వర్ధమాన నటిపై గ్యాంగ్‌ రేప్‌ | Bihar Model Gang Raped in Delhi 3 Arrested | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 28 2017 9:28 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

Bihar Model Gang Raped in Delhi 3 Arrested  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానిలో మరో దాష్టీకం చోటు చేసుకుంది. పలు టీవీ సీరియళ్లలో సహాయక పాత్రల్లో నటించిన మోడల్‌(23) గ్యాంగ్‌ రేప్‌కి గురైంది. 

పోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన సదరు యువతి మోడలింగ్‌ కోసం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఈ క్రమంలో పలు సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే ఓ ముగ్గురు వ్యక్తులు ఆమెను కలిసి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని ఆమెతో నమ్మబలికారు. ముంబైలో ఉన్న ఓ స్టార్‌ డైరెక్టర్‌ కొత్త వాళ్ల కోసం అన్వేషణ ప్రారంభించాడని.. నేరుగా ఆయనతోనే మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఈ క్రమంలో డిసెంబర్‌ 25న సరోజినీ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి.. ఆ ముగ్గురు ఆమెపై ఈ దారుణానికి తెగబడ్డారు. మరుసటి రోజు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిని అరెస్ట్‌ చేశారు. అయితే కాసేపటికే వారిని విడుదల చేసినట్లు తెలియటంతో సదరు మోడల్‌ ఆందోళనకు సిద్ధమైంది. వారి వల్ల తన ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఆమె భయపడుతోంది. అయితే వారిని బెయిల్‌ పై విడుదల చేశామని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement