రుమలలో శుక్రవారం శ్రీవారి ఉదయాస్తమాన సేవలో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు.
తిరుమల: తిరుమలలో శుక్రవారం శ్రీవారి ఉదయాస్తమాన సేవలో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవరం కూడా కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... భక్తులు భారీగా క్యూ లైన్లులో నిలబడ్డారు. సర్వదర్శనానికి 14 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.