
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి ఏపీలో తలెత్తిన శాంతి భద్రతల వైఫల్యాన్ని ఆయనకు వివరించనున్నారు. అత్యంత భద్రత ఉండే విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు థర్డ్ పార్టీ విచారణ కోరనున్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించిన రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై వివాదాస్పదంగా వ్యవహరించారు. దాంతో హత్యాయత్నం ఘటనపై ఠాకూర్ నేపథ్యంలో ఏర్పాటైన సిట్‌పై తనకు నమ్మకం లేదంటూ వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై ఏపీ అధికారులతో కాకుండా థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలపనున్నారు.