
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
వివరాల ప్రకారం... బెంగళూరులోని బీటీఎం లేఅవుట్‌లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నడుస్తున్న వీధి నిర్మానుష్యంగా ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. వారిలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, మరో మహిళ.. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అనంతరం, సదరు ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తామే స్వయంగా చర్య తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.
The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025
ఇదిలా ఉండగా.. బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల సాధారణంగా మారాయి. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో ఓ యువతి వేధింపులకు గురైంది. ఆమె బుక్ చేసుకున్న క్యాబ్‌లోకి బలవంతంగా ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించారని ఆరోపించారు. కమ్మనహళ్లి నివాసి అయిన ఆ మహిళ ఏదో విధంగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 27న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ మహిళ తన స్నేహితుడిని తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ మహిళ భయంతో క్యాబ్ నుంచి దిగాలని నిర్ణయించుకున్నప్పుడు నిందితుల్లో ఒకరు ఆమెను వెంబడించాడు. మరొకరు ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నించారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.