టైటిల్ పోరుకు కర్ణాటక, రైల్వేస్ | Railways, Karnataka to clash in Vijay Hazare final | Sakshi
Sakshi News home page

టైటిల్ పోరుకు కర్ణాటక, రైల్వేస్

Published Sat, Mar 15 2014 1:11 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నీలో కర్ణాటక, రైల్వేస్ జట్లు టైటిల్ పోరుకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కర్ణాటక 21 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై... రైల్వేస్ 5 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయం సాధించాయి.

కోల్‌కతా: విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నీలో కర్ణాటక, రైల్వేస్ జట్లు టైటిల్ పోరుకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కర్ణాటక 21 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై...  రైల్వేస్ 5 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయం సాధించాయి. రాబిన్ ఉతప్ప (135 బంతుల్లో 133; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 6 వికెట్లకు 323 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసింది.
 
 ఇషాంక్ జగ్గీ (121 బంతుల్లో 141; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), సౌరభ్ తివారీ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించినా ప్రయోజనం లేకపోయింది. వినయ్ కుమార్ 4, మిథున్ 3 వికెట్లు తీశారు. ఉతప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.  రెండో సెమీస్‌లో మొదట బెంగాల్ 47.4 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. మనోజ్ తివారీ (61), గోస్వామి (38) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత రైల్వేస్ 38.2 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో కర్ణాటకతో  రైల్వేస్ తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement