results
-
Bihar: పరీక్షల్లో టాపర్‌ను మేళతాళాలతో ఊరేగిస్తూ..
పట్నా: బీహార్ బోర్డు(Bihar Board) తాజాగా 12వ తరగతి ఫలితాలను విడుదలు చేసింది. పెళ్లిళ్లలో మేళతాళాలు వాయించే వ్యక్తి కుమార్తె సంజనా కుమారి ఈ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆర్ట్స్ గ్రూపులో రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. సంజన 93.6శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. ఆమె భవిష్యత్‌లో ఐఏఎస్ కావాలనుకుంటోంది.సంజనా కుమారి మోతీపూర్ పరిధిలోని అంజనాకోట్లో ఉంటోంది. కుటుంబంలోని ముగ్గురు సంతానంలో ఆమె మూడవది. సంజనా మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు దీపక్ ఇటీవలే ప్రభుత్వ టీచర్(Government teacher) ఉద్యోగం సంపాదించాడని తెలిపింది. మరో సోదరుడు కూడా చదవులో ప్రతిభ చూపిస్తున్నాడని పేర్కొంది. ఇష్టంగా కష్టపడి చదవితేనే మంచి స్కోరు సాధించగలమని సంజన స్పష్టం చేసింది.పరీక్షల్లో తాను రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచానని తెలియగానే ఎంతో ఆనందించానని, ఇంట్లోని వారికి ఈ విషయం తెలిసి, ఎంతో సంబరపడ్డారని సంజన పేర్కొంది. ఇండియా టీవీ కథనంలోని వివరాల ప్రకారం సంజన తన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని, వారి మార్గదర్శకత్వంలో చదివి, తాను ఉత్తీర్ణత సాధించానని వివరించింది. తాను పరీక్షలకు ముందు రోజుకు 10 నుంచి 12 గంటలపాటు చదివేదానినని, సెల్ఫ్ స్టడీ తనకు ఎంతో ఉపకరించిందని తెలిపింది. భవిష్యత్‌లో ఐఏఎస్ కావాలన్నదే తన కల అని సంజన పేర్కొంది. కుమార్తె 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందని తెలియగానే తండ్రి ఆమెను మేళతాళాలతో ఊరేగించారు. ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట -
తరతరాలకు చెరగని ‘టాపర్ల’ చిరునామా..
పట్నా: బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే అవే పరీక్షల్లో టాపర్‌గా నిలిస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. మరి.. తరతరాలుగా టాపర్లుగా నిలుస్తున్న ఆ కుటుంబంలోని వారు ఎంత ఆనందించాలి?తాజాగా బీహార్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు(Bihar Intermediate Board Exam Results) విడుదలయ్యాయి. ఈ నేపధ్యంలో పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారిని పట్నాలోని బోర్డు కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం పిలిచారు. సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికర టాపర్ల ఫ్యామిలీ ఉదంతం మీడియాకు దొరికింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు టాపర్లుగా నిలుస్తూ వస్తున్నారు. బెట్టియాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన తాత, తండ్రి, ఇప్పుడు తనయుడు తమ ప్రతిభతో పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఈ కుటుంబానికి చెందిన మూడవ తరం వాడైన యువరాజ్ బీహార్ బోర్డు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.యువరాజ్ కుమార్ పాండే మాట్లాడుతూ నాటి రోజుల్లో మా తాత కూడా టాపర్‌గా నిలిచారని, మెట్రిక్యులేషన్లో టాపర్‌గా నిలిచారని, తరువాత బీఎస్సీలోనూ టాపర్ అయ్యారన్నారు. మా నాన్న కూడా టాపర్ల లిస్ట్‌లో పేరు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడు తాను కూడా ఈ జాబితాలో చేరానన్నారు. ఈ సందర్భంగా యువరాజ్ తండ్రి రజనీష్ కుమార్ పాండే మాట్లాడుతూ తన తండ్రి 1954లో గ్రాడ్యుయేషన్(Graduation)లో టాపర్‌గా నిలిచారన్నారు. తన సోదరుడు కూడా 1998లో టాపర్ అని, 1996 ఇంటర్మీడియట్ బ్యాచ్‌లో తాను టాపర్‌గా నిలిచానన్నారు. గతంలో రాష్ట్రంలో కాపీయింగ్ జరిగేదని రజనీష్ కుమార్ పాండే అన్నారు. 1996లో మొదటిసారిగా కేంద్రీకృత పరీక్ష నిర్వహించినప్పుడు తాను టాపర్‌గా నిలిచానన్నారు. తన ఇద్దరు మేనల్లుళ్ళు కూడా వారి వారి పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారన్నారు.ఇది కూడా చదవండి: పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు -
ఎస్సైకి గ్రూప్–1 ఉద్యోగం
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్‌గౌడ్ గ్రూప్–1కు ఎంపికయ్యారు. ఇటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే.. అటు గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. సోమవారం విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో మాధవ్‌గౌడ్ 505 మార్కులు సాధించారు. మెరిట్ మేరకు ఆయనకు డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మాధవ్‌గౌడ్ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్పూర్. తండ్రి మొగిలి పోస్టల్ ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. 2019 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన వరంగల్ కమిషనరేట్ పరిధి జఫర్గడ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల బదిలీపై కేయూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం భీమారంలోని సత్యసాయికాలనీ–5లో భార్యాపిల్లలతో ఉంటున్నారు.గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానంశాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌ృ1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్‌ృ1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు. -
TSPSC Group 2 results released : తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల
-
గ్రూప్–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ
మంచిర్యాల: గ్రూప్–1 ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇందులో పలువురుయువకులు ప్రతిభ కనబర్చారు. కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించారు. తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌కు చెందిన సురుకుంటి సచిన్.. 454.5 మార్కులు సాధించాడు. ఈయన వార్డు ఆఫీసర్‌గా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన ఎల్టి కార్తీక్‌రెడ్డి..443 మార్కులు సాధించాడు. బోథ్ మండలం ధనోర గ్రామానికి చెందిన నల్ల లావణ్యరెడ్డి.. తాంసి మండలం హస్నాపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాయగా 441.5 మార్కులు సాధించింది. తాంసికి చెందిన జానకొండ అశోక్ పంచాయతీ కార్యదర్శిగా జైనథ్ మండలం సుందరగిరిలో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాశాడు. 398.50 మార్కులు సాధించాడు. -
గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీపీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేయనుంది. ఈ నెల 10 నుంచి 18 మధ్య గ్రూప్-1, 2, 3 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా, 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనుంది. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలను విడుదల చేయనుంది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించడానికి టీజీపీఎస్సీ తుది పరిశీలన చేస్తోంది. -
AP MLC Results 2025: షాక్ లో టీడీపీ, జనసేన
-
త్రిముఖ పోరులో నెగ్గేదెవరు..? తగ్గేదెవరు..?
-
TG: గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ:తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం(ఫిబ్రవరి3) సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్-1 నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 పరీక్ష తొలిసారిగా జరగడం గమనార్హం.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు వెల్లడించనున్నారు. -
త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులు
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్(Havells) ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 3 శాతంపైగా క్షీణించి రూ. 278 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 288 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం ఎగసి రూ. 4,953 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 4,414 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 4,576 కోట్లకు చేరాయి. స్పెన్సర్స్ రిటైల్..ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ సంస్థ స్పెన్సర్స్(Spencers) రిటైల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో మరోసారి నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 47 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 51 కోట్లతో పోలిస్తే నష్టాలు 8 శాతంపైగా తగ్గాయి. మొత్తం ఆదాయం సైతం 21 శాతం క్షీణించి రూ. 517 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో రూ. 654 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యయాలు 20 శాతం తగ్గి రూ. 567 కోట్లకు చేరాయి. కాగా.. జిఫీ బ్రాండుతో క్విక్‌కామర్స్‌లోకి ప్రవేశించినట్లు కంపెనీ వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు పేర్కొంది. తదుపరి దశలో యూపీలో విస్తరించనున్నట్లు తెలియజేసింది. అనుబంధ సంస్థ ప్రీమియం రిటైల్ చైన్ నేచర్స్ బాస్కెట్‌ను పునర్వ్యవస్థీకరించే యోచనేమీ లేదని చైర్మన్ శాశ్వత్ గోయెంకా స్పష్టం చేశారు. నష్టాలు నమోదు చేస్తున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల నుంచి వైదొలగినట్లు తెలియజేశారు.డీబీ కార్ప్..మీడియా రంగ దిగ్గజం డీబీ కార్ప్(DB Corp) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 118 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2023 –24) ఇదే కాలంలో రూ. 124 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 643 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 645 కోట్ల టర్నోవర్ అందుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ. 497 కోట్ల నుంచి రూ. 496 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. ప్రింటింగ్, పబ్లిíÙంగ్ తదితర విభాగాల ఆదాయం యథాతథంగా రూ. 594 కోట్లుగా నమోదైంది. అయితే రేడియో బిజినెస్ 5 శాతం బలపడి రూ. 49 కోట్లకు చేరింది. సంస్థ దైనిక్ భాస్కర్, సౌరాష్ట్ర సమాచార్, దివ్య మరాఠీ తదితర ఐదు వార్తా పత్రికలను ప్రచురించే సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్ఎల్టీఐమైండ్ట్రీ...ఐటీ సొల్యూషన్ల దిగ్గజం ఎల్‌టీఐమైండ్‌ట్రీ(LTI MindTree) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 1,085 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,169 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం పుంజుకుని రూ. 9,661 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 9,017 కోట్ల టర్నోవర్ సాధించింది. విభిన్న ఏఐ వ్యూహాల నేపథ్యంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 1.68 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ వెల్లడించారు. నూతన భాగస్వామ్యాలు, స్పెషలైజేషన్లు, ఏఐలపై కొనసాగుతున్న పెట్టుబడులు కొత్త ఏడాదిలోనూ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. 2024 డిసెంబర్31కల్లా 742 యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఈ కాలంలో 2,362 మందికి ఉపాధి కలి్పంచడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 86,800ను తాకింది. -
సియట్, నెట్వర్క్18 లాభాలు డౌన్
టైర్ల తయారీ దిగ్గజం సియట్(Ceat) లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 46 శాతంపైగా క్షీణించి రూ. 97 కోట్లకు పరిమితమైంది. పెరిగిన ముడిసరుకుల వ్యయాలు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 181 కోట్లుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,963 కోట్ల నుంచి రూ. 3,300 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,739 కోట్ల నుంచి రూ. 3,176 కోట్లకు పెరిగాయి. ముడిసరుకుల వినియోగ వ్యయాలు రూ. 1,695 కోట్ల నుంచి రూ. 2,117 కోట్లకు ఎగశాయి. అన్ని విభాగాలలోనూ పటిష్ట ఆర్డర్ బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అర్నాబ్ బెనర్జీ పేర్కొన్నారు. స్థిరమైన డిమాండ్ కారణంగా ఆదాయంలో వృద్ధి కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు.ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలునెట్వర్క్18..ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18(Network18) మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో భారీ నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,400 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే అనుకోని పద్దులకు ముందు దాదాపు రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. అనుబంధ సంస్థల గుర్తింపురద్దుతో రూ. 1,426 కోట్ల నష్టం నమోదైనట్లు వెల్లడించింది. వీటిని ప్రొవిజనల్‌గా మదింపు చేసినట్లు తెలియజేసింది. స్టార్ ఇండియాతో అనుబంధ కంపెనీ వయాకామ్18 విలీనం కారణంగా గతేడాది(2023–24) ఫలితాలను పోల్చతగదని పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 1,361 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 476 కోట్లను అధిగమించగా.. అనుకోని ఆర్జనతో రూ.3,432 కోట్ల లాభం ఆర్జించింది. -
జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు భారత్ సమన్లు
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్‌బర్గ్ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్ పార్లమెంటరీ హౌజ్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కౌంటర్ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.జుకర్‌బర్గ్ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన. -
క్యూ3 ఫలితాలే దిక్సూచి
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 9న షురూ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్తోపాటు టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎలక్సీ, ఫైనాన్షియల్ పీఎస్‌యూ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ(ఇరెడా) గురువారం(9న) క్యూ3 పనితీరును వెల్లడించనున్నాయి. తద్వారా ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుట్టనున్నాయి. ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మంగళవారం తొలిసారి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. టీసీఎస్ పటిష్ట పనితీరు సాధిస్తే ఇటీవల అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులవైపు దృష్టి పెట్టవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. దేశీ అంశాలు వారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సరీ్వసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది. దీంతో ఇన్వెస్టర్లు బడ్జెట్ ప్రతిపాదలపైనా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఎఫెక్ట్ ఈ నెల మూడో వారంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గత వారాంతాన ముడిచమురు ధరలు బలపడ్డాయి. బ్రెంట్ బ్యారల్ 75 డాలర్లను తాకింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 85.79కు చేరింది. ఇక ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత పాలసీ నిర్ణయాలకు సంబంధించిన వివరాలు(మినిట్స్) 9న వెల్లడికానున్నాయి. ఈ అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అంచనా వేశారు. కాగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే దేశీ ఫండ్స్ భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ అంశాలన్నీ ట్రెండ్ నిర్ణయంలో కీలకంగా నిలవనున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే తెలియజేశారు. గత వారమిలా శుక్రవారం(3)తో ముగిసిన గత వారం తీవ్ర ఆటుపోట్ల మధ్య మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 524 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 79,223 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 191 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,000 పాయింట్లకు ఎగువన 24,005 వద్ద నిలిచింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం జంప్‌చేసింది.ఎఫ్‌పీఐలు వెనక్కివిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త ఏడాది తొలి మూడు(1–3) ట్రేడింగ్ రోజుల్లో నికర అమ్మకందారులుగా నిలిచారు. వెరసి రూ. 4,285 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే డిసెంబర్లో తొలుత అమ్మకాలకే పరిమితమైనప్పటికీ చివరి రెండు వారాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. వెరసి గత నెలలో నికరంగా రూ. 15,446 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారడం, డాలరు బలపటడంతో ఎఫ్‌ఫీఐలు అమ్మకాలకే కట్టుబడవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. -
100 శాతం ఫలితాలతో క్యాన్సర్ ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
క్యాన్సర్ బాధితులకు శుభవార్త. త్వరలో వారికి ఈ వ్యాధి నుంచి విముక్తి లభించనుంది. క్యాన్సర్ డ్రగ్ డోస్టార్లిమాబ్కు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) బ్రేక్‌త్రూ థెరపీ హోదాను మంజూరు చేసింది. దీంతో ఈ ఔషధం త్వరలోనే క్యాన్సర్ బాధితులకు అందుబాటులోకి రానుంది.అత్యుత్తమ ఆశాజనక ఫలితాలను అందించిన డోస్టార్లిమాబ్ను విరివిగా మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డోస్టార్లిమాబ్ (బ్రాండ్ పేరు జెంపెర్లి)కు గత జూన్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో వందశాతం ఆశాజనక ఫలితాలు వచ్చాయని ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో పేర్కొన్నారు. ఈ డోస్టార్లిమాబ్ ఔషధం ప్రోగ్రామ్ చేసిన డెత్ రిసెప్టర్-1 (పీడీ-1)-బ్లాకింగ్ యాంటీబాడీ, శస్త్రచికిత్స, రేడియేషన్ చికిత్స లేదా కీమోథెరపీ అవసరం లేకుండా పేగు క్యాన్సర్ (Rectal Cancer)కణితులను పూర్తిగా నిర్మూలించింది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ఇమ్యునోథెరపీ పేగు క్యాన్సర్ బాధితులను ఇతరత్రా సమస్యలకు గురిచేస్తోంది. సంతానోత్పత్తిని దెబ్బతీయడం లాంటి ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి.100 శాతం విజయవంతమైన ఫలితాలుక్యాన్సర్ ఔషధం డోస్టార్లిమాబ్ క్లినికల్ ట్రయల్స్(Clinical trials)లో 100శాతం విజయవంతమైన ఫలితాలను అందించింది. దీర్ఘకాలిక ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు అనువైన ఔషధంగానూ నిరూపితమయ్యింది. ఇప్పటివరకూ పేగు క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న చికిత్స నమూనాను మార్చడంలో, సమర్థవంతమైన ఫలితాలను అందించడంలో డోస్టార్లిమాబ్ ఉత్తమంగా పనిచేస్తున్నదని గ్లాక్సో స్మిత్క్లైన్లోని పరిశోధన, అభివృద్ధి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేషమ్ అబ్దుల్లా పేర్కొన్నారు.ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు 1,516 అభ్యర్థనలుక్యాన్సర్ చికిత్సపై పరిశోధనలు సాగిస్తున్న అమెరికాకు చెందిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్కే) ఇటీవల ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం క్యాన్సర్‌కు ఇక చికిత్స అందించలేని తీవ్రమైన పరిస్థితుల్లో ఉపయుక్తమయ్యేందుకు అనువైన ఔషధాల ఉత్పత్తికి సంబంధించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు 1,516 అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన అసంతరం 587 ఔషధ నమూనాలకు అనుమతి మంజూరయ్యింది. 30 నుంచి 40% అభ్యర్థనలకు ఆమోదం లభ్యమయ్యింది.ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో పరిశోధనలుమెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్లో పేగు క్యాన్సర్ బాధితులపై డోస్టార్లిమాబ్ ఔషధ ప్రయోగాలు నిర్వహించారు. దీనిని ఆంకాలజిస్టులు నిశితంగా పరిశీలించారు. ఈ ఔషధం బాధితునిలోని క్యాన్సర్ కణితులను 100 శాతం నిర్మూలించిందని గుర్తించారు. ప్రారంభంలో 24 మంది రోగులపై ఈ ఔషధ ప్రయోగాలు చేశారు. క్లినికల్ ట్రయల్‌లో భాధితులలోని ప్రతీ ఒక్కరిపై ఈ ఔషధం అద్భుతంగా పనిచేసిందని ఎంఎస్కే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆంకాలజిస్ట్(Gastrointestinal Oncologist) ఆండ్రియా తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 42 మంది బాధితులకు డోస్టార్లిమాబ్తో చికిత్స అందించగా,చికిత్స అనంతరం వారిలో వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు దూరమయ్యాయన్నారు. డోస్టార్లిమాబ్ వినియోగం వలన వచ్చే దుష్ప్రభావాలు చాలా తేలికపాటివి.. తట్టుకోగలిగేవని అన్నారు. ఈ నూతన చికిత్స అద్భుత ఫలితాలను అందించిదని తెలిపారు.ఏడాది వ్యవధిలోనే క్యాన్సర్ నుండి విముక్తిడోస్టార్లిమాబ్ ట్రయల్‌లో పాల్గొన్న బాధితుల్లోని చాలామంది ఏడాది వ్యవధిలోనే క్యాన్సర్ నుండి పూర్తి విముక్తి పొందారని, ఈ ట్రయల్స్ వందశాతం విజయమంతమయ్యాయని ఆంకాలజిస్ట్ ఆండ్రియా పేర్కొన్నారు. కాగా బ్రేక్‌త్రూ స్టేటస్ అనేది దోస్టార్లిమాబ్కు రెండవ ఎఫ్‌డీఏ హోదా. ఈ ఔషధం 2023, జనవరిలోనే ఫాస్ట్ ట్రాక్ హోదాను పొందింది. ఇప్పుడు డోస్టార్లిమాబ్ ట్రయల్ తదుపరి హోదాను కూడా దక్కించుకుంది. అమెరికాలో ప్రతీయేటా 46,220 మంది పేగు క్యాన్సర్ బారిపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: Vikram Sarabhai: భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా.. -
Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు
కొద్ది రోజుల్లో 2024 ముగిసి 2025 రాబోతుంది. 2024 మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వాటిని ఇప్పుడొకసారి గుర్తు చేసుకుంటే, భవిష్యత్‌లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడగలుగుతాం. 1. వాటర్ హీటర్ షాక్‌తో మహిళ మృతిఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్‌లో ఈ ఏడాది నవంబర్‌లో వాటర్ హీటర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.తప్పు ఎక్కడ జరిగింది?కరెంట్ స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో పాటు నీళ్లలో చేయి వేయడం ఆ మహిళ తప్పిదమే. ఫలితంగా ఆమె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.గ్రహించాల్సిన విషయంవాటర్ హీటర్ వినియోగించాక స్విచ్ ఆఫ్ చేయాలి. హీటర్ రాడ్‌ను నీటిలో నుండి తీసివేయాలి. ఆ తర్వాతనే ఆ వేడి నీటిని వినియోగించాలి2. రూమ్ హీటర్ కారణంగా వృద్ధురాలు మృతి 2024, నవంబర్‌లో యూపీలోని మీరట్‌లోని ఒక ఇంటిలోని బెడ్రూమ్లో ఒక వృద్ధ మహిళ మృతదేహం కనిపించింది. ఆమె రూమ్ హీటర్ ఆన్ చేసి పడుకుంది.జరిగిన తప్పిదం ఏమిటి?ఆ వృద్ధురాలు హీటర్ స్విచ్ ఆన్ చేసి, గది తలుపులు వేసుకుని పడుకుంది. రూమ్ హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడడంతో దానినే ఆమె పీల్చుకుంది. ఫలితంగా ఆమె మరణించింది.గ్రహించాల్సిన విషయంగదిలోని హీటర్ ఆన్‌చేసి, తలుపులు వేసుకుని ఎప్పుడూ నిద్రపోకూడదు. హీటర్‌ను రెండు గంటల కంటే ఎక్కువసేపు ఆన్‌లో ఉంచకూడదు.3. ప్రెషర్ కుక్కర్ పేలి బాలికకు గాయాలుఈ ఏడాది జూలైలో యూపీలోని శ్రావస్తి జిల్లాలో ప్రెషర్ కుక్కర్ పేలడంతో 11 ఏళ్ల బాలిక గాయపడింది.ఏమి తప్పు జరిగింది?ప్రెషర్ కుక్కర్లో పేలుడు సంభవించడానికి కారణం రబ్బరు సరిగా అమర్చకపోవడం లేదా విజిల్ పాడైపోవడం కారణమై ఉంటుంది.నేర్చుకోవాల్సిన విషయంకుక్కర్ని ఉపయోగించే ముందు రబ్బరు, విజిల్, సేఫ్టీ వాల్వ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.4. గీజర్ కారణంగా నవ వివాహిత మృతి2024 నవంబర్‌లో యూపీలోని బరేలీలో కొత్తగా పెళ్లయిన ఓ మహిళ బాత్రూమ్లో గీజర్ ఆన్‌లో ఉంచి స్నానం చేస్తోంది. అదేసమయంలో ఉన్నట్టుండి గీజర్ పేలిపోయింది.ఏం తప్పు జరిగింది?చాలాకాలంగా ఆ గీజర్‌కు సర్వీస్ చేయించలేదు.నేర్చుకోవాల్సినదిగీజర్ను చాలాకాలంపాటు వినియోగించకుండా ఉంటే, దానిని సర్వీస్ చేయించిన తరువాతనే వినియోగించాలి.5. గ్యాస్ సిలిండర్ పేలుడు2024, మార్చిలో పట్నాలో ఓ పెళ్లి వేడుకలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి.ఏం తప్పు జరిగింది?గ్యాస్ సిలిండర్ పేలిన సందర్భాల్లో సరైన నిర్వహణ లేకపోవడమే కారణం.నేర్చుకోవలసినది ఏమిటి?సిలిండర్‌ను ఎప్పుడూ నిలబెట్టి ఉంచాలి. దానిని పడుకోబెట్టి ఉంచకూడదు. దాని వాల్వ్ ఎప్పుడూ పైకి ఉండాలి. అలాగే సిలిండర్‌ను గాలి తగిలే ప్రాంతంలో ఉంచాలి. కిటికీలు, తలుపులు మూసివున్న ప్రాంతంలో ఉంచకూడదు.6. మొబైల్ ఛార్జర్ కారణంగా బాలిక మృతితెలంగాణలో విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె మొబైల్ ఛార్జర్‌ని ఆన్‌లో ఉంచి ఫోను వినియోగించింది. ఫలితంగా ఆమె విద్యుత్ షాక్‌నకు గురయ్యింది.ఏం తప్పు జరిగింది?విద్యుత్ ఛార్జర్‌ను విద్యుత్ సాకెట్లో పెట్టి, ఫోను వినియోగించడం వలన అది విద్యుత్ షాక్‌కు దారితీస్తుంది.మనం నేర్చుకోవల్సినది ఏమిటి?ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచి ఎప్పుడూ ఉపయోగించకూడదు.7. పవర్ బ్యాంక్ కారణంగా చెలరేగిన మంటలుఈ ఏడాది అమెరికాలోని ఒక ఇంటిలో ఒక శునకం పవర్ బ్యాంక్ నమలడంతో దాని నుంచి మంటలు చెలరేగాయి.ఏం తప్పు జరిగింది?చాలా పవర్ బ్యాంకులు ఓవర్ హీట్ అయినప్పుడు పేలే అవకాశం ఉంది.మనం నేర్చుకోవలసినదిపవర్ బ్యాంక్‌ను చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.8. డీజే సౌండ్‌కు చిన్నారి మృతిఈ ఏడాది భోపాల్‌లో డీజే శబ్దానికి ఓ చిన్నారి మృతి చెందింది.ఏం తప్పు జరిగింది?డీజే నుంచి వచ్చే ధ్వని మనిషి వినికిడి సామర్థ్యం కంటే 300 రెట్లు ఎక్కువ.దీని నుంచి నేర్చుకోవలసినదిఎల్లప్పుడూ లౌడ్ స్పీకర్లకు అత్యంత సమీపంలో నిలబడకూడదు. అటువంటి సందర్బాల్లో నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్లను ఉపయోగించాలి.9. జాబ్ ఆఫర్ పేరుతో మోసంఈ ఏడాది నవంబర్‌లో పంజాబ్‌లోని మొహాలీలో టెలిగ్రామ్‌లో జాబ్ ఆఫర్ పేరుతో ఒక ముఠా మోసానికి పాల్పడింది. ఓ యువకుడి నుంచి రూ.2.45 లక్షలకు పైగా మొత్తాన్ని వసూలు చేసింది.ఏం తప్పు జరిగింది?ఆ యువకుడు ఆ జాబ్ ఆఫర్‌ను గుడ్డిగా నమ్మాడు. వాళ్లు అడిగినంత మొత్తం చెల్లించాడు.దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠంఉద్యోగం పేరుతో ఎవరైనా మీ నుండి డబ్బు డిమాండ్ చేస్తుంటే, అటువంటి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.10. కారు లాక్ కావడంతో మూడేళ్ల బాలిక మృతి2024 నవంబర్‌లో యూపీలోని మీరట్‌కు చెందిన మూడేళ్ల బాలిక ఒక కారులో నాలుగు గంటలపాటు లాక్ అయిపోయింది. ఫలితంగా ఊపిరాడక ఆ చిన్నారి మృతిచెందింది.ఏం తప్పు జరిగింది?కారు డోరు లాక్ కావడంతో దానిలోని ఆక్సిజన్ లెవల్ తగ్గింది. కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగింది. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందింది.నేర్చుకోవలసిన అంశంకారులో పిల్లలను ఉంచి బయటకు వెళ్ల కూడదని గుర్తించాలి.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు -
మహా పోరులో తెలుగోడి ఢంకా : బాబాయ్- అబ్బాయ్‌ల గెలుపోటములు తీరిదీ!
సోలాపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరి కలలు నెరవేరగా.. అనేకమంది వైఫల్యాలను చవిచూశారు. కోటే కుటుంబానికి చెందిన మహేశ్ కోటే, ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకే కుటుంబం తరఫున ఇరువురు అందులో తెలుగువారు శాసనసభ్యులు అయ్యే కల నెరవేరుతోందని వారి అనుచరులు భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న మహేశ్ కోటే కల చెదిరిపోగా.. ఆయన తమ్ముడు కొడుకు దేవేంద్ర ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. పట్టణంలో పేరు గాంచిన కోటే కుటుంబం కాంగ్రెస్‌కు, ముఖ్యంగా సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ శిందేకు విధేయులుగా గుర్తింపు పొందింది. సుశీల్ కుమార్ శిందే ఎన్నికల్లో విజయం సాధించడంలో, రాజకీయ ఆధిపత్యం అంతా దివంగత విష్ణు పంతు కోటే ఎన్నికల వ్యూహంలో ప్రధానపాత్ర పోషించేవారు. అయితే సుశీల్ కుమార్ శిందే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఇక్కడి ఎంపీ టికెట్ విష్ణు పంతు కోటేకు వస్తుందని అంతా భావించారు. అయితే విష్ణు పంతుకోటేకు మాత్రం అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009లో సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణు పంత్ కుమారుడైన మహేశ్ కోటేకు కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థత్వం లభించింది. అయితే అప్పటి మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన వ్యక్తి రెబల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మహేశ్ కోటే ఎన్నికల్లో పరాభవం చెందారు. తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే తన ఎమ్మెల్యే కల నెరవేరదని తెలుసుకున్న మాజీ మేయర్ మహేశ్ కోటే శివసేనలో చేరారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో శివసేన తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు తీరా సమయంలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన మూడో స్థానంలో నిలిచారు. గత మూడు ఎన్నికలలో పరాభవం చవిచూసిన మహేశ్ కోటే గత సంవత్సరం కిందట శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టిగా సన్నాహాలు చేసుకున్నారు. మహా వికాస్ అఘాడీకి చెందిన నేతలు అందరూ ఈ ఎన్నికల్లో మహేశ్‌కు వెన్నంటి ఉండి ప్రచారాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయనే సోలాపూర్ నార్త్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి పరాభవం చెందారు. మరోవైపు ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలో దూకుడుగా ప్రసంగించడం ద్వారా కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఆ తర్వాత కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీలో క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధిష్టానం దృష్టిలో పడి అభ్యరి్థత్వాన్ని పొందారు. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు! -
మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు!
సోలాపూర్: జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. లాడ్కీ బహీన్ పథకం ప్రయోజనాలు మహా కూటమి అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి ప్రభుత్వానికి మహిళా ఓటర్లు భారీగా పట్టం కట్టారని స్పష్టం అవుతోంది. జిల్లాలోని ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ నాలుగు.. శివసేన యూబీటీకి చెందిన ఒకరు అలాగే షేకాపాకు చెందిన ఒకరు గెలుపొందారు. అక్కల్కోట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సచిన్ కల్యాణ్ శెట్టి 49 వేల 572 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామ్ మెత్రే పరాభవం చెందారు. భార్షీ నియోజకవర్గం నందు శివసేన యూబీటీకి చెందిన దిలీప్ సోపల్ 6,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఏక్నాథ్ శిందేకు చెందిన అభ్యర్థి రాజేంద్ర రౌత్ పరాభవం చెందారు. కరమాల నియోజకవర్గం నందు శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున నారాయణ పాటిల్ 16 వేల 85 ఓట్ల ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. ఆయన తన ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్ శిందేను ఓడించారు. మాడ నియోజకవర్గంలోని అభిజిత్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున పోటీ చేసి 30 వేల 621 ఓట్ల అధిక్యంతో విజయం పొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి రంజిత్ శిందేను ఓడించారు. మోహల్ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరఫున పోటీ చేసిన రాజు కర్రే 30 వేల రెండు వందల రెండు ఓట్లతో విజయం సాధించారు. ఇచ్చట సిట్టింగ్ ఎమ్మెల్యే యశ్వంత్ మానే ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ఐపీఎల్ 2025 వేలం : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?పండరీపూర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన సమాధాన్ అవతాడే 8 వేల 65 ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి భగీరథ బాలికేను ఓడించారు. సోలాపూర్ సిటీ నార్త్ నియోజకవర్గం ద్వారా బీజేపీకి చెందిన విజయ్ దేశ్‌ముఖ్ 51 వేల 88 ఓట్ల మెజారీ్టతో వరుసగా ఐదవసారి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థి మహేశ్ కోటేను ఓడించారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దేవేంద్ర కోటే 40 వేల 657 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఫారూక్ షాబ్దిని ఓడించారు. సాంగోల నియోజకవర్గంలో షేత్కారి కామ్‌గార్ పారీ్టకి చెందిన బాబాసాహెబ్ దేశ్‌ముఖ్ 25 వేల 386 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన ప్రత్యర్థి ఏక్నాథ్ శిందే శివసేనకు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు షాహాజీ బాపు పాటిల్‌ను ఓడించారు. మాల్ శిరస్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఉత్తం ఝాన్కర్ 137 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్సాత్ పూతేను ఓడించారు. ఆరు స్థానాల్లో బరిలోకి బీజేపీ అభ్యర్థులు.. ఐదు స్థానాల్లో గెలుపు -
మహారాష్ట్రలో యోగి మ్యాజిక్.. 18 చోట్ల ప్రచారం.. 17 సీట్లలో విజయం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. దీంతో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఎన్నికల్లో 132 సీట్లను గెలుపొందడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర పగ్గాలు చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విజయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కీలక పాత్ర పోషించారు.నిపుణులు విశ్లేషించిన వివరాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ 18 మంది బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయగా, వారిలో 17 మంది విజయం సాధించారు. అకోలా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఒక్క బీజేపీ అభ్యర్థి విజయ్ అగర్వాల్ మాత్రమే ఓటమి చవిచూశారు. విజయ్ అగర్వాల్ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సాజిద్ ఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ విధంగా చూస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల విజయం కోసం చేసిన ప్రచారంలో 95% స్ట్రైక్ రేట్‌ను దక్కించుకున్నారు.ఇదేవిధంగా సీఎం యోగి.. మహాయుతి కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ఐదుగురు అభ్యర్ధుల కోసం కూడా ప్రచారం చేశారు. ఆయన మొత్తంగా మహాయుతికి చెందిన 23 మంది అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. వీరిలో 20 మంది గెలిచారు. ఈ 20 మంది అభ్యర్థుల్లో 17 మంది బీజేపీ అభ్యర్థులు. ముగ్గురు విఫలమైన అభ్యర్థుల్లో శివసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. మహారాష్ట్రలో సీఎం యోగి స్ట్రైక్ రేట్‌పై పోస్టర్లు కూడా వెలిశాయి. ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు -
Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం
రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం (జేఎంఎం) 34 సీట్లు గెలుచుకుంది. ఇంతలో ఒక విచిత్ర పరిణామం చోటుచేసుకుంది.ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చీఫ్ సుదేష్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నానని ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏజేఎస్‌యూ పార్టీ అధినేత సుదేష్ మహతో ఓటమి పాలయ్యారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ పార్టీ జార్ఖండ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఈ విజయం సాధించింది. ఈ ఒక్క సీటు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నిర్మల్ మహతో కూడా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండూ స్థానం నుంచి ఎన్నికైన ఈయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ చీఫ్ సుదేష్ మహతోకు లేఖ పంపానని అన్నారు.తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయనను అభ్యర్థించానన్నారు. తద్వారా సుదేష్ మహతో ఇక్కడ(మండూ) జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. సుదేష్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి అమిత్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతనితో పాటు ఏజేఎస్‌యూకి చెందిన మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఈ పార్టీ కేవలం మండూ సీటును మాత్రమే గెలుచుకుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్.. మార్కెట్లు పుంజుకునే చాన్స్ -
శరద్ పవార్ శకం ముగిసినట్లే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) ఘోర పరాజయం పాలైంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఆ పార్టీ పొత్తులో భాగంగా 86 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 10 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ చీలిక వర్గం ఎన్సీపీ(అజిత్‌పవార్) 59 స్థానాల్లో పోటీచేసింది. 41 స్థానాల్లో విజయం సాధించింది. శరద్ పవార్‌కు కంచుకోట అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో అజిత్ పవార్ జయకేతనం ఎగురవేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థిగా పోటీ చేసిన శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ ఓడిపోయాడు. ఐదు నెలల క్రితం ఇదే బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే విజయం సాధించారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఆమె ఓడించారు. లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లలో పోటీ చేసిన శరద్ పవార్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఇకపై ఎన్నికలకు దూరంశరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గత ఏడాది జూలైలో ఎన్సీపీని చీల్చారు. బీజేపీ–శివసేన(షిండే) కూటమితో చేతులు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. అసలైన ఎన్సీపీ తమదేనంటూ శరద్ పవార్ చేసిన పోరాటం ఫలించలేదు. పార్టీని, పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్‌కే కేటాయించింది. కుట్రదారులను ఓడించాలంటూ శరద్ పవార్ చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ప్రజలు మన్నించలేదు. 57 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో శరద్ పవార్ బారామతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనుంది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడంలో శరద్ పవార్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ‘ఇండియా’కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర. కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్)ని తమ కూటమిలోకి తీసుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకు గాను ఎంవీఏ ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తగిన ప్రభావం చూపలేక చతికిలపడింది. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన శరద్ పవార్ చాణక్యం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో 54 సీట్లు గెలుచుకున్న శరద్ పవార్ ఈసారి 10 సీట్లకే పరిమితమయ్యారు. సోనియాతో విభేదించి కాంగ్రెస్‌తో పొత్తు 1940 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బారామతిలో జని్మంచిన శదర్ పవార్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ శిష్యుడిగా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 1967లో 27 ఏళ్ల వయసులోనే తొలిసారి బారామతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి జనతా పారీ్టతో పొత్తు పెట్టుకున్నారు. పవార్ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు. 1986లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రి, రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కీలకమైన రక్షణ, వ్యవసాయ శాఖలు ఆయన లభించాయి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ విదేశీయురాలు అని విమర్శిస్తూ 1999లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ)ని స్థాపించారు. తర్వాత అదే కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి కొనసాగింది. తాజా ఎన్నికల్లో శరద్ పవార్ దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ శకం ఇక ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు (శనివారం) వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారుయూపీలోని మీరాపూర్, కుందర్కి, సీసామవు, కటేహరి, ఫుల్పూర్, మజ్వాన్, ఘజియాబాద్, కర్హల్, ఖైర్ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దాని రాజకీయ ప్రత్యర్థుల మధ్య నెలకొన్న ఈ పోటీని 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. उप्र के विधानसभा उपचुनाव में चुनाव आयोग व इंडिया गठबंधन-सपा के सभी 9 सीटों के उम्मीदवारों से ये अपील है कि कल सुबह ये सुनिश्चित करें कि नियमानुसार पोस्टल बैलेट पहले गिने जाएं और फिर ईवीएम मशीनों के वोटों की मतगणना हो। सभी पूरी तरह मुस्तैद रहें और किसी भी तरह की गड़बड़ी होने या…— Akhilesh Yadav (@yadavakhilesh) November 22, 2024ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన ఒక ట్వీట్లో.. ఎన్నికల కమిషన్‌కు, ఇండియా అలయన్స్-ఎస్పీకి చెందిన తొమ్మిదిమంది అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు. శనివారం ఉదయం జరిగే పోస్టల్ బ్యాలెట్లను నిబంధనల ప్రకారం మొదట లెక్కించేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే ఎన్నికల కమిషన్‌కు, పార్టీకి తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు విజయ ధృవీకరణ పత్రాన్ని అందుకునేవరకూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్పూర్, ఘజియాబాద్, మజ్వాన్, ఖైర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సీసామవు, కటేహరి, కర్హల్, కుందర్కిలో ఎస్పీ విజయం సాధించింది. అప్పుడు ఎస్పీకి మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), మీరాపూర్ స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగమైంది. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఎస్పీకి మద్దతు పలికింది. -
చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్
ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్ 6) ట్రంప్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్..ట్రంప్ నినాదాలతో హోరెత్తించారు. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "...This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72— ANI (@ANI) November 6, 2024 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
మంత్రి లేక టెట్ ఫలితాలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జూలై–2024) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రకటించాల్సి ఉండగా, విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన ఫలితాలకు అడ్డంకిగా మారింది. అక్టోబర్ 3 నుంచి 21వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.వాస్తవానికి గతనెల 27న ప్రకటించాల్సిన ఫైనల్ కీ సైతం రెండు రోజులు ఆలస్యంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా టెట్ ఫలితాలను సోమవారం ప్రకటించి, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 6న విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, మంత్రి వచ్చాక టెట్ ఫలితాలు, డీఎస్పీ నోటిఫికేషన్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. -
కాంగ్రెస్ బలపడింది అని అనుకోవడం లేదు..
-
సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఐకమత్యం గురించి తెలిపే ఒక అద్భుతమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. వ్యాపార వ్యవహరాల్లో తలమునకలై ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎడ్యుకేట్ చేయడంలో, మోటివేట్ చేయడంలో ఈ బిజినెస్ టైకూన్ తరువాతే మరెవ్వరైనా అని చెప్పవచ్చు.మట్టిలో మాణిక్యాల్లాంటి వ్యక్తుల ప్రతిభను పరిచయం చేయడమే కాదు, తనవంతుబాధ్యతగా వారికి అండగా నిలుస్తారు. ఇన్స్పిరేషనల్ వీడియోస్, సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలు, అప్పుడప్పుడు మరికొన్ని ఫన్నీ విడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్ పేరుతో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బలం, శక్తి, స్వేచ్ఛకు ప్రతీకలు పక్షులు గుంపుగా ఎగురుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒంటరిగా ఎగరడం, అదీ అందనంత ఎత్తున ఆకాశతీరాన విహరించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ పనిలో జట్టుగా, జమిలిగా ఎగరడం(ఎదగడం)లో చాలా మేజిక్ ఉంది. దానికి చాలా శక్తి ఉంది అంటూ కలిసికట్టుగా ఉండటంలోని ప్రయోజనాన్ని గురించి ఆనంద్ మహీంద్ర గురించి చెప్పారు. ఇది ఆయన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘అవును సార్, టీమ్‌వర్క్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అనుకున్నకలలను నెరవేర్చుకోవచ్చు, కలిసి, కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మరపురాని అనుభవాన్ని సాధించవచ్చు! అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేయడం విశేషం.Flying solo and soaring high in the skies can be exhilarating. But there is as much magic—and power—in flying together, as a Team….#MondayMotivation#TogetherWeRisepic.twitter.com/ARVcoEJtwM— anand mahindra (@anandmahindra) October 7, 2024 -
TS DSC Results 2024: తెలంగాణ DSC ఫలితాలు విడుదల
-
ఇవాళ తెలంగాణ DSC 2024 ఫలితాలు విడుదల
-
నీట్.. ర్యాంకుల ‘షికార్’
నీట్ యూజీ–2024 పరీక్ష ఫలితాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. మే 5న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా.. 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. గత నెలలో ఫలితాలు వెల్లడికాగా..పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తమైంది. అనేకమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహణ సంస్థ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా పట్టణాలు, పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించింది.700+ స్కోర్‌తో ఆలిండియా కోటా సీటు..నీట్లో 700+ మార్కులు స్కోర్ చేసిన 2,321 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో మెడికల్ సీటు లభిస్తుంది. అదేవిధంగా 650+ మార్కులు స్కోర్ చేసిన 30,204 మంది విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం దక్కుతుంది. అలాగే 600+ మార్కులు స్కోర్ చేసిన 81,550 మంది విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల్లో ఏదో ఒక చోట సీటు సొంతమయ్యే అవకాశముంది.రీటెస్ట్ తర్వాత ఫలితం..గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు.. నీట్ రీటెస్ట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రీటెస్ట్ త ర్వాత హరియాణాలోని ఒక పరీక్ష కేంద్రంలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. హిస్సార్‌లోని హరదయాళ్ పబ్లి క్ స్కూల్ పరీక్ష కేంద్రంలో రీటెస్ట్‌కు ముందు వెల్లడించిన ఫలితాల్లో మొత్తం 8 మంది విద్యార్థులకు 720, 719, 718 మార్కులు వచ్చాయి. రీటెస్ట్ ఫలితాలు వెల్లడయ్యాక ఈ పరీక్ష కేంద్రంలో గరిష్ట స్కోర్ 682 మాత్రమే. అంతేకాకుండా కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే 650+ మార్కు లు వచ్చాయి. 13 మంది విద్యార్థులు 600+ మార్కులు స్కోర్ చేశారు. దీన్నిబట్టే చూస్తే రీటెస్ట్‌కు ముందు ఈ సెంటర్లో వెల్లడయిన ఫలితం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. సికర్ ఫలితం.. ఆశ్చర్యకరంరాజస్తాన్లోని సికర్ పట్టణంలో మొత్తం 50 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ పట్టణంలోని కేంద్రాల్లో మొత్తం 27,216 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 149 మందికి 700+ స్కోర్ వచ్చింది. 650 + స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 2,037. అలాగే 4,297 మంది విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. సికర్‌లో నీట్ రాసిన విద్యార్థుల సగటు మార్కులు 362. దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన మొత్తం 23 లక్షల మందిలో 30,204 మంది విద్యార్థులు 650+ స్కోర్ చేశారు. కేవలం 1.3 శాతం మంది. కాని ఒక్క సికర్లోనే 2,037 మంది 650+ స్కోర్ చేశారు. ఇది 6.8 శాతం. అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన వారిలో 1.3 శాతం మందికి మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం లభించగా.. సికర్‌లో పరీక్ష రాసిన వారిలో ఏకంగా 7.48 శాతం మందికి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ దక్కుతోంది. ఇక్కడే చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఏదో జరిగిందని నేను అనడం లేదు. కాని కేవలం 50 పరీక్ష కేంద్రాలున్న ఒక్క సిటీలో ఇంత మందికి బెస్ట్ స్కోర్ ఎలా సాధ్యమనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతోంది.ఒక్క కేంద్రంలో 12 మందికి 700+» అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రంలో మొత్తం 676 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. ఏకంగా 12 మందికి 700 + స్కోర్ వచ్చింది. » నామకల్‌లోని ద నవోదయా అకాడెమీ సీనియర్ సెకండరీ స్కూల్లో 659 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 8 మందికి 700+ మార్కులు వచ్చాయి. » సికర్‌లోని టాగోర్ పీజీ కాలేజీలో 356 మంది పరీక్ష రాయగా.. 5గురికి 700+ స్కోర్ వచ్చింది. టాప్ 50లో 37 సికర్ నుంచే» 650 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన టాప్ 50 పరీక్ష కేంద్రాల్లో 37 సికర్‌లోని పరీక్ష కేంద్రాలే. అలాగే దేశంలో బెస్ట్ ఫలితం వచ్చిన టాప్ 60 పరీక్ష కేంద్రాల్లో 43 సికర్ నుంచే ఉన్నాయి. టాప్ 50లో నామకల్‌లోని ఐదు పరీక్ష కేంద్రాలు, హర్యాన, హిస్సార్‌లోని జఝర్ వంటివి ఉన్నాయి. ళీ రాజ్‌కోట్‌లోని ఒక పరీక్ష కేంద్రంలో ఏకంగా 200 మంది విద్యార్థులకు 600 + మార్కులు వచ్చాయి.రాజస్థాన్ బెస్ట్ ప్రదర్శన» దేశ వ్యాప్తంగా నీట్ యూజీలో ఉత్తమ ఫలితాలు చూపిన టాప్ 10 సిటీలో.. ఐదు రాజస్థాన్ నుంచే ఉన్నాయి. » రాష్ట్రాలు/కేంద్రాలు పాలిత పాంత్రాల వారిగా చూసే.. నీట్లో ఉత్తమ ఫలితం చూపిన టాప్ పది రాష్ట్రాల్లో వరుసగా చండీగఢ్, రాజస్థాన్, హరియాణా కేరళ, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. » ఈశాన్య రాష్ట్రాల్లో నీట్ ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. కాగా కొన్ని పరీక్ష కేంద్రాలు, కొన్ని సిటీల్లో ఇలా ఎందుకు ఫలితం భిన్నంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మందికి బెస్ట్ ర్యాంకులు ఎలా వచ్చాయి అనే సందేహం రావడం సహజం. అయితే దీనికి ఈ సిటీల్లో అందుబాటులో ఉన్న కోచింగ్ సౌకర్యాలు కారణం కావచ్చు. కోచింగ్ వల్ల కొన్ని చోట్ల విద్యార్థులు మంచి ఫలితం సాధించి ఉండొచ్చు.» కోచింగ్‌కు పేరుగాంచిన కోటా పట్టణంలోని పరీక్ష కేంద్రాల్లో హాజరైన విద్యార్థుల డేటాను విశ్లేషించినా.. సికర్‌లో పరీక్ష రాసిన విద్యార్థులు ఎంతో ముందున్నారని అర్థమవుతోంది. కోటాలో 27,118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే..700+ స్కోర్ చేసింది 74 మంది(0.27శాతం) మాత్రమే. అదే సికర్‌లో ఆ సంఖ్య రెండింతలుగా ఉంది. 650+ స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 1,066(3.93 శాతం)గా ఉంది. అలాగే ఇక్కడ 2,599 విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. 600+స్కోర్ చేసిన విద్యార్థులు కోటాలో 9.58 శాతం ఉండగా.. సికర్‌లో అది 16 శాతంగా ఉంది.రాష్ట్రాలవారీగా 700కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులురాజస్థాన్482 కేరళ194హరియాణా146మహారాష్ట్ర 205ఉత్తరప్రదేశ్184తెలంగాణ49 -
నీట్ యూజీ ఫలితాలు: సెంటర్ల వారీగా విడుదల
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) విడుదల చేసింది. నగరాలు, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్సైట్లో శనివారం ఈ ఫలితాలను అప్లోడ్ చేసింది. అభ్యర్థులు nta.ac.in/NEET/ లేదా neet.ntaonline.in. వెబ్సైట్లో తమ ఫలితాలను నగరాలు, కేంద్రాల వారిగా చూసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జడ్జిలు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగరాల వారీగా, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు.. అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా గుర్తింపుపై మాస్క్ వేసి ప్రచురించాలని సుప్రీంకోర్టు నీట్ కమిటీకి స్పష్టం చేసింది. ఇక.. ఇలా ఫలితాలను విడుదల చేస్తే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బయటపడతాయని సొలిసిటర్ జనరల్ వాదించగా.. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ పరీక్ష కేంద్రాల వారీగా డమ్మీ రోల్ నంబర్లతో ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు. -
NEET(UG) రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: నీట్ యూజీ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్ స్కోర్ కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.నీట్ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు. వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్ కీ, ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచింది. -
NEET-UG 2024: ఎన్టీఏకు సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ అంశంలో గురువారం (ఏప్రిల్27) సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.నీట్ పీజీ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.ఈ తరుణంలో విద్యార్ధులు, పలు ఎడ్యుకేషన్ సంస్థలు(Xylem Learning) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఓఎంఆర్ షీట్లో మార్కుల లెక్కింపు అస్పష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నాయి.అయితే విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ మనోజ్ మిశ్రా,ఎస్వీఎన్ భట్టీ బెంచ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం.. విద్యార్ధుల పిటిషన్‌పై ఎన్టీఏ వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ పిటిషన్‌ను జులై 8న విచారణ చేపడతామని, ఆ లోగా వివరణ ఇవ్వాలని పునరుద్ఘాటించింది. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం(జూన్25) మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఉత్తీర్ణత శాతం 58.4 శాతం ఉండగా మొత్తం 1,37,903 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఎస్జీటీ రెగ్యులర్ పేపర్-1 కు 78,142 అభ్యర్థులు అర్హత సాధించగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ -1కు 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పేపర్ -2 కు 60,846 అభ్యర్థులు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్- 2కు 1,125 మంది అర్హులయ్యారు. -
AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్‌తో జనరల్ ఫలితాలుఒక్క క్లిక్‌తో ఒకేషనల్ ఫలితాలు ఏపీ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. -
TS TET Results 2024: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఒక్క క్లిక్‌తో ఫలితాలుటెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో 67.13 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18 శాతం అర్హత సాధించారు. -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలను విడుదల చేశారు. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్ నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి.. వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..ఎలిమినేషన్ ప్రక్రియ
-
ఆధిక్యంలో సీఎం జగన్ సహా పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
-
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ!
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.సుదీర్ఘ కాలంగా పవర్లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. మరోవైపు అధికార బీజేడీ మూడు పదుల సీట్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. -
మౌనం పాటిస్తున్న బాబు
-
జనం తీర్పు ఏం చెప్పనుంది?
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఈ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగు పరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? అధికార ప్రతి పక్షాలు రెండూ తమవైన వివరణలను జోడించి చేసిన 85 శాతం–15 శాతం ప్రచారాన్ని ఓటర్లు ఎలా తీసుకున్నారు? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా? ఇలాంటి ప్రశ్నలకు ఓ రెండ్రోజుల్లో సమాధానం లభిస్తుంది.జూన్ 4న వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల లెక్కల్లో బీజేపీ 303 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చు. లేదా దాని స్థానాలు 272 నుంచి 303 మధ్య ఉండవచ్చు. లేదా మెజారిటీ మార్కు కంటే తక్కువగా ఉండవచ్చు. వీటి గురించి ఇప్పటికైతే ఎవ్వరికీ తెలియదు. అయితే నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు మనకు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఆ ఫలితాలను పరిశీలించండి.గత దశాబ్దం గురించిన స్పష్టమైన మొదటి పరికల్పనను ఇక్కడ చూద్దాం. నరేంద్ర మోదీ రాజకీయాలను పునర్నిర్వచించారు. ప్రతి ఎన్నికా స్థానిక, జాతీయ సమతూకంతో ఉంటుంది. అయితే సంక్షేమ పథకాల పంపిణీ, ఎడతెగని జాతీయ సందేశపు ప్రదర్శనతో మోదీ జాతీయతను, స్థానికతను అనుసంధానించారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఎదుర్కొన్న ప్రతికూలతలను పూడ్చడానికి మోదీ ప్రజాదరణ సరిపోయింది. మరోవైపున ఓటర్లు కూడా తమ శాసనసభా కార్యకలాపానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే అంశానికన్నా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు అనేదానికి ప్రాధాన్యతను ఇచ్చారు.2024 తీర్పు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో, కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఇంకా ఎక్కువ మంది ఓటర్లను మోదీ ఆకర్షిస్తున్నారా, లేదా? బీజేపీ అభ్యర్థి స్వభావం లేదా కుల సమీకరణలు లేదా ఆర్థిక ఆందోళన నుండి ఉత్పన్నమయ్యే స్థానిక బలహీనతలను పూడ్చడానికి మోదీ ఇమేజ్ సరిపోతుందా? ఓటర్లు భారత ప్రభుత్వ అధికారంలో ఒక బలమైన నాయకుడిని కోరుకుంటున్నారా లేక బలమైన తనిఖీలతో 1989–2014 మధ్యకాలపు తరహా ఏర్పాటు తిరిగి రావాలని కోరుకుంటున్నారా?ఇక రెండో పరికల్పన హిందూ మత–రాజకీయ గుర్తింపునకు పెరుగుతున్న భావన గురించి. దీన్ని బీజేపీ స్పష్టమైన అవగాహనతోనే పెంచి పోషించింది. హిందూ మత గుర్తింపునకు సంబంధించిన రాజకీయ ప్రకటనకు ప్రభుత్వ మద్దతు ఉంది. కల్పిత మనోవేదనల సమాహారం ద్వారా ముస్లింలను ఇతరులుగా మార్చే భావన మరొకటి. వెనుకబడిన, దళిత ఉప సమూహాలకు సాంస్కృతిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించడం ద్వారా సమ్మిళిత హిందూ గుర్తింపును నిర్మించడం కూడా దీని వెనుక ఉంది. అయోధ్యలో లేదా కశ్మీర్లో లేదా దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక అన్యాయాల ‘సవరణ’ ఉంది. హిందువులు ఐక్యంగా ఉంటే, వారు ముస్లిం ఓట్లను అసంగతం చేయగలరనీ, ముస్లిం ప్రాతినిధ్యాన్ని చాలావరకు తగ్గించగలరనీ చూపించడానికి ఒక ఎన్నికల నమూనా కూడా దీని వెనుక ఉంది.కులాలకు అతీతంగా హిందుత్వ సామాజిక గాఢత కనబడటం, ‘లౌకికవాదం’ ప్రతిధ్వనులు ఎక్కడా వినిపించకపోవడం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) మద్దతు వంటివి తనకు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోయింది. బీజేపీ తరహా రాజకీయ మతపరమైన గుర్తింపును సవాలు చేసే కథనం తన దగ్గర లేకపోవడంతో కుల గణన, మరిన్ని రిజర్వేషన్లు, అన్ని రంగాలలో అన్ని కుల సమూహాలకు దామాషా ప్రాతినిధ్యాన్ని వాగ్దానం చేసింది. ఇది చారిత్రాత్మకం!జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్... దేశాన్ని కుల సమూహాలు, మతాలు, జాతుల మొత్తంగా కాకుండా హక్కులతో కూడిన, వ్యక్తిగత పౌరులతో కూడిన ఒక పెద్ద సమూహంగా భావించింది. మౌలికమైన అస్తిత్వ ఆధారిత విధానాల కంటే సామాజిక ప్రయోజనాలను సమతుల్యం చేసే క్రమానుగతమైన మార్పును విశ్వసించింది. ఈ రెండు అంశాలకు సంబంధించినంతవరకూ నెహ్రూ పార్టీని రాహుల్ గాంధీ భారత రాజకీయాలను సామ్యవాద స్రవంతి వైపు తిరిగి మళ్లించారు. పైగా కమ్యూనిస్ట్ స్రవంతి నుండి అరువు తెచ్చుకున్న బలమైన పెట్టుబడిదారీ వ్యతిరేక వైఖరిని దానికి జోడించారు.హిందూ గొడుగులోని సంకీర్ణ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, ప్రతిపక్షాలు ఎన్నికలను 85%–15% యుద్ధంగా మలిచాయి. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 15 శాతం అంటే ‘ఇతరులైన’ ఉన్నత కులాలు. దళితులు, ఓబీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఉద్దేశించినట్లు అది తప్పుగా పేర్కొంది. మరోవైపున తన సొంత హిందూ సామాజిక సంకీర్ణాన్ని కొనసాగించడానికి, బీజేపీ ఈ ఎన్నికలను 85% వర్సెస్ 15% యుద్ధంగా రూపొందించింది. ఇక్కడ 15 శాతం అంటే ‘ఇతరులైన’ ముస్లింలు ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపించింది. అట్టడుగు హిందువుల రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఉద్దేశించినట్లు బీజేపీ తప్పుగా ఆరోపించింది. అన్ని ప్రశ్నల పరంపరకు ఈ ఎన్నికల తీర్పు సమాధానం ఇస్తుంది. ఏకీకృత హిందూ రాజకీయ గుర్తింపునకు చెందిన ఆలోచన భౌగోళికంగా దక్షిణాదిలో కూడా విస్తరించి, సామాజికంగా దళితులు, గిరిజనులలో లోతుగా పాతుకుపోయిందా? రిజర్వేషన్ నిర్మాణాన్ని మరింత విస్తరించడానికి ఈ తీర్పు పార్టీలను ఎంతవరకు ఒత్తిడికి గురి చేస్తుంది?మూడవ పరికల్పన రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి. మోదీ నమూనా మౌలిక సదుపాయాలలో తయారీపై, పెట్టుబడులు పెంచడంపై ఆధారపడినది. ప్రైవేట్ వ్యవస్థాపకతను ముందుకు తీసుకుపోవడానికి డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులను ఉపయోగించడం; ఆర్థిక మార్కెట్లను విస్తరించడం; పరపతిని సరళీకరించడం; ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం; సేవలలో భారతదేశ బలాన్ని పెంచడం; నగదు, గృహాలు, నీరు, ఆహారం, విద్యుత్, వంటగ్యాస్ వంటి వాటిని అందుకునే కోట్లాది మంది ప్రజలతో కూడిన సంక్షేమ వలయాన్ని సృష్టించడం ఈ నమూనాలో భాగం. సంక్షేమం ఒక తరగతి లబ్ధిదారులను సృష్టించింది, గుర్తింపులు, ప్రాంతాల వ్యాప్తంగా మహిళా ఓటర్ల మద్దతును గెలవడానికి ఇవి మోదీకి సహాయపడ్డాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంపై ప్రజల్లో కోపం, బాధ పెరుగుతున్నాయని కూడా స్పష్టమైంది. గరిష్ఠంగా నగదు బదిలీలు, ప్రభుత్వ రంగ ఉపాధి, ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ప్రణాళికతో సహా మరింత సంక్షేమానికి ప్రతిపక్షాలు వాగ్దానం చేశాయి. ప్రస్తుత పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? ఓటర్లను, ముఖ్యంగా మహిళలను, యథాతథ స్థితికి కట్టుబడి ఉండటానికి లేదా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరడానికి సంక్షేమం ప్రేరేపణ కలిగించిందా? రాజకీయ–క్యాపిటల్ నెట్‌వర్క్‌పై ప్రజలకు ఆగ్రహం ఉందా? మహమ్మారి అనంతరం వివిధ రూపాల్లో దేశం కోలుకోవడం జరిగిందా? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా?తమను ఎవరు నడిపించాలనుకుంటున్నారు, తమను ఎలా నిర్వచించాలనుకుంటున్నారు, తమ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి వారు ఎవరిని విశ్వసిస్తారు అనే కీలకాంశాలను రెండ్రోజుల్లో ఓటర్లు ప్రకటిస్తారు. ఇది 2024కి సంబంధించిన అసలైన కథ.- వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -ప్రశాంత్ ఝా -
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
ఏపీ ఎన్నికల తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..
-
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
ఏపీ ఈసెట్ ఫలితాలు కోసం రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
ఎన్నికల కమిషన్ పై న్యాయ పోరాటం
-
కౌంటింగ్ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
-
బిగ్ క్వశ్చన్: ఏపీ ఎన్నికల ముఖచిత్రం..మళ్లీ అదే స్పీడు
-
రెండోసారి కూడా మన ప్రభుత్వమే..
-
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
-
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
-
జూన్ 4న జగన్ ప్రభంజనం..
-
అందుకే సీఎం జగన్ విక్టరీ వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్సీపీ గెలుస్తుందని అత్యధికులు నమ్మారు. 120-130 సీట్లు రావచ్చని ఎక్కువ మంది భావించారు. ఆ టైమ్‌లో కూడా జగన్ 150 సీట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించేవారు. నిజంగానే ఆయన ఊహించినట్లుగానే 151 సీట్లు వచ్చాయి. అది ఒక రికార్డు. గతంలో విభజిత ఏపీలో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దక్కలేదు. ఎన్.టీ.రామారావు సాధించలేని రికార్డును జగన్ సాధించగలిగారు. అంతేకాక ఇరవైరెండు లోక్ సభ సీట్లు వైఎస్సార్సీపీ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్ సభ సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ క్యాడర్లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చులే అనుకుంటారు. కాని జగన్ ఎప్పుడు ఏమి చేసినా ఒక రివల్యూషన్‌లా ఉంటోంది.ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దే సేవలు అందించారు. ఇది కొత్త అనుభూతే. దేశంలో ఏ రాష్ట్రంలోను ఇలాంటి సదుపాయం ప్రజలకు లేదు. జగన్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్లు ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన రుజువు చేశారు. అలాగే రాజకీయంగా బలహీనవర్గాలకు, మహిళలకు ఏభై శాతం పదవులు వచ్చేలా చేయడం, పథకాలు కాని, ఇళ్ల స్థలాలు కాని మహిళల పేరుతోనే ఇవ్వడం తదితర చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు. వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీనవర్గాలవారు వెల్లువలా ఓట్లు వేయడానికి తరలివచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. వీటన్నిటిని బెరీజు వేసుకునే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లు మించే వైఎస్సార్సీపీ వస్తాయని చెప్పి ఉండవచ్చు.ఇంకో సంగతి చెప్పాలి. కూటమి నేతలు హైదరాబాద్, తదితర చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించిన తీరు కూడా ఆయా గ్రామాలలోని బలహీనవర్గాలు గుర్తించాయట. పెత్తందార్లకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చినవారికి పోటీగా స్థానికంగా ఉండే గ్రామాలలోని పేదలంతా ఓటింగ్‌లో పాల్గొన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత తిరిగి అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే అదేమి అసాధ్యం కాదు. ఉదాహరణకు 2014లో టీఆర్ఎస్కు 63 సీట్లు వస్తే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చాయి. అంటే ఏకంగా ఇరవైఐదు సీట్లు పెరిగాయన్నమాట. అలాగే గుజరాత్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు వస్తే, 2022 ఎన్నికలలో 160 వరకు వచ్చాయి.గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తోంది. ఒడిషా లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు. బెంగాల్లో గతంలో సీపీఎం నేత జ్యోతిబసు వరసగా ఇరవైమూడేళ్లు పాలన చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎమ్.కె అధికారంలోకి వచ్చిన ఒక సందర్భంలో డిఎమ్.కెకి కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1994లో ఎన్.టీ.ఆర్ నాయకత్వంలోని తెలుగుదేశంకు 213 సీట్లు, మిత్రపక్షాలకు 34 సీట్లు వచ్చాయి.అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి, ప్రభుత్వాల పనితీరును బట్టి, ఎన్నికలలో ప్రకటించే మానిఫెస్టోలలోని అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. 2024 ఎన్నికలలో జగన్‌కు ఉన్న క్రెడిబిలిటిని జనం విశ్వసించారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి, అబద్దాలు చెప్పి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకుపైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చెప్పడం ఆయన నిజాయితీ తెలియచేస్తుంది. 2019లో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం నెరవేర్చడమే కాకుండా మానిఫెస్టోలను చూపించి మంచి జరిగితేనే తనకు ఓటు వేయండని ప్రజలకే పరీక్ష పెట్టారు. ఇవన్ని ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తాయి.ఈ నేపధ్యంలోనే ఆయన అంత ధీమాగా 151 సీట్లను మించి వస్తాయని చెప్పి ఉండవచ్చు. ఈసారి పలు సర్వే సంస్థలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేసిన పరిశీలనలో వైఎస్సార్సీపీ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పోలింగ్‌కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన తర్వాత వైఎస్సార్సీపీవై పే మొగ్గు చూపుతున్నాయి. అయినా టీడీపీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేం. వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఐ-ప్యాక్ పూర్వ వ్యవస్థాపకుడు ప్రశాంత కిషోర్ ఈ మధ్య టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్సీపీ అధికారం దక్కదని ప్రచారం చేశారు. ఆ తరుణంలో టీడీపీతో పాటు, ఇలాంటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేలా జగన్ ఈ ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని, అందువల్ల వైఎస్సార్సీపీ వంద నుంచి 110 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు.ఒకవేళ జగన్‌కు అనుకూలంగా వేవ్ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైఎస్సార్సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్ చాణక్య అనే సంస్థ 144-158 సీట్లు దక్కుతాయని లెక్కగట్టింది. న్యూస్ ఎక్స్-నేత అనే సంస్థ 139-152 సీట్లు రావచ్చని చెబుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎన్ఎన్ న్యూస్ 18 సంస్థ 132 lనుంచి 145 సీట్లు వస్తాయని భావిస్తోంది. టైమ్స్ నౌ జోస్యం ప్రకారం 128-133 సీట్లు రావచ్చు. ఇలా కొన్ని సర్వే సంస్థలు సైతం వైఎస్సార్సీపీకు 151 మించి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. వీటిని గమనిస్తే జగన్ చెప్పినట్లు వైఎస్సార్సీపీకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందన్న భావన కలుగుతుంది. ఇదే జరిగితే నిజంగానే దేశ మంతా జగన్ వైపు చూస్తుంది. ఏపీలో జరుగుతున్న పాలన వైపు, వ్యవస్థల వైపు చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
గెలుపుపై ఆశలు లేవు..పవన్ కళ్యాణ్ సైలెంట్
-
పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ
-
తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు.EAP CET టాపర్లు (ఇంజనీరింగ్)మొదటి ర్యాంక్ - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం,ఏపీ) రెండో ర్యాంక్ - గొల్లలేక హర్ష (కర్నూల్, ఏపీ) మూడో ర్యాంక్- రిషి శేఖర్ శుక్లఇంజనీరింగ్ విభాగంలో టాట్టెన్లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచారు.EA PCET టాపర్లు ( అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ)మొదటి ర్యాంక్- ఆలూర్ ప్రణిత ( మదనపల్లి, ఏపీ) రెండో ర్యాంక్ - నాగుడసారి రాధా కృష్ణ (విజయనగరం, ఏపీ) మూడో ర్యాంక్- గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్,తెలంగాణ)ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ‘ఎప్ సెట్‌ను మొదటి సారిగా నిర్వహించాం. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించాం’ అని తెలిపారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది ఈఎపి సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు . ఈఎపి సెట్‌కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తాం’అని అన్నారు. -
ఒక్క క్లిక్‌తో ఈఏపీ సెట్ ఫలితాలు
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాను ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి... ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేస్తారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు చూడొచ్చు. కాగా, ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు. -
ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం
-
గులాబీ పార్టీ బలం పెరిగిందా ?..తగ్గిందా ?
-
ఆ కాన్ఫిడెంట్ ఏంటి ?..హ్యాట్సాఫ్ జగన్
-
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
-
జగన్ మాటలతో కూటమిలో వణుకు..చంద్రబాబును ప్రజలు నమ్మలేదు
-
జూన్ 09..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను..
-
రికార్డు బ్రేక్ అయ్యేలా ఈసారి ఎన్నికల ఫలితాలు
-
కాంగ్రెస్ లో టెన్షన్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై గాంధీ భవన్ లో చర్చ
-
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం, 2019కి మించి వైఎస్సార్సీపీ ప్రభంజనం... పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.
-
వన్స్ మోర్ వైఎస్ జగన్...
-
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
-
పోలింగ్‌పై పోస్టుమార్టం..
-
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి
సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు సంయుక్తంగా విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.సంస్థ పరిధిలోని 38 సాధారణ పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు, 12 మైనారిటీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్లు, 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లతో పాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. స్కూల్ స్థాయిలో 3,770 సీట్లకు 32,666 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 25,216 మంది పరీక్షకు హాజరయ్యారు.» పాఠశాల స్థాయిలో ఐదో తరగతిలో ఎం.కీర్తి (విశాఖపట్నం జిల్లా), 6వ తరగతి పి.సోమేశ్వరరావు (విజయనగరం జిల్లా), 7వ తరగతి కె.ఖగేంద్ర (శ్రీకాకుళం జిల్లా), ఎనిమిదో తరగతిలో వై.మేఘ శ్యామ్ (విజయనగరం జిల్లా) రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. » రాష్ట్రంలోని ఏడు జూనియర్ కాలేజీల్లో ఉన్న 1,149 సీట్లకు 56,949 మంది దరఖాస్తు చేసుకోగా 49,308 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంపీసీ విభాగంలో జి.యశ్వంత్ సాయి, ఎంఈసీ/సీఈసీ విభాగంలో ఎల్.సత్యరామ్ మోహన్ (తూర్పు గోదావరి), బైపీసీ విభాగంలో ఎం.మహిత (కర్నూలు జిల్లా) అత్యధిక మార్కులు సాధించారు. వీరితో పాటు నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కాలేజీలో 152 సీట్లకు ఎంపికైన విద్యార్థుల వివరాలను https://aprs.apcfss.in/ లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ కార్యదర్శి నరసింహారావు తెలిపారు. -
బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లకు కావాల్సిన సీట్లను బీజేపీ గెలుచుకోలేదని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎంతో మంది నిపుణులు, సెఫాలజిస్టులతో మాట్లాడనని చెప్పారు. బీజేపీ ఈసారి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో చాలా సీట్లు కోల్పోనున్నట్లు తెలిసిందన్నారు. ‘ఫోన్లో చాలా మంది సెఫాలజిస్టులతో మాట్లాడాను. ప్రతి ఒక్కరు బీజేపీకి మెజారిటీ రాదనే చెబుతున్నారు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం 7 ఎంపీ సీట్లలో బీజేపీ ఓడిపోతుంది. జూన్4న మోదీ అధికారం కోల్పోతారు. ఇండియూ కూటమి అధికారంలోకి వస్తుంది’అని కేజ్రీవాల్ చెప్పారు. -
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సాక్షి,విజయవాడ: పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం(మే8)ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈ పరీక్షను ఏప్రిల్ 27న నిర్వహించారు.మొత్తం 1.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.24 లక్షల మంది అర్హత సాధించారు. దీంతో ఈసారి 87.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... -
TS 10th ఫలితాలు విడుదల
-
రెండో దశలో పోలింగ్ ఎక్కడ? 2019లో ఏం జరిగింది?
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి.అసోంలోని కరీంగంజ్, సిల్చార్, మంగళ్దోయ్, నవ్గోంగోన్, కలియాబోర్, బీహార్‌లోని కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక స్థానం, కర్ణాటకలోని ఉడిపి, చిక్కమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబళ్లాపూర్, కోలార్‌లో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.ఇదేవిధంగా కేరళలోని కాసరగోడ్, కన్నూర్, వటకర, వాయనాడ్, కోజికోడ్, మలప్పురం, పొన్నాని, పాలక్కాడ్, అలత్తూర్, త్రిస్సూర్, చాలకుడి, ఎర్నాకులం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజ, మావెలిక్కర, పతనంతిట్ట, కొల్లం, అట్టింగల్, తిరువనంతపురం, మధ్యప్రదేశ్‌లోని తికమ్గఢ్, దామో, ఖజురహో, సత్నా, రేవా, హోషంగాబాద్, బేతుల్‌లలో ఓటింగ్ జరగనుంది.రాజస్థాన్‌లోని టోంక్, సవాయ్ మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్‌పూర్, బార్మర్, జలోర్, ఉదయ్‌పూర్, బన్స్వారా, చిత్తోర్‌గఢ్, రాజ్‌సమంద్, భిల్వారా, కోట, ఝలావర్-బరన్‌లలో ఓటింగ్ జరగనుంది. అలాగే మహారాష్ట్రలోని బుల్దానా, అకోలా, అమరావతి (ఎస్సీ), వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భానీలలో పోలింగ్ జరగనుంది. త్రిపురలోని త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానానికి 26న ఓటింగ్ జరగనుంది.యూపీలోని అమ్రోహా, మీరట్, బాగ్పత్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, అలీఘర్, మధుర, బులంద్‌షహర్‌లలో ఓటింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, రాయ్‌గంజ్, బలూర్ఘాట్లలోని ఓటింగ్ జరగనుంది.2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 89 స్థానాలలో 51 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతోపాటు ఎన్డీఏ మిత్రపక్షం ఎనిమిది సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో 21 మంది కాంగ్రెస్ ఎంపీలు విజయం సాధించారు. మరికొన్ని సీట్లు సీపీఎం, బీఎస్పీ తదితర పార్టీలకు దక్కాయి. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలను అందరికన్నా త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకే క్లిక్‌తో తేలికగా ఫలితాలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది. www.sakshi education.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వేగంగా ఫలితాలు చెక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం 👇 క్లిక్ చేయండిఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇక తెలంగాణలో ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే.. ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా ఉందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఫస్ట్ ఇయర్లో 60.01 శాతం ఉత్తీర్ణత2, 87, 261మంది పాసయ్యారుఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా టాప్, మేడ్చల్ జిల్లా సెకండ్సెకండ్ ఇయర్లో 64.61 శాతంసెకండ్ ఇయర్లో 3,22,432 మంది పాస్సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా టాప్ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలురేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్.. దరఖాస్తు చేస్కోవాలిమే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు -
Watch Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్
-
TS Inter Results 2024: రేపు 11 గంటలకు ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలను ఈనెల 24న 11 గంటలకు వెల్లడిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఫలితాలు https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ‘సాక్షి’లో ఇంటర్ ఫలితాలు ఇంటర్ ఫలితాలను వేగంగా తెలుసుకునేందుకు ‘సాక్షి’దినపత్రిక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation. com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది. -
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీని ప్రకటించనున్నట్టు బోర్డు కమిషనర్ శృతి ఓజా ’సాక్షి’ప్రతినిధికి తెలిపారు. ఆది, లేదా సోమవారం ఫలితాలను వెల్లడించాలనుకుంటున్నామని, ఎక్కువ శా తం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు. ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. మార్చి 6వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు. మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. -
AP: గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ.. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. గ్రూప్ వన్‌కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. కిందటి ఏడాది డిసెంబర్ 08వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 Group 1 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రెస్ నోట్లో ఏపీపీఎస్సీ పేర్కొంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి పోస్టుల వివరాలివే.. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6; కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. -
ఇంటర్ ఫలితాలు.. అమ్మాయిలదే హవా
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు బాలికలు, బాలురు కలిపి మొత్తం 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది (78 శాతం), మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది (67 శాతం) ఉన్నారు. ఈ మేరకు ఫలితాలను శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియెట్ విద్యా మండలిలో కమిషనర్, కార్యదర్శి సౌరభ్ గౌర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వీవీ సుబ్బారావు సంయుక్తంగా విడుదల చేశారు. పరీక్షలు ముగిశాక కేవలం 21 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. కాగా ఎప్పటిలాగే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 81 శాతం, మొదటి ఏడాదిలో 71 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు రెండో ఏడాది 75 శాతం, మొదటి సంవత్సరంలో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2023 మార్చిలో ఇంటర్ మొదటి ఏడాది 4.33 లక్షల మంది పరీక్ష రాయగా 61 శాతం, ద్వితీయ సంవత్సరం 3.80 లక్షల మంది రాయగా 72 శాతం మంది పాసయ్యారు. మొత్తం మీద గతేడాది కంటే ఈసారి 6 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. ఫలితాల్లో జిల్లాల వారీగా కృష్ణా మొదటి స్థానంలో (మొదటి సంవత్సరం 84 శాతం, ద్వితీయ సంవత్సరం 90 శాతం) సాధించగా, చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు (ఇంటర్ మొదటి ఏడాది), చిత్తూరు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in లేదా www. sakshieducation.comÌ లో చూడవచ్చు. ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 47 శాతం, రెండో ఏడాది 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో బాలికలు, బాలురు కలిపి మొదటి సంవత్సరం మొత్తం 38,483 మంది పరీక్షలకు హాజరు కాగా 23,181 మంది (60 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32,339 మంది హాజరవగా 23 వేల మంది (71 శాతం) విజయం సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ఏడాది 77 శాతం, రెండో ఏడాది 83 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. చివరి స్థానంలో వైఎస్సార్ (మొదటి ఏడాది), పల్నాడు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని కార్యదర్శి సౌరభ్ గౌర్ కోరారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. మార్కుల లిస్టులు డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇవి రెగ్యులర్ పత్రాలుగానే చెల్లుబాటవుతాయన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా ఉండాలి ఉత్తీర్ణులు కానివారు ఆందోళన చెందొద్దని సౌరభ్ గౌర్ సూచించారు. గతంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనవారికి ‘కంపార్ట్మెంటల్’ అని సరి్టఫికెట్‌పై వచ్చేదని, ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ఇకపై సప్లిమెంటరీ కూడా రెగ్యులర్‌తో సమానంగానే ఉంటుందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు మనోధైర్యాన్ని అందించాలని సూచించారు. బైపీసీలో విశాఖ అమ్మాయి పావనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా గాజువాక చైతన్య కళాశాల విద్యార్థి శరగడం పావని సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును దక్కించుకుంది. పావని తండ్రి నాగగంగారావు గంగవరం పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని పావని తెలిపింది. కిరణ్మయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఆలూరి కిరణ్మయి సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. కిరణ్మయి విజయవాడలోని శ్రీ గోసలైట్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది. కిరణ్మయి తండ్రి ఏవీ గిరిబాబు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి విజయశాంతి గృహిణి. ఎంబీబీఎస్ చదివి న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన చిరకాల కోరిక అని కిరణ్మయి వెల్లడించింది. -
ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
-
APPSC Group 2 Prelims Result: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: గ్రూప్- 2 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం(ఏప్రిల్10) ప్రకటించింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది. 1:100 నిష్పత్తిలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్ధాయిలో ఏడు వారాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలీను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్డ్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. ఇదీ చదవండి.. వాలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు -
ఫలితాల సీజన్‌తో జోష్!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కార్పొరేట్ ఫలితాలు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసిక ఫలితాలతో సీజన్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం(12న) టీసీఎస్ జనవరి–మార్చి(క్యూ4)తోపాటు పూర్తి ఏడాదికి సైతం ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఇదే రోజు ఆర్థిక గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ప్రభుత్వం(ఎన్ఎస్వో) మార్చి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో సీపీఐ నామమాత్ర వెనకడుగుతో 5.09 శాతానికి చేరింది. ఇక పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.4 శాతంగా నమోదైంది. కాగా.. గురువారం(11న) ఈద్(రంజాన్) సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గత వారం రికార్డు గత వారం ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరికి శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్ 597 పాయింట్లు(0.8 శాతం) లాభపడి 74,248 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 187 పాయింట్లు(0.84 శాతం) ఎగసి 22,514 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.84 శాతం జంప్‌చేసి 40,831 వద్ద నిలిచింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 6.64 శాతం దూసుకెళ్లి 46,033 వద్ద ముగిసింది. చమురు, రూపాయి ఎఫెక్ట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు ప్రస్తావించారు. అంతేకాకుండా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకాగలవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరువైన నేపథ్యంలో ఆరు ప్రపంచ కరెన్సీలతో డాలరు మారకపు విలువ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. విదేశీ అంశాల విషయానికివస్తే గత వారాంతాన మార్చి నెలకు యూఎస్ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెలువడ్డాయి. వీటితోపాటు ఈ నెల 10న(బుధవారం) యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఇటీవల చేపట్టిన పాలసీ సమీక్షలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. -
జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్‌ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్‌కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్‌కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
పాకిస్థాన్ హంగ్ అసెంబ్లీ..?
-
తెలంగాణ గ్రూప్-4 ఫలితాల విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును కమిషన్ ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కిందటి ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీ ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. -
ఓట్ల లెక్కింపు ఎప్పుడు? ఫలితాలు ఎన్నడు?
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులతో సతమతమవుతున్న పాకిస్తాన్లో గురువారం సాధారణ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 336 సభ్యుల జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 169 సీట్లు అవసరం. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఓటింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 150 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. అవి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్. పాకిస్తాన్లో ఎన్నికల జరిగిన రోజు అర్థరాత్రికల్లా ఫలితాలు వెలువడతాయి. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పాక్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. వాటి మొత్తం బరువు 2100 టన్నులు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పోలింగ్ అధికారి రిటర్నింగ్ అధికారికి ఆ సమాచారం అందిస్తారు. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. -
కాసేపట్లో పశుసంవర్ధక సహాయకుల పోస్టు ఫలితాలు విడుదల
సాక్షి, తాడేపల్లి: పశు సంవర్ధక సహాయకుల పోస్టుల రాత పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను https://apaha-recruitment.aptonline.in/ వెబ్ సైట్లో చూసుకోవచ్చు. కాగా సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసి.. గత డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు జిల్లా పోస్టుల సంఖ్య అనంతపురం 473 చిత్తూరు 100 కర్నూలు 252 వైఎస్సార్ 210 నెల్లూరు 143 ప్రకాశం 177 గుంటూరు 229 కృష్ణా 120 పశ్చిమ గోదావరి 102 తూర్పు గోదావరి 15 విశాఖపట్నం 28 విజయనగరం 13 శ్రీకాకుళం 34 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 39% జంప్
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2023–24, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 12,735 కోట్లతో పోలిస్తే 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలు ఇలా... బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) క్యూ3లో స్వల్పంగా పెరిగాయి. 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికర ఎన్పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్.. ప్చ్!
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో కంపెనీ రూ. 6,106 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.6,586 కోట్లతో పోలిస్తే 7.3% తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 1.3% పెరుగుదలతో రూ. 38,821 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో ఆదాయం రూ. 38,318 కోట్లుగా నమోదైంది. క్లయింట్ల నుండి డిమాండ్ మందగించడం ఫలితాలపై ప్రభావం చూపింది. గైడెన్స్ కట్.. 2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిన్ ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్) కుదించింది. 1.5–2 శాతానికి తగ్గించింది. గత ఫలితాల సందర్భంగా ఆదాయ వృద్ధిని 1–2.5 శాతంగా అంచనా వేసింది. ‘ఇన్‌సెమీ’ కొనుగోలు.. బెంగళూరుకు చెందిన సెమీకండక్టర్ డిజైన్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్‌సెమీ కొనుగోలు ప్రతిపాదనకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.280 కోట్లకు దీన్ని దక్కించుకోనుంది. 2024 మార్చిలోపు ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో మా పనితీరు నిలకడగానే ఉంది. బడా డీల్స్ దన్నుతో 3.2 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నాం. జెనరేటివ్ ఏఐ, డిజిటల్, క్లౌడ్ తదితర విభాగాల్లో మా పోర్ట్‌ఫోలియో పటిష్టతకు ఇది నిదర్శనం. స్థూల ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఫైనాన్షియల్ సర్వీసులు, టెల్కోలు, హైటెక్ రంగాల్లో ప్రభావం కొనసాగవచ్చని భావిస్తున్నాం. - సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ ఇతర ముఖ్యాంశాలు.. క్యూ3లో ఇన్ఫీ 3.2 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో నికరంగా 71% కొత్త డీల్స్ ఉన్నాయి. డిసెంబర్ 31 నాటికి కంపెనీలో 3,22,663 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. క్యూ2తో పోలిస్తే (3,28,764) నికరంగా 6,101 మంది (1.8 శాతం) సిబ్బంది తగ్గారు. క్రితం ఏడాది డిసెంబర్ క్వార్టర్ నాటికి ఉన్న 3,46,845 మందితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7% తగ్గింది. క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 12.9%గా ఉంది. కాగా, ఉద్యోగుల వినియోగాన్ని నిశితంగా పరిశీలిస్తామని సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ చెప్పారు. క్యాంపస్ హైరింగ్ అనేది క్లయింట్ల డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతానికి దీని అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో షేరు ధర 1.62% నష్టంతో రూ.1,495 వద్ద ముగిసింది. -
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సరీ్వసులకు ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన యూపీఎస్సీ–2023 మెయిన్స్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మెయిన్స్ పరీక్షలను గత సెపె్టంబర్లో నిర్వహించడం తెలిసిందే. గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలను దాదాపు 13 లక్షల మంది రాశారు. 15 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో దాదాపు 2,500 మంది తాజాగా ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్టు సమాచారం. ఇంటర్వ్యూ తేదీలతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి మొత్తం 1,105 మందిని సివిల్ సరీ్వసులకు యూపీఎస్సీ ఎంపిక చేయనుంది. -
తెలంగాణ ఫలితాలపై బీజేపీ పోస్టుమార్టం
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు సిద్ధమైంది. పార్టీలో జరిగిన పరిణామాలు.. సీట్ల కేటాయింపు నుంచి ఫలితాల ప్రకటన వరకు అభ్యర్థుల తీరుపై సమగ్ర నివేదికతో ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ కమలసారథి కిషన్ రెడ్డి, అసలు కాషాయ దళపతి హస్తినకు తీసుకెళ్లిన రిపోర్ట్ లో ఏముంది ? ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 8 అసెంబ్లీ సీట్లు.. 14 శాతం ఓట్లు సాధించి ఉనికి చాటుకుంది. గత మూడేళ్లుగా బీజేపీ చేసిన పోరాటలకు.. వచ్చిన ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడంపై పార్టీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి ఆ నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, హోం మంత్రి అమిత్ షాకు సమర్పించనున్నారు. కిషన్ రెడ్డి ఇస్తున్న రిపోర్ట్ లో ఏముందనే దానిపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంత వరకు వర్కవుట్ అయ్యాయనే దానిపై నివేదికలో వివరించినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం, బీసీ సీఎం నినాదం ఎంత వరకు ఉపయోగపడిందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ 36 మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. 12 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లపై మిషన్ 31 అని కమిటీలు వేసినా.. ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఆరు స్థానాలు ఇచ్చి బీజేపీ పరువు నిలబెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 48 మంది కార్పోరేటర్లు... టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నా వారిని వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైంది. దీంతో జీహెచ్ఎంసీలో కేవలం ఒక్క గోషామహల్ విజయంతో సరిపెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీగా ఓట్లను చీల్చడంతో బీజేపీ సీట్లకు గండిపడింది. కాంగ్రెస్ ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, బోధ్ అసెంబ్లీ స్థానాలపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ స్థానాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు, ఎంపీలు పోటీ చేసి పరాజయం పాలుకావడం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం అభ్యర్థులుగా ఫోకస్ చేసినప్పటికీ ఎందుకు గెలవలేదనే దానిపై చర్చ సాగుతోంది. ఎంపీల అతివిశ్వాసం, గ్రేటర్ లో కార్పోరేటర్ల సహాయ నిరాకరణ, నేతల మధ్య ఆధిపత్య పోరులాంటి అంశాలు.. బీజేపీ వైఫల్యానికి కారణంగా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వైఫల్యాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు ? పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుందనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చదవండి: TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు -
బీజేపీకి జై..సూచీలు రయ్
ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ‘జై’ కొట్టడంతో సోమవారం స్టాక్ సూచీలు ఏకంగా రెండు శాతం ర్యాలీ చేశాయి. ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదు ఉత్సాహాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు దిగువకు చేరుకుంది. ఫలితంగా సూచీలు 18 నెలల్లో (మే 20, 2022 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,384 పాయింట్లు పెరిగి 68,865 ముగిసింది. నిఫ్టీ 419 పాయింట్లు బలపడి 20,687 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ట ముగింపు. ట్రేడింగ్‌లోనూ జీవితకాల గరిష్టాల నమోదు జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉదయం సూచీలు భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 945 పాయింట్లు పెరిగి 68,435 వద్ద, నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 20,602 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. మీడియా తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరమైన లాభాలతో ట్రేడయ్యా యి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడం ఓ దశలో సెన్సెక్స్ 1,437 పాయి ంట్లు దూసుకెళ్లి 53 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 68,918 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 435 పాయింట్లు ఎగసి 20,703 వద్ద రెండో రోజూ రికార్డు ర్యాలీ చేసింది. ► సూచీల రికార్డు ర్యాలీని అందిపుచ్చుకున్న అదానీ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 9%, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 7%, అదానీ పోర్ట్స్, ఏసీసీ 6%, అదానీ పవర్, అదానీ ఎనర్జీ 5%, అదానీ టోటల్ గ్యాస్ 4%, ఎన్డీటీవీ 3%, అదానీ విల్మార్ 2% చొప్పున లాభపడ్డాయి. మొత్తం పది కంపెనీల షేర్లూ రాణించడంతో ఇంట్రాడేలో గ్రూప్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 31 తర్వాత తొలిసారి రూ.12 లక్షల కోట్లను తాకింది. చివరికి రూ.11.95 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ►ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఐసీఐసీఐ బ్యాంక్ 5%, ఎస్బీఐ 4%, కోటక్ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ ఇండ్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 3% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఏ యూ బ్యాంక్‌లు 2%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు ఒకశాతం పెరిగాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 91 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 46,484 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ రెండుశాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.81 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ. 343.48 లక్షల కోట్లకు చేరింది. కాగా అయిదు రోజుల ర్యాలీతో బీఎస్ఈలో రూ.14.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్వసించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలు మెప్పించడంతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగొచ్చు. రికార్డు ర్యాలీ నేపథ్యంలో స్థిరీకరణ జరిగితే నిఫ్టీకి 20,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
-
Mizoram Election Results 2023: మిజోరంలో జెడ్పీఎం జయ కేతనం
Live Updates.. జెడీపీఎం జయ కేతనం 27 స్థానాలను కైవసం చేసుకున్న జెడ్పీఎం 7 చోట్ల ఎంఎన్ఎఫ్ విజయం.. 3 స్థానాల్లో ముందంజ 25 చోట్ల జెడ్పీఎం గెలుపు.. 2 స్థానాల్లో ముందంజ సెర్చిప్ నియోజకవర్గంలో జెడ్పీఎం సీఎం అభ్యర్థి లాల్దుహోమా ఘన విజయం జెడ్పీఎం ‘మ్యాజిక్’ విజయాలు 20 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 7 చోట్ల ఆధిక్యం 7 స్థానాల్లో ఎంఎన్ఎఫ్ గెలుపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జెడ్పీఎం రేపు గవర్నర్‌ను కలవనున్ను సీఎం అభ్యర్థి లాల్దుహోమా 16 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 11 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యత 3 చోట్ల ఎంఎన్ఎఫ్ గెలుపు.. 7 స్థానాల్లో ముందంజ 2 సీట్లు గెలుపొందిన బీజేపీ.. ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యం ఎంఎన్ఎఫ్ తొలి గెలుపు ఒక చోట గెలిచిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), మరో 10 చోట్ల లీడింగ్ జెడ్పీఎంకు 11 విజయాలు, 15 చోట్ల కొనసాగుతున్న ఆధిక్యం 7 స్థానాల్లో జెడ్పీఎం విజయం.. 7 స్థానాల్లో జెడ్పీఎం విజయం, మరో 19 చోట్ల ఆధిక్యం 11 నియోజకవర్గాల్లో ఎంఎన్ఎఫ్ ముందంజ ఒక చోట గెలిచిన బీజేపీ, మరో స్థానంలో లీడింగ్ ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజ మిజోరంలో దూసుకుపోతున్న జేపీఎం జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం).. 26స్థానాల్లో లీడ్, ఒక స్థానంలో గెలుపు ఎంఎన్ఎఫ్.. 9 స్థానాలు బీజేపీ..3 కాంగ్రెస్..2 స్థానాల్లో లీడ్ #MizoramElections2023 | Official EC trends of all 40 seats in - ZPM (Zoram People's Movement) comfortably crosses the halfway mark, wins 1 and leads on 25 seats. Ruling MNF (Mizo National Front) leads on 9 seats BJP on 3 Congress on 2 pic.twitter.com/w2zT3I7sVc — ANI (@ANI) December 4, 2023 మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. ఎంఎన్ఎఫ్..5 జెడ్‌పీఎమ్..3 బీజేపీ..1 కాంగ్రెస్..1 చోట ఆధిక్యం #MizoramElections2023 | Early official EC trends in; MNF (Mizo National Front) leading on 5 seats while ZPM (Zoram People's Movement) ruling on 3 seats. BJP and Congress leading on 1 each. Counting of votes on all 40 seats is underway. pic.twitter.com/QfPu4B77Pn — ANI (@ANI) December 4, 2023 మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్ #WATCH | #MizoramElections2023 | After counting of postal ballots, counting of votes cast through EVMs begins. Visuals from a counting centre at Aizawl Government College where strong room was unlocked for EVMs to be brought out. pic.twitter.com/epdcbCNHUB — ANI (@ANI) December 4, 2023 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు. #WATCH | Counting of votes for #MizoramElections2023 is underway. Visuals from a counting centre in Serchhip. pic.twitter.com/yaQzE5oqmj — ANI (@ANI) December 4, 2023 ►మిజోరంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం Counting of votes for Mizoram Elections 2023 begins. pic.twitter.com/S1IJmvFwR7 — ANI (@ANI) December 4, 2023 ► మిజోరంలో కౌంటింగ్‌కు సర్వం సిద్దం. #WATCH | Counting for #MizoramElections2023 to take place today. Visuals from a counting centre in Serchhip as boxes containing ballot papers being brought here. pic.twitter.com/PqIWtRKpDv — ANI (@ANI) December 4, 2023 #WATCH | Preparations underway at the counting centre in Aizawl where the counting of votes for the Mizroam Assembly Elections will begin shortly. pic.twitter.com/tAwFWBDiuM — ANI (@ANI) December 4, 2023 ►మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్ జరుగనుంది. కౌంటింగ్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. ►40 నియోజక వర్గాలున్న మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్(మిజో నేషనల్ ఫ్రంట్), జడ్పీఎం (జొరం పీపుల్స్ మూవ్మెంట్), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ►ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 13 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని మిజోరం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్.లియాంజెలా తెలిపారు. #WATCH | Preparations underway at the counting centre in Serchhip where the counting of votes for the Mizroam Assembly Elections will begin shortly. pic.twitter.com/QiedojHJ7B — ANI (@ANI) December 4, 2023 ►మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ►174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26, జడ్పీఎం 8, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక స్థానం గెలుపొందాయి. ►నవంబరు 7న మిజోరం అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
‘విక్రమార్కుడి’ విజయ పరంపర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క విజయపరంపర మరోసారి కొనసాగింది. భారీ మెజార్టీతో ఆయన మధిర ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచారు. 2009, 2014, 2018లో వరుసగా విజయం సాధించిన భట్టి ఈ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భట్టి భారీ మెజార్టీ కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 35,452 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో భట్టికి 1,08,970 ఓట్లు రాగా.. కమల్‌రాజ్‌కు 73,518 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ లింగాల కమల్రాజ్పైనే ఆయన విజయం సాధించడం మరో విశేషం. 2009లో ఆయన 1,417 ఓట్లతో, 2014లో 12,329 మెజార్టీతో, 2018లో 3,567 ఓట్లతో విజయం సాధించగా.. ప్రస్తుతం 35,452 ఓట్ల భారీ మెజార్టీతో పొందారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి దక్కుతుందని మధిర నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఏ పదవినిచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా.. ‘సీఎంగా ఎవరనేది సీఎల్పీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఆ తర్వాత సీఎం ఎవరనేది పార్టీ అధిస్టానం ప్రకటిస్తుంది. నాకు ఏ పద వి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తాను’అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న ప్రగతిభవన్‌ను ప్రజాపాలన భవన్‌గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తుందని తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ అధికారి, ఉద్యోగి సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలని భట్టి కోరారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన, యావత్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
TS: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ..
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీఆర్ఎస్పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ ఉండగా, గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఉండగా, నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సాగుతున్నారు. అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. చదవండి: ‘ఎగ్జిట్ పోల్స్’ కంటే మిన్నగా.. -
తెలంగాణ ఫలితాలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు!
బెంగళూరు : తెలంగాణ,మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఈ విషయమై ఆయన మాట్లాడారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులని తెలిపారు. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని, తాను సొంత పోస్ట్ పోల్ సర్వేలు చేయిస్తానని డీకే చెప్పారు. తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద వేవ్ ఉందన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పవర్లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలకు టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలను కేసీఆర్ లాక్కోవడం ఈసారి కుదరదని తేల్చిచెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి డీకే శివకుమార్ ముఖ్య కారణమన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ హై కమాండ్ డీకేకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కూడా పరోక్షంగా అప్పగించింది. దీంతో ఆయన ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికలపై ఎక్కువే ఫోకస్ చేశారు. తెలంగాణకు వచ్చి చాలా చోట్ల ప్రచారం కూడా చేశారు. తెలంగాణలో గెలిచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు బెంగళూరు తరలిస్తారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. ఇదీచదవండి..హాట్ వింటర్పై ఐఎండీ కీలక అప్డేట్ ! -
Election Results: ప్చ్.. ఎగ్జిట్ ఎవరికో?
అది 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైం. దశలవారీగా పోలింగ్ జరుగుతూ వస్తోంది. ఫలితాలకు కొన్నిరోజుల ముందు దాదాపుగా ఓ 20 సర్వే సంస్థలు ఎగేసుకుని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. అందులో సగానికిపైనే బీజేపీ 90కిపైనే స్థానాలు సాధిస్తుందని.. మరికొన్నేమో ఏకంగా బంపర్ విక్టరీ సాధిస్తుందని చాటింపేసుకున్నాయి. తీరా ఫలితాలు చూస్తే ఒకటి, రెండు సర్వేలు మాత్రమే ఆ అంచనాల్ని అందుకోగా.. మిగతావన్నీ బొక్కాబోర్లా పడ్డాయి. బీజేపీ 77 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చేశాయోచ్.. అని అవి పట్టుకుని అటు బిజీబిజీ చర్చావేదికల్లో పాల్గొనే నేతలు, ఇటు గుంపుగా గుమిగూడి ఓ తెగ మాట్లాడేసుకునే జనాలు.. ఎవరు గెలుస్తారనేది చెప్పేశాం, మా బాధ్యత తీరింది అని చేతులు దులిపేసుకునే సర్వే సంస్థలు.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలివే. మరి తీరా ఫలితం వచ్చాక ఆ అంచనాలు సరిపోలుతాయా? అంటే.. తలకిందులే అయిన సందర్భాలు అనేకం ఉన్నాయని గతం గుర్తు చేస్తోంది. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ను, అసలు ఫలితాలను గమనిస్తే... చాలా సంస్థలు ఓటరు నాడిని పసిగట్టడంలో బోల్తా పడ్డాయని అర్థమైపోతుంది. ఆ టైంలో ప్రముఖ ఛాన్సెల్స్ ఎగ్జిట్ పోల్స్ సగటుకు, అసలు ఫలితాలకు భారీతేడా కనిపించింది. అప్పట్లో ఈ సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తే.. యూపీఏకు అధికంగా సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో.. ఎగ్జిట్‌పోల్స్ ఎక్కువసార్లు అంచనాల్ని అందుకోలేకపోతూ వస్తున్నాయి. పక్కా ఫలితం.. అంత వీజీ కాదు ఎగ్జిట్‌పోల్స్‌కు కచ్చితత్వం.. శాస్త్రీయతలు ఉన్నాయా?.. ఆ సంగతిని పక్కనపెడితే.. మీడియా సంస్థలపై ఎగ్జిట్ పోల్స్ ఒత్తిడి మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఓటర్ పల్స్ ఏంటన్నది టీవీ ఛానళ్లకు కచ్చితంగా దొరకడం లేదు. పైగా ఎన్నికల సంఘం ఆంక్షల నుంచి అభిప్రాయ సేకరణకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతా అయ్యాక చూస్తే.. ఓటర్ ఏకంగా ‘అంతరిక్ష పల్టీ’ కొడుతున్నాడు. ఓటు వేసేది ఒకరికని అభిప్రాయ సేకరణలో చెప్పి.. పోలింగ్ టైంలో మరొకరి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో జరిగేది ఏంటంటే.. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కానీ, ఓటర్ సర్వే సంస్థలు మాత్రం కేవలం ఒక్క శాతం, రెండు శాతమో అభిప్రాయం మాత్రమే తీసుకుంటాయి. అలాంటప్పుడు.. ఫలితం పక్కాగా వస్తుందా? సారీ తప్పైంది! ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు. ఒక్కోసారి ఆ అంచనాలు అందుకోవచ్చు.. లేదంటే దరిదాపుల్లో ఉండొచ్చు. కానీ, ఓటర్ నాడి పసిగట్టలేక ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాలే ఎక్కువున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఆ ఎగ్జిట్‌పోల్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి కూడా. ఉదాహరణకు 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన్నీ తప్పాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్డీటీవీ ఒక అడుగు ముందుకేసింది. ‘‘క్షేత్రస్థాయిలో జరిగిన సమాచార సేకరణ మొత్తం తప్పైంది. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం. పూర్తి బాధ్యత మాదే.. క్షమించండి..’’ అంటూ ఎన్డీటీవీ కో చైర్పరసన్ ప్రణోయ్ రాయ్ బహిరంగ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆ మీడియా సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. #BiharResults Final party wise breakdown: RJD 80, JDU 71, BJP 53, INC 27, LJP 2, RLSP 2, HAM 1, CPI 3, Independent 4 — ANI (@ANI) November 8, 2015 సర్వే సంస్థల్లో లోపిస్తోన్న అంశాలు వయస్సు పరంగా ఓటర్లను కలవాలి (యువత, వృద్ధులు, మధ్య వయస్సు) వృత్తి పరంగా ఓటర్లను కలవాలి (రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు) మతం ప్రాతిపదిక తీసుకోవాలి (హిందూ, ముస్లిం, క్రిస్టియన్) కులం ప్రాతిపదిక ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ) జెండర్ ప్రాతిపదిక ఉండాలి (పురుషులు వేరు, మహిళల ఓటు తీరు వేరు) ప్రాంతం అత్యంత కీలకం (నగరం, పట్టణం, గ్రామం, కొండ ప్రాంతం, అటవీ సమీప ప్రాంతం) ఓటర్లకు విసుగెత్తి.. ప్రస్తుతం మార్కెట్లో సర్వే చేస్తోన్న సంస్థలో శాస్త్రీయత లోపించడం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే.. సర్వే చేపడుతున్న సెఫాలజిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ప్రశ్నల్లో స్పష్టత లేకపోవడంతో.. ఓటర్లు ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. ఈ విషయంలో చాలా సార్లు లోపం కనిపిస్తోంది. పైగా ఓటరు కచ్చితంగా ఎటు ఓటు వేస్తాడనే దానిపై పక్కా అభిప్రాయం రాబట్టాలని.. చాలా ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా జరిగే సర్వేల సంగతి సరేసరి. పదే పదే ఓటర్లకు ఫోన్లు చేసి విసిగిస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో సాధారణంగానే చికాకులో ఉండే ఓటర్లు ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. విద్యార్థుల్ని ఇలాంటి వ్యవహారాల్లో భాగస్వామ్యం చేస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో అసలు ఫలితం చాలా సార్లు తేడా కొడుతోంది. ఈసీ ఏమందంటే.. ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనూ స్పందించింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ స్పందిస్తూ.. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అనేవి తెర వెనుక వ్యవహారాలు. వాటిని అసలు అనుమతించకూడదని అన్నారు. ‘‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు ఇవి కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వీటిని వ్యతిరేకించారనే విషయాన్ని ఆ సందర్భంలో ఆయన గుర్తు చేశారు కూడా. నేతలది అలాంటి మాటే.. తమకు అనుకూలంగా వస్తే మంచిది. లేకుంటే చెడ్డది. ఎక్కడైనా ఇది కనిపించే తంతే. అయితే.. ఎగ్జిట్‌పోల్స్ విషయంలో రాజకీయ పార్టీలు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన సందర్భాలే అనేకం. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. న్యూసెన్స్ అంటూనే ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదని, పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. పోలింగ్ సమయం అధికారికంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటలకు. అర గంట తర్వాత ఎగ్జిట్‌పోల్స్ బయటకు వచ్చాయి. కానీ, తెలంగాణలో పోలింగ్ కోసం ఓటర్లు సాయంత్రమే ఎక్కువగా వచ్చారని.. రాత్రి 10 గంటలదాకా ఓటింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కన ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొచ్చా?.. పోనీ ఆ అంచనాలే ఫలిస్తాయా?.. తెలియాలంటే డిసెంబర్ 3 దాకా వేచి చూడాల్సిందే. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గుబులు పుట్టించిన బీజేపీ
-
ఎస్ఐ రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై స్టే
సాక్షి, అమరావతి: ఎస్ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెల్లడించవద్దని హైకోర్టు శుక్రవారం రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ వ్యాజ్యాన్ని కూడా ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. ఎస్ఐ నియామక ప్రక్రియలోని దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతలను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆరుగొళ్లు దుర్గాప్రసాద్‌తో పాటు మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిక్రూట్మెంట్కు సంబంధించి అక్టోబర్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని ఓ అనుబంధ పిటిషన్ కూడా వేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆర్.వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. ఎత్తు, ఛాతి చుట్టుకొలతను కొలిచేందుకు అధికారులు డిజిటల్ విధానాన్ని అవలంభించడంతో కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. విచారణ జరిపిన హైకోర్టు మాన్యువల్ విధానంలో అభ్యర్థుల ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలవాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు మాన్యువల్‌గా ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలిచారని చెప్పారు. కానీ, గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు పరీక్షలో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులను ఈసారి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. 2018లో కొలిచిన వివరాలను, తాజాగా కొలిచిన వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 2018లో 169.1 సెంటీమీటర్లు ఉన్న ఎత్తు, ఇప్పుడు 167.6 సెంటీమీటర్లకు ఎలా తగ్గిందని రిక్రూట్మెంట్ బోర్డును ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్‌లో ఫీచర్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్ఇంక్!
గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్‌లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్ఇంక్ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్‌పిచాయ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్‌కటింగ్ పేరిట్ క్లౌడ్ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్ అమ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్ఓ రూత్ పోరట్ తెలిపారు. గూగుల్‌క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్ల కోసం ఇతర ఎంటర్ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది. -
ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం రూ.1,323 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను ఐడీబీఐ బ్యాంక్ రూ.1,323 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.6,066 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.6,924 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 16.51 శాతం నుంచి 4.90 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 1.15 శాతం నుంచి 0.39 శాతానికి దిగొచ్చింది. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన సమయానికి బ్యాంక్ ప్రమోటర్లయిన ఎల్ఐసీ, భారత ప్రభుత్వం వద్ద 94.72శాతం వాటా ఉంది. ఎఫ్ఐఐల వద్ద 0.40శాతం, డీఐఐల వద్ద 0.24శాతం, రిటైల్ ముదుపర్ల వద్ద 4.62శాతం వాటా ఉంది. -
Q2 Results: ఆదాయవృద్ధి మార్గదర్శకత్వాన్ని తగ్గించనున్న ఇన్ఫోసిస్
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు రూ.7కోట్లు రెవెన్యూ వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. ఇక కంపెనీ కార్యకలాపాల వల్ల వచ్చిన ఆదాయం రూ.36,538 కోట్ల నుంచి రూ.38,994 కోట్లకు పెరుగుతందని సమాచారం. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్ కోత పెట్టనుంది. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1 - 3.5 నుంచి 1-2.5 శాతంగా ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ వద్ద 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈఓ సలీల్‌పరేఖ్ చెప్పారు. జూన్ త్రైమాసికంలో 17.3 శాతంగా ఉన్న వలసల రేటు 14.6 శాతానికి తగ్గుతుందని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ షేర్ ధర గురువారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందే 2.8శాతం పడిపోయింది. -
టీసీఎస్ రిజల్ట్స్..స్వల్పంగా పెరుగనున్న ఆదాయం
ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలు బుధవారం రానున్నాయి. మరికాసేపట్లో మార్కెట్ టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ క్యూ2 ఫలితాలు విడుదలవుతాయి. అయితే ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ విలువ దాదాపు రూ.13.29 లక్షల కోట్లుగా ఉంది. వివిధ బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్ ఫలితాలను అంచనా వేశాయి. దాని ప్రకారం..టీసీఎస్ ఆదాయం త్రైమాసికంలో 1.4శాతం వృద్ధితో రూ.60,218 కోట్లకు చేరుతుంది. వార్షిక వారీగా ఆదాయం దాదాపు 9% పెరుగుతుంది. నికర లాభం త్రైమాసికంలో 3%, వార్షిక వారీగా 9% పైగా పెరిగి రూ.11,404 కోట్లుగా ఉంటుందని అంచనా. టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్ QoQలో 30-90 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ సేవలపై క్లయింట్స్ వ్యయాలు మందగించినప్పటికీ, టీసీఎస్ డీల్ విన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ కూడా కాసేపట్లో జరుగనుంది. క్యూ2 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్స్ బైబ్యాక్ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత సమాచారం వెలువడనుంది. -
అసలు... కొసరు
ఏక క్రియా ద్వ్యర్థి కరీ అన్నారు పెద్దలు. రాతి మీద నూరటం కత్తికి పదును కోసం, రాయి నునుపు కోసం కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనుకున్న దానితో పాటు కొన్ని అవాంతర ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పనికివచ్చేవి, కొన్ని పనికిరానివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో అసలు ప్రయోజనం మర్చిపోయి, ఈ కొసరుదే సరి అనుకునే ప్రమాదం కూడా ఉంది. పిల్లలకి స్నానం చేయించి, శుభ్రమైన యూనిఫారం వేసి, తల దువ్వి, షూస్ బాగా మిలమిలా మెరిసేట్టు పాలిష్ చేసి, పుస్తకాలు సద్ది, బ్యాగులో పెట్టి, ప్రేమతో తినిపించి, డబ్బా కట్టి బడికి పంపటానికి సిద్ధం చేస్తారు. బడికి వెళ్ళటంతో ప్రయోజనం సిద్ధించదు. అసలు ప్రయోజనం అక్కడికి వెళ్ళి చదువుకుంటే కలుగుతుంది. తయారు అవటం క్రమశిక్షణలో భాగం మాత్రమే. వరి సాగు చేయటం ధాన్యం కోసం. కాని వరిగడ్డి కూడా వస్తుంది. దాని వల్ల లాభం వస్తుంది అని గడ్డి కోసం వరి సాగు చేయరు. అంతే కాదు గడ్డి ఎక్కువగా పెరగటం కోసం ఎరువు వేయరు.వడ్లు బాగా రావాలని తగిన ఎరువులు వేస్తారు. ఆవులని పాల కోసం పోషిస్తారు. గోమయం, గోమూత్రం కూడా మానవులకి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఒకప్పుడు వాటిని పొలాలలో ఎరువుకి వాడేవారు. గోమయంతో పిడకలు చేసి ఇంధనంగా ఉపయోగించేవారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడేవారు. ఇప్పుడు వాటిని మరెన్నింటికో ఉపయోగిస్తున్నారు. కాని ఎవరూ ఆవులని పేడకోసమో, మూత్రం కోసమో పెంచరు కదా! అవసరం అనుకుంటే ఆవులున్న వారి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు. అరవిందాశ్రమంలో శ్రీ మాతగా ప్రసిద్ధి పొందిన మిర్రా సాధన ప్రారంభించిన మొదట్లో అద్భుతమైన అందంతో ప్రకాశించటం మొదలు పెట్టిందిట. శారీరిక, మానసిక ఆరోగ్యాలు ఉండటమే అందం. వెంటనే ఆవిడ ఇది నా ప్రయోజనం కాదు అని ఆ శక్తిని భౌతిక శరీరం నుండి ఉపసంహరించింది. లక్ష్యసాధనలో ఎదురయ్యే ఇటువంటి వాటిని పరమార్థం అనుకోకుండా ముందుకి సాగాలి. ఖాళీ సీసాలు సేకరించి అమ్ముకునే వాడితో ఒక పెద్దమనిషి ‘‘నీకోసమేనయ్యా నేను రాత్రి అంతా కూర్చుని సీసాలు ఖాళీ చేసేది.’’ అన్నాడట! ఆహా! ఏమి సమర్థింపు!! ఈ సందర్భంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూగారిని స్మరించక తప్పదు. స్వతంత్రోద్యమంలో ప్రధాన భాగంగా విదేశీవస్తు దహనం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో ఎవరో ‘‘మీరు విదేశీ సిగరెట్లు కాలుస్తున్నారు. మనం విదేశీ వస్తువులు వాడం కదా!’’ అన్నారుట. దానికి నెహ్రూ గారు నవ్వుతూ... ‘‘అందుకే కదా దహనం చేస్తున్నాను.’’ అన్నారుట. పేలాల కోసం కుప్పలు తగల బెట్టటం అనే సామెత ఉంది. వరిపేలాల కోసం వడ్లని వేయిస్తారు. కాసిని వడ్లతో సరిపోయేదానికి మొత్తం కుప్పని తగల బెట్టటం తెలివి గల పనేనా? ప్రధానమైన ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తుంటే కొన్ని అనుకోనివి కూడా లభిస్తాయి. వాటిని పట్టించుకుంటే దృష్టి చెదిరే ప్రమాదం ఉంది. క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసం. ఆ లోపు పాలసముద్రం నుండి ఎన్నో విశిష్ట వస్తువులు ఉద్భవించాయి – లోకోపద్రవకారకమైన హాలాహలం నుండి కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు వంటి వారి నుండి లక్ష్మిదేవి వరకు. తెలివిగలవారు దేనిని ఏ విధంగా వినియోగించుకోవాలో, ఆ విధంగా వినియోగించుకున్నారు. తమ లక్ష్యమైన అమృతం సిద్ధించే వరకు పాలసముద్రాన్ని చిలకటం కొనసాగించారు. కల్పవృక్షం వంటి వాటి కోసం మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయలేదు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్
-
టెట్‌పై పట్టు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా.. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మాత్రం చాలా మంది ఫెయిలవుతున్నారు. బీఎడ్ విద్యార్హతతో రాసే పేపర్–2లో 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క 2022లో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత 30% కూడా దాటకపోవడం గమనార్హం. ప్రభు త్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తా మని గతేడాది ప్రకటించడంతో.. ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్నవారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్ కోసం సిద్ధమయ్యారు. అయినా పాస్ శాతం తక్కువే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌తోపాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేవారని.. టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో టెట్‌పై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సీరియస్‌గా ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందని అర్హత గీటురాయి: టెట్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కు లు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. పేపర్–1 (డీఎడ్ అర్హతతో రాసేది)తో పోలిస్తే, పేపర్–2 (బీఎడ్ అర్హతతో రాసేది) కష్టంగా ఉంటోందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు. మేథ్స్, ఇంగ్లిష్ పై పట్టు ఉంటే తప్ప కనీసం 90 మార్కులు సాధించడం కష్టమేనని.. ముఖ్యంగా మేథ్స్‌లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. కనీసం 6 నెలల పాటు మోడల్ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నా రు. ఇక ఇంగ్లిష్‌లో ప్రధానంగా జాతీయాలు, మోడ్రన్, అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారని.. వీటికి తగ్గ ప్రిపరేషన్ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. అదే పేపర్–1 ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటోందని.. బోధన మెళకువలు, మోడ్రన్ టీచింగ్ మెథడ్స్‌పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. నాలుగున్నర లక్షల మందిలో.. రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్ ఉత్తీర్ణులు, 4.5 లక్షల మంది బీఎడ్ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికిపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణత సాధించగలిగారు. టెట్‌లో పేపర్–1 పాసైతే.. 1–5 వరకూ బోధించే ‘సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)’ పోస్టులకు.. పేపర్–2 పాసైతే పదో తరగతి వరకు బోధించే ‘స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)’ పోస్టులకు పోటీపడే వీలు ఉంటుంది. డీఎడ్ పూర్తిచేసినవారు పేపర్–1 మాత్రమే రాసే వీలుండగా.. బీఎడ్ వారు పేపర్–1, పేపర్–2 రెండూ రాయవచ్చు. అయితే పేపర్–1 కాస్త సులువుగా ఉంటుండటంతో.. చాలా మంది బీఎడ్ వారు పేపర్–1పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇదికూడా పేపర్–2లో అర్హత శాతం తగ్గడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇంగ్లిష్, మేథ్స్‌కు కష్టపడాలి కేవలం 45 రోజుల్లోనే టెట్‌కు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇంగ్లిష్, మేథ్స్‌లో మంచి మార్కులు సాధిస్తేనే అర్హత సాధించవచ్చు. దీనికి ప్రత్యేక సన్నద్ధత అవసరం. టీచర్ పోస్టులు వస్తాయనే ఆశతో కోచింగ్ కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాం. కానీ టీచర్ నోటిఫికేషన్ రాకపోవడం నిరాశగా ఉంది. – స్వాతి, టెట్ అభ్యర్థి, భూపాలపల్లి నియామకాలుంటేనే ఉత్సాహం టెట్ ఉత్తీర్ణులు లక్షల్లో ఉన్నారు. టీచర్ పోస్టులు వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ ఏటా నిరాశే ఎదురవుతోంది. నియామక నోటిఫికేషన్ వస్తేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. ఈసారైనా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. – ఇఫ్రాన్ పాషా, టెట్ అభ్యర్థి, ములుగు జిల్లా -
సెప్టెంబర్‌లో కానిస్టేబుల్స్ ఫలితాలు?
నిజామాబాద్ : కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితాను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సెప్టెంబర్ రెండో, లేదా మూడో వారంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌లో ఎ న్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ముందుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పోలీస్‌శాఖతో పాటు వివి ధ విభాగలైన జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ(రవాణా), ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 266 సివిల్ కానిస్టే బుల్స్, ఏఆర్ పోస్టులు 134 ఉన్నాయి. వివిధ విభాగాల సంఖ్య హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఉంది. జిల్లాకు కేటాయింపుల ప్ర కారం జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ (రవాణా), ఎకై ్సజ్‌శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేస్తారు. కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష ఫలితాల ను మే 30న పోలీస్ నియామక మండలి ప్రకటించింది. జూన్ 1న ధ్రువపత్రాల పరిశీల న ప్రక్రియ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఎస్సై పరీక్ష ఫలితాల్లో బాసర జోన్ పరిధిలోని 35 ఎస్సై పోస్టులకు ఎస్సైలను ఎంపిక చేశారు. ఎస్సై పోస్టులకు ఎంపికై న వారి వివరాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు(ఎస్బీ) ఎంకై ్వరీ చేశారు. ఎస్సైగా ఎంపికై న అభ్యర్థులకు మెడి కల్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎస్సైల ఎంపిక పూర్తి కావడంతో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కానిస్టేబుళ్ల ఎంపికపై దృష్టి సారించింది. జిల్లాలో 5313 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ చేశారు. మిగితా విభాగాల పోస్టులు కాకుండా సివిల్, ఏఆర్ పోస్టులకు జిల్లాలోని ఒక్కో పోస్టుకు 13 మంది పోటీ పడుతున్నారు. వీరికి సంబంధించిన అన్ని రికా ర్డులు, ఆయా జోన్లు, పోలీ స్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న ట్లు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం జరిగే వరకు రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
US presidential election 2020 Case: ట్రంప్ అరెస్ట్.. విడుదల
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్ షాట్ తీశారు. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్ షాట్ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్ రెండు లక్షల డాలర్ల బెయిల్ బాండ్‌పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు. ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్ షాట్ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్ షాట్ ఫొటోను ట్రంప్ తన సొంత ‘ట్రూత్ సోషల్’తోపాటు ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్ మగ్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు. -
ఫలితం కోసం చూడకుండా అంకితభావంతో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘ఫలితాల కోసం ఎదురుచూడకుండా అంకితభావంతో నీ పని నువ్వు చేసుకుపో.. అని భగవద్గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి..ఇది అర్బిట్రేషన్‌లో నిపుణులు ఎలాంటి కీలకపాత్ర పోషించాలో చెబుతుంది’అని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆధ్వర్యంలో ‘ఆర్బిట్రేషన్‌లో విలువను పెంపొందించడం–నిపుణుల సూచనలు’అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’అనే భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించారు.నిష్పక్షపాతానికి కట్టుబడి న్యాయమైన తీర్మానాలకు వేదికను ఏర్పాటు చేయడంతో నిపుణులకు ఈ సూత్రం ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్‌ను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ నంద, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ పుల్లా కార్తీక్, సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్ డగ్లస్ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీలోని లా ఛాంబర్స్‌తో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ జానెట్ వాకర్, ఎఫ్టీఐ కన్సల్టింగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ లీ బేకర్, అర్బిట్రేటర్ భాగస్వామి విన్సెంట్ రోవాన్, ఎఫ్టీఐ కన్సల్టింగ్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బలిసాగర్ పాల్గొన్నారు. -
ఏపీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
-
ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
సాక్షి, కృష్ణా: గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఫలితాలను రిలీజ్ చేశారు. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలను ప్రకటించారాయన. నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియ పూర్తి చేసింది. ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రికార్డు సమయంలోనే గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించాం. గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా పూర్తి చేశాం. మొదటిసారిగా సీసీ కెమెరాలను వినియోగించాం. 111 పోస్టులకి 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్ధులని ఎంపిక చేశాం. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం ఇదే. ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ర్యాంకర్ల వివరాలు ఫస్ట్ ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ( బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ) సెకండ్ ర్యాంకర్ - భూమిరెడ్డి భవాని ( అనంతపురం) మూడవ ర్యాంకర్ - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న నాలుగవ ర్యాంకర్ - కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ( అనంతపురం జెఎన్ టియు) అయిదవ ర్యాంకర్ - భానుప్రకాష్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటీ) ఆ పుకార్లు నమ్మొద్దు ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల విషయంలో.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పుకార్లపైనా చైర్మన్ గౌతమ్ సవాంత్ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని, గ్రూప్ -2 కి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని, అలాగే.. గ్రూప్-1 వంద పైనా పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని’’ తెలిపారాయన. గ్రూప్-1 ప్రక్రియ సాగిందిలా.. గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. -
గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గతంలో నోటిఫికేషన్ వస్తే భర్తీ ప్రక్రియ ఏళ్లు పట్టేదని.. ఇప్పుడు రెండు నెలల్లో పూర్తి చేస్తున్నామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకట్రెండు సమస్యలకు వ్యవస్థనే తప్పు పట్టడం సరికాదన్నారు. గ్రూప్-4 ఫలితాలకు ఇంకా సమయం ఉందని జనార్థన్‌రెడ్డి అన్నారు. కాగా, ఈ పరీక్షను జూలై 1వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదవండి: ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో మంత్రి మల్లారెడ్డి -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
SI Results Released: పోలీసు ఎస్ఐ ఫలితాలు విడుదల..
హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐ, ఏఎస్ఐ ఫలితాలు విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 పురుష అభ్యర్థులు, 153 మంది మహిళ అభ్యర్థులను టీఎస్ఎల్పీఆర్బీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్ ఆఫ్ మార్కులు రేపు ఉదయం సంబంధిత వెబ్సైట్లో ఉంచుతామని బోర్టు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్సైట్లో పూర్తించాల్సి ఉంటుంది. ఇందుకు ఆగష్టు 9 నుంచి ఆగష్టు 11 వరకు గడువును ఇచ్చారు. 2022 ఏడాది విడుదల చేసిన 587 ఎస్ఐ పోస్టుల రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్, దేహదారుఢ్య పరీక్షలన్నింటినీ బోర్డు విజయవంతంగా పూర్తి చేసింది. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇదీ చదవండి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. -
గ్రూప్-1 ఫలితాలు సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ: గ్రూపు 1 పరీక్షల కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు. సోమవారం అడ్వకేట్ జనరల్ తన వాదనలు కోర్టుకు వినిపిస్తారని తెలిపారు AGP. కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు వెలువరించడంలో తొందరపడొద్దని, సోమవారం వరకు ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ టీఎస్పీఎస్సీ అన్నిటినీ అధిగమించి పరీక్షలనైతే నిర్వహించింది కానీ అడుగడుగునా ఈ వ్యవహారం వారికి అగ్నిపరీక్షలా మారింది. తాజాగా ఎన్ ఎస్ యూఐ తోపాటు మరికొంత మంది అభ్యర్దులు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ పెట్టలేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ దశలో ఉండగానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు ఫలితాలు ప్రకటించకుండా స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించారు పిటిషనర్లు. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దని హై కోర్ట్ ఓరల్ ఆర్డర్ జారీ చేసింది. -
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 111 గ్రూపు-1 పోస్టులకు గాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుండి ఎంపికయ్యారు. గ్రూప్-1 పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది ఏపీపీఎస్సీ . జూన్ 3 నుండి 10వ తారీఖు వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా వారిలో నుండి 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ పర్యవేక్షణలో మూల్యాంకనం స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
గణాంకాలు, ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలతోపాటు, ప్రయివేట్ రంగ బ్యాంకులు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు విడుదల చేయనున్నాయి. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. మరోవైపు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు సైతం వెలువడనున్నాయి. వీటికి జతగా చైనా, యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లలో భారీ పెట్టుబడులు కుమ్మరిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం మార్కెట్లకు జోష్ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. సై టాటా గ్రూప్ బ్లూచిప్ కంపెనీ టీసీఎస్ తొలిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ఈ నెల 12న ప్రకటించనుంది. ఈ బాటలో ఇదే రోజు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం క్యూ1 పనితీరు వెల్లడించనుండగా.. మరో ఐటీ దిగ్గజం విప్రో 13న ఫలితాలు విడుదల చేయనుంది. అయితే అనిశ్చితులు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఐటీ రంగానికి అంత ఆశావహంగా లేనట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నా యి. దీంతో ఐటీ దిగ్గజాల ఫలితాలు ఆకర్షణీయ స్థా యిలో వెలువడకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ప్రయివేట్ రంగ సంస్థలు ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సైతం ఈ వారంలో క్యూ1 పనితీరును వెల్లడించనున్నాయి. కాగా.. ఈ వారం నుంచీ స్టాక్ ఆధారిత యాక్టివిటీ ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఇందుకు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తెరతీయనున్నట్లు తెలియజేశారు. టోకు ధరల ఎఫెక్ట్ జూన్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ)తోపాటు, మే నెలకు తయారీ రంగం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు శుక్రవారం(14న) వెలువడనున్నాయి. మరోపక్క చైనా ద్రవ్యోల్బణ రేటు 10న వెల్లడికానుండగా.. 12న కీలక ద్రవ్యోల్బణ గణాంకాలను యూఎస్ ప్రకటించనుంది. వారాంతాన యూఎస్ పేరోల్స్, నిరుద్యోగ వివరాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించగలదని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ లిమిటెడ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా అభిప్రాయపడ్డారు. గత వారం కొత్త రికార్డ్ ఎఫ్‌పీఐ పెట్టుబడుల అండతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 65,899 వద్ద, నిఫ్టీ 19,524 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. నికరంగా సెన్సెక్స్ 562 పాయింట్లు జమ చేసుకుని 65,280 వద్ద నిలవగా.. 143 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 19,332 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 300 లక్షల కోట్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడంతో వారాంతాన ప్రపంచ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఎఫ్‌పీఐల దన్ను గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ పెట్టుబడులతో జోష్‌నిచ్చారు. ఈ నెల తొలి వారంలో దేశీ ఈక్విటీలలో దాదాపు రూ. 22,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చతులున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత ఎఫ్‌పీఐలను ఆకర్షిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ నెలలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు మే(రూ. 43,838 కోట్లు), జూన్(రూ. 47,148 కోట్లు)లను మించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. మార్చి నుంచి నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న ఎఫ్‌పీఐలు జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,626 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రుతుపవన విస్తరణ, అంచనాలను మించనున్న కార్పొరేట్ ఫలితాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐలకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. -
TS: విడుదలైన ఐసెట్ ఫలితాలు.. తొలి పది ర్యాంకులు అబ్బాయిలవే
తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ టీఎస్ ఐసెట్ 2023 ఫలితాలను జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో విడుదల చేశారు. ఈ ఫలితాలలో పాటు ఫైనల్ 'కీ' ని కూడా విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఫలితాల విడుదల ఆలస్యంగా గురువారం (జూన్ 29)న విడుదల చే అయింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023 పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. 70,900 మంది హాజరయ్యారు. ఈ సారి ఐసెట్‌లో తొలి 10 ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. వీరిలో మొదటి ర్యాంకు నూకల శరణ్‌కుమార్ కైవసం చేసుకోగా.. నాగులపల్లి సాయి నవీన్ రెండు, రవితేజ సజ్జ మూడో ర్యాంకులో సాధించారు. టాప్ 10లో ఆ తర్వాతి ర్యాంకుల్లో ఎస్.సాయి ఫణి ధనుష్, గోపి మల్లికంటి, తిరుగుడు సుమంత్ కుమార్ రెడ్డి, ఆయాచితుల నితీశ్‌కుమార్, వి. సాయి వెంకట కార్తిక్, ఎస్.నాగసాయి కృష్ణవంశీ, బి.సాయిగణేష్ నిలిచారు. చదవండి: Hyderabad: అమ్మో ఫాస్ట్‌ఫుడ్! పంది కొవ్వు కొని నూనెగా మార్చి తక్కువ ధరకు విక్రయం -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2023 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. AP ICET Results 2023 టాప్-10 ర్యాంకర్లు వీళ్లే.. 1. తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట) 2. వేదాంతం సాయివెంకట కార్తీక్ (సికింద్రాబాద్) 3. పుట్లూరు రోహిత్ (అనంతపురం) 4. చింతా జ్యోతి స్వరూప్ (విజయనగరం) 5. కానూరి రేవంత్ (విశాఖపట్నం) 6. మహమ్మద్ అఫ్తాద్ ఉద్దీన్ (పశ్చిమగోదావరి) 7. దేవరాపల్లి దేవ్ అభిషేక్ (విశాఖపట్నం) 8. జమ్ము ఫణీంద్ర (కాకినాడ) 9. పిరతి రోహన్ (బాపట్ల) 10. అంబళ్ల మహాలక్ష్మి (పశ్చిమగోదావరి) ఈ ఏపీ ఐసెట్-2023 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. మే 24, 25 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష రెండు షిఫ్ట్‌లో ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. ☛ AP ICET Results-2023 డైరెక్ట్ లింక్ ఇదే (Click Here) -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ►ఇంజనీరింగ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత ►అగ్రికల్చర్ 89.65 శాతం మంది ఉత్తీర్ణత ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ టెన్ జాబితాలో ఈసారి అంతా బాలురే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం మొదటి ర్యాంకు158 మార్కులతో ఉమేష్ వరుణ్ అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణా ఎమ్ సెట్లో కూడా వరుణ్ మూడవ ర్యాంకు సాధించారు. విద్యార్థులకు అభినందనలు:బొత్స ఏపీఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతీ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రయత్నమని చెప్పారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం విద్యార్దుల మంచి భవిష్యత్ కోసమేనని అన్నారు. దేశంలోనే టాప్ రాష్ట్రంగా ఏపీని ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య కోసం వెచ్చించే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగపడుతుందని చెప్పారు. విద్య పట్ల ప్రతీ ఒక్కరికి శ్రద్ధ పెరిగిందని అన్నారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు. డైరెక్ట్ లింక్ ఇదే.. ఇంజనీరింగ్ ఫలితాలు అగ్రికల్చర్ ఫలితాలు -
UPSC 2023: సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అఖిల భారత సర్వీస్ ‘ప్రిలిమ్స్ పరీక్షా’ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఈ ఏడాది మే 28వ తేదీన ఈ పరీక్ష జరగ్గా.. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 14, 264 మంది సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించారు. UPSC షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇక ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవాళ్లు.. మెయిన్స్ కోసం మళ్లీ డిటైల్డ్ ఫామ్-1 నింపి.. దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ చెబుతోంది. త్వరలోనే ఇందుకు తేదీలను ప్రకటించనుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి https://www.upsc.gov.in/ -
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సైతం పాల్గొన్నారు. పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. అలాగే.. రెండు కేటగిరీల్లో ఏపీకి చెందిన విద్యార్థులే టాప్ ఫైవ్ ర్యాంకుల్లో సత్తా చాటడం గమనార్హం. సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయినట్లు తెలిపారామె. అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ దక్కినట్లు ప్రకటించారు. అగ్రికల్చర్ పరీక్షలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు మంత్రి సబిత. అగ్రికల్చర్ & మెడిసిన్(AM) కేటగిరీ టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ ఇందులో టాపర్‌గా నిలిచాడు. ఇక.. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో విశాఖపట్నంకు చెందిన సానపాల అనిరుధ్ టాపర్‌గా నిలిచాడు. ఇందులోనూ టాప్ 5లో నలుగురు ఏపీవాళ్లే కావడం గమనార్హం. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. -
UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల
ఢిల్లీ: సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది UPSC. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, OBC కేటగిరీ కింద 263 మందిని, SC కేటగిరీ కింద 154 మందిని, ST వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్‌గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇషితా కిషోర్ సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల విజయభేరి IAS/IPS వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తోట శరత్ చంద్ర తెలిపారు. తమ అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి దాదాపు 45 మంది అభ్యర్థులు ఈ ఏడాది ర్యాంకులు సాధించారని ఇందులో చాలామందికి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి మెరుగైన సర్వీసులు వస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా అత్యున్నత సర్వీసులకు ఎంపికవడం పట్ల శరత్ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు. ర్యాంకర్ల వివరాలు : పవన్ దత్త All India Rank 22 హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్‌కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 గత ఏడాది కంటే.. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఖాళీల సంఖ్య పెరిగింది. 1011 ఖాళీలకు యూపీఎస్సీ.. సివిల్స్ పరీక్ష నిర్వహించింది. జనవరి 30వ తేదీ నుంచి మే 18 వరకు ఇంటర్వ్యూలు జరగగా, మూడు ఫేజ్‌ల వారీగా 2529 అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. సివిల్స్-2022లో 11లక్షల పై చిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
మార్కులు తగ్గాయని ఇంట్లో నుంచి వెళ్లి.. రూ.కోటి ఇవ్వాలంటూ తండ్రికి మెసేజ్!
కోల్‌కతా: పరీక్షల్లో మార్కులు తగ్గితే కొందరు విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 16 ఏళ్ల బాలిక పరీక్షల్లో మార్కులు తగ్గడంతో తల్లిదండ్రులు తిడతారని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా తనని కిడ్నాప్ చేశారని నాటకమాడి తన తండ్రి నుంచి కోటి వసూలు చేయాలని ప్రయత్నించింది. ఈ షాకింగ్ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తన మార్కులను తెలుసుకునేందుకు సైబర్ కేఫ్‌కి తన 6 ఏళ్ల సోదరితో కలిసి తన ఇంటి నుంచి బయలుదేరింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వాళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు. అదే సమయంలో, బాలిక తండ్రికి గుర్తుతెలియని నంబరు నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తన కుమార్తెలిద్దర్నీ కిడ్నాప్ చేశామని, రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని అందులో ఉంది. దీంతో పోలీసులు ఆ ఫోన్ నంబరు ఆధారంగా చివరకు నదియా జిల్లాలోని ఓ నర్సింగ్ హోం ఎదుట వారు ఉన్నట్లు గుర్తించి కాపాడారు. అయితే విచారణలో వారు కిడ్నాప్ కాలేదని ఇది డ్రామా అని తెలిసి అవాక్కయ్యారు. తల్లిదండ్రులకు భయపడి తానే ఈ నాటకమాడినట్లు బాలిక కూడా అంగీకరించింది. చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని.. -
కన్నడ ఫలితాలపై కేఎస్ఆర్ కామెంట్
-
కర్ణాటక లో కాంగ్రెస్ సందడి...
-
Karnataka election results 2023: కలసి ఉంటే కలదు సుఖం
రాహుల్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో, మల్లికార్జున ఖర్గే మంత్రాంగంతో ఉప్పు, నిప్పుగా ఉండే దిగ్గజ నేతలు సిద్ధూ, డీకే ఒక్కటయ్యారు. పోస్టర్ల నుంచి ప్రచారం వరకు ఒకే మాట ఒకే బాటగా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మత రాజకీయాలను సమష్టిగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అందరికీ కొత్తగా కనిపించింది. అనూహ్య విజయంతో లోక్‌సభ ఎన్నికలకు కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. అవినీతిపై ప్రచారం రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. పేటీఎంను గుర్తుకు తెచ్చేలా ‘‘పేసీఎం’’ అంటూ బొమ్మై ముఖం, క్యూఆర్ కోడ్‌తో పోస్టర్లు వేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 40% కమీషన్ సర్కార్ అంటూ ప్రచారాన్ని గ్రామ గ్రామల్లోకి తీసుకువెళ్లారు. గ్రామీణాభివృద్ధి మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులో 40% కమీషన్‌ను డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు 40 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. సిద్దూ, డీకే కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి మరే రాష్ట్రంలో లేని విధంగా బలమైన నాయకులు కర్ణాటకలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ జోడు గుర్రాలుగా మారి గెలుపు రథాన్ని పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఎన్నికల వ్యూహాల దగ్గర్నుంచి పార్టీ మేనిఫెస్టో వరకు, టిక్కెట్ల పంపిణీ నుంచి బూత్ మేనేజ్మెంట్ వరకు సంయుక్తంగా వ్యూహాలు రచించారు. పార్టీలో దిగ్గజ నాయకులిద్దరూ ఒక్కటి కావడంతో నాయకులంతా చేతులు కలపడం రావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఖర్గే అనుభవం ఏ పార్టీకైనా అనుభవజ్ఞలైన పెద్దలే కొండంత అండ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 80ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకులైన సిద్దరామయ్య, శివకుమార్లను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఖర్గే సగం విజయం సాధించారు. టిక్కెట్ల పంపిణీపై ముందస్తుగా కసరత్తు చేసి 124 మందితో తొలి జాబితా విడుదల చేయడం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తూ నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు లేకుండా చూశారు. అటు అధిష్టానానికి, ఇటు స్థానిక నాయకత్వానికి వారధిగా ఉంటూ నెల రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. సానుభూతే ఆయుధం బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన కక్షపూరిత రాజకీయాలు కూడా వికటించాయి. ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని వారు కాంగ్రెస్ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధించడం ప్రజల్లో సానుభూతిని పెంచింది. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటునెదుర్కోవడం, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌పై సీబీఐ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టడం వంటివి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే దీనికి తార్కాణం. లింగాయత్ ఓట్లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతుదారులైన లింగాయత్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చీల్చింది. బి.ఎస్. యడీయూరప్పని సీఎంగా తప్పించడంతో ఆ వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికలకు కాస్త ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాదిలు కాంగ్రెస్ గూటికి చేరడం కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ స్వయంగా లింగాయత్ మఠాలన్నీ సందర్శించి తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లన్నీ తీరుస్తామన్న హామీలు ఇవ్వడంతో ఈ సారి లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్లారు. ‘సార్వత్రిక’ విజయానికి తొలి మెట్టు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తొలి మెట్టు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వొచ్చేమో. బీజేపీయేతర పార్టీలు ఇక త్వరగా ఏకతాటి మీదకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ మత రాజకీయాలను ఓడించిన ప్రజలకు జేజేలు’’ – కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య లోకల్ వోకల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి స్థానిక సమస్యలపైనే అత్యధికంగా దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించే అంశాల జోలికి వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌పై ఆధారపడి బీజేపీ ఎన్నికలకి వెళ్లడాన్ని పదే పదే ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలే తప్ప ప్రధాని మోదీ గురించి ఎన్నికలు కాదంటూ ప్రతీ సభలోనూ గళమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పవర్ఫుల్ నాయకులనే ముందుంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకమైపోతూ స్థానిక అంశాలపైనే వారితో ముచ్చటించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా హస్తం గుర్తుకే ఓట్లు గుద్దేశారు. గ్యారంటీ కార్డుకి కురిసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈసారి ఎన్నికల్లో ఓట్లు కురిపించాయి. అయిదు హామీలతో కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీ కార్డులో గృహజ్యోతి (గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ఇంటి మహిళా యజమానికి నెలకి రూ.2 వేలు ఆర్థిక సాయం), అన్న భాగ్య (నిరుపేద కుటుంబాలకు నెలకి 10 కేజీల ఉచిత బియ్యం) యువనిధి (నిరుద్యోగ యువతకి రెండేళ్లు ఆర్థిక సాయం) శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం) హామీలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టాయి. మైనార్టీల అండదండ.. పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అందరూ భావించారు. కానీ మైనార్టీ ఓట్ల ఏకీకరణ జరిగి కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఓల్డ్ మైసూరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలతో ముస్లిం ఓటర్లందరూ ఏకమయ్యారు. ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయేవి. కానీ ఈ సారి అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ వెంటే మైనార్టీలు నడిచారు. జోడో యాత్ర జోష్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా పార్టీ విజయానికి దోహదపడింది. కర్ణాటకలో అత్యధికంగా 24 రోజులు నడిచిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎనిమిది జిల్లాల్లో 500 కి.మీ. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ నడిచారు. 2018 ఎన్నికల్లో ఈ 20 సీట్లలో అయిదు స్థానాలనే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాల్లో విజయభేరి మోగించింది. -
ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్‌కు ఊహించని భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. గత ఎన్నికల్లో గెల్చిన 37 సీట్లతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రజల తీర్పుని గౌరవిస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. చెన్నపటణ నుంచి పోటీ చేసిన హెచ్డీ కుమారస్వామి ఘన విజయం సాధించారు. హోలెనరసీపుర్ నుంచి బరిలోకి దిగిన ఈయన సోదురుడ హెచ్.డీ రేవన్న కూడా గెలుపొందారు. కానీ రామనగరం నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాత్రం ఓటమిపాలయ్యారు. తన తాత హెచ్డీ దేవెగౌడకు కంచుకోటగా చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో నిఖిల్ ఓడిపోవడం జేడీఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతంది. బీజేపీ 64 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. బెంగళూరులో రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలవనుంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
బలవంతులపై పేదల శక్తి గెలిచింది..ఇకపై ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. బలవంతులపై పేదల శక్తి గెలిచిందన్నారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. 'ఈ ఎన్నికల్లో ధనికులకు, పేదలకు మధ్య యుద్ధం జరిగింది. కర్ణాటకలో పెత్తందార్లను పేదలు ఓడించారు. ఈ ఎన్నికల్లో మేం విద్వేషాన్ని ఉపయోగించి పోరాడలేదు. పేదల కోసం పోరాడం. ఇది అందరి విజయం. ప్రేమతో కర్ణాటక ప్రజల మనసులు గెలుచుకున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన 5 హామీలను మొట్ట మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చుతాం. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ ఫలితాలే రిపీట్ అవుతాయి. భారీ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని రాహుల్ అన్నారు. #WATCH | "Karnataka mein Nafrat ki bazaar band hui hai, Mohabbat ki dukaan khuli hai": Congress leader Rahul Gandhi on party's thumping victory in #KarnatakaPolls pic.twitter.com/LpkspF1sAz — ANI (@ANI) May 13, 2023 #WATCH | "Poor people defeated crony capitalists in Karnataka. We didn't fight this battle using hatred...": Congress leader Rahul Gandhi on party's thumping victory in #KarnatakaPolls #KarnatakaElectionResults pic.twitter.com/KKSiV2Lxye — ANI (@ANI) May 13, 2023 కాగా.. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం చేరుకున్న రాహుల్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలతో హొరెత్తించారు. విజయంతో ఫుల్ జోష్‌లో సంబరాల్లో మునిగిపోయారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
అంచనాలకు మించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో దూసుకుపోతుంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 6 ముఖ్య హామీలు 1. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 2. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల రూ.2,000 3. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా రూ.10 కేజీల చొప్పున బియ్యం 4. నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల రూ.3,000 నిరుద్యోగ భృతి 5. డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోలుగా ఉన్న యువతకు యువ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ.1500. 18-25 ఏళ్ల మధ్య వయస్కులకే ఇది వర్తిస్తుంది. 6. శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 130 స్థానాల్లో ఆదిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 67, జేడీఎఎస్ 21 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. చదవండి: కర్ణాటకలో మొదలైన రిసార్ట్ పాలిటిక్స్.. -
నాన్నా రాడు.. అమ్మ లేదు.. ‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన అలేఖ్య
నల్గొండ: నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థిని కట్టెబోయిన అలేఖ్య పరీక్షలకు ముందు ఎన్నో ఇబ్బందులకు గురైంది. బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్షమ్మ దంపతులకు ఏకైక కూతురు అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియడంతో తండ్రి చాలా ఏళ్ల కిందటే వదిలి వెళ్లాడు. దీంతో తల్లి లక్ష్మమ్మ కూతురు అలేఖ్యను తీసుకుని తల్లిగారి ఊరు పెద్దవూర మండలంలోని ముసలమ్మ చెట్టుకు వచ్చి స్థిరపడింది. అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమనూరులోని వసతి గృహంలో ఉంటూ ఆదర్శ పాఠశాలలో చేరింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కూడా తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రా సి 9.7 జీపీఏ సాధించింది. అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న ఆదర్శ పాఠశాల అధ్యాపకులు ఆర్థికంగా కొంత సహయ సహకారాలు అందించారు. పదో తరగతి తర్వాత కూడా అలేఖ్య కూడా చదువుకు అవసరమైన సహకారం అందించడానికి అధ్యాపకులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్‌లో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. బైపీసీలో చేరి, నర్సింగ్ చేయాలని లక్ష్యమని తెలిపింది. సాయం అందిచాలనుకునే వారు: కట్టెబోయిన అలేఖ్య యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్) A/C NO: 194612120000001 IFSC CODE:UBIN 0819468 -
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
కాంగ్రెస్ వైపే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మొగ్గు..!
-
ఉత్తమ ఫలితాలు...అద్భుత ప్రతిభ...
-
వీడియో: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
-
ఏపీ 10 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు హవా
-
వీడియో: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
-
AP: టెన్త్‌లో పెరిగిన ఉత్తీర్ణతా శాతం.. ఫస్ట్, లాస్ట్ జిల్లాలు ఇవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఐదు శాతం పెరిగింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణతా శాతం 72.26 శాతం వచ్చింది.. అలాగే బాలుర కంటే బాలికలే పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 75.38 శాతంతో పైచేయి సాధించారు. ఇక ఫెయిలైన విద్యార్ధులు అధైర్య పడవద్దని.. జూన్ మొదటీ వారంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విజయవాడలో టెన్త్ ఫలితాలను మంత్రి బొత్స ప్రకటించారు. కేవలం 18 రోజుల వ్యవధిలోనే విద్యాశాఖ రికార్డుస్ధాయిలో ఫలితాలని ప్రకటించారు.. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 87.47 శాతం ఉత్తీర్ణత సాధించి పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక 60.39 శాతంతో చివరి స్ధానంలో నంద్యాల జిల్లా నిలిచింది. టెన్త్ పరీక్షలకి రాష్ట్రంలో 6,05,052 మంది పరీక్షకు హాజరు కాగా 4,37,196 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 72.26 శాతం కాగా గత ఏడాది 68 శాతం ఉత్తీర్ణత వచ్చింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఐదు శాతం పెరిగింది. వారిలో 69.27 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా 75.38 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలురు కంటే బాలికలు 6.11 ఎక్కువ శాతంలో ఉత్తీర్ణులై పై చేయిగా నిలిచారు. ఇక 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో 95.25 శాతం అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల వివరాలను www.bse.ap.gov.inలో ఉంచారు. దీనికి సంబంధించి పాస్ వార్డ్ CBSE@2025 అని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. గత ఏడాది టెన్త్ ఫలితాలలో 71 పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు రాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 38 పాఠశాలలకి తగ్గించగలిగారు. ఇందులోనూ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు 29 ఉండటం విశేషం.. ఇక ఒక ప్రభుత్వ హైస్కూలులో.. మరో ఐదు జెడ్పీ హైస్కూలులో జీరో శాతం ఫలితాలు వచ్చాయి.. జీరో శాతం ఫలితాలపై పాఠశాల వారీగా సబ్జెక్టు వారీగా విశ్లేషించి వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నించాలని మంత్రి బొత్స అధికారులని ఆదేశించారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! అలాగే నేరుగా పరీక్షలు రాసిన ఆరుగురు అంధ విద్యార్ధులు పాసయ్యారు.. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుండి 10వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు అభ్యర్థులు మే 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసిన 80.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకుండా ఒక సవాల్ గా తీసుకుని సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించాలన్నారు. పిల్లలు అధైర్య పడకుండా తల్లితండ్రులు వారిని ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక క్లాస్‌లు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు కొరకు హాజరయ్యే విద్యార్థులు మే 7 నుండి 17వ తేదీ వరకూ ఫీజులు చెల్లించవచ్చునన్నారు. టెన్త్ పరీక్షలపై గత ఏడాది జరిగిన సంఘటనలని దృష్టిలో పెట్టుకుని ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎటువంటి ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీగా నిర్వహించారు. -
టెన్త్ ఫెయిల్ అయ్యారని బాధపడొద్దు..ఈ వీడియో చుడండి
-
ఏపీ పదో తరగతి పలితాలు విడుదల
-
ఈ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు
-
AP 10th Class Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల..
సాక్షి, అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల వివరాలను వెల్లడించారు. ఇక, పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లి దండ్రులు ధైర్యం చెప్పాలి ప్రభుత్వ చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి బొత్స తెలిపారు.రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 18 రోజుల్లో ఫలితాలు ప్రకటించమని, పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వరకూ పకడ్బందీగా వ్యవహరించామన్నరు. తక్కువ ఉత్తీర్ణీత వచ్చిన ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గతేడాది పేపర్ లీక్‌కు పాల్పడిన 70 మందికి పైగా టీచర్లను అరెస్ట్ చేశామన్నారు.ఈ ఏడాది ఆరోపణలు రాకుండా టెన్త్ పరీక్షలు నిర్వహించమన్న బొత్స.. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహం చెందవద్దన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని బొత్స సూచించారు. - ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత). - నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది(60 శాతం). - ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. - జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. - మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో ఏప్రిల్ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి చేశారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.... BSEAP అధికారిక సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి. హోమ్ పేజీలో AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి కొన్ని క్షణాల్లో మీ ఫలితం తెరపై కనబడుతుంది ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్లోడ్ చేయండి -
జేఈఈ మెయిన్స్‌లో.. టాప్ లేపిన తెలంగాణ!
ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ టాప్ లేపింది. జాతీయ స్థాయి మొదటి ర్యాంకు మాత్రమేగాక.. టాప్–10లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే సాధించారు. జాతీయ స్థాయిలో వంద పర్సంటైల్ సాధించిన వారిలోనూ రాష్ట్ర విద్యార్థులు 11 మంది ఉన్నారు. ఏపీతో కలుపుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది వంద పర్సంటైల్ సాధించిన టాప్–43లో నిలిచారు. ఇక ఓపెన్ కేటగిరీలో మొదటి వంద ర్యాంకుల్లో 25కుపైగా, టాప్ వెయ్యి ర్యాంకుల్లో 200కుపైగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. ఈసారి జేఈఈ పరీక్ష జాతీయ స్థాయిలో రెండు దఫాలుగా.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి జరిగింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,13,325 మంది హాజరయ్యారు. తుది ఫలితాలు, ర్యాంకులను ఎన్టీఏ శనివారం వెల్లడించింది. టాపర్స్ వీరే.. జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా వంద శాతం పర్సంటైల్‌ను 43 మంది విద్యార్థులు సాధించగా.. అందులో 11 మంది తెలంగాణ విద్యార్థులే. మొత్తంగా టాప్ ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్యకు దక్కింది. టాప్–10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన అల్లం సుజయ్ 6వ ర్యాంకు, వావిళ్ల చిద్విలాసరెడ్డి 7వ ర్యాంకు, బిక్కన అభినవ్ చౌదరి 8వ ర్యాంకు, అభినీత్ మంజేటి 10వ ర్యాంకు సాధించారు. ఇక గుత్తికొండ అభిరాం (17వ ర్యాంకు), భరద్వాజ (18వ ర్యాంకు), పాలూరి గణకౌశిక్రెడ్డి (20వ ర్యాంకు), రమేశ్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గారెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి మోహన శ్రీధర్‌రెడ్డి (41వ ర్యాంకు) తదితరులు వందశాతం పర్సంటైల్ సాధించిన టాప్–43 ర్యాంకర్లలో ఉన్నారు. రేపట్నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు జేఈఈ అర్హత సాధించినవారు ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకుని, దాని ఆధారంగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ కేటగిరీలకు కేటాయించిన కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన వారి వివరాలను ర్యాంకు కార్డులో పొందుపరిచారు. అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ ఇదీ.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో వచి్చన మార్కులను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయిస్తారు. గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 90 పర్సంటైల్‌తో కటాఫ్ నిర్ణయించారు. కేటగిరీల వారీగా కటాఫ్ ఇదీ.. కేటగిరీ కటాఫ్ ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఓపెన్ 90.788642 98,612 పీహెచ్ 0.0013527 2,685 ఈడబ్ల్యూఎస్ 75.6229025 25,057 ఓబీసీ 73.6114227 67,613 ఎస్సీ 51.9776027 37,536 ఎస్టీ 37.2348772 18,752 కృత్రిమ మేధపై పట్టు సాధించాలనుంది జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే పట్టుదలతో విజయం సాధిస్తా. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనుంది. తర్వాత ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రోజుకు 18 గంటలు కష్టపడి చదువుతున్నాను. మా నాన్న శ్రీపణి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మ రాజరాజేశ్వరి నా కోసం చాలా కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను. – సింగరాజు వెంకట కౌండిన్య, జేఈఈ టాపర్ -
ఈ రిజల్ట్ ఎలాంటి ప్రభావం చూపదు: సజ్జల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైఎస్సార్సీపీని బాగా ఆదరించారని, అలాగే ఫలితంతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని శనివారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో పేర్కొన్నారు. ఓట్ల బండిల్లో ఏదో గందరగోళం జరిగింది.కౌంటింగ్‌లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిద్ది అని అనుకోవద్దంటూ ప్రతిపక్ష టీడీపీకి చురకలంటిచారాయన. అలాగే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని గుర్తు చేశారు. ఇవి సొసైటీని రిప్రజెంట్ చేసేవి కావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు. పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీకి వెళ్లాయి. ఈ ఫలితంతో.. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారాయన. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదు. అలాగే.. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదు. ఎందుకంటే.. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదు. అసలు ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు? అని టీడీపీని, యెల్లో మీడియాను ప్రశ్నించారాయన. ‘‘మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్ల లో ఎక్కువగా లేరు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేస్తోంది. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయొచ్చు అని తెలిపారు సజ్జల. అయితే.. మొదటిసారి ఉపాధ్యాయుల స్థానాలు గెల్చుకున్నామని చెప్పిన ఆయన.. ఉపాధ్యాయులు తమను బాగా ఆదరించారని చెప్పారు. ‘‘తొలిసారి టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం మాకు పెద్ద విజయం. మా ఓటర్లు వేరే ఉన్నారు. మాకు సంతృప్తికరంగానే ఓట్లు వచ్చాయి. అలాగని.. ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపవు’’ అని మరోసారి స్పష్టం చేశారాయన. ఇదీ చదవండి: రెండు సీట్లకే ఎగిరి గంతేయడం టీడీపీ స్టైల్! -
AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
Updates: ►ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డిపై 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంవీ రామచంద్రారెడ్డి ►కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి కి 10787 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డి కి 10618 ఓట్లు వచ్చాయి. మూడో ప్రాధాన్యత ఓట్లతో ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ►పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం చిత్తూరు: తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది.