తిరుమలలో దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఆరోరోజు కొనసాగుతున్నాయి.
తిరుమల: తిరుమలలో దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఆరోరోజు కొనసాగుతున్నాయి. శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు బంగారు రథంపై ఊరేగనున్నారు. రాత్రికి స్వామివారికి గజవాహన సేవ జరగనుంది.
అయితే బ్రహ్మోత్సవాలు... వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలిబాట మార్గం నుంచి భారీగా భక్తులు వస్తున్నారు.