ధోనితో కలిసి పంత్‌ ఇలా.. | Pant Relishes Good Vibes With MS Dhoni And His Dogs | Sakshi
Sakshi News home page

ధోనితో కలిసి పంత్‌ ఇలా..

Published Sat, Oct 26 2019 10:18 AM | Last Updated on Sat, Oct 26 2019 11:38 AM

Pant Relishes Good Vibes With MS Dhoni And His Dogs - Sakshi

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనితో కలిసి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంజాయ్ చేసాడు. రాంచీలోని ధోని నివాసంలో పంత్ సరదాగా గడిపాడు. . ఇద్దరి కలిసి గార్డెన్‌లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సమయంలో ధోని శునకంతో పంత్‌ కాసేపు ఆడుకున్నాడు. దీనికి సంబందించిన ఫొటోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం పోస్ట్ చేసాడు.  ‘గుడ్ వైబ్స్ ఓన్లీ’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం పంత్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  అభిమానులు దీనిపై తమదైన శైలిలో చమత్కరిస్తున్నారు. తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. కీపింగ్‌లో ధోనీ వద్ద సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. 'శునకంతో ఏం చెబుతున్నావ్ పంత్‌’ అని ఒక అభిమాని కామెంట్‌ చేయగా, ‘దిగ్గజంతో ఎంజాయ్ చేస్తున్నావ్‌.. సలహాలు బాగా తీసుకో’ అని మరొకరు కామెంట్‌ చేశారు.

గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమీటి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషభ్‌ పంత్‌ను కూడా జట్టులో ఉన్నా శాంసన్‌ను రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌-వికెట్‌ కీపర్‌గా తీసుకున్నారు. ఇక ప్రపంచకప్ అనంతరం ధోని క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు కూడా అందుబాటులో లేడు. ప్రస్తుతం ధోని కుటుంబంతో గడుపుతూ వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement