బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువతిని 12 మంది యువకులు సాముహిక అత్యాచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా, ఈ ఏడాది మే నెలలో, అత్యాచార ఘటన జరిగిందని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు. ఈ కేసును కేవలం ఐదు వారాల వ్యవధిలోనే పూర్తి చేసి, కోర్ట్‌లో చార్జ్‌షిట్ దాఖలు చేశామని ఈరోజు (గురువారం) ట్వీట్ చేశారు.
అదే విధంగా, ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించినందుకు, దీనిలో పాల్గోన్న అధికారులకు 1 లక్ష రూపాలయలను రివార్డుగా ప్రకటించారు. అయితే, నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్యాంగ్, బంగ్లాదేశ్‌కు చెందిన యువతిని, మూడేళ్ల క్రితం అక్రమంగా తీసుకోచ్చి అస్సాం, పశ్చిమబెంగాల్, తెలంగాణ, కర్ణాటకలో తిప్పుతూ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
వీరిమధ్య డబ్బుల విషయంలో గొడవ రావడంతో, మిగతావార ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. వీరంతా ఒకే గ్రూప్‌కు చెందినవారుగా భావిస్తున్నారు. అయితే, 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు యువతులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడ్డారు. వీరిపై పలు సెక్షన్‌ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు.
<
An update on the Bangladeshi woman abuse case:
— Kamal Pant, IPS (@CPBlr) July 8, 2021
Twelve accused are arrested, out of which 11 accused persons & the victim are Bangladeshi nationals. The investigation is complete and a detailed & systemic 1019 page charge sheet has been submitted to the Hon'ble Court.. (1/3)
Comments
Please login to add a commentAdd a comment