గర్భిణిపై ముగ్గురి లైంగికదాడి | Molestation on Pregnant Woman in Tamil Nadu | Sakshi
Sakshi News home page

గర్భిణిపై ముగ్గురి లైంగికదాడి

Published Sat, Dec 14 2019 10:50 AM | Last Updated on Sat, Dec 14 2019 10:50 AM

Molestation on Pregnant Woman in Tamil Nadu - Sakshi

తమిళనాడు ,అన్నానగర్‌ :  కడలూర్‌లో భర్తతో వస్తున్న 5నెలల గర్భిణిని కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. పుదుప్పాలైయమ్‌ ప్రాంతానికి చెందిన 21ఏళ్ల మహిళ.. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి కడలూర్‌లోని ఓ థియేటర్‌లో సినిమా చూసి తిరిగి వస్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను బలవంతగా ఎత్తుకెళ్లారు. కమ్మియమ్‌పేటలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత ఆ మహిళను కారులోనే తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలివెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు పుదునగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు ఎస్పీ శాంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement