఇంద్రవెల్లికి చెందిన కే.విజయ్‌ ప్రకాశ్‌(35)లతో కలిసి కార్‌లో ఆదిలాబాద్‌ మండలం లాండసాంగ్వి రోడ్డు ప్రాంతంలో ఉన్న జి.సంతోష్‌(30) ఫాం హౌజ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ నలుగురూ కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక డయల్‌ 100కు ఫోన్‌చేసి వివరించగా, వెంటనే రంగంలోకి దిగిన పట్టణ సీఐ వి.సురేష్, ఎస్సై ఎంఏ బాకి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

 పట్టణ పోలీసుస్టేషన్‌లో అత్యాచారం కింద కేసు నమోదు చేయగా, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఆదేశాల మేరకు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి ఫిర్యాదు ఇవ్వగా, 12 గంటల్లోనే ఈ కేసును ఛేదించినట్లు వివరించారు. నాలుగు సెల్‌ఫోన్‌లు, ఒక స్విఫ్ట్‌ డిజైర్‌ కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ, ఎస్సైలను ఎస్పీ ఈ సందర్భంగీఆ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement