సంస్కృతం మన ప్రాచీన భాష. అది హైందవ నాగరికతకు ప్రతీక. భారతీయుల నిత్య జన వ్యవహారాలలో ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటుంది.
ఇన్ బాక్స్
సంస్కృతం మన ప్రాచీన భాష. అది హైందవ నాగరికతకు ప్రతీక. భారతీయుల నిత్య జన వ్యవహారాలలో ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటుంది. ఇక యజ్ఞయాగాదులలో, దేవాలయాలలో ఆ భాష ప్రాధాన్యం విశేషమైనది. మనదైన జీవన విధానంతో ముడిపడి ఉన్న ఆ దేవభాషను కాపాడాలని చెప్పడం తప్పుకాదు. సంస్కృత భాష అభ్యాస, అధ్యయన, పారాయణాలకు అనువైన పవిత్ర స్థలాలు ఆశ్రమాలు, దేవాలయాలు, విద్యాపీ ఠాలు, గురుకులాలు, విద్యాలయాలను గుర్తిం చి కాపాడాలి. సంస్కృత భాషని మన భాషగా గౌరవించి, జాతి వారసత్వ లిపిని నేర్చుకోవాలి. సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని వేర్వేరు శాఖలుగా విభజించి పోషించాలి. దక్షిణ భారతంలో ఒక్క తెలుగు, మరాఠీ, కన్నడ భాషలకు చెందిన వారిలో 30 శాతం సంస్కృతం మీద ప్రేమ చూపుతారు. తమిళనాడు మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఉత్తర భారతంలో దీనికి ఎంతో ఆదరణ ఉంది. జనని సకల భాషలకు సంస్కృతంబు. ప్రపంచం గౌరవిస్తున్న మనదైన భాషను మనం నిర్లక్ష్యం చేయడం అవివేకం. దీనిని గుర్తించాలి.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు కరీంనగర్