శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది.
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది. దేవదేవుడు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. కంపార్ట్మెంట్ల బయట భక్తులు క్యూలో బారులు తీరారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడక భక్తులకు 10 గంటల సమమయ పడుతుంది. నిన్న శనివారం స్వామివారిని 93,119 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే నిన్న శ్రీవారి హుండీకి రూ. 2.58 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.