డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. రెండు, మూడు రోజుల్లో డీఎంకే కార్యాలయంలో అన్నా
ఆరోగ్యంగా కరుణ
Published Mon, Nov 21 2016 2:45 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. రెండు, మూడు రోజుల్లో డీఎంకే కార్యాలయంలో అన్నా అరివాలయానికి ఆయన వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అలర్జీ కారణంగా ఏర్పడ్డ దద్దుర్లతో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. నెల రోజులుగా ఆయన గోపాలపురం ఇంటి నుంచే చికిత్స పొందుతూ వచ్చారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, డీఎంకే బహిష్కృత నేత అళగిరి తదితర కుటుంబీకులు తప్ప, మరెవ్వర్నీ గోపాలపురంలోకి అనుమతించ లేదు.
ఈ పరిస్థితుల్లో దద్దుర్లు మానడంతో కరుణానిధి ఆరోగ్యవంతులు అయ్యారు. ఇందుకు తగ్గ సంకేతాలను డీఎంకే వర్గాలు ఇస్తున్నాయి. కరుణ ఆరోగ్యవంతుడు కావడంతో, పార్టీ వ్యవహారాల మీద ఇంటి నుంచే దృష్టి పెట్టి ఉన్నారని చెబుతున్నారు. అందుకే చిల్లర కోసం జనం పడుతున్న పాట్లను నిరసిస్తూ ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా మానవహారానికి పిలుపునిచ్చి ఉన్నారని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన గోపాలపురం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం అరివాలయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement