అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెరుుల్ రాలేదని విరక్తి చెంది ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరువళ్లూరు సమీపంలోని పొన్నేరి వద్ద చోటుచేసుకుంది.
గుమ్మిడిపూండి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రాలేదని విరక్తి చెంది ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరువళ్లూరు సమీపంలోని పొన్నేరి వద్ద చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిలా,్ల పొన్నేరి డివిజన్ పరిధిలోని కాటావూర్ గ్రామానికి చెందిన నాగయ్యన్ కుమారుడు సుభాష్ (23). ఇతను ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అన్నాడీఎంకే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత బెయిల్ పిటిషన్ విచారణ సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో స్వీకరించారు. అయితే విచారణనూ అత్యవసరంగా విచారించలేమని న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. టీవీలో చూసిన సుభాష్ విరక్తి చెంది విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని చెన్నై వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సుభాష్‌కు స్థానిక అన్నాడీఎంకే నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.