ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని స్థాయిని మున్సిపల్ స్థాయికి దిగజార్చారని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని స్థాయిని మున్సిపల్ స్థాయికి దిగజార్చారని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. మోదీ అనుసరించిన మతతత్వ విధానాలతో పాటు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ చేసిన ప్రకటనలు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణంగా ఆయన విశ్లేషించారు. ఈ ఫలితాలతో అయినా మోదీ కళ్లు తెరవాలని ఆయన సూచించారు. బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం వరంగల్ ఉప ఎన్నికపై ఉంటుందని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.