
సాక్షి, తాడేపల్లి: పశు సంవర్ధక సహాయకుల పోస్టుల రాత పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను https://apaha-recruitment.aptonline.in/ వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు.
కాగా సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసి.. గత డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు.
ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు
జిల్లా పోస్టుల సంఖ్య
అనంతపురం 473
చిత్తూరు 100
కర్నూలు 252
వైఎస్సార్ 210
నెల్లూరు 143
ప్రకాశం 177
గుంటూరు 229
కృష్ణా 120
పశ్చిమ గోదావరి 102
తూర్పు గోదావరి 15
విశాఖపట్నం 28
విజయనగరం 13
శ్రీకాకుళం 34
Comments
Please login to add a commentAdd a comment