Jayalalithaa
-
జయలలిత వస్తువుల అప్పగింత షురూ!
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలిత వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకున్నారు. జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, 11,344 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు, 7,040 గ్రాముల బరువైన 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి అభరణాలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీసెట్లు, 8 వీసీఆర్‌లు, ఒక వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్‌లు, 24 టూ ఇన్ వన్ టేప్రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లతోపాటు ఇతర విలువైన వస్తువులను కర్ణాటక అధికారులు న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అప్పగింత ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తికానుంది. జయలలిత బంధువులమంటూ దీప, దీపక్ అనే వ్యక్తులు గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వస్తువులను తమకు అప్పగించాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 2024 మార్చి 6, 7 తేదీల్లో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. అంతలోనే దీప, దీపక్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలిత వస్తువుల అప్పగింతపై గతేడాది మార్చి 5న హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత దీప, దీపక్‌ల పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు వస్తువుల అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు స్పెషల్ కోర్టు 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
నటి నుంచి సీఎం వరకూ.. ‘అమ్మ’ జీవితం సాగిందిలా!
పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ నేపధ్యం జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్‌లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. సినీ జీవితం చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. రాజకీయ ప్రయాణం నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎంజీఆర్, జయలలిత ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్‌తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సాధించిన విజయాలు తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
‘జయలలిత డబ్బులు కాజేసి పైకొచ్చాడు’
మేడ్చల్ రూరల్: పాలమ్మి, పూలమ్మి మంత్రి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఇతరుల ఆస్తులు కాజేసి పై కొచ్చాడని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రాత్రి మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని అందులో డైయిరీ ఫాం ఏర్పాటు చేసుకుందన్నారు. ఆ సమయంలో పాలవ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడన్నారు. ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం అందడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఓ చోట దాచిపెట్టగా మల్లారెడ్డి వాటిని దొంగిలించాడన్నారు. తన ఇంటి పక్కన ఉండే క్రిస్టియన్ విద్యా సంస్థల యజమానురాలిని మోసం చేసి కుటుంబీకులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి కాజేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మైసమ్మగూడలో చెరువు శిఖం స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టడం వల్లే మొన్న భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నాయకులు చివరకు తమ మేనిఫెస్టోను కాఫీ కొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి పదవీ వ్యామోహం ఎక్కువన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడి గతంలో గెలిచారని కానీ ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉండి చేసిందేమీ లేదన్నారు. తమ వ్యాపారాల కోసమే మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాళాల, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి వెలుగులోకి తెస్తామని తనకు మేడ్చల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్, నాయకులు రమణారెడ్డి, మహేశ్‌గౌడ్, పోచయ్య, వరదారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్‌గౌడ్, నడికొప్పు నాగరాజు, రంజిత్, రాహుల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథే 'రుద్రంకోట'
అనిల్ ఆర్క కండవల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రుద్రంకోట’. నటి జయలలిత ఓ కీలక పాత్రలో నటించి, చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించారు. రాము కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విభీష, రియా హీరోయిన్లు. ఏఆర్కే విజువల్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాని ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ– ‘‘స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది.భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటిగారు మా చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిమల్ల సంజీవ్, సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్. -
స్టే ఉండగా.. పీటీ వారెంట్ ఎలా జారీ చేస్తారు?
సాక్షి, చైన్నె: పరప్పన అగ్రహార జైలులో లగ్జరీ జీవితం గడపిన వ్యవహారంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, ఈమె వదినమ్మ ఇలవరసిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. బెంగళూరు లోకాయుక్త మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో స్టే ఉండగా ఎలా..? వారెంట్‌జారీ చేస్తారని చిన్నమ్మ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, ఆమె వదినమ్మ ఇలవరసి బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరు ఆ జైల్లో లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి తరచూ బయటకు షాపింగ్‌కు వెళ్లడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి మరిగి, లంచం పుచ్చుకుని చిన్నమ్మ, వదినమ్మకు లగ్జరీ జీవితం గడిపే అవకాశం కల్పించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు బెంగళూరు ఏసీబీ అధికారులు శశికళ, ఇలవరసిని కూడా టార్గెట్ చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో.. ఈకేసులో తొలి నిందితుడిగా అక్కడి జైళ్ల శాఖ పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరప్పన అగ్రహార జైలు అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌కు సంబంధించిన కేసు లోకాయుక్త కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తొలి నిందితులిగా జైలు పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరస్పన అగ్రహార అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌ను రెండు, మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఐదు, ఆరో నిందితులుగా శశికళ, ఇలవరసి ఉన్నారు. ఈ కేసు బెంగళూరు లోకాయుక్తలో విచారణలో ఉంది. ఈ విచారణకు నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో కోర్టును ఆశ్రయించారు. మినహాయింపు పొందారు. అయితే, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇది వరకు సూంచింది. ఆ మేరకు పలుమార్లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అయితే, విచారణకు ఈ ఇద్దరు వెళ్లలేదు. దీంతో లోకాయక్త కోర్టు కన్నెర్ర చేసింది. ఈ ఇద్దరికీ పిటీ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 6వ తేదీకి వాయిదా పడింది. కాగా చిన్నమ్మను అరెస్టు చేస్తారేమో అన్న బెంగ ఆమె మద్దతు దారులలో నెలకొంది. అయితే కోర్టు విచారణకు హాజరు కావడంలో కోర్టు మినహాయింపు ఉన్నా.. ఎలా వారెంట్ జారీ చేస్తారని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని చిన్నమ్మ న్యాయవాదులు వెల్లడించారు. -
అసెంబ్లీలో ఆమె చీరలాగి.. ఇక్కడికొచ్చి నీతులు చెబుతారా?
-
నాయకుడొచ్చాడు..! అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి
అనుమానాలు తొలగిపోయాయి.. ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకూ అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్పించింది. ఆయన నేతృత్వంలో 79 మంది రాష్ట్ర కమిటీ, 69 జిల్లాల కార్యదర్శులు, ఇతర రాష్ట్రాలలోని కార్యదర్శులకు ఆమోద ముద్ర వేస్తూ.. ఆ వివరాలను మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇది అన్నాడీఎంకే శ్రేణుల్లో అమితానందాన్ని నింపింది. సాక్షి, చైన్నె: అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాల క్రమంలో ఆ పార్టీలోని ముఖ్య నేతలు నాలుగు శిబిరాలుగా విడిపోయి ముందుకెళ్తున్నారు. ఓ ఓ వైపు తానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శినంటూ జయలలిత నెచ్చెలి శశికళ, మరోవైపు పార్టీలో చీలిక కారణంగా ఏర్పడిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం గొడుగు నీడన దినకరన్, ఇంకో వైపు సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాతో అంటూ పన్నీరు సెల్వం శిబిరం అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అయితే, కేడర్ బలం, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో అన్నాడీఎంకే తనదే అని చాటే విధంగా పళణి స్వామి నిత్యం వ్యూహాలకు పదును పెట్టి చివరికి సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకే వ్యవహారాలు అనేకం కోర్టుల్లో ఉన్నా, పార్టీకి కీలకం ఎవరు? అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మరోమారు తేల్చింది. సర్వ సభ్య సమావేశం, పార్టీ నిబంధనలకు అనుగుణంగా సంస్థాగత ఎన్నికలు, ఏకగ్రీవంగా పదవులకు ఆమోదం లభించడంతో పళనిస్వామి పై చేయి సాధించారు. నూతనోత్సాహంతో.. సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన తీర్పు, అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో వ్యూహాలకు పదును పెట్టి అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం దిశగా పళణి స్వామి అడుగులు వేసి విజయం సాధించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి బలోపేతం దిశగా పరుగులు తీస్తున్నారు. ఆగస్టులో మదురై వేదికగా భారీ మహానాడు నిర్వహణకు సిద్ధమవున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శిగా తన ఎంపికతో పాటుగా, రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, ఇతర రాష్ట్రాల కమిటీల ఎంపిక వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అన్నాడీఎంకే వర్గాలు పంపించాయి. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇక, అన్నాడీఎంకేను సొంతం చేసునే అవకాశం ఇతర గ్రూపులకు లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టిన ఉత్తర్వులు మంగళవారం పళణి స్వామికి అందాయి. ఇందులో అన్నాడీఎంకేలో ఇక ఏక నాయకత్వం అని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, 69 జిల్లాలకు కార్యదర్శులు, రాష్ట్ర కమిటీలో జంబో జట్టుగా 79 మంది నియామకానికి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ, అండమాన్ తదితర ప్రాంతాలకు పార్టీ కార్యదర్శుల గుర్తింపునకు ఆమోదం లభించింది. దీంతో ఆపార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర కమిటీలో 79 మందికి చోటు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా తమిళ్ మగన్ హుస్సేన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా కేపీ మునుస్వామి, నత్తం ఆర్. విశ్వనాథన్, కోశాధికారిగా దిండుగల్ శ్రీనివాసన్, ఆల్ ఇండియా ఎంజీఆర్ మండ్రం కార్యదర్శిగా సి. పొన్నయ్యన్‌ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా సి. తంబి దురై, నిర్వాహక కార్యదర్శులుగా సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, సెమ్మలై, దళవాయి సుందరం, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎస్పీ వేలుమణి, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా పొల్లాచ్చి వి. జయరామన్, మహిళా విభాగం కార్యదర్శిగా వలర్మతికు పదవులు కల్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకే అన్నాడీఎంకే అని స్పష్టం చేయడంతో పళణి స్వామి మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అన్నాడీఎంకే జెండాను గానీ,పార్టీ చిహ్నాన్ని గానీ మరెవరైనా ఉపయోగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జయకుమార్ హెచ్చరించారు. పళణిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గుర్తింపు వచ్చిందో లేదో వెంటనే ఏన్డీఏ కూటమి ఆహ్వానం కూడా దక్కింది. ఈనెల 18వ తేదీ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పార్టీల సమావేశానికి అన్నాడీఎంకే తరపున హాజరు కావాలంటూ పళణికి పిలుపు రావడం విశేషం. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నాయి. అంగీకరించే ప్రసక్తే లేదు.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను తాము అంగీకరించే ప్రసక్తే లేదని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పళణి సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న (దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్) కొడనాడు ఘటనను ఈసందర్భంగా పన్నీరు సెల్వం ప్రస్తావిస్తూ, ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాని కోరారు. ఈ విషయంపై ఆగస్టు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు. కాగా, ఎన్డీఏ కూటమి సమావేశానికి పళణి స్వామికి, పీఎంకే తరపున అన్భుమణి రాందాసుకు, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జీకే వాసన్‌కు ఆహ్వానాలు వచ్చినా తనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేని పన్నీరు పేర్కొనడం గమనార్హం. -
40 స్థానాలు మావే!
సాక్షి, చైన్నె: రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలు తమవేనని, గెలుపు ప్రకాశవంతంగా ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. సేలం జిల్లా ఆత్తూరులో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే బలం ఏమాత్రం తగ్గలేదని ఽధీమా వ్యక్తం చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో మరింత బలోపేతం దిశగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అని అయితే, ప్రజామద్దతు ముఖ్యం అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ఏ ఒక్కరికీ బానిస కాదని స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో అన్నాడీఎంకే బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ తమ గెలుపు ప్రకాశవంతంగా ఉందని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేయగా, అవి ఆయన వ్యక్తిగతం అని సమాధానం ఇచ్చారు. 25 స్థానాలను బీజేపీ గురి పెట్టినట్టుందే అని మళ్లీ ప్రశ్నించగా, అమిత్ చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
చిన్నమ్మ.. ఎవరా జ్యోతిష్కుడు?
సాక్షి, చైన్నె: కొడనాడు హత్య, దోపిడీ కేసులో శశికళను విచారణ వలయంలోకి తెచ్చేందుకు సీబీసీఐడీ నిర్ణయించింది. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఎడపాడిలో ఉన్న ఓ జ్యోతిష్కుడిని కూడా విచారించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో నవంబర్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన గురించి తెలిసిందే. అన్నాడీఎంకే హయాంలో ఈ కేసును మమా అంటూ ముగించారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని వెలుగులోకి తెచ్చేందుకు తాజాగా డీఎంకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలుత ఐజీ సుధాకర్, డీఐజీ ముత్తుస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏడాది కాలంగా విచారించింది. ఆ తర్వాత సీబీసీఐడీకి కేసును అప్పగించారు. ప్రధానంగా మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి, ఆయన సన్నిహిత మిత్రుడు ఇలంగోవన్‌ను టార్గెట్ చేసి ఈకేసులో సీబీసీఐడీ దూకుడుగా ముందుకెళుతోంది. గతవారం పళనిస్వామికి భద్రతాధికారిగా పనిచేసిన కనకరాజ్‌ను సీబీసీఐడీ విచారించింది. ఈపరిస్థితులలో ఈకేసులో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని స్వయంగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే, పళనిస్వామి డ్రైవర్‌గా పనిచేసి అనుమానాస్పదంగా గతంలో మరణించిన కనకరాజ్‌కు ఎడపాడిలోని ఓ జ్యోతిష్కుడికి మధ్య సంబంధాలు ఉన్న సమాచారం సీబీసీఐడీ దృష్టికి చేరింది. దీంతో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టితోపాటు ఆ జ్యోతిష్కుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మే మొదటి వారంలో వీరిని విచారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా సమన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. అదే సమమయంలో పళనిస్వామి నియోజకవర్గం ఎడపాడికి చెందిన జ్యోతిష్కుడి గురించిన సమాచారం తెరపైకి రావడంతో విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు రానున్నాయో అన్న ఉత్కంఠ మొదలైంది. అలాగే, గతంలో చిన్నమ్మ వద్ద విచారణ బృందం వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విచారణకు సిద్ధం కావడం గమనార్హం. -
అమ్మ ఆస్తుల వేలానికి కసరత్తు
సాక్షి, చైన్నె : దివంగత సీఎం జయలలితకు సంబంధించిన అటాచ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమవుతోంది. బెంగళూరు కోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారాల పర్యవేక్షణకు న్యాయ వాదిని శుక్రవారం నియమించింది. అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, ఇలవరసి, సుధాకరన్ దోషులుగా తేలిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడే సమయానికి జయలలిత అనంత లోకాలకు వెళ్లారు. దీంతో ఆమె నెచ్చెలి, బంధువులు జైలు శిక్షను అనుభవించి ప్రస్తుతం బయటకు వచ్చారు. అయితే, అక్రమాస్తుల కేసులో పెద్ద ఎత్తున జయలలితకు సంబంధించిన ఆస్తులు, వస్తువులను సీబీఐ జప్తు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని గత నెల బెంగళూరు కోర్టు ఆదేశించింది. అయితే, ఇంత వరకు ఎలాంటి చర్యలను కర్ణాటక ప్రభుత్వం చేపట్ట లేదు. ఈ పరిస్థితులలో ఈ కేసు మరలా ఈనెల 11వ తేదీ విచారణకు రానుంది. కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా కిరణ్ ఎస్ జౌహిని నియమించారు. వేలంలో ఈ ఆస్తులను మళ్లీ చేజిక్కించుకునేందుకు చిన్నమ్మ బృందం వ్యూహాలు పన్నేనా అన్నది వేచి చూడాల్సిందే. -
జమిలీ ఎన్నికలు తథ్యం..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడికే పళణి స్వామి సేలం పర్యటన ఆదివారం రోడ్‌షోను తలపించింది. దారి పొడవునా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సైతం ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని కేడర్‌కు ఈ సందర్భంగా పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు రోజుల క్రితం ఎడపాడి కె. పళణిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ హోదాలో ప్రపథమంగా ఆదివారం చైన్నె నుంచి సొంత జిల్లా సేలంకు ఆయన బయలుదేరారు. మొదట గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన ఇంటి వద్ద నుంచే అన్నాడీఎంకే వర్గాల హడావుడి మొదలైంది. వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తర్వాత సేలానికి పళణిస్వామి రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఆలందూరులోని ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పర్యటన రోడ్ షోను తలపించే విధంగా జరిగింది. మార్గం మధ్యలో తాంబరం, చెంగల్పట్టు, మదురాంతకం, దిండివనం, విల్లుపురం, అంటూ ప్రతి చోటా ఆయన కాన్వాయ్ ఆగింది. పార్టీ కేడర్ ఈ మేరకు పళణిస్వామికి బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. దారి పొడవున కేడర్‌ను పలకరిస్తూ వెళ్లడంతో సేలం చేరేలోపు రాత్రి ఏడు దాటింది. సేలంలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది. జమిలీ ఎన్నికలు తథ్యం.. దారి పొడవున తనకు బహ్మ్రరథం పట్టిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పళణి స్వామి ప్రసంగాలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ఈసారి 40 స్థానాలు అన్నాడీఎంకే కూటమి చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని, ఇందులో మరో ఆలోచన లేదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తనకు శుభాకాంక్షలు, ఆహ్వానం తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పళణి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మజయలిత మార్గంలోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే కార్యదర్శులు, జిల్లాల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పళణి స్వామి తెలిపారు. అలాగే, సోమవారం మదురైలో పర్యటించాలని నిర్ణయించారు. దేవర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. -
మాటలు పలుచన
జె.డి.శాలింజర్ తన నవల ‘క్యాచర్ ఇన్ ద రై’తో ప్రఖ్యాతం. అమెరికాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకుని ఒక్కసారి కలిస్తే చాలు, చెప్పేది వింటే బాగుండు అని తహతహలాడించాడు. కాని ఎప్పుడూ జనం మధ్యలోకి రాలేదు. శాలింజర్‌ని ఇంటర్వ్యూ చేయడానికి మహామహులు ప్రయత్నిస్తే ఆశాభంగమే ఎదురైంది. అమెరికాలో తన నవల ‘హౌ టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’తో సంచలనం సృష్టించిన రచయిత్రి హార్పర్ లీ ఎవరినీ తన ఇంటిలోకి అడుగు పెట్టనీయలేదు. ఆమెని చూడాలని, ఇంటర్వ్యూ చేయాలని ఎందరో ప్రయత్నించి ఆమె ఇంటి గేట్ బయట నుంచే వెనుతిరిగే వారు. ప్రఖ్యాత కవి సాహిర్ లూధియాన్వీ తాను పాల్గొనే ముషాయిరాల్లో కవితా జ్ఞానం లేని శ్రోతలను గమనించాడంటే నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టేవాడు. సంఘంలో గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది శ్రీమంతులు అతడు పాల్గొనే ప్రయివేటు ముషాయిరాలకు వచ్చినా వారికీ అదే గతి పట్టేది. అతణ్ణి ఇంటర్వ్యూ చేయడం దుర్లభం. చేయాలనుకున్న వ్యక్తికి ఉర్దూ సాహిత్యం, కవిత్వం కూలంకషంగా తెలిసి ఉండాలి. ‘నా గురించి నీకేం తెలుసో చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను’ అనేవాడు. మాటలకు చాలా విలువ ఉంటుంది. మాట్లాడే మనిషిని బట్టి, మాటలను వెలికి తీసే మనిషిని బట్టి ఆ సంభాషణ, ముఖాముఖికి విలువ వస్తుంది. ఓప్రా విన్ ఫ్రే తన ఇంటర్వ్యూలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆమె తన నైపుణ్యంతో ఎదుటివారి మాటల్లో ఉండే జ్ఞాపకాల గాఢతను వెలికి తెస్తుంది. ఆమె మైకేల్ జాక్సన్‌ని ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజుల్లో కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఇప్పటికీ అమెరికన్ టెలివిజన్ చరిత్రలో అదే ఎక్కువ వ్యూయర్షిప్ పొందిన ఇంటర్వ్యూ. అడిగేవారి అంతస్తు చెప్పే వారి అంతస్తు తాలుమేలుగా కలిసినప్పుడు వచ్చే విలువ, గౌరవం అది. మన దేశంలో కూడా మంచి సంభాషణతో వ్యక్తిత్వాలను వెలికి తీసే పని స్త్రీలే మొదలెట్టారు. దూరదర్శన్‌లో నాటి బాలనటి తబస్సుమ్ చేసే టాక్ షోలకు విశేషంగా ఆదరణ ఉండేది. ఆమె తమను ఇంటర్వ్యూ చేయడం చాలామంది గౌరవంగా భావించేవారు. ఆ తర్వాత నటి సిమీ గెరేవాల్ చాలా విపులమైన ఇంటర్వ్యూలు చేసి అది చాలా శ్రద్ధతో పని చేయవలసిన రంగమని చాటింది. జయలలిత వంటి మొండిఘటం చేత తన ఇంటర్వ్యూలో పాట పాడించింది సిమీ. రతన్ టాటా, రాజీవ్ గాంధీ, రాజ్ కపూర్... వీరందరూ ఆమెతో మాట కలిపినవారిలో ఉన్నారు. రజత్ శర్మ ‘ఆప్ కీ అదాలత్’ ఒక భిన్నమైన ఫార్మాట్‌తో నింద–సంజాయిషీల ద్వారా చాలా మంది వ్యక్తిత్వాలను ప్రదర్శనకు పెట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆమిర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ షోతో ముఖాముఖి కార్యక్రమాలు తన వంటి సూపర్ స్టార్ నిర్వహించడం వల్ల వచ్చే సీరియస్‌నెస్‌ను, సామాజిక ప్రయోజనాన్ని లోకానికి తెలియచేశాడు. అయితే రాను రాను ఈ మాటల సేకరణ ఒక జీవనోపాధిగా మారింది. ప్రముఖులతో సంభాషణలు వినోదానికి, హాస్యానికి, కాలక్షేపానికి వనరుగా మారాయి. కరణ్‌జోహార్ వంటి హోస్ట్‌లు మునిగాళ్ల లోతుకే ఎదుటివారిని ఉంచుతూ సగటు ప్రేక్షకులను ఉత్సుకత పరిచే కబుర్లను వినిపించడం మొదలెట్టారు. శేఖర్ సుమన్ ‘మూవర్స్ అండ్ షేకర్స్’ ఇదే కోవలోకి వస్తుంది. కపిల్ శర్మ వంటి వారు బయలుదేరి హాస్యం కోసం ఎదుట ఉన్నది ఎవరైనాసరే వారితో నేలబారు మాటలు మాట్లాడించవచ్చని నిరూపించారు. ప్రచారం కోసం, ఏదో ఒక విధాన గుర్తుండటం కోసం ఒకనాడు తమ తమ రంగాలలో ఎంతో కృషి చేసినవారు కూడా ఇలాంటి షోలకు హాజరయ్యి ‘మీ ఇంట్లో సబ్బు అరిగిపోతే ఏం చేస్తారు?’ వంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వారి అభిమానులను చానల్ మార్చేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటల సేకరణ పతాక స్థాయికి చేరింది. యూ ట్యూబ్ పుణ్యాన ప్రతి ఒక్కరూ కాసిన్ని వీడియోల కోసం, వాటి మీద వచ్చే జరుగుబాటు కోసం మైక్ పట్టుకుని సాంస్కృతిక, కళారంగాల్లో ఉన్న రకరకాల స్థాయి పెద్దల వెంటబడుతున్నారు. వీరికి తాము ఇంటర్వ్యూ చేస్తున్న కళాకారుల/సృజనకారుల గురించి ఏమీ తెలియదు. అధ్యయనం చేయరు. గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో తెలుసుకోరు. ‘చెప్పండి సార్... చెప్పండి మేడమ్’ అంటూ ‘చెప్పండి’ అనే ఒక్కమాట మీద ఇంటర్వ్యూలు ‘లాగిస్తున్నారు’. విషాదం ఏమంటే గొప్ప గొప్ప గాయనీ గాయకులు, నటీనటులు, సంగీతకారులు, రచయితలు, రాజకీయవేత్తలు, దర్శకులు, నిర్మాతలు... వీరి ‘బారిన’ పడుతున్నారు. తమను అడుగుతున్నవారు ‘పిల్లకాకులు’ అని తెలిసినా క్షమించి జవాబులు చెబుతున్నారు. ‘హోమ్ టూర్’ అని వస్తే తమ ఇళ్లు బార్లా తెరిచి చూపిస్తున్నారు. పిచ్చి ప్రశ్నలకు హతాశులవుతూనే ఏదో ఒకటి బదులు ఇస్తున్నారు. వారికి ఉన్న అభిమానులు వారి పట్ల ఉండే గౌరవాన్ని పోగొట్టుకునేలా ఈ ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. అన్నింటినీ మించి వీరి ఇంటర్వ్యూలలోని శకలాలను వక్రీకరించే థంబ్‌నైల్స్‌తో పోస్ట్‌లు వస్తుండటం దారుణం. దినపత్రికలు పలుచబడి, అచ్చులో వచ్చే ఇంటర్వ్యూల స్థలం కుదింపునకు లోనయ్యాక సంభా షణలు, ముఖాముఖీలు ఇప్పుడు ఎలక్ట్రానిక్/డిజిటల్ మీడియాలోనే సాగుతున్నాయి. కొత్తగా మొదలైన ఓటిటి ప్లాట్‌ఫామ్స్ తమ సబ్స్క్రిప్షన్ లు పెంచుకోవడానికి పాపులర్ సినిమా స్టార్లను రంగంలోకి దింపి ఆ స్టార్ల ములాజాతో ఇతర స్టార్లను పిలిపించి టాక్‌షోలు నిర్వహిస్తున్నాయంటే ఊహించుకోవచ్చు. ఈ షోలన్నీ ఉంటే ఉండొచ్చు. కాని మాటను పలుచన చేయరాదు.పెద్దలారా! మాటకు విలువివ్వండి! మీ పెద్దరికానికి మాటతో మాట రానీకండి!! -
చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ!.. దత్తపుత్రుడి వల్లే గొడవలచ్చాయని..
దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ – మేన కోడలు దీప జయకుమార్ మధ్య వివాదం ముదిరింది. చిన్నమ్మ శశికళను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో జయలలిత మేన కోడలు దీప శనివారం ఓ ఆడియోను విడుదల చేశారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం విషయంలోనే.. తన మేనత్త జయలలిత కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. శశికళ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణించిన తరువాత ఆస్తికి వారసులుగా ఆమె అన్న కుమార్తె దీప, కొడుకు దీపక్ తెరపైకి వచ్చారు. కోర్టు సైతం వీరినే జయ వారసులుగా ధ్రువీకరించింది. అదే సమయంలో దీప ఓ రాజకీయ పార్టీ స్థాపించి ముందుకు సాగినా, చివరికి వెనక్కి తగ్గింది. అదే సమయంలో జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా దీప తరచూ వ్యాఖ్యల చేసేవారు. తాజాగా శశికళను ఢీకొట్టే విధంగా పలు ఆరోప ణాలు గుప్పిస్తూ.. ఓ ఆడియోను బుజ్జమ్మ దీప విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా వివాదానికి నేపథ్యం ఇదేనా..? జయలలిత మృతి నేపథ్యంలో నెలకొన్న వివాదాన్ని విచారించిన ఆర్ముగ స్వామి కమిషన్‌కు శశికళ లిఖిత పూర్వకంగా సమర్పించిన వాంగ్మూలంలోని కొన్ని అంశాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇందులో దీప కుటుంబం, ఆమె తల్లి విజయలక్ష్మి గురించి శశికళ తీవ్ర వ్యాఖ్యలు చేసిందనే వార్తలొచ్చాయి. దీనిపై దీప తీవ్రంగా మండిపడుతూ ఆడియోను విడుదల చేయడం విశేషం. అనుమానాలెన్నో.. ఇప్పుడున్న మర్యాదను చెడ గొట్టుకోవద్దని, ఏ తప్పు చేయనప్పుడు, నిరూపించుకునేందుకు సిద్ధమా..? అని శశికళకు దీప సవాల్ విసిరారు. సుధాకరన్ పెళ్లి తర్వాత తన తండ్రి జయకుమార్ మరణించారని, ఏ కారణంతో ఈ మరణం సంభవించిందో.. నేటికీ వెల్లడి కాలేదన్నారు. తమపై కక్ష సాధింపులో భాగంగానే లేనిపోని చాడీలను మేనత్త వద్ద శశికళ నూరి పోసిందని మండిపడ్డారు. అందుకే శశికళపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని తాను డిమాండ్ చేస్తూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. తొలుత తన సోదరుడు దీపక్‌ను బలవంతంగా తన గుప్పెట్లోకి శశికళ లాక్కుందని ఆరోపించారు. శశికళకు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మేనత్త జయలలిత మరణం సందర్భంగా శశికళ వ్యవహరించిన తీరు, తమ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించాయని వెల్లడించారు. ఏ తప్పు చేయలేదని చెబుతున్న శశికళ, మేనత్తను చూసేందుకు తమకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని, సీసీ కెమెరాలన్నీ ఎందుకు ఆపేయించారని ప్రశ్నించారు. వారి స్వలాభం, ఆదాయం కోసం తన మేనత్త జయలలితను తప్పుదారి పట్టించి వాడుకున్నారని ఆరోపించారు. నిజాలు, రహస్యాలను మరెన్నో రోజులు దాచి పెట్ట లేరని, త్వరలో అన్ని బయటకు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు. ఆడియో రూపంలో.. వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తే.. తన మేనత్త జయలలిత మృతిపై అనుమానం అనే ప్రశ్నే వచ్చి ఉండేది కాదని ఆడియోలో దీప పేర్కొన్నారు. తన తల్లి విజయలక్ష్మి గురించి మాట్లాడేందుకు మూడో వ్యక్తిగా ఉన్న శశికళకు ఏం అర్హత ఉందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావును కలిసి అప్పట్లో తన తల్లి విజయలక్ష్మి మేనత్త జయలలితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు శశికళ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవానికి తన మేనత్తకు శశికళ రూపంలోనే ప్రమాదం పొంచి ఉండేదని, ఆమెను రక్షించేందుకే తన తల్లి ప్రధానిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం కారణంగానే మేనత్తతో తన కుటుంబానికి మనస్పార్థలు వచ్చినట్లు వివరించారు. తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నిందలను తమ మీద వేయడం శశికళకు కొత్తేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి విజయలక్ష్మి గతంలో కలైంజ్ఞర్ కరుణానిధి, వాలప్పాడి రామమూర్తి వంటి నేతలను కలిసిన సందర్భాలు లేవు అని, ధైర్యం ఉంటే తనతో చర్చకు శశికళ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మౌనంగా ఉండకుంటే గుట్టు విప్పుతాం.. తన కుటుంబం, తన తల్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని శశికళను దీప హెచ్చరించారు. శశికళ నోరు మూసుకుని మౌనం పాటిస్తే ఆమెకే మంచిదని.. లేనిపక్షంలో గుట్టు విప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. తన జీవితాన్ని సర్వనాశనం చేశారని, తన కడుపులో ఉన్న బిడ్డను చిదిమేశారని, తన తల్లి భౌతిక కాయాన్ని కూడా చూడనివ్వకుండా జయలలితను అడ్డుకున్నది శశికళే కదా.. అని ఆరోపించారు. మధ్య తరవాతి స్థాయికి కూడా నోచుకోని శశికళకు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే విషయంపై.. ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇకనైనా ఈ విషయంపై శశికళను అన్నాడీఎంకే కేడర్ ప్రశ్నించాలని, రాష్ట్ర ప్రజలు సైతం నిలదీయాలని కోరారు. తనకు శశికళ రూపంలో ప్రాణహాని ఉందని ఆరోపించారు. కాగా ఈ దీప వ్యాఖ్యలపై చిన్నమ్మ శశికళ ఎలా స్పందిస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. ఎవరా సీఎం?
50 ఏళ్లపాటు నిరంతరాయంగా 'సాహసమే ఊపిరి'గా ఎన్నో రికార్డులను నెలకొల్పిన నటశేఖరుడు.. ఇక లేడనే విషయం తెలుసుకొని యావత్ సినీలోకం కంటతడిపెడుతోంది. అయితే సూపర్‌స్టార్ కృష్ణ మనల్ని విడిచి వెళ్లిపోయిన ఆయన జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో సూపర్‌స్టార్ కృష్ణ జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఔరా అనిపించకమానదు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే కుమార్తె వివాహానికి రావొద్దని చెప్పారంటే మనం నమ్మగలమా?. కానీ ఇదే నిజం.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఒకసారి పరిశీలిస్తే.. కృష్ణ తన పెద్దకుమార్తె పద్మావతి వివాహ వేడుకను గల్లా జయదేవ్‌తో చెన్నైలో నిశ్చయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సూపర్‌స్టార్ కృష్ణ స్వయంగా వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. చెన్నైలోనే వివాహం జరుగుతుండటంతో అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేస్తూ తప్పకుండా వస్తానని మాటిచ్చింది. అయితే వివాహానికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి కృష్ణను కలిశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో మొదటి మూడు వరుసలు భద్రతా కారణాల రీత్యా జయలలితకు కేటాయించాల్సిందిగా సెక్యూరిటీ ఆఫీసర్ కోరారు. దీంతో షాక్ తిన్న కృష్ణ.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు వివాహానికి వస్తున్న సంగతి చెప్పి మొదటి మూడు వరుసలు పూర్తిగా కేటాయించడం కదురదని చెప్పారు. కృష్ణ వెంటనే జయలలితకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలోనే జయలలితను సున్నితంగా వివాహానికి రావొద్దని.. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహానికి హాజరు కాకుండా పెళ్లిరోజున వధూవరులకు ఒక బొకేను పంపారు. కాగా, జయలలిత సూపర్‌స్టార్ కృష్ణతో గూఢాచారి 116, నిలువు దోపిడి వంటి సినిమాల్లో కలిసి నటించారు. చదవండి: (మహేశ్ బాబు గొప్ప మనసు.. తీవ్ర విషాదంలోనూ వారికోసం..!) -
Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!
లంక పరిణామాలు మన దేశంలో భారీ మార్పులు తీసుకువచ్చాయి. ప్రభాకరన్‌ను లంక సైన్యం మట్టుపెట్టడం, ఎల్టీటీఈ తన శ్రేణులన్నీ కోల్పోవడంతో జాఫ్నాతో పాటు ఉత్తర ప్రాంతమంతా లంక సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అంతర్యుద్ధం ముగిసిందని అప్పటి అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. లంకలో తమిళుల ప్రాభవం వేగంగా కోల్పోవడంతో ఇక్కడ ఖైదీల మీద వీపరీతంగా సానుభూతి పెరిగింది. ఈలోగా జైల్లో ఉన్న ఏడుగురు ఖైదీలు తమను క్షమించమంటూ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిభా పాటిల్ దీన్ని నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఈ లోగా మరో పిటిషన్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కింది. వాదోపవాదాలు, అప్పటి పరిస్థితుల దృష్ట్యా మద్రాస్ హైకోర్టు ఉరి శిక్షపై స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎల్టీటీఈ ఖైదీలకు పెద్ద ఊరట. ఉరిశిక్ష స్థానంలో యావజ్జీవ శిక్షను సూచించింది సుప్రీంకోర్టు. ఈలోగా రాజీవ్ గాంధీ కుటుంబానికి తమిళుల వినతులు వెల్లువెత్తాయి. నేరుగా రాజీవ్ కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్ గాంధీ నేరస్థులను జైల్లో కలిశారు. పరిస్థితి ఎందాక వెళ్లిందంటే మొత్తం సమాజం నేరస్థులను క్షమించారా అన్నంత చర్చకు దారి తీసింది. ఈలోగా తమిళనాడు సీఎం జయలలిత ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 23ఏళ్లకు పైగా జైల్లో ఉన్న అందరూ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఢిల్లీలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశానికి అత్యున్నత పదవుల్లో ఒకటయిన ప్రధానిగా పని చేసిన రాజీవ్‌గాంధీ హత్యకు గురయితే, దానికి కారకులను ఓ రాష్ట్రం ఎలా విడిచిపెడతారన్న చర్చ జరిగింది. ఇదే విషయం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత తమిళనాడు నిర్ణయంపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. జయ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాజీవ్ హంతకుల విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. జైల్లో నుంచి బయటపడతామని కోటి ఆశలు పెట్టుకున్న ఎల్టీటీఈ ఖైదీలు సుప్రీం తీర్పుతో నిరాశకు గురయ్యారు. అయితే వారిలో ఆశ మాత్రం చావలేదు. దానికి కారణం తమిళులు, వారి రాజకీయాలు. చదవండి: (రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?) నాడు రాజీవ్ హంతకులను పట్టుకోవడానికి కార్తికేయన్ సారధ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచిత్ర పరిస్థితుల మధ్య పలు రకాల అవాంతరాల నడుమ సిట్ పట్టువదలకుండా దర్యాప్తు కొనసాగించింది. విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా ఢీలా పడకుండా విచారణ సాగించిన సిట్ ఈ దారుణానికి పాల్పడింది ఎల్టీటీఈ అని తేల్చింది. ఫోటోగ్రాఫర్ హరిబాబు ఇంట్లో దొరికిన రసీదును ఆధారంగా చేసుకొని తీగ లాగిన సిట్.. హంతకుల పేర్లను తెరపైకి తెచ్చింది. 1991.. దేశమంతటా అస్థిర వాతావరణం నెలకొన్న సమయం. కేంద్రంలో ప్రభుత్వాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన తరుణం. అలాంటి సమయంలో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార భారం రాజీవ్‌గాంధీపై పడింది. అప్పటికే దేశమంతా తిరుగుతున్న ఆయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారంపై దృష్టి పెట్టిన ఆయన అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1991, మే 20 నుంచి 22 వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారం ముగించుకొని 22 సాయంత్రం వరకైనా రాజీవ్ ఢిల్లీకి చేరుకోవాలి. ఇదీ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ పర్యటన వరకు అన్నీ అనుకున్న ప్రకారం జరిగాయి. కానీ 21న పరిస్థితి మొత్తం మారిపోయింది. -
మరణానికి ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం.. ఆడియో క్లిప్ వైరల్
సాక్షి, చెన్నై: దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో అనుమానాలు మాత్రం తొలగడం లేదు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సైతం సంచలనంగా మారింది. తాజాగా జయలలిత మృతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మరణానికి ముందు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. నేను బాధ పడుతుంటే మీరు పట్టించుకోవడం లేదంటూ ఆపోలో సిబ్బందిపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పిలిచినపుడు మీరెందుకు రాలేదంటూ డాక్టర్లపై జయలలిత మండిపడ్డారు. చికిత్స సమయంలో ఆమె తీవ్రంగా దగ్గుతుండటం, డాక్టర్లపై చిరాకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జయలలిత ఆడియోను ఆస్పత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి నివేదికతో ఆడియో బయటకు వచ్చింది. #Jayalalithaa's audio clip goes viral #JayalalithaaDeath pic.twitter.com/beG7zS3xCj — Janardhan Veluru (@JanaVeluru) October 20, 2022 విదేశాలకు అవసరమా? అదే విధంగా 2017లో చెన్నైలో తన ప్రెస్ మీట్ అనంతరం డాక్టర్ రిచర్డ్ బిల్ మాట్లాడిన వీడియో కూడా వైరల్‌గా మారింది. జయలలిత వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అని శశికళ ప్రశ్నించగా.. ఆమె తప్పక వెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వారు అంగీకరించారు. కానీ ఆ తర్వాత జయలలితే స్వయంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని డాక్టర్ రిచర్డ్ బిల్ పేర్కొన్నారు. చదవండి: జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్ ఆర్ముగస్వామి నివేదిక ఏం చెబుతోంది ఇదిలా ఉండగా జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ 608 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను మంగళవారం అసెంబ్లీ ముందుకొచ్చింది. ఇందులో కమిషన్ సూచించిన పలు కీలక అంశాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించింది. ఈ నివేదికలోనూ పలు అంశాలు శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి మరణించిన సమయంలో తేడా ఉండటం, జయలలితకు లండన్, అమెరికా వైద్యులు యాంజియో చికిత్సకు సిఫార్సు చేసినా చివరి వరకు అందించకపోవడంపై ఆర్ముగస్వామి కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. శశికళ విచారణకు ఆదేశం సమగ్ర సమాచారం కోసం చిన్నమ్మ శశికళతోపాటు ఏడుగురు కీలక వ్యక్తులను పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. శశికళ, జయలలిత వ్యక్తిగత డాక్టర్ శివ కుమార్, మాజీ సీఎస్ రామ్మోహన్రావు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ వంటి పేర్లను ప్రత్యేకంగా సూచిస్తూ వీరిని విచారణ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ఇక జయలలిత, శశికళ మధ్య గతంలో నెలకొన్న గొడవల వివరాలను సైతం నివేదికలో పొందుపరిచింది. విచారణకు తనను ఆదేశించడంపై శశికళ స్పందించారు. నివేదికను ఊహాగానాలతో రూపొందించారని.. జయలలిత మరణాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 2016న మృతి చెందిన విషయం తెలిసిందే. -
జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్
చెన్నై: తమిళనాడు దివగంత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆర్మగస్వామి కమిషన్ని ఏర్పాటు చేయడం, ఐదేళ్ల తదనంతరం కమిషన్ 600 పేజీల నివేదికను స్టాలిన్‌కి సమర్పిచడం జరిగింది. ఐతే ఆ నివేదిక తోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆ కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్(జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధకృష్ణన్ , మాజీ ఆరోగ్య మంత్రి సి విజయ భాస్కర్లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తుకు అభ్యర్థించింది. అంతేగాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగాని ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టింది కమిషన్. అలాగే జయలలిత డిసెంబర్ 4, 2016న మధ్యాహ్నాం 3.50 నిమిషాలకు గుండెపోటుకు గురైన తర్వాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్నీ సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్లు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె చనిపోయింది డిసెంబర్ 4, 2016 అయితే ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5, 2016గా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ 2018లో రాష్రంలోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుని తప్పుపట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకుడి ఘటన సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది. (చదవండి: : ఐదేళ్లకు.. ‘అమ్మ’ మరణంపై కమిషన్ విచారణ పూర్తి -
వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే..
సాక్షి, చెన్నై: పోయేస్ గార్డెన్‌లోని వేద నిలయంలోకి మరికొద్ది రోజుల్లో గృహప్రవేశం చేయనున్నట్లు దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తెలిపారు. ఆ భవనాన్ని తాము విక్రయించే ప్రసక్తే లేదని, ఇది తమ పూర్వీకుల ఆస్తి, వారి జ్ఞాపకం అని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలితకు పోయేస్‌గార్డెన్‌లో వేద నిలయం పేరిట భవనం ఉ న్న విషయం తెలిసిందే. ఆమె మరణించే వరకు అదే భవనంలోనే జీవించారు. ఈ భవనాన్ని గత అన్నా డీఎంకే ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చే ప్రయత్నం చేసి భంగ పడింది. కోర్టులో న్యాయ పో రాటం ద్వారా ఆ భవనాన్ని జయలలిత మేన కోడ లు దీప, మేనల్లుడు దీపక్ సొంతం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భవనం పర్యవేక్షణ, తదితర వ్యవ హారాలు దీప, దీపక్‌కు భారమైనట్టు ప్రచారం జోరందుకుంది. అలాగే ఆ భవనాన్ని విక్రయించేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో దీప మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ ఆడియోను విడుదల చేశారు. ఎన్నో మధుర జ్ఞాపకాలు... పోయేస్ గార్డెన్ నివాసం తమ పూర్వీకుల ఆస్తి అని, ఈ ఇంట్లోనే చిన్నప్పుడు తాను, దీపక్ పెరిగినట్టు దీప గుర్తు చేశారు. మేనత్త జయలలిత, తన తండ్రి జయకుమార్ ఆ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉన్నారని, తాను జన్మించింది కూడా ఇదే భవనంలో అని వివరించారు. అభిప్రా య భేదాలతో తన తండ్రి ఆ ఇంట్లో నుంచి టీ నగర్‌లోని మరో పూర్వీకుల ఇంటికి వచ్చేశారని, అయినా, అత్త పిలిచినప్పుడల్లా పోయేస్గార్డెన్కు వెళ్లి వచ్చేవారిమని తెలిపా రు. పూర్తిగా ఆమె రాజకీయాల్లోకి వెళ్లడంతో తాము బయటకు వచ్చేశామని, అయితే, ఇది తమ ఆస్తి కావడంతోనే కోర్టులో న్యాయం దక్కిందని పేర్కొన్నారు. జయలలిత సీఎంగా ఉన్నంత కాలం, ఆమె వెన్నంటి నడిచిన వాళ్లు, పయనించిన వాళ్లు ఎందరో ఉన్నారని, వారందరూ రక్త సంబంధీకులు కాలేరని వ్యాఖ్యలు చేశారు. ఇది చిన్నమ్మ శశికళ కుటుంబానికి సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ భవనం తమ కుటుంబ ఆస్తి అని, దీనిని విక్రయింబోమని స్పష్టం చేశారు. ఈ ఇంటిని అమ్మేస్తామని తాము ఎవ్వరికీ చెప్పలేదని, ఎవరిని సంప్రదించ లేదని తేల్చి చెప్పా రు. వదంతులను నమ్మ వద్దని, వేద నిలయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనతో పాటుగా దీపక్‌పై ఉందన్నారు. మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు. -
Jayalalithaa Death: విచారణ పరిధిలోకి శశికళ?
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మృతి కేసుకు సంబంధించి చిన్నమ్మ శశికళ, మాజీ మంత్రి విజయ భాస్కర్, మాజీ సీఎస్ రామ్మోహన్‌రావును విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక సిట్ మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగనుంది. ఇందుకు తగ్గ చట్టపరమైన అంశాలపై న్యాయ నిపుణులతో అధికార వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం. నేపథ్యం ఇదీ.. అమ్మ జయలలిత 2016 డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను రంగంలోకి దిగింది. ఈ కమిషన్ రెండు రోజుల క్రితం సీఎం స్టాలిన్‌కు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వ వర్గాలు సమగ్రంగా పరిశీలించాయి. ఇందులో ఆర్ముగ స్వామి సూచించిన అంశాలు, కొన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు. మంత్రి వర్గ సూచనలో.. ఆర్ముగ స్వామి తన నివేదికలోని కీలక విషయాల గురించి సోమవారం సాయంత్రం పొద్దు పోయే వరకు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జగినట్లు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి మరణించే వరకు జరిగిన పరిణామాలు, వైద్య సేవలు అంశాలను నివేదికలో ఆర్ముగ స్వామి పొందుపరిచారు. ఈ మేరకు జయలలిత నెచ్చెలి శశికళ, డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, అప్పటి సీఎస్ రామమోహ్మన్ రావును విచారించాలని సలహా ఇవ్వడం మంత్రి వర్గం దృష్టికి వచ్చింది. దీంతో ప్రత్యేక సిట్ ద్వారా విచారణ జరిపేందుకు మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) ఈ మేరకు మరికొద్ది రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ సిట్ రంగంలోకి దిగనుంది. న్యాయ నిపుణులతో ఇందుకు తగ్గ చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ విచారణతో పాటూ ఆర్ముగ స్వామి కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ విచారణ సంకేతాల నేపథ్యంలో అమ్మ మరణం మిస్టరీ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. తూత్తుకుడి వ్యవహారం మంత్రి వర్గంలో గత ప్రభుత్వ హయాంలో తూత్తుకుడిలో జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా, ఆ నివేదిక ఆధారంగా శాఖ పరమైన చర్యలకు డీఎంకే పాలకులు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్, రెవెన్యూ అధికారులు 21 మంది చర్యలకు అరుణా జగదీశన్ కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేయడం గమనార్హం. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం, ర్యాలీ, కాల్పులు ఆ తదుపరి పరిణామాల గురించి అరుణా జగదీశన్ తన నివేదికలో వివరించారు. ఐపీఎస్ అధికారులతో పాటూ 17 మంది పోలీసుల అధికారులు, కలెక్టర్, నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు సూచించడం గమనార్హం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. -
భర్తతో గొడవ.. ఆస్పత్రిలో చేరిన జయలలిత మేనకోడలు దీప
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప ఆస్పత్రిలో చేరారు. భర్త మాధవన్‌తో గొడవ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఇంటికే ఆమె పరిమితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ కావడంతో చర్చ బయలుదేరింది. భర్త మాధవన్ – దీపల మధ్య ఇప్పటికే పలు మార్లు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో భర్తతో గొడవ కారణంగానే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అయితే, ఆమె భర్త మాధవన్ దీనిని ఖండించారు. తానే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొనడం గమనార్హం. చదవండి: (అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం) -
Tamil Nadu: జయలలిత మరణించిన ఐదేళ్లకు.. కమిషన్ విచారణ పూర్తి
ఎడతెగని ఊహాగానాలు, నిత్యకృత్యంగా మారిన వాయిదాలు, విమర్శలు, నిట్టూర్పులు వెరసి ఐదేళ్ల తరువాత అమ్మ మరణంపై ఎట్టకేలకూ నివేదిక సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విచారణ కమిషన్ సమగ్ర వివరాలను సమర్పించింది. ఆ నివేదికలో ఏం ఉందోననే ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. జయలలిత మృతి కేసులో ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని గతంలోనే సీఎం స్టాలిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జె.జయలలిత మృతి కేసులో విచారణ ముగిసింది. వాయిదాల పర్వంతో ఐదేళ్ల పాటూ సాగిన విచారణలో వెలుగు చూసిన అంశాలతో ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదిక సిద్ధం చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి సమర్పించారు. 600 పేజీలతో ఈ నివేదిక రూపొందింది. నేపథ్యం ఇదీ.. 2016 డిసెంబర్ 5న అప్పటి సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్ 24న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుంచి∙విచారణను ఆర్ముగ స్వామి కమిషన్ ప్రారంభించింది. ఐదేళ్ల పాటుగా సాగిన విచారణకు అనేక అడ్డంకులు తప్పలేదు. అపోలో రూపంలో.. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణలో తమ వైద్యులు తెలియజేస్తున్న అంశాలు, వివరాలు బయటకు రావడం, అవన్నీ కొత్త వాదనలకు దారి తీయడంతో అపోలో యాజమాన్యం కోర్టు తలుపు తట్టింది. తమను ప్రత్యేకంగా విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అపోలో యాజమాన్యం సవాలు చేసింది. ఈ పరిణామాలతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించాల్సి వచ్చింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగియడం, ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులు రంగంలోకి దిగడంతో మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో ఆర్ముగ స్వామి కమిషన్ వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకుంది. విచారణను వేగవంతం చేసింది. తొలి విచారణ నాటి నుంచి చివరి వరకు ఈ కమిషన్ పదవీ కాలాన్ని 14 సార్లు పొడిగించాల్సిన పరిస్థితి పాలకులకు ఏర్పడింది. ఈ కేసులో 159 మందిని విచారించారు. 8 మంది వద్ద లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ కేసులో తొలి విచారణ డాక్టర్ శరవణన్‌తో మొదలు కాగా, చివరగా అన్నాడీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో ముగించారు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! నివేదికలో మిస్టరీ... విచారణను ముగించిన ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికను శనివారం ఉదయం సీఎం ఎంకే స్టాలిన్‌కు సమర్పించింది. సచివాలయంలో ఈ నివేదికను స్వయంగా స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి అందజేశారు. 608 పేజీలతో నివేదికను సిద్ధం చేసినా, 600 పేజీలలో మరణం కేసు విచారణ సమగ్ర వివరాలను పొందుపరిచారు. తొలుత 550 పేజీల్లో వివరాలను ముగించేందుకు నిర్ణయించినా, ఎయిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాలతో అదనంగా మరో 50 పేజీలు చేర్చారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రెండు రకాల నివేదికను సమర్పించారు. ఇందులో జయలలితను పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించడం, అక్కడ అందించిన వైద్య చికిత్సల వివరాలను పేర్కొన్నారు. అపోలో వైద్యుల చికిత్స సరైన మార్గంలోనే జరిగినట్లుగా పొందు పరిచినట్లు భావిస్తున్నారు. అలాగే, అదనంగా మరో 200 పేజీల నివేదికలో ముఖ్యాంశాలను సీఎంకు సమర్పించారు. ప్రధాన నివేదికలోని కొన్ని కీలక వివరాలను ముఖ్యాంశాలుగా ఇందులో పేర్కొని ఉండటం గమనార్హం. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అలాగే, ఈనెల 29వ తేదీన మంత్రి వర్గం భేటీ కావాలని నిర్ణయించారు. అందులో ప్రత్యేక అంశంగా ఈ నివేదిక గురించి చర్చించి మిస్టరీని నిగ్గు తేల్చబోతున్నారు. ఆపై తదుపరి చర్యలకు సిద్ధం కాబోతున్నారు. కాగా జయలలిత మరణం వెనుక ఎవరైనా ఉండివుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శ్రేణులతో పాటూ రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొంది. శశికళ లిఖిత పూర్వకంగా.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ స్వయంగా కాకుండా లిఖిత పూర్వకంగా ఈ కమిషన్‌కు వివరాలను సమర్పించారు. ఆమె తరపున న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ మాత్రం విచారణకు హాజరయ్యారు. అలాగే, చిన్నమ్మ వదిన ఇలవరసి మాత్రం స్వయంగా విచారణకు వచ్చారు. నివేదిక సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్ముగ స్వామి మాట్లాడుతూ, శశికళ నేరుగా విచారణకు రాలేదని, లఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు. పోయెస్ గార్డెన్ ఇంట్లో నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఎలాంటి అనుమానాలు లేవు అని పేర్కొంటూ, పోయెస్ గార్డెన్లో విచారణ జరపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విచారణలో ఎలాంటి జాప్యం జరగలేదని, తన విచారణలో వెలుగు చూసిన అంశాలు, సాక్షాలు, ఆధారాలు, రికార్డులు అన్నీ సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేశానని తెలిపారు. అన్ని వివరాలను ఓ నివేదిక రూపంలో, ముఖ్యమైన అంశాలను మరో నివేదిక రూపంలో తెలియజేసినట్లు వివరించారు. ఎయిమ్స్ వైద్యుల సహకారం, రెండు ప్రభుత్వాల సహకారంతో (గత అన్నాడీఎంకే, ప్రస్తుత డీఎంకే) ఈ కేసు విచారణను ముగించినట్టు చెప్పారు. తన కమిషన్ విచారణకు అధికంగా నిధులు వెచ్చించినట్టు కొందరు పేర్కొనడం శోచనీయమన్నారు. ఇది వరకు ఎన్నో కమిషన్లు మరెన్నో అంశాలపై విచారణలు చేశాయని, అప్పుడు రాని నిధుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకోచ్చినట్లు? అని ఓ ప్రశ్నకు సమాధానంగా అభిప్రాయపడ్డారు. -
జయలలిత వస్తువులు వేలం వేయండి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు సంబంధించిన సీబీఐ అధికారులు సీజ్ చేసిన లక్షలాది రూపాయల ఆస్తులను వేలం వేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కర్ణాటక హైకోర్టు సీజేకు బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి లేఖలు రాశారు. 2016లో జయలలిత మరణించగా, అంతకుముందు 1996లోనే అక్రమ ఆస్తుల ఆరోపణలకు సంబంధించి సీబీఐ అధికారులు చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని అత్యంత ఖరీదైన గృహోపకరణాలు, ఫర్నిచర్, దుస్తులను సీజ్ చేసినట్లు గుర్తు చేశారు. వీటిని కర్ణాటక విధాన సౌధలోని ప్రభుత్వ ట్రెజరీలో ఉంచారని తెలిపారు. 26 ఏళ్లుగా ట్రెజరీలో ఉన్న ఈ ఆస్తులను వేలం వేసి, ఆ సొమ్మును ప్రజా సంక్షేమానికి వినియోగించాలని విన్నవించారు. చదవండి: (Maharashtra Crisis: అప్పుడు కుక్కలు, పందులు.. ఇప్పుడు రమ్మని అడుగుతున్నారా?) -
జయలలిత మరణం మిస్టరీ: పన్నీరుకు సమన్లు..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. అలాగే, జయలలిత నివాసంలో సుదీర్ఘ కాలం ఉన్న చిన్నమ్మ శశికళ వదిన ఇలవరసికి కూడా సమన్లు జారీ అయ్యాయి. దివంగత సీఎం జే జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండో రోజుగా అపోలో వైద్యులు పలువురు విచారణకు హాజరయ్యారు. జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమెకు రక్తనాళాల మార్పిడి శస్త్ర చికిత్స విషయంగా జయలలిత నెచ్చెలి శశికళ తరపు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్‌క్రాస్ ఎగ్జామిన్‌లో ప్రశ్నలు సంధించారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పన్నీరుసెల్వంకు ఆ కమిషన్ సమ న్లు జారీ చేసింది. అయితే, ఆ సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండటంతో విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. తాజాగా ఆయన్ని ఈనెల 21వ తేది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసు విచారణ సమయంలో శశికళ వదిన ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను కూడా విచారించేందుకు కమిషన్ నిర్ణయించింది. శశికళతో పాటుగా జయలలిత నివాసం పోయేస్ గార్డెన్లో సుదీర్ఘ కాలం ఇలవరసి కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. -
జయలలిత మృతిపై వెలుగులోకి కొత్త అంశం
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో (2016) విజయానందం దివంగత సీఎం జయలలితకు ఎంతో సేపు మిగల్చలేదనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఆరోగ్యం బాగో లేకున్నా.. తాత్కాలిక ఉపశమనం పొందే మందులను తీసుకుని ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్ముగస్వామి కమిషన్ ముందు నలుగురు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆదిలో శరవేగంగా విచారణ సాగినా, అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మూడేళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు విచారణ ఆగింది. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో సోమవారం విచారణ ముమ్మరం చేసింది. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్య బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహకారం అందించారు. విశ్రాంతి తీసుకోవాలన్నా.. తొలిరోజు విచారణకు అపోలో నుంచి నలుగురు వైద్యులు విచారణకు వచ్చారు. జయలలిత ఆస్పత్రికి వచ్చిన సమయంలో స్పృహలో లేరని పేర్కొంటూ, ఆమెకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జయలలిత నెచ్చెలి, చిన్నమ్మశశికళ తరపు న్యాయవాది రాజా చెందూర్‌పాండియన్ ఈ వైద్యుల వద్ద క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు మనోహర్ కొత్త విషయాన్ని కమిషన్ ముందు ఉంచినట్టు వెలుగు చూసింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ తనను సంప్రదించినట్లు బాబు మనోహర్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం, ఎవరో ఒకరి సాయం లేకుండా నడవ లేకపోవడం వంటి సమస్యలు జయలలిలలో గుర్తించినట్లు తెలిపారు. తాత్కాలిక చికిత్సతో ఎక్కువ సమయం విశ్రాంతి అవసరం అని జయలలితకు సూచించగా.. రోజుకు 16 గంటలు తాను ప్రజల కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇక, మరో ఏడుగురు వైద్యులు మంగళవారం విచారణకు రానున్నారు. వీరందర్నీ రాజా చెందూర్ పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది. అనారోగ్యంతోనే ‘అమ్మ’ మరణం: దినకరన్ అమ్మ జయలలిత అనారోగ్యంతోనే మరణించారని, అయితే, దీనిని రాజకీయం చేశారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అన్నారు. సోమవారం చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్ గతంలోనే అమ్మ మరణం గురించి స్పష్టమైన వివరాలు ఇచ్చారని, అపోలో వైద్యులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిపారు. రాధాకృష్ణన్ నిజాయితీ గల అధికారి అని, అందుకే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఆయనకు ఆరోగ్య శాఖ కార్యదర్శి పదవిని అప్పగిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అనారోగ్యంతోనే అమ్మ మరణించారని, అయితే, దీనిని రాజకీయం చేసి, విచారణ కమిషన్ పేరిట ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని ఆరోపించారు. -
జయలలిత మరణం మిస్టరి.. అపోలో వైద్యులకు సమన్లు
సాక్షి, చెన్నై: ఆర్ముగస్వామి కమిషన్ ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈనెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా బుధవారం అపోలో వైద్యులకు సమన్లు జారీ అయ్యాయి. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో తమను విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులను సుప్రీంకోర్టు రంగంలోకి దించింది. గత నెల ఈ వైద్య బృందంతో కమిషన్ వర్గాలు సమావేశమయ్యాయి. వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకున్నారు. ఇక, వీరి సహకారంతో విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి మరికొన్ని నెలల్లో నివేదిక సమర్పించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అప్పట్లో జయలలితకు చికిత్స అందించిన అపోలో వైద్యులను ఈ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. -
జయలలిత ఇంటి తాళాలు మేనకోడలు దీప చేతికి
వేదనిలయం తాళాలను ప్రభుత్వం ఎట్టకేలకు వారసులకు అప్పగించింది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆమె ఉంటున్న వేద నిలయాన్ని అప్పటి ప్రభుత్వం స్మారక మండపంగా మార్చింది. దానిపై జయలలిత అన్న కుమార్తె, కుమారుడు కోర్టులో సవాలు చేశారు. వేద నిలయం వారసులదేనని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. సాక్షి ప్రతినిధి, చెన్నై : న్యాయపోరాటం అనంతరం ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటి తాళాలు ఆమె అన్న కుమార్తె, కుమారుడు దీప, దీపక్ చేతికి వచ్చాయి. ఆమె శుక్రవారం గృహ ప్రవేశం చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 డిసెంబర్ 5న ఆకస్మిక మరణంతో రూ.కోట్ల ఆస్తికి వారసులు ఎవరన్న అంశం చర్చకు వచ్చింది. జయ కు చెన్నై పోయస్గార్డెన్లో సుమారు రూ.100 కోట్లు విలువ చేసే వేద నిలయం పేరున భవంతి ఉంది. జయలలిత మరణించే వరకు అందులోనే ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు సాగించేవారు. అలాగే మరికొన్ని కోట్ల ఆస్తులున్నట్లు ప్రచా రంలో ఉంది. జయ మరణం తర్వాత ఆస్తి వివాదం వేద నిలయం చుట్టూనే తిరిగింది. సీఎంగా అధికారం చేపట్టిన ఎడపాడి పళనిస్వామి వేద నిలయాన్ని జయ స్మారకమండపంగా మార్చేందుకు ప్రయత్నించారు. వారసులం మేముండగా తమ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని జయ అన్న సంతానమైన దీప, దీపక్ కోర్టులో పిటిషన్ వేశారు. ఒక దశలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో వేద నిలయం జయ స్మారక మండపంగా మారిపోయింది. అంతేగాక అప్పటి ప్రభుత్వం ప్రారంభోత్సవం చేసి వేద నిలయం వద్ద జయ స్మారక మండపం అనే బోర్డు పెట్టేసింది. వివాదం పూర్తిగా సమసిపోయే వరకు సందర్శకులను అనుమతించరాదని కోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని దీప, దీపక్ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు చెల్లదని, మూడువారాల్లోగా వేద నిలయాన్ని వారసులకు అప్పగించాలని ఇటీవల తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలను అనుసరించి దీప, దీపక్ ఇరువురూ శుక్రవారం చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ విజయరాణి వేద నిలయం తాళాలను వారికి అప్పగించారు. ‘కోర్టు ఆదేశాలను అనుసరించి వేద నిలయం తాళాలను అప్పగించాల్సిందిగా తనకు ఇటీవల వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విచారణ తర్వాత తాళాలు అప్పగించాను’ అని జిల్లా కలెక్టర్ విజయరాణి మీడియాకు తెలిపారు. తాళాలు స్వీకరించగానే దీప, దీపక్ నేరుగా వేద నిలయం చేరుకున్నారు. ఇల్లంతా కలియతిరగడంతోపాటు రోడ్డు వైపున ఉన్న బాల్కనీలోకి వచ్చి ఆనందంతో పరిసరాల్లోని ప్రజలకు అభివాదం చేశారు. -
జయలలిత నివాసం.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసిన కోర్టు.. మూడు వారాల్లో పోయెస్ గార్డెన్‌ని జయలలిత మేన కోడలి దీపకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..) జయలలిత 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. (చదవండి: CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!) తమని జయలలిత వారసులుగా కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందంటూ దీప, దీపక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా పోయెస్ గార్డెన్ ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. చదవండి: ద్విసభ్య కమిషన్.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా? -
నేను జయలలిత కుమార్తెనే.. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు: జయలక్ష్మి
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నప్పుడే కాదు గతించిన తరువాత కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జయ కుమార్తెను అని చెప్పుకుని గతంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు హడావిడి చేసి.. ఆ తరువాత మిన్నకుండి పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చారు. తగిన ఆధారాలతో జయ కుమార్తెను అని త్వరలో నిరూపించుకుంటానని చెన్నైలో శనివారం స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జీవితాంతం కుమారిగానే మెలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక కుమార్తె ఉందని దశాబ్దాల తరబడి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని జయ ఏనాడు ఖండించలేదు. అలాగని సమర్ధించనూ లేదు. జయ మరణం తరువాత తమను వారసులుగా గుర్తించాలంటూ ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో బెంగళూరు, మైసూరు నుంచి వేర్వేరుగా ఇద్దరు యువతులు, ఓ యువకుడు వచ్చారు. కొన్నాళ్లు పోరాడారు. అయితే వారి వాదన పెద్దగా నిలవక పోవడంతో తెరమరుగై పోయారు. నేనే జయ కుమార్తెను..: ఇదిలా ఉండగా, తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చింది. చిన్నపాటి మందీ మార్బలంతో శనివారం సాయంత్రం చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్దకు చేరుకుని ఆమె నివాళులర్పించారు. సమాధికి ప్రదక్షిణ చేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె హావభావాలు, కట్టూబొట్టూ, బాడీ లాంగ్వేజ్ అంతా జయను పోలినట్లుగా ఉండడంతో పరిసరాల్లోని వారు ఆశ్చర్యంగా అనుసరించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధుల వద్ద జయ కుమార్తెగా పరిచయం చేసుకున్నారు.. ‘‘మాది మైసూరు. చెన్నై పల్లవరంలో స్థిరపడ్డాను. చాలా ఏళ్ల క్రితమే నేను జయ కుమార్తెను అని తెలుసు. అయితే ఇష్టం లేక, కొన్ని సమస్యల వల్లనే ఇన్నేళ్లూ బాహ్య ప్రపంచంలోకి రాలేదు. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు, అందుకే అప్పట్లో రాలేదు. అమ్మను కోల్పోయిన షాక్ నుంచి బయటకు వచ్చేందుకు ఇంత సమయం పట్టింది. చదవండి: (Heavy Rains: మరో ఐదు రోజులు కుండ పోతే!) చెన్నై పోయస్ గార్డెన్ ఇంటిలో మొదటిసారి అమ్మతో మాట్లాడాను. ఆ తరువాత అపోలో ఆసుపతిలో కలిశాను. అమ్మ పీఏ అపోలో ఆసుపత్రి వెనుకమార్గం గుండా లోనికి తీసుకెళ్లారు. అమ్మతో నేరుగా మాట్లాడాను. చెక్కిలిపై ఆమె ముద్దు పెట్టుకుంది. ఉద్వేగానికి లోనై ఇద్దరం కన్నీరు పెట్టుకోవడంతో బేబీని తీసుకెళ్లండని అక్కడి సిబ్బందికి చెప్పింది. దీప, దీపక్ నాతో మాట్లాడేందుకు యత్నించారు, అయితే ఇష్టం లేక దూరంగా మెలిగాను. ఇప్పటికే కొందరు జయ కుమార్తెలు అని వచ్చారు, అయితే అందరికీ ఆమె అమ్మ కాలేదు కదా.. వారు ఫేక్ అని రుజువైంది కదా. జయ కుమార్తెను అని వైద్యపరంగా కూడా నిరూపణకు అన్ని ఆధారాలు ఉన్నందునే ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాను. మంచి రోజు చూసి మీడియా వద్ద బహిరంగ పరుస్తాను. మైసూరులో నన్ను పెంచిన వారు ఇటీవలే మరణించారు. నాకు ఇప్పటికీ చిన్నమ్మ శశికళ మాత్రమే అండగా ఉంది. చిన్నమ్మతో కూడా ఇంకా మాట్లాడలేదు. మూడు నాలుగు రోజుల్లో శశికళను కలుస్తాను. అపాయింట్మెంట్ కూడా ఆమె ఇచ్చారు. రాజకీయాల గురించి ఇప్పుడు ప్రశ్నలు వేయవద్దు, త్వరలో రాజకీయం గురించి అన్ని విషయాలు చెబుతాను. నా పేరు ప్రేమ, అమ్మ నన్ను జయలక్ష్మి అని ముద్దుగా పిలుచుకునేది’’ అని ఆమె వివరించింది. -
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నేనే..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరోమారు చాటుకున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవ వేడుకల శిలాఫలకంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తానే అని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే నాయకత్వ పగ్గాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఓ శిబిరంగా, శశికళ నేతృత్వంలో మరో శిబిరంగా అన్నాడీఎంకే కేడర్ విడిపోయింది. చెన్నై మెరీనా తీరంలోని ఎంజీఆర్, జయలలిత సమాధులను శనివారం శశికళ సందర్శించి నివాళులరి్పంచిన విషయం తెలిసిందే. ఆదివారం అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని చాటుకునే ప్రయత్నం శశికళ చేయడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏకమవుదాం.. పార్టీని గెలిపిద్దాం పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. శశికళ నేతృత్వంలో చెన్నై టీనగర్‌లోని ఎంజీఆర్ స్మారక మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని శశికళ ఆవిష్కరించారు. ఇందులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అని రాసి ఉంది. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో ఆమె ప్రయాణించారు. ఎంజీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు. ముందుగా టీనగర్లో జరిగిన సేవా కార్యక్రమంలో శశికళ మాట్లాడారు. అందరం ఏకం అవుదాం.. అన్నాడీఎంకేను గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఎంజీఆర్, జయలలిత తమిళనాడును అన్నాడీఎంకే కంచుకోటగా మార్చారని, ఈ వైభవం మళ్లీ రావాలంటే అందరం ఒక్కటి కావాలి్సందేనని స్పష్టం చేశారు. తనను గతంలో సమస్యలు చుట్టుముట్టినా, అన్నాడీఎంకేకు చెందిన వారినే ప్రభుత్వ పాలనలో కూర్చోబెట్టానని పరోక్షంగా పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడు, తమిళ ప్రజలే తనకు ముఖ్యమని.. ఎంజీఆర్, అమ్మ ఆశయాల సాధనే లక్ష్యమని తేల్చిచెప్పారు. అయితే, శశికళ చర్యలను అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వ్యవహారం కోర్టులో ఉందని గుర్తుచేశారు. శిలాఫలకంలో ఆమె పేరును ఎలా పొందుపరిచారు? అని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కార చర్య అని, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’
సాక్షి ప్రతినిధి,చెన్నై: అమ్మపార్టీలో మళ్లీ శశి‘కలకలం’ ప్రారంభమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడిన తరువాత జైలుకెళుతూ జయ సమాధి వద్ద చిన్నమ్మ శశికళ శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగున్నరేళ్ల తరువాత శనివారం మళ్లీ అమ్మ సమాధి వద్ద నివాళులర్పించిన చిన్నమ్మ.. ఈసారి మౌనం పాటిస్తూ మళ్లీ శపథం చేశారా? అవును, నాటి శపథానికి ఇది కొనసాగింపు అంటున్నారు.. కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇదీ నేపథ్యం.. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరి 27వ తేదీన శశికళ విడుదలయ్యారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఆమె వచ్చినపుడు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆమె ఆశించినట్లుగా అన్నాడీఎంకే అగ్రనేతలు ఎవ్వరూ దరి చేరకపోవడంతో నిరాశచెందారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. చదవండి: (జయలలితకు నెచ్చెలి నివాళి) కారుకు పార్టీ జెండా కట్టుకుని.. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే స్వర్ణోత్సోవాల సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు చెన్నై టీ నగర్‌లోని వదిన ఇళవరసి ఇంటి నుంచి అమ్మ సమాధికి బయలుదేరారు. కారుకు అన్నాడీఎంకే పతాకాన్ని అమర్చుకోవడం, ఆమెను అనుసరించిన కార్యకర్తలు సైతం అదే పతాకాన్ని చేతబూని అనుసరించడం చర్చనీయాంశమైంది. 11.30 గంటలకు ఎంజీ రామచంద్రన్, జయ సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. జయ సమాధి వద్ద పది నిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు కార్చారు. గత కొన్నేళ్లు మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద ఆమె అన్నారు. దీంతో ఆమె మాటల్లోని అంతరార్థం ఏమిటని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైలు కెళ్లేముందు జయ సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరిచి పెదాలు కొరుకుతూ ఏదో శపథం చేస్తున్నట్లుగా ఆమె వ్యవహరించారు. జైలు నుంచి విడుదల కాగానే, ఆ తరువాత అనేక సందర్భాల్లో జయ సమాధి వద్దకు వెళ్లాలని శశికళ ప్రయత్నించినా వెళ్లలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే చతికిలబడగా డీఎంకే ప్రభుత్వం దూసుకెళుతున్న పరిస్థితుల్లో అమ్మ పార్టీకి తానే దిక్కనే సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జయ సమాధి వద్దకు శశికళ రాక కలకలం రేపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నై టీనగర్ లోని ఎంజీఆర్ స్మారక నిలయానికి, అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్ నివాసానికి ఆమె వెళతారని సమాచారం. ఆదివారం ఆమె కార్యక్రమా లు అంతవరకే పరిమితమా లేక ఏదైనా దూకుడు ప్రదర్శిస్తారా అనే అనుమానాలు అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొన్నాయి. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హడావుడి పార్టీని కైవసం చేసుకోవడంలో భాగంగా అమ్మ సమాధి నుంచి శశికళ నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో చెన్నై రాయపేటలోని పార్టీ మెయిన్ గేటు ప్రవేశద్వారం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉదయం 10 గంటలకే మాజీ మంత్రులు, అగ్రనేతలు, జిల్లాల కార్యదర్శులు కుర్చీలు వేసుకుని అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారనే సమాచారం అందిన తరువాత మధ్యాహ్నం అందరూ వెళ్లిపోయారు. చిన్నమ్మ ఆస్కార్‌కు అర్హురాలు : మాజీ మంత్రి జయకుమార్ చిన్నమ్మ శశికళ ఒక మహానటి..ఆస్కార్ అవార్డుకు ఆమె అర్హురాలని మాజీ మంత్రి జయకుమార్ ఎద్దేవా చేశారు. చెన్నై మెరీనాబీచ్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద శశికళ కన్నీ రు కార్చడంపై మీడియాతో ఆయన మాట్లాడారు. అంతా ఒక నాటకమని వ్యాఖ్యానించారు. జయ సమాధిని రోజూ లక్షలాది మంది సందర్శిస్తుంటా రు, శశికళ రాక కూడా అందులో భాగమేనని.. అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదని ఆయన అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, దాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపిస్తానంటూ.. శశికళ అనడం అవివేకమన్నారు. అన్నాడీఎంకే అనేది ఒక గజరాజు, దానిపై ఒక దోమ కూర్చుని ఆ గజరాజును నేనే నడిపిస్తున్నానని భావించినట్లు శశికళ కూడా ప్రగల్భాలకు పోతున్నారని దుయ్యబట్టారు. నేడు 50 ఏళ్ల వేడుకలు అన్నాదురై శిష్యునిగా డీఎంకేలో కొనసాగిన ఎంజీ రామచంద్రన్ తన గురువు మరణం తరు వాత డీఎంకేలో ఇమడలేక పోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో విభేదించి 1972 అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకేను స్థాపించారు. రాజకీయాల్లో అప్రతిహతంగా సాగిన అన్నాడీఎంకే 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాయి. -
నేడు అమ్మ సమాధి వద్దకు శశికళ.. కీలక ప్రకటన చేసే అవకాశం..!
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే శనివారం జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించి అక్కడి నుంచే తన పొలిటికల్ రీ ఎంట్రీపై చినమ్మ ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, అక్టోబర్ 17కి అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: (నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం) అయితే జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి: (బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య) -
జయలలిత మరణంపై అనుమానాలు: స్టాలిన్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చడంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు చిత్తశుద్ధి లేదని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మండిపడ్డారు. ఆ ఇద్దరు ఆడుతున్న నాటకం ఓ లేఖ ద్వారా బట్టబయలైనట్టు ఆరోపించారు. జయలలిత మృతి మిస్టరీని నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతోంది. ఇంత వరకు ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. ఈనెల 24వ తేదీతో పొడిగించిన గడువు కూడా ముగియంది. మరో 3 నెలలు గడువు పొడిగించాలని ఆర్ముగస్వామి కమిషన్ ప్రభుత్వానికి ఓ లేఖ రాసి ఉండడం ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో కొన్ని అంశాలు, ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న స్టాలిన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలిత మృతిచెంది నాలుగేళ్లు కావస్తోందని, ఆమె మరణంపై అనేక అనుమానాలు ఉన్నా, అవి ఇంతవరకు నివృతి కాలేదని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మరణం మిస్టరీని నిగ్గుతేల్చడంలో సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీరు సిద్ధంగా లేదన్నది తాజా లేఖ స్పష్టం చేస్తున్నట్టుందని అనుమానం వ్యక్తంచేశారు. ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పడి 37 నెలలు అవుతోందని, ఇంత వరకు ఎలాంటి నివేదిక ప్రభుత్వానికి చేరలేదని గుర్తు చేశారు. (ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: అమిత్ షా) కమిషన్ ఆదేశించి 22 నెలలు అవుతున్నా, ఇంతవరకు విచారణకు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం హాజరు కాకపోవడం చూస్తే ఈ వ్యవహారాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. జయలలిత మరణం విషయంలో ఆయన ప్రస్తుతం మౌనముద్ర అనుసరించడం అనుమానాలకు దారి తీస్తోందన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై ఆ కమిషన్ లేఖ రాసి ఉండడం చూస్తే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని బయటకు తీసుకురావడంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టం అవుతోందన్నారు. -
తలైవి పాత్రలో ఒదిగిపోయిన కంగనా
హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కరోనా లాక్డౌన్ కారణంగా గత ఆరునెలల నుంచి షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న 'తలైవి' చిత్రం ఆదివారం తిరిగి షూటింగ్‌ను ప్రారంభించినట్లు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఫైర్ బ్రాండ్ కంగనా.. 'జయ మా ఆశీస్సులతో 'తలైవి' మరో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ యాక్షన్, కట్ చెప్పే విధానం ఏ మాత్రం మారలేదు' అంటూ పేర్కొంది. తలైవి షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఫొటోలు వైరల్ అవుతూ వచ్చాయి. అయితే తాజాగా.. కంగనా జయలలిత పాత్రలో అసెంబ్లీకి వస్తున్న ఫొటోలు, అసెంబ్లీలో కూర్చున్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో కంగనా జయలలిత పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తలైవి విడుదల తేదీని మూవీ యాజమాన్యం త్వరలో ప్రకటించనుంది. కాగా కంగనా జయలలిత బయోపిక్ కాకుండా, ఎయిర్ ఫోర్స్ మూవీ తేజస్‌లో కూడా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుంది. (వివాదాస్పద ట్వీట్ : కంగనాకు కోర్టు ఝలక్) With the blessings of Jaya Ma we completed one more schedule of Thalaivi- the revolutionary leader. After corona many things are different but between action and before cut nothing changes. Thank you team @vishinduri @ShaaileshRSingh #ALVijay pic.twitter.com/CghmfK0JQf — Kangana Ranaut (@KanganaTeam) October 11, 2020 -
‘అమ్మ’ ఇంట్లో 8 వేల వస్తువులు
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేదనిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం సేకరించిన జాబితా మేరకు అమ్మ ఇంట్లో 8 వేల వస్తువులు ఉన్నట్టు తేలింది. దివంగత సీఎం జయలలితకు పోయెస్‌గార్డెన్‌లో వేదనిలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు పాలకులు ప్రయత్నించి ఫలితాన్ని సాధించారు. ఆ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చే రీతిలో సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో ట్రస్ట్ ఏర్పాటైంది. న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యే క చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. అలాగే, అమ్మ కుటుంబవారసులుగా ఉన్న దీప, దీపక్‌ల నుంచి భవిష్యత్తులో చిక్కులు ఎదురుకాని రీతిలో ఆ ఇంటిని కొనుగోలు చేస్తూ, అందుకు తగ్గ నగదు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. అయితే, దీనిని దీప తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో న్యాయ పోరాటం అన్న ప్రకటన చేశారు. ఈ పరిస్థితుల్లో అమ్మ ఇంటిని ప్రస్తుతం చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తీసుకొ చ్చి ఉండడం మనార్హం. త్వరలో ఆ ట్రస్ట్‌కు ఈ ఇంటిని అప్ప గించబోతున్నారు. కలెక్టరేట్ నుంచి సమాచార శాఖకు వచ్చిన సమాచారాల మేరకు ఆ ఇంట్లో ఉన్న వస్తువుల చిట్టా వెలుగు చూసింది. భారీ గానే వస్తువులు.... అమ్మ ఇంట్లో 32 వేల 700 పుస్తకాలు ఉన్నట్టు లెక్కించారు. అలాగే, 8,376 వస్తువులు ఉండడం గమనార్హం. ఇందులో 14 కేజీలుగా పేర్కొంటున్న 437 బంగారు ఆభరణాలు, 601.4 కేజీలుగా పేర్కొంటున్న 867 వెండి వస్తువులు ఉన్నాయి. అలాగే, ఆరు వేల పాత్రలు, 556 ఫర్నీచర్లు, 162 చిన్న చిన్న వెండి వస్తువులు,108 అలంకరణ వస్తువులు, 29 ఫోన్లు, సెల్ఫోన్లు, 15 పూజా సామగ్రి, పది ఫ్రిడ్జ్‌లు, 38 ఎసీలు, 11 టీవీలు, ఆరు గడియారాలు ఉన్నట్టుగా లెక్క తేల్చారు. అలాగే, 10,438 వివిధ వస్త్రాలు ఉన్నట్టు తేల్చారు. వీటన్నింటిని ట్రస్ట్‌కు మరి కొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు. ఈ వస్తువుల్లో కొన్నింటిని అమ్మ స్మారక మందిరంలో ప్రజల సందర్శన కోసం ఉంచే అవకాశాలు ఎక్కువేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, వేద నిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ఆ ఇంటి వైపుగా అధికారులు తప్ప, మరెవ్వరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. -
వైరలైన ఆగస్టు 14 ముహూర్తం..
రాష్ట్ర రాజకీయ తెరపై శశికళ మరోసారి తళుక్కుమన్నారు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి కాకుండానే ఆగస్ట్ 14వ తేదీన ముందుగానే విడుదల కానున్నారని జోరుగాప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శశికళకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత జయలలితకు అన్నీతానై 32 ఏళ్లపాటు నీడలా వెంట నిలవడమే ఇందుకు కారణం. జయ తీసుకునే పార్టీ పరమైన అన్ని నిర్ణయాల వెనుక శశికళ ప్రమేయం ఉంటుందని ప్రతీతి. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయాల్లో తన అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంతో ‘శశికళ వర్గం’ కూడా ఏర్పడింది. పైకి జయకు వీరవిధేయులుగా ఉంటూనే లోలోపల శశికళ బంటులుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారు. అందుకే జయ కన్నుమూయగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పోలోమంటూ శశికళకు పాదాక్రాంతమైనారు. అమ్మ తరువాత ఇక చిన్నమ్మే శరణ్యమని పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్‌ను కలిసి ఇక సీఎం కావడమే తరువాయి అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నాలుగేళ్ల శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో జైలు పాలుకావడం జరిగిపోయింది. 2017 టూ 2021 ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు జీవితం ప్రారంభించిన శశికళకు నాలుగేళ్ల శిక్షా కాలం 2021 ఫిబ్రవరితో ముగుస్తుంది. దాదాపుగా ప్రతి ఖైదీ తన శిక్షా కాలంలో అనేక వెసులుబాటులు కలిగి ఉంటారు. విచారణ దశలో రిమాండ్ ఖైదీగా గడిపిన కాలం, సత్ఫ్రవర్తనతో శిక్షాకాలం నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఆయా కేటగిరిలకు చెందిన ఖైదీలను ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వాలు ముందుగా విడుదల చేస్తుంటాయి. శశికళ విషయానికి వస్తే రిమాండ్ ఖైదీగా జయలలితతోపాటు బెంగళూరు జైల్లో మూణ్ణాలుగు నెలలు గడిపి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ రిమాండ్ కాలాన్ని శశికళ విషయంలో పరిగణనలోకి తీసుకుంటే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అది వీలుపడని పక్షంలో ఇక సత్ఫ్రవర్తన కింద పరిశీలించాల్సి ఉంటుంది. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ‘చేతి’చలువతో జైలు గోడల మధ్య లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఇష్టారాజ్యంగా ములాఖత్, జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వెళుతూ బెంగళూరు నగరంలో షాపింగ్ చేయడం వంటివి శశికళ సాగించారని బెంగళూరు అప్పట్లో జైళ్లశాఖ డీఐజీ రూప సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. శశికళ షాపింగ్‌కు వెళ్లివస్తున్న సీసీటీవీ పుటేజీలు సైతం బహుళ ప్రచారంలోకి వచ్చాయి. వీటిని గనుక ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటే సత్ఫ్రవర్తన కోటా కింద శశికళకు ముందస్తు విడుదల యోగం ఉండదు.(జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు ) ఆగస్టు 14న విడుదలవుతున్నట్లుగా ప్రచారం సత్ఫ్రవర్తన కోటా కింద నాలుగేళ్ల జైలు శిక్ష ముగియకుండానే ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలవుతున్నట్లు ఒక సమాచారం వైరల్ అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న శిక్షాఖైదీల్లో శశికళ కూడా ఉన్నారా అనే విషయం స్పష్టం చేయాలని కోరుతూ శశికళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ఆశీర్వాదం ఆచారి.. సమాచార హక్కు చట్టం కింద బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా బదులురాలేదని సమాచారం. ఇదిలా ఉండగా, సత్ఫ్రవర్తన కోటా కింద ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదల కానున్నారని ఆశీర్వాదం ఆచారి గురువారం ట్వీట్ చేసి కలకలాన్ని రేపారు. అంతేగాక రాజకీయవర్గాల్లో రసవత్తరమైన చర్చకు తెరలేపారు. వచ్చే ఏడాది (2021) ఏప్రిల్ లేదా మే మాసంలో తమిళనాడు అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేలో కీలకపాత్ర పోషించిన శశికళ చలువవల్లే ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అదే తరుణంలో శశికళపై తిరుగుబాటు చేసిన ఓ పన్నీర్‌సెల్వం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. నటులు కమల్, రజనీకాంత్ రాజకీయ పార్టీలను పక్కనపెడితే అన్నాడీఎంకే, డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల రణరంగంలో తలపడుతాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే శశికళ జైలు నుంచి విడుదలైతే అన్నాడీఎంకే రాజకీయాల్లో కుదుపుతప్పదు. ఈ పరిణామం అన్నాడీఎంకేకు అనుకూలమా ప్రతికూలమా అనేది అంచనాలకు అందని విధంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో డీఎంకే దూకుడుకు కళ్లెం వేసేందుకు అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కమలనాథులు వ్యూహం పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఎడపాడి ఎలాగూ విధేయుడు కాబట్టి శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వంల మధ్య రాజీకి బీజేపీ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ వ్యూహంపై రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా అన్నాడీఎంకేలో ప్రతిస్పందన ఎలాగుంటుందో తెలుసుకునేందుకే బీజేపీ అధిష్టానం ‘ట్రయల్ రన్’లా ఆశీర్వాదం ఆచారిచే ట్వీట్ చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కమలనాథులు ఆశించినట్లుగానే శశికళ ముందస్తు విడుదల రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. సత్ఫ్రవర్తన కింద శశికళ ముందుగా విడుదల కావాలంటే రూ.10 కోట్ల జరిమానా చెల్లింపుపై చిక్కు సమస్య ఉంది. ఆస్తుల కేసులో శశికళతోపాటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి, సుధాకరన్ కలిపి మొత్తం రూ.30 కోట్లు జరిమానా కట్టాలి. ఆ సొమ్ము కట్టిన పక్షంలో ఆదాయపు పన్నుశాఖ రంగప్రవేశం చేసి ఇంత సొమ్ము ఎక్కడిదని నిలదీస్తుంది. జరిమానా చెల్లించని పక్షంలో సత్ఫ్రవర్తన జాబితాలో చేరినా ముందస్తు విడుదలకు అవకాశం లేదు. అబ్బే అదేం లేదు : బెంగళూరు జైళ్లశాఖ ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదలా, అబ్బే అదేం లేదని బెంగళూరు జైలు అధికారులు శుక్రవారం కొట్టివేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ‘సత్ఫ్రవర్తన కోటా కింద శిక్షా ఖైదీలను విడుదల చేయాలనే అంశంపై స్వాతంత్య్ర దినోత్సవానికి సుమారు పది రోజుల ముందు కర్ణాటక కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని గవర్నర్‌కు ఆమోదానికి పంపుతుంది. ఆ తరువాతనే ఖైదీలను విడుదల చేస్తార’ని జైళ్లశాఖ అధికారి ఒకరు తెలిపారు. సత్ఫ్రవర్తన ఖైదీల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు సమావేశమే కాలేదని ఆయన స్పష్టం చేశారు. -
జయలలిత బయోపిక్: థియేటర్? ఓటీటీ?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్టార్ హీరోయిన్ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం "తలైవి". ఏఎల్ విజయ్ దర్శత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇదిలా వుండగా లాక్డౌన్ కారణంగా థియేటర్లకు ఇంకా అనుమతులు రానందున పలు సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ క్రమంలో తలైవి చిత్రం కూడా ఓటీటీలో విడుదల కానుందని, ఇందుకు నిర్మాతలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో భారీ డీలింగ్ కుదుర్చుకున్నారని వార్తలు వెలువడ్డాయి. త్వరలోనే ఈ సినిమాను అరచేతిలో చూసేయవచ్చని అందరూ భావించారు అయితే ఈ చిత్రాన్ని ముందుగా ఓటీటీలో విడుదల చేసే సమస్యే లేదని చిత్ర యూనిట్ కుండలు బద్ధలు కొట్టినట్లు చెప్పింది. (నా ఇల్లు నాకో స్వర్గంలా అనిపిస్తోంది) ఓటీటీలో తలైవి ప్రీమియర్ రానుందన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ముందుగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని తెలిపింది. ఆ తరువాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. కాగా తొలుత జూన్ 26న సినిమా విడుదల చేయానుకున్నప్పటికీ కరోనా వైపరీత్యం వల్ల సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో విడుదల తేదీని వాయిదా వేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ మూడు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ కలిసి నిర్మించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత తలైవి ద్వారా కంగనా నేరుగా తమిళ సినిమాలో నటిస్తోంది. ఇదిలా వుంటే ఇప్పటికే జయలలిత బయోపిక్‌పై 'క్వీన్' చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించింది. (తలైవికి నష్టం!) -
పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పటి పవర్ఫుల్ రాజకీయకేంద్రమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం స్మారకమందిరం వివాదంలో నలిగిపోతోంది. జయ వారసులు దీప, దీపక్ ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు సమరం సాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెగార్డెన్‌లో అత్యంత విలాసవంతమైన భవనంలో నివసించేవారు. రాజకీయ వర్గాలు ‘గార్డెన్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. జయలలిత అధికారంలో ఉన్నపుడు ‘గార్డెన్’ నుంచి ఆదేశాలు వచ్చాయా అని ముందుగా ప్రశ్నించేవారు. సచివాలయం కంటే పోయెగార్డెన్ కే ప్రాధాన్యతతో రాజకీయ, అధికార కేంద్రంగా వెలిగిపోయేది. జయ మరణించిన తరువాత కూడా దాని ప్రాభవం తగ్గలేదు. జయకు వందలకోట్ల రూపాయల ఆస్తులున్నా గార్డెన్హౌస్ చుట్టూనే రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. జయకు సొంతమైన వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తికి ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ వారసులని మద్రాసు హైకోర్టు తేల్చడంతో ఇంతకూ ఆస్తులెక్కడెక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే అంశంపై జోరుగా చర్చ బయలుదేరింది. (వారిద్దరూ అమ్మ వారసులే) అవినీతి నిరోధకశాఖ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో ఎన్నికల సమయంలో జయలలిత దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో చూపిన ఆస్తులనే పేర్కొన్నారు. జయకు వారసులమని తమను ప్రకటించి ఆమె ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను తమకు అప్పగించాల్సిందిగా దీప, దీపక్ గతంలో వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వెలువడిన తీర్పుతో స్పష్టత వచ్చింది. వారిద్దరూ జయ ఆస్తికి రెండోతరం వారసులని కోర్టు పేర్కొంది. జయ ఆస్తులపై పర్యవేక్షణాధికారం వారిద్దరికీ ఉంటుందని తెలిపింది. పోయెస్ గార్డెన్లోనిఇంటిని జయ స్మారక మందిరంగా మార్చాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సింది ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హర్షం వ్యక్తంచేసిన దీప, దీపక్ ఇద్దరూ కలిసి చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధికి వెళ్లి అంజలి ఘటించారు. గార్డెన్‌లోనే కాపురం: దీప కోర్టు తీర్పులో సైతం గార్డెన్‌కు ప్రాధన్యత ఇవ్వడంతో జయ నివాసం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం తమ పూర్వీకుల ఆస్తి, ఆ భవనం తమకు సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. జయకు నేరుగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తిని కాజేయాలని ఎందరో చేసిన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్టవేసింది. పోయెస్‌గార్డెన్ ఇంటిని జయ స్మారకమందిరంగా మార్చడాన్ని అంగీకరించం. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర చట్టంపై కోర్టులో అప్పీలు చేస్తాం. జయకు చెందిన ఆస్తులన్నీ మాకే సొంతం. వాటిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నాం. జయ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేస్తాం. చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాగానే పోయెస్‌గార్డెన్‌లో నివసిస్తాం. జయ ఆస్తులను స్వాధీనం చేసుకుని కాపాడే బాధ్యత మాపై ఉంది. జయ పేరున మేమే ట్రస్టును ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సేవచేస్తామని దీప చెప్పారు. దీపక్ మాట్లాడుతూ, పోయెస్‌గార్డెన్ ఇల్లు వారసత్వంగా మాకు సంక్రమించిన ఆస్తి, దాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని అన్నారు. జయ స్మారకమందిరంగా ప్రభుత్వం మార్చదలచుకుంటే తాముగా ఇవ్వాలేగాని వారు ఏకపక్ష నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. వేద నిలయంను సీఎం క్యాంపాఫీస్ చేయా లన్న సూచన కూడా సరికాదు. డీఎంకే అధి కారంలోకి వచ్చి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన పక్షంలో అందులో ఉంటారా. మాకు సాయుధ పోలీస్ బందోబస్తు కావాలని కోరలేదు. ఒక ఆస్తి కోసం నన్ను హత్యచేస్తే అందుకు బాధ్యులెవరు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం తమ పూర్వీకుల ఆస్తిని జయ స్మారకమందిరంగా చేసుకుంటే మంచిదని దీపక్ వ్యాఖ్యానించారు.(స్మారక మందిరంగా జయలలిత నివాసం) చిన్నమ్మకు చిక్కే.. జయ ఆస్తులపై కోర్టు ఇచ్చిన తీర్పు శశికళను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. జయలలిత, శశికళ సంయుక్తంగా అనేక సంస్థలు నడుపుతుండేవారు. వాటిల్లోని జయ వాటాను దీప, దీపక్‌లకు కేటాయించాల్సి ఉంటుంది. లేదా జయ ఆస్తులన్నీ ట్రస్ట్ కిందకు తీసుకొస్తే మారుమాట్లాడకుండా శశికళ అప్పగించాల్సి రావచ్చు. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట వివాదాలు కుదుటపడవచ్చు. ప్రభుత్వానికే అధికారం: సీవీ షణ్ముగం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తీర్పుతో స్పష్టమైందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. జయ ఇంటిని స్మారకమందిరంగా మార్చడంపై పునరాలోచించాలని, ఒక భాగం స్మారక మందిరం, మరో భాగం సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మార్చవచ్చని కోర్టు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పు ప్రతులు అందిన తరువాత క్షుణ్ణంగా అధ్యయనం చేసి బదులు పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
స్మారక మందిరంగా జయలలిత నివాసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చాలని మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తులపై ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్లకూ వారసత్వపు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రైవేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పుహళేంది (ప్రస్తుతం పార్టీతో రాజీ), జానకిరామన్ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. -
జయలలిత నివాసంపై కీలక నిర్ణయం
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జయలలితన నివాసాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోనున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులకు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ నివాసానికి సంబంధించి చట్టబద్ధమైన వారసులకు పరిహారం అందజేయకపోవడంతో తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీచేసినట్టు అధికారులు చెప్పారు. వారసులకు కేటాయింపుల కోసం రూ. 66 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మ్యూజియం వ్యవహారాలు చూసుకునేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ఈ ట్రస్ట్‌కు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, సమచార శాఖ మంత్రి కె రాజు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. కాగా, జయలలిత బతికి ఉన్న కాలంలో వేద నిలయం రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కూడా ఆమె ఈ బంగ్లా నుంచే చక్రం తిప్పారు. జయలలిత మరణించిన తర్వాత వేద నిలయానికి సంబంధించి వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. -
చెరసాలేనా చిన్నమ్మ?
నాలుగేళ్ల శిక్ష ముగింపు దశకు చేరుకుంది. జైలు నుంచి విముక్తిపై శశికళ చుట్టూ కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. జరిమానా రూపంలో చిన్నమ్మ చిక్కుల్లో పడ్డారు. జరిమానా చెల్లించనట్లయితే అదనంగా ఏడాది పాటు జైలు జీవితం తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్‌లో ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పింది. ఇదే కేసులో సహ నిందితులైన జయ నెచ్చెలి శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్‌కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏడాదిపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై రెండేళ్ల పాటు అప్పీళ్లపై అప్పీళ్లతో శిక్ష అమలులో జాప్యం చోటుచేసుకుంది. 2016 డిసెంబర్లో జయలలిత కన్నుమూయగా 2017 ఫిబ్రవరి నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిమానాకు గురైన వారు శిక్ష ముగిసే సమయంలోనే చెల్లిస్తారు. శశికళ వ్యవహారంలో చెక్ లేదా డీడీ రూపంలో జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియబరుస్తూ ఆదాయపు పన్నుశాఖకు ఆదారాలు చూపి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను జతచేసి చెల్లించాలి. ఖైదీగా ఉన్న కాలంలో జైలు నిబంధనలకు అనుగుణంగా, క్రమశిక్షణతో వ్యవహరించినవారు శిక్షా కాలం నుంచి మినహాయింపు పొంది ముందుగానే విడుదలయ్యే వెసులుబాటు ఉంది. ఈ కేటగిరి కింద శశికళ నాలుగేళ్లు ముగిసేలోపే విడుదలవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దోపిడీ, హత్య, అత్యాచారం కేసుల్లో 14 జైలుశిక్ష పడిన వారికి మాత్రమే ముందస్తు విడుదల వెసులుబాటు వర్తిస్తుంది. అవినీతి కేసులో శిక్ష పడినవారు అందుకు అనర్హులని అంటున్నారు. శశికళ రూ.10 కోట్ల జరిమానా చెల్లించిన పక్షంలో 2021 జనవరి 25వ తేదీన జైలు నుంచి విడుదల అవుతారు. జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 15వ తేదీ వరకు జీవితం గడపక తప్పదని జైళ్లశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు రెండేళ్ల కిత్రం శశికళ సొంత వ్యాపారాలు, బంధువుల వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు చేసి రూ.5వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు. ఈ పరిస్థితిలో రూ.10 కోట్ల జరిమానాను కరెన్సీ రూపంలో శశికళ చెల్లించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ శశికళ బంధువులు, స్నేహితులు చెల్లించినా వారికి సైతం ఐటీ అధికారుల బెడద ఉంటుంది. శశికళ తరఫున అంతపెద్ద మొత్తాన్ని కట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. శశికళ రూ.10 కోట్లు జరిమానా చెల్లించి వచ్చే ఏడాది విడుదల అవుతారా..? లేక మరో ఏడాది పాటు జైల్లోనే ఉండిపోతారా..? అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. -
జయలలిత.. అచ్చం ఐశ్వర్యరాయ్‌లా!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. బాలీవుడ్ సంచలన హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిత్రబృందం సినిమాలో కంగనా లేటెస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేసింది. అందులో ఈ హీరోయిన్ సాంస్కృతిక నృత్యకారిణిగా ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారు. జయ లలిత పాత్రను పోషించడం కోసం పెద్ద పరిశోధనే చేసానంటుందీ కంగనా. జయలలిత నాలా ఉండదు. బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉంటుందో..ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. అలాంటిది ఆమె పాత్రలో నటించడం నాకు చాలా పెద్ద చాలెంజ్ అనిపించింది. ఎందుకంటే నేను గ్లామరస్ స్టార్‌ను కాదు.(పంగా రివ్యూ: మహిళలు, అస్సలు మిస్సవకండి) కాకపోతే ఆమెకు నాకు ఉన్న ఒకే ఒక పోలిక.. అనుకోకుండా నటి కావడం. సినిమాలంటేనే ఇష్టముండని జయలలిత అనూహ్యంగా వెండితెరపై కనిపిస్తుంది. నేనూ అంతే. సినిమాల్లో కనిపించాలని ఎప్పుడూ కలలు కనలేదు. అందుకే మేము అసాధారణ నటీమణులుగా కీర్తి గడించా’మని చెప్పుకొచ్చింది. మరో విషయంలోనూ వీరిద్దరికీ పోలిక ఉందంటోంది పంగా హీరోయిన్. ‘సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేస్తూ ఉండటం కన్నా అంతకు మించి మరేదో ఉందని జయలలిత ఎప్పుడూ అనుకునేదేమో. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి శక్తివంతమైన నాయకురాలిగా మారింది. ఇక నా విషయానికొస్తే.. కేవలం నటిగా కొన్ని పరిమితుల్లోనే ఉండటం ఎందుకని, నిర్మాతగానూ మారాను’ అని కంగనా పేర్కొంది. ‘తలైవి’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 26న విడుదల కానుంది. చదవండి: కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’ కంగనాకు పూలగుచ్ఛం పంపిన అలియా భట్! అమ్మ ఆస్తులకు కుమ్ములాట -
అమ్మ ఆస్తులకు కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకోసం కుమ్ములాట మొదలైంది. భాగస్వామిగా వ్యవహరించిన శశికళ, అన్నకుమార్తె దీప మధ్య ఆస్తులపై ఆధిపత్య పోరుకు మద్రాసు హైకోర్టు వేదికగా మారనుంది. కొడనాడు ఎస్టేట్ సహా అనేక స్థిరాస్తులు, కంపెనీలు తనకే సొంతమని శశికళ ప్రకటించుకోవడాన్ని జయలలిత అన్న కుమార్తె దీప తీవ్రంగా ఖండించారు. శశికళపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు శుక్రవారం ఆమె ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. జయ అధికారంలో ఉన్నా లేకున్నా శశికళ అన్నీతానైనట్లుగా వ్యవహరించారు. అధికార పరపతిని అడ్డుపెట్టుకుని వేలాది కోట్లరూపాయల ఆస్తులను సంపాదించినట్లుఆరోపణలున్నాయి. వీటిల్లో అనేక ఆస్తులను జయలలిత, శశికళ సంయుక్త భాగస్వాములుగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటిల్లో కొడనాడు ఎస్టేట్ ఎంతో ప్రధానమైనది. భర్త నటరాజన్ అనారోగ్యం, మరణం సందర్భాల్లో శశికళ రెండుసార్లు పెరోల్‌పై చెన్నైకి వచ్చి కొన్నిరోజులు గడిపారు. పెరోల్ ముగిసిన తరువాత ఆమె జైలుకు చేరిన కొద్దిరోజుల్లోనే 2017 నవంబరులో ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం, శశికళ బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపని భారీ ఆస్తులను గుర్తించారు. అంతేగాక రద్దయిన కరెన్సీకి సంబంధించిన సుమారు రూ.1,900 కోట్ల ఆస్తులను కొనుగోలు, రుణాలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ అక్రమ వ్యవహారాలకు సంబంధించి వివరణ కోరుతూ శశికళకు సమన్లు జారీ చేశారు. శశికళ తరఫున ఆమె ఆడిటర్ ఈనెల 11వ తేదీన ఐటీ అధికారులకు బదులిచ్చాడు. జయలలితకు సొంతమైనదిగా ఇటీవల వరకు ప్రచారంలో ఉండిన కొడనాడు ఎస్టేట్, మరో నాలుగు ఆస్తుల్లో 2016 నుంచి ఏప్రిల్ 1 నుంచి జయలలిత మరణించిన అదే ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు శశికళ భాగస్వామిగా మెలిగారు. జయ కన్నుమూసిన తరువాత భాగస్వామ్య సంస్థలు రద్దుకాగా శశికళ వాటి యజమానిగా మారారు. ఈ కారణంగా కొడనాడు ఎస్టేట్ ఆస్తులు శశికళకు సొంతమని ప్రకటించుకున్నారు. దీంతో శశికళ నిర్ణయాలను సవాలు చేస్తూ దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ జయ వారసురాలిగా ఆమె ఆస్తులకు సంబంధించి తాను గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లు విచారణ దశలో ఉన్న పరిస్థితుల్లో కొడనాడు ఎస్టేట్ ఆస్తులను తనకు సొంతమైనవని శశికళ ప్రకటించడం చట్టరీత్యా చెల్లదని అన్నారు. జయ ఆస్తులను సొంతం చేసుకుంటూ శశికళ వద్దనున్న డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాలని, ముఖ్యంగా భాగస్వామ్య పత్రాలను కోరనున్నట్ల దీప తెలియజేశారు. -
క్వీన్ రివ్యూ: అందరి మనసులో ‘అమ్మ’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీయాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఆమె బయోపిక్‌పై మూడు సినిమాలు రానున్నాయి. కంగనా రనౌత్ ‘తలైవి’, నిత్యామీనన్ ‘ద ఐరన్ లేడీ’ సినిమాలతో పాటు డిజిటల్ మాధ్యమంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్, మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అటు న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చిత్రబృందం జయలలిత పాత్రకు శక్తి శేషాద్రి అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అందరి నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. శక్తి.. ఏమీ తెలియని బాల్యం నుంచి అందర్నీ శాసించే రాజకీయ నాయకురాలిగా ఎదిగిన తీరు, ఆమె సంఘర్షణ, పోరాటతత్వం అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. చిన్నప్పటి శక్తి పాత్రను అనిక పోషించగా యవ్వనంలో అంజనా జయప్రకాశ్ తెరమీద ప్రత్యక్షమవుతుంది. శక్తి రాజకీయ ప్రస్థానాన్ని టాలీవుడ్ నటి రమ్యకష్ణ మరింత రక్తి కట్టించిందనడంలో సందేహం లేదు. శక్తి బాల్యం నుంచే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ముళ్లదారిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరాఖరకు విజయాన్ని ముద్దాడింది. ఒక్కసారి నటిగా గుర్తింపు వచ్చిన తర్వాత బాల్యంలో దక్కని ప్రేమ, అభిమానాలు ఆమెను చుట్టుముట్టడం విశేషం. శక్తి.. సమాజంలోని అసమానతలను, పితృస్వామ్య ధోరణిలను నిర్భయంగా, నిస్సందేహంగా నిలదీస్తుంది. అక్కడే ఆమెలోని నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తనకు ఎదురయ్యే ప్రతీ సమస్యను ఎదుర్కొంటూ మరింత రాటు దేలుతూ వచ్చిందే తప్ప కుంగిపోయి ఆమె ప్రయాణాన్ని ఆపలేదు. అదే ఆమెను గొప్ప స్త్రీగా నిలబెట్టింది. నటిగా, నాయకురాలిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇక రాజకీయ ఎంట్రీతో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. శక్తి(జయలలిత) ఎంతగానో గౌరవించే ఎమ్జీఆర్ పాత్రలో నటుడు ఇంద్రజిత్ సుకుమార్ దర్శనమిస్తాడు. వీరి కలయికలో వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే శక్తి జీవితంలో ఎత్తుపల్లాలను స్పృశిస్తూనే, ఓ గొప్ప నాయకురాలిగా అందరి మనసులో ఎలా స్థానం సంపాదించిందన్నదే కథ. సామాజిక వ్యత్యాసాలు, పురుషాధిక్యం వంటి సమస్యలను కూడా టచ్ చేస్తుందీ సినిమా. రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ ఠీవి, అధికారం, ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి తమిళ వెబ్‌సిరీస్‌లో క్వీన్ ప్రత్యేక స్థానం దక్కించుకోవడంతోపాటు అమ్మ(జయలలిత) అభిమానులు మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. -
‘ఆ సినిమాలకు’ తొలగిన అడ్డంకులు
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పలు చిత్రాల నిర్మాణాలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ క్వీన్‌కు, నటి కంగనా రనౌత్ తలైవికి, నిత్యా మీనన్ ది ఐరన్ లేడీ చిత్రాలకు ఆటంకాలు తొలిగిపోయాయి. వీటి నిర్మాణాలను నిర్భయంగా జరుపుకోవచ్చు. అందుకు స్వయంగా మద్రాసు హైకోర్టునే పచ్చజెండా ఊపింది. దర్శకుడు విజయ్... జయలలిత బయోపిక్‌ను తలైవి పేరుతో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం, అందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మహిళా దర్శకురాలు ప్రియదర్శిని దీ ఐరన్ లేడీ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో జయలలితగా నటి నిత్యామీనన్ నటించనున్న సంగతి విదితమే. ఇకపోతే దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత చరిత్రను నటి రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో క్వీన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కాగా వీటిని తన అనుమతి లేకుండా రూపొందించడాన్ని నిషేధించాలని జయలలిత సోదరుడి కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఒకసారి విచారణ జరిగింది. దీప పిటిషన్‌కు సమాధానం ఇస్తూ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు, విజయ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. గురువారం న్యాయమూర్తులు సెంథిల్‌కుమార్, రామమూర్తిల సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తులు జయలలిత బయోపిక్‌ను చిత్రాలుగా తెరకెక్కించడాన్ని నిషేధించలేం అని తీర్పునిచ్చారు. అయితే దర్శక నిర్మాతలు ఇది కల్పిత సన్నివేశాలతో రూపొందించినట్లు టైటిల్ కార్డులో ప్రకటించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే పూర్తి అయిన రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ క్వీన్ శనివారం నుంచి ఆన్లైన్లో ప్రసారం కానుంది. -
అమ్మకు తగ్గిన ఆదరణ
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరంలో పేదలకు చౌక ధరకే కడుపు నింపుతున్న ‘అమ్మ’ క్యాంటీన్లకు ఆదరణ తగ్గింది. ఇందుకు కారణం నాణ్యత కొరవడడమే అన్న సంకేతాలు వెలువడ్డాయి. అధికారులు స్థానిక ఎన్నికల పనుల బిజీలో ఉండడంతో క్యాంటీన్లపై దృష్టి పెట్టే వాళ్లు కరువయ్యారు. దీంతో నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వీకరించేందుకు పేద ప్రజానీకం మొగ్గు చూపడం లేదు.చెన్నై మహానగరంలో స్టార్ హోటళ్ల మొదలు ఫుట్‌పాత్ టిఫిన్ సెంటర్ల వరకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. వీధికి నాలుగైదు హోటళ్లు, ఫాస్టు ఫుడ్స్, బిర్యానీ సెంటర్లు, రోడ్డు సైడ్ దుకాణాలు దర్శనం ఇస్తుంటాయి. రోడ్ సైడ్ దుకాణాలు మినహా తక్కిన చోట్ల ధరలు సామాన్యుడికి భారమే. చెన్నై వంటి మహానగరంలో తక్కువ జీతానికి పనిచేసే చిరుద్యోగులు, రోజూవారి కూలీలు, గుడిసెల్లో, రోడ్డు సైడ్లలో నివసించే వారు, మోత కార్మికులు, ఇలా పేద వర్గాలకు చౌక ధరకే కడుపు నింపాలన్న కాంక్షతో బృహత్తర పథకాన్ని అమ్మ జయలలిత 2013లో ప్రవేశ పెట్టారు. అమ్మ పేరుతో తొలుత చెన్నైలో నెలకొల్పిన క్యాంటీన్లు, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చౌక ధరకే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రుల్లో చపాతి వంటి వాటిని విక్రయిస్తూ వస్తున్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా, కేవలం పేదలకు కడుపు నింపడం లక్ష్యంగా నెలకొల్పిన ఈ క్యాంటీన్ల రూపంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఓట్ల వర్షం కురిశాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం ప్రస్తుతం పాలకులకు భారంగా మారినట్టుంది. కొరవడ్డ నాణ్యత.... అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఈ క్యాంటీన్లను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈక్యాంటీన్ల ద్వారా లాభ నష్టాలను బేరీజు వేసే పనిలో అధికారులు పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.చెన్నై నగరంలో రెండు వందల వార్డుల్లో ఈ క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే, నగర శివార్లల్లోనూ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ క్యాంటీన్లలో మూడు వేళల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం, వంటి పనులకు రెండు షిఫ్టులుగా మహిళలు పనిచేస్తున్నారు. వీరి జీతాలు, నిర్వహణ, ఆహార పదార్థాల తయారీ అంటూ మొత్తంగా రూ. 120 కోట్లు ఖర్చు ఏడాదికి అవుతుండగా, కేవలం రూ. 30 కోట్ల మేరకు మాత్రం ఆదాయం వస్తున్నట్టుగా ఇటీవల లెక్కల్లో అధికారులు తేల్చారు. క్యాంటీన్లను బలోపేతం చేయాలంటే, మరింత నిధులు తప్పనిసరి కావడంతో, ఇందుకు తగ్గ నివేదిక ప్రభుత్వానికి కార్పొరేషన్ నుంచి వెళ్లినా, అక్కడి నుంచి స్పందన లేని దృష్ట్యా, ప్రస్తుతం నాణ్యత అన్నది కొరవడి ఉంది. అన్ని రకాల ఆహార పదార్థాల్లో నాణ్యత కొరవడడంతో పేదలు సైతం అటు వైపుగా వెళ్లడం మానేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా క్యాంటీన్లలో తయారు చేసిన ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో చెత్త కుండీల్లో వేయాల్సిన పరిస్థితి అనేక చోట్ల ఉన్నట్టు సమాచారం. నాణ్యత కొరవడం, విక్రయాలు గణనీయంగా తగ్గడం వెరసి ఇక, క్యాంటీన్లకు మంగళం పాడేనా అన్న చర్చకు తెరపైకి తెచ్చింది. కాగా స్థానిక ఎన్నికల పనుల బిజీలో కార్పొరేషన్ అధికారులు అందరూ బిజీగా ఉన్న దృష్ట్యా, ఇప్పట్లో క్యాంటీన్లపై దృష్టి పెట్టింది అనుమానమే. -
అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి
సినిమా: అమ్మ లక్షణాలు సహజంగానే ఆమెలో ఉన్నాయి అని మహిళా దర్శకురాలు ప్రియదర్శిని అన్నారు. ఈమె ఎవరి గురించి చెబుతున్నారో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును దర్శకురాలు ప్రియదర్శిని చెబుతున్నది నటి నిత్యామీనన్ గురించే. నవ దర్శకురాలైన ప్రియదర్శిని దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటీమణి జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రకు నటి నిత్యామీనన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి విదితమే. దీనికి ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా రోజులైంది. దీంతో ఈ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకురాలు ప్రియదర్శిని స్పందిస్తూ శనివారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ది ఐరన్‌లేడీ చిత్రం గురించి పలువురు పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. వారందరికి వాస్తవాలను తెలియజేయాలని భావించాను. ఈ చిత్రం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పరిపూర్ణ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. నిజ జీవిత అంశాలను పూర్తిగా చర్చించిన తరువాతనే జయలలిత పాత్రలో నటి నిత్యామీనన్ సరిగ్గా నప్పుతారని ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాం, జయలలితలోని సహజమైన లక్షణాలన్నీ నిత్యామీనన్‌లో ఉన్నాయి. పురట్చి తలైవి అమ్మ మాదిరిగానే నిత్యామీనన్ ఆరు భాషల్లో సరళంగా మాట్లాడగలరు. తను చిన్నతనంలోనే భరతనాట్యం, క్రీడలు పరిచయం కలిగి ఉన్నారు. అంతే కాదు సంగీతంలోనూ ప్రతిభ కలిగిన నటి. జీవిత చరిత్రను తెరకెక్కించడం సవాలే. అదేవిధంగా బయోపిక్‌లతో పలు సమస్యలు, చర్చలు, విమర్శలు ఉన్నా, అమ్మ జీవిత చరిత్రను యథార్థంగా ఎలాంటి మార్పులు చేయకుండా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కథను తెరకెక్కించడంలో దర్శకురాలిగా సవాళ్లు అధికమే. ప్రజలు అంగీకరించేలా, అలరించేలా ఒక మంచి చిత్రాన్ని రూపొందించే బాధ్యతను తీసుకున్నాం. సర్ రిచర్డ్ ఆటంబరో గాంధీ బయోపిక్‌ను తెరకెక్కించడానికి 18 ఏళ్ల సమయాన్ని ఖర్చు చేశారు. ఒక ఉన్నతమైన చిత్రాన్ని రూపొందించడానికి అంత సమయం అవసరం అవుతుందన్న విషయంలో మేమూ దృఢంగా ఉన్నాం. ఈ చిత్రంలో సగం విజయం సరైన కథాపాత్రలను ఎంపిక చేయడంలోనే ఉంది. ఈ విషయంలో రాజీకి చోటు ఉండదు. అలా కాంప్రమైజ్ అయితే మీరు కచ్చితంగా అంగీకరించరన్నది మాకు తెలుసు.అందుకే యథార్థం మీరకుండా పూర్తి స్వేచ్ఛతో ఈ చిత్రాన్ని మీ ముందుంచాలని భావించాం, చిత్రంలో మూడు ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటుల కాల్షీట్స్ కోసం వేచి ఉన్నాం. ఈ విషయాన్ని మీ ముందుంచడం సంతోషంగా ఉంది. ఈ ఆదరణతో అసాధ్యాన్ని సాధ్యం చేస్తాం. అని ది ఐరన్ లేడీ చిత్ర రూపకల్పనకు పూనుకున్న నవ దర్శకురాలు ప్రియదర్శిని పేర్కొన్నారు. -
తరగతులకు వేళాయె!
క్రమశిక్షణగా క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఈ క్లాసులు ఎందుకంటే సినిమా కోసమే. ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్ పెట్టారు) చిత్రం కోసం కంగనా రనౌత్ భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ క్లాసులతోనే ఆమె బిజీగా ఉన్నారని తెలిసింది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం ప్రారంభం కానుంది. అందుకే భరతనాట్యం క్లాసులతో బిజీ అయ్యారు కంగనా. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
‘దీప’కు బెదిరింపులు..!
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపకు బెదిరింపులు, వేధింపులు పెరిగాయి. ఎంజీఆర్, అమ్మ, దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ బెదిరింపులు, వేదింపులు పెరిగాయి. దీంతో తనకు, తన భర్తకు భద్రత కల్పించాలని కమిషనర్ విశ్వనాథన్‌కు దీప విజ్ఞప్తి చేశారు.జయలలిత మరణం అనంతరం ఆమె మేన కోడలు దీప ఓ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంజీఆర్ అమ్మ దీప పేరవైతో రెండేళ్ల పాటుగా సాగిన ఈ పార్టీ వ్యవహారాల మీద అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. పదవుల్ని అమ్ముకున్నట్టుగా కూడా ఆరోపణలే కాదు, వ్యవహారం ముదిరి పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీని నడప లేని పరిస్థితుల్లో ఉన్న దీప, ఇక రాజకీయాలకు దూరం అని గత వారం ప్రకటించారు. అలాగే, ఎంజీఆర్ అమ్మ దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ పార్టీ కోసం జేబులు చిల్లు చేసుకున్న వాళ్లలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమతో మాట వరసకైనా చెప్పకుండా, ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. జయలలిత మీదున్న అభిమానంతో దీప వెన్నంటి నిలబడి ఆస్తుల్ని సైతం అమ్ముకున్నామని చాలా మంది వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దీపకు ఆ శక్తుల నుంచి బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరిగినట్టుంది. ఆడియో ద్వారా ఫిర్యాదు సోమవారం కమిషనర్ విశ్వనాథన్‌కు దీప ఆడియో రూపంలో ఫిర్యాదు చేశారు. తాను జయలలిత మేన కోడలుగా పేర్కొంటూ, ఇది వరకు తాను రాజకీయాల్లో ఉన్నానని,ప్రస్తుతం తప్పుకున్నట్టు గుర్తు చేశారు. రాజకీయ జీవితం నుంచి దూరంగా ఉన్న తనకు ప్రస్తుతం బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన పార్టీ పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేసిన అనంతరం ఈ బెదిరింపులు పెరిగినట్టు వివరించారు. ఫోన్ల ద్వారా, వాయిస్ మెస్సేజ్‌ల ద్వారా వస్తున్న బెదిరింపులు ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఓ మహిళ అనే విషయాన్ని కూడా పరిగణించకుండా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అనారోగ్య సమస్య ఉందని, కొంత కాలం చికిత్స సైతం తీసుకోవాల్సి ఉందని, ఈ సమయంలో ఈ బెదిరింపులు భయాన్ని కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణ హాని సైతం ఉందని, దయ చేసి తనకు తన భర్త మాధవన్‌కు భద్రత కల్పించాలని కోరారు. అన్నాడీఎంకేలో పేరవైను విలీనం చేయడానికి అంగీకరించని శక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాయని, తనకు భద్రత కల్పించాలని విన్నవించారు. -
త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు
సాక్షి బెంగళూరు: ‘రామ్‌గోపాల్‌వర్మ ఉన్నది ఉన్నట్లుగా సినిమాల్లో చూపించే వ్యక్తి. సినిమాల్లో వాస్తవాలు చూపించడంలో తనకు తానే సాటి. త్వరలోనే కేసీఆర్, జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సినిమాలు సిద్ధం చేస్తాం’ అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు ఆనందంతో ఇంటికి వెళ్లాలి.. కానీ అసంతృప్తిగా కాదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాకేశ్‌రెడ్డి వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. పలమనేరు నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పని చేశారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాల్లో ఉన్నారు. రెండు పడవల ప్రయాణం వద్దని వ్యాపారాల మీద దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. వివరాలు.. చిన్ననాటి నుంచే ఆసక్తి ♦ బాల్యం నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. ఆరంభంలోనే అదిరిపోయే సినిమా నిర్మించాలని భావించాను. ఈ క్రమంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వాస్తవాలను జనాలను చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఫలితంగా పాత పరిచయాల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మతో కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించాం. వాస్తవాలను తెరకెక్కించాలంటే రామ్‌గోపాల్‌వర్మతోనే సాధ్యం. ♦ నిర్మాతలతో చాలా చక్కగా ప్రవర్తించే వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. నిర్మాతల బాధలను అర్థం చేసుకునే వ్యక్తి వర్మ. మా బ్యానర్లో వచ్చే మరో రెండు సినిమాలు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలోనే కొనసాగిస్తాం. తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథలను ఎంచుకున్నాం. ♦ ట్రైలర్ విడుదల సమయంలోనే ఆదరించారు. బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. అదే తరహాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా హైప్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. -
జయలలిత మృతికేసు విచారణకు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ... దానిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే జయలలిత అపోలో ఆస్పత్రిలో పొందిన చికిత్స వివరాలపై ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ అపోలో ఆస్పత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందనీ, అయితే ఆస్పత్రిలో ఉండగా అందించిన చికిత్స సరైనదో కాదో నిర్ధారించే హక్కు ఆర్ముగం కమిషన్‌కు లేదని అపోలో యాజమాన్యం వాదించింది. కమిటీ నేతృత్వంలో వైద్యులు ఆస్పత్రి రికార్డులు పరిశీలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. గతంలో అపోలో ఆస్పత్రి ఇదే విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
పోయెస్ గార్డెన్తో పాటు జయ ఆస్తులు జప్తు
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులను తాము జప్తు చేసినట్లు ఆదాయపు పన్నుశాఖ మద్రాసు హైకోర్టుకు గురువారం తెలిపింది. చెన్నై పోయెస్ గార్డెన్లో జయ నివాసంతోపాటు అన్ని ఆస్తులు తమ స్వాధీనంలో ఉన్నాయని స్పష్టం చేసింది. పర్యవేక్షణకు ప్రయివేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ చెన్నై కేకే నగర్‌కు చెందిన అన్నాడీఎంకే నేత పుహళేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. జయలలితకు రూ.913 కోట్లకు పైగా ఆస్తులున్నాయని, వాటన్నింటినీ ఎవరు నిర్వహించాలి, ఎవరు పర్యవేక్షించాలని జయ ఎలాంటి వీలునామా రాయనందున హైకోర్టు చొరవ తీసుకుని పర్యవేక్షకుడిని నియమించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ కేసు విచారణ ఇవాళ న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, శరవణన్‌ల బెంచ్ ముందుకు వచ్చింది. ఐటీశాఖ అసిస్టెంట్ కమిషనర్ శోభ కోర్టుకు హాజరై, చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయలలిత బంగ్లా, ఆస్తులను ఇప్పటికే జప్తు చేశామని తెలిపారు. అలాగే తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాల్లోని జయ ఆస్తులన్నింటినీ తమ శాఖ ఇప్పటికే జప్తు చేసినందున పర్యవేక్షణ కోసం ప్రయివేటు వ్యక్తిని నియమించాలంటూ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమే లేదని అన్నారు. ఈ కేసుపై తుది విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. -
అమ్మ ఆస్తులు, అప్పులు ఎంత?
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఐటీ వర్గాలను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈనెల 25లోపు సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు ఎంఎం సుందరేషన్, శరవణన్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత ఆస్తుల గురించి ప్రత్యేకగా చెప్పనక్కర్లేదు. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లి రావాల్సిన పరిస్థితి. ఆమెకు రూ. 917 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నా, సమగ్ర వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇక ఆమె మరణించినా, ఆస్తుల వివాదం మాత్రం సమసినట్టు లేదు. ఆమె ఆస్తుల పర్యవేక్షణకు ఎవరో ఒకర్ని నియమించాలని చెన్నైకు చెందిన పుహలేంది దాఖలు చేసిన పిటిషన్ మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. తామే జయలలితకు, ఆస్తులకు వారసులు అంటూ ఆమె అన్న జయరామన్ కుమారుడు దీపక్, దీప సైతం కోర్టు మెట్లు ఎక్కి ఉన్నారు. ఇటీవల పిటిషన్ విచారణకు రాగా, దీపక్ తరఫున ఓ వాదన కోర్టుకు చేరింది. కొడనాడు ఎస్టేట్‌ను చెన్నై ఆర్ఏ పురంలోని ఓ బ్యాంక్‌లో జయలలిత తాకట్టు పెట్టి ఉన్నారని, ఇందుకుగాను రూ. కోటి 60 లక్షలు చెల్లించాల్సి ఉందని వివరించారు. అదేసమయంలో జయలలిత 2016 ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో దాఖలు చేసిన నామినేషన్ పత్రంలోని ఆస్తుల వివరాలు, అప్పులు ఎంత? అన్న ప్రస్తావనను కోర్టు తెర మీదకు తెచ్చింది. ఇంతకీ జయలలిత ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు, అక్రమాస్తుల కేసు విచారణలో తేలిన ఆస్తుల వివరాలు, 2016 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆమె ఆస్తుల వివరాలు, అప్పులు తదితర వివరాలను సమర్పించాలని ఇప్పటికే ఓ మారు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో గురువారం పుహలేంది పిటిషన్ విచారణకు రాగా, దీపక్ తరఫున దాఖలైన మరో పిటిషన్‌ను కోర్టుకు చేరింది. రక్తసంబంధీకుడైన తనను జయలలిత ఆస్తుల పర్యవేక్షణకు నియమించాలని దీపక్ ఆ పిటిషన్ ద్వారా కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ పిటిషన్‌ను, పుహలేంది దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారించేందుకు న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, శరవణన్ బెంచ్ నిర్ణయించింది. ఈ కేసు విచారణ మరింత ముందుకు తీసుకెళ్లాలంటే, జయలలిత ఆస్తులు, అప్పులు ఎంత అన్న లెక్క ముందుగా తేలాల్సి ఉందని బెంచ్ అభిప్రాయ పడింది. దీంతో ఈనెల 25వ తేదీలోపు ఆ వివరాలను సమగ్ర నివేదికగా కోర్టుకు సమర్పించాలని ఐటీ వర్గాలకు ఆదేశిస్తూ, అదే రోజుకు విచారణను న్యాయమూర్తులు వాయిదా వేశారు. -
అఫీషియల్.. అమ్మ పాత్రలో కంగనా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఇప్పటికే నిత్య మీనన్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్రకటించారు. సినిమాగానే కాక వెబ్ సిరీస్‌గానూ అమ్మ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు. తాజాగా మరో బయోపిక్కు సంబంధించి అధికారిక ప్రటకన వెలువడింది. ఎన్టీఆర్ బయోపిక్కు సహ నిర్మాతలుగా వ్యవహరించిన విబ్రీ మీడియా తలైవి పేరుతో జయలలిత బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఈబయోపిక్లో అమ్మ పాత్రలో కంగనా రనౌత్ నటించనుంది. ఈ విషయాన్ని కంగనా రనౌత్ పుట్టిన రోజు సందర్భంగా తమిళ హీరో జీవీ ప్రకాష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు హిందీలోనూ రూపొందిస్తున్నారు. After #gangsofwasseypur this will be my venture back into Hindi .. #GV72 #KanganaRanaut will play the lead role in #Thalaivi, the #Jayalalithaabiopic produced by @vibri_media @vishinduri and directed by #Vijay #Vijayendraprasad #NiravShah @gvprakash #HBDKanganaRanaut — G.V.Prakash Kumar (@gvprakash) 23 March 2019 -
‘అమ్మ’ను హల్వా తినిపించి చంపేశారు
సాక్షి, చెన్నై: జయలలిత మృతి విషయంలో మరోమారు తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హల్వాను తినిపించి మరీ జయలలితను చంపేశారని ఆరోపించారు. జయలలితది ముమ్మాటికి హత్యే అని విచారిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలం, నివేదికలపై న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తీవ్రంగానే విరుచుకుపడ్డారు. అపోలో యాజమాన్యానికి అనుకూలంగా రాధాకృష్ణన్ వ్యవహరిస్తున్నారని, ఎవరినో రక్షించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త ఐఏఎస్‌లు, మంత్రుల మధ్య వ్యాఖ్యల సమరానికి దారి తీసింది. ఈనేపథ్యంలో జయలలిత మరణం విషయంలో సీవీ షణ్ముగం మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో షణ్ముగం ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో స్లో పాయిజన్‌గా తీపి వస్తువుల్ని ఇవ్వడం మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రధానంగా హల్వాను అధిక మోతాదులో ఇచ్చి చంపేశారని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. జయలలితకు మధుమేహం ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని, చివరి క్షణంలో గుండెపోటు వచ్చే విధంగా పరిస్థితి మారే రీతిలో హల్వా తినిపించినట్లు ఆరోపించారు. -
ఒక్క జీవితం.. మూడు సినిమాలు
బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న టైమ్‌లో తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బయోపిక్స్‌లో జయలలిత బయోపిక్ ఒకటి. ఒకటీ, రెండు కాదు మూడు యాక్చువల్లీ. జయ జీవితం ఆధారంగా ముగ్గురు దర్శకులు (ఏఎల్ విజయ్, ప్రియదర్శని, భారతీరాజా) బయోపిక్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జయలలిత జయంతి. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని ఆనవాయితీ ప్రకారం ఆయా సినిమాల టైటిల్స్‌ను, రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కించనున్నారు. జయలలిత పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విద్యా బాలన్, నయనతార.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కథకు స్క్రిప్ట్ సూపర్వైజ్ చేయనున్నారు. విబ్రీ మీడియా విష్ణు నిర్మాత. ‘ఎన్టీఆర్, ‘83’ (1983 వరల్డ్ కప్) బయోపిక్‌లు నిర్మాత ఈయనే. సుమారు తొమ్మిది నెలల పాటు ప్రీ–ప్రొడక్షన్ పనులు చేశాం, కథకు కావల్సిన సమాచారాన్ని సేకరించాం అని ‘తలైవి’ చిత్రబృందం తెలిపింది. దర్శకురాలు ప్రియదర్శని సినిమా విషయానికి వస్తే.. ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌తో జయలలితగా నిత్యా మీనన్ నటిస్తారని ఎప్పుడో అనౌన్స్ చేశారు. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న చిత్ర రిలీజ్‌ను చేస్తున్నాం అని ప్రకటించారు. భారతిరాజా అనౌన్స్ చేసిన సినిమా, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతానికి రాలేదు. ఇన్ని సినిమాలు, సిరీస్‌లు ఒకే వ్యక్తి జీవితంపై తెర మీదకు రావడం విశేషం. -
అపోలో పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో పొందిన చికిత్స వివరాలపై ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఆర్.సుబ్బయ్య, జస్టిస్ కృష్ణన్ రామస్వామిల డివిజన్ బెంచ్ అపోలో పిటిషన్‌ను సోమవారం విచారించింది. జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందనీ, అయితే ఆస్పత్రిలో ఉండగా అందించిన చికిత్స సరైనదో కాదో నిర్ధారించే హక్కు ఆర్ముగం కమిషన్‌కు లేదని అపోలో యాజమాన్యం వాదించింది. కమిటీ నేతృత్వంలో వైద్యులు ఆస్పత్రి రికార్డులు పరిశీలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. -
చిన్నమ్మగా సాయిపల్లవి
సినిమా: అమ్మ(జయలలిత) బయోపిక్ అంటే ఆ చిత్రంలో చిన్నమ్మ (శశికళ) పాత్ర కచ్చితంగా ఉంటుంది. జయ రాజకీయ జీవితంలో ఆమె స్నేహితురాలిగా శశికళను ప్రధాన భూమిక పోషించారు. జయలలిత ఆనందంలోనూ, విషాదంలోనూ చిన్నమ్మ భాగం ఎంతో. జయలలిత అంతిమ దశలోనూ శశికళది చర్చనీయాంశ భూమిక అన్నది తెలిసిందే. ఇదిలాఉండగా ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి కోలీవుడ్‌లో పోటీ పెరిగింది. దర్శకుడు విజయ్, నవ దర్శకురాలు ప్రియదర్శిని ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు. ది ఐరన్ లేడీ పేరుతో ప్రియదర్శిని తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని జయలలిత పుట్టిన రోజు సందర్భంగా పిబ్రవరి 24న ప్రారంభించనున్నారు. ఇందులో అమ్మగా నటి నిత్యామీనన్ నటించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఇప్పటికే తనను తాను తయారు చేసుకునే పనిలో ఉంది. ఇక జయలలిత నెచ్చలి శశికళగా నటి వరలక్ష్మీశరత్కుమార్ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.దర్శకుడు విజయ్ కూడా జయలలిత పుట్టిన రోజునే ఆమె బయోపిక్‌ను ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు.ఇందులో అమ్మ పాత్రలో నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. శశికళ పాత్రలో నటి సాయిపల్లవిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తాజా సామాచారం. సాయిపల్లవిని కోలీవుడ్‌కు దియా చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు ఈయనే. తాజాగా ధనుశ్కు జంటగా నటించిన మారి–2 చిత్రం ఇటీవల విడుదలై సాయిపల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టింది. విజయ్ కోసం సాయిపల్లవి శశికళగా నటించే అవకాశం ఉంటుందని భావించవచ్చు. -
జయ ఆస్తుల తనిఖీ బాధ్యత దీప, దీపక్‌లకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈసీ, న్యాయస్థానంలో దాఖలు చేసిన జాబితా ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను సరిచూసే బాధ్యతను ఆమె అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపలకు మద్రాసు హైకోర్టు మంగళవారం అప్పగించింది. దక్షిణ చెన్నై జిల్లా జయలలిత పేరవై సహాయ కార్యదర్శి పుహళేంది, జానకిరామన్ కోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. జయలలితకు రూ.55 కోట్ల ఆస్తులున్నట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సమయంలో బెంగళూరు కోర్టు తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు సైతం నిర్ధారించింది. అయితే జయ ఆస్తుల ప్రస్తుత విలువ రూ.913.41 కోట్లు. అవన్నీ చట్టవిరుద్ధంగా థర్డ్‌పార్టీ స్వాధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని భద్రం చేయాలి, ఒక పద్ధతిలో వాటిని నిర్వహించాలని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అదే కోర్టులో వారు అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్‌ను న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ఖద్దూస్లతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. జయలలిత రెండోతరం వ్యక్తులైన దీపక్, దీపలను ఈ పిటిషన్‌పై బదులివ్వాల్సిందిగా ఆదేశించింది. ఈకేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్ ముందు జయలలిత దాఖలు చేసిన వివరాలు, ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పులో చూపిన ఆస్తుల వివరాలు సరిచూడాల్సిందిగా దీపక్, దీపలను కోర్టు ఆదేశించింది. కోర్టులో దాఖలు చేసిన ఆస్తుల వివరాల్లో ఏదైనా విస్మరించారా? అనేది గమనించాల్సిందిగా సూచించింది. ఈసీ లేదా కోర్టు దృష్టికి రాని ఆస్తులు ఏవైనా ఉంటే వాటి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి కేసును వాయిదా వేసింది. -
అంతసొమ్ము ఎక్కడిదమ్మా?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభిస్తున్న శశికళను ఆదాయపు పన్నుశాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. అంత సొమ్ము ఎక్కడిదమ్మా అంటూ ఆరాతీశారు. ఐదుగురితో కూడిన చెన్నై ఐటీ బృందం గురువారం ఉదయం బెంగళూరు జైలులో శశికళను విచారించడం ప్రారంభించింది.శుక్రవారం సైతం విచారణకొనసాగనుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత హయాంలో అన్నీ తానై చక్రం తిప్పిన శశికళ తెరవెనుక సీఎంగా పేరు గడించారు. జయ వెన్నంటి ఉంటూ ఆమె బంధు, మిత్రగణానికి ‘సర్వం’ సమకూర్చారు. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు న్యాయస్థానంలో రుజువుకావడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, చెన్నైలో శశికళకు సొంత ఇల్లు, ఆమె భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆనేక కంపెనీలు, అక్క కుమారుడు టీటీవీ దినకరన్, సోదరుని కుమారుడు వివేక్, బంధువులు, బినామీలకు సంబంధించి 187 చోట్ల ఐటీ అధికారులు గత ఏడాది ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు, తనిఖీల్లో 60కిపైగా బినామీ సంస్థలు బయటపడ్డాయి. అంతేగాక 150కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.3వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కనుగొన్నారు. ఈ సొమ్ముకు సంబంధించి శశికళ రక్తసంబంధీకులు, బంధువులు, భాగస్వాములు, స్నేహితులను ఐటీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. అంతేగాక బినామీల సొత్తును జప్తు చేశారు. జప్తుచేసిన ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. అయితే అన్ని ఆస్తులను కూడబెట్టడంలో సూత్రధారి, పాత్ర«ధారి అయిన శశికళను మాత్రం ఇన్నాళ్లూ విచారించలేదు. విచారణకు జైలు అధికారుల అనుమతి శశికళను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ బెంగళూరు జైలు అ«ధికారులకు ఐటీ అధికారులు ఇటీవల ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాన్ని పరిశీలించిన జైలు అధికారులు విచారణకు అనుమతించారు. ఈ అనుమతిని అనుసరించి డిసెంబర్ 13, 14 తేదీలను విచారణకు నిర్ణయించుకుని జైలు అధికారులకు కబురంపారు. ఈ మేరకు చెన్నై ఐటీ కార్యాలయం నుంచి ఐదుగురితో కూడిన అధికారుల బృందం గురువారం ఉదయం 10.30 గంటలకు జైలుకు చేరుకుంది. గత ఏడాది నిర్వహించిన ఐటీ దాడుల్లో బయటపడిన రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అంత సొమ్ము ఎక్కడిది అనే కోణంలో గురు, శుక్రవారాల్లో సుమారు 500 పైగా ప్రశ్నలను సంధించనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తికాగానే శశికళపై మరో కేసు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఒకే ముఖ్య మహిళ
ఇరవై తొమ్మిది రాష్ట్రాలు! పద్నాలుగు మంది ముఖ్య మహిళలు ఉండాలి.ఇది ‘ఆకాశంలో సగం’ కౌంట్.పోనీ...తొమ్మిది మంది ముఖ్య మహిళలు ఉండాలి. ఇది పార్లమెంట్లో ఇంకా నోచుకోని కౌంట్.కానీ ప్రస్తుతం మిగిలింది..ఒకే ఒక్క ముఖ్య మహిళ. ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతి కౌంట్.అవును. మమతాబెనర్జీ ఒక్కరే ఇప్పుడు మనకు మిగిలిన మహిళా ముఖ్యమంత్రి! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఇప్పుడు మమతాబెనర్జీ ఒక్కరే ఏకైక మహిళా సి.ఎం.గా మిగిలారు! దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో మూడు రోజుల క్రితం వరకు ఇద్దరు మహిళా సి.ఎం.లు ఉండేవారు. రాజస్తాన్‌కు వసుంధరారాజే. పశ్చిమబెంగాల్‌కు మమతాబెనర్జీ. ఈ ఎన్నికల్లో రాజే పార్టీ బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో మరోసారి ఆమె సి.ఎం. కాలేకపోయారు. ఇక మిగిలింది మమతాబెనర్జీ. మమత 2011 నుంచి సి.ఎం.గా ఉన్నారు. పశ్చిమబెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలు 2016లో జరిగాయి కనుక మమత 2021 వరకు సి.ఎం.గా ఉంటారు. రెండేళ్లకు ముందు నలుగురు మహిళా సి.ఎం.లు ఉండేవారు. మమత, రాజే, మొహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), ఆనందిబెన్ (గుజరాత్). 2014లో మోదీ ప్రధాని కావడంతో గుజరాత్ సి.ఎం. పోస్టు ఖాళీ అయి, ఆ స్థానంలోకి ముఖ్యమంత్రిగా వచ్చిన ఆనందిబెన్, 2016లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ‘ఈ ఏడాదితో నాకు డెబ్బై ఐదేళ్లు వస్తున్నాయి. ఇక ఈ వయసులో నేను చురుగ్గా పనిచేయలేను కనుక రాజీనామా చేస్తున్నాను’ అని ఆనందిబెన్ బహిరంగంగానే ప్రకటించారు. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 23న ఆనందిబెన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి వరకు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలోకి కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ వస్తున్నారు కాబట్టి ఆయన్ని కట్టడి చెయ్యడానికి మరింత క్రియాశీలంగా ఉండే గవర్నర్‌ను ఆ రాష్ట్రానికి నియమించాలని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అనుకుంటే కనుక ఆనందిబెన్ స్థానంలోకి మరొకరు రావచ్చు.ఆనందిబెన్ తనకు తానుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది జూన్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. మెహబూబా ముఫ్తీ దేశంలో రెండవ ముస్లిం మహిళా సి.ఎం. కాగా, 1980–81 మధ్య అస్సాంలో అధికారంలో ఉన్న సయేదా అన్వరా తైమూర్.. తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. వసుంధరా రాజే, మెహబూబా, ఆనందిబెన్లకు ముందు ఉమాభారతి (మధ్యప్రదేశ్), షీలాదీక్షిత్ (ఢిల్లీ), సుష్మా స్వరాజ్ (ఢిల్లీ), రబ్రీదేవి (బిహార్), రాజేందర్ కౌల్ భత్తల్ (పంజాబ్), మాయావతి (ఉత్తర ప్రదేశ్); వీరికి ముందు జయలలిత (తమిళనాడు), జానకీ రామచంద్రన్ (తమిళనాడు), సయేదా అన్వరా తైమూర్ (అస్సాం), శశికళా కకోద్కర్ (గోవా), నందిని సత్పతి (ఒరిస్సా), సుచేతా కృపలానీ (ఉత్తర ప్రదేశ్) ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మమతా బెనర్జీతో కలుపుకుని మొత్తం 16 మంది మహిళలు స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రులు అయ్యారు. ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇప్పటి వరకు 13 రాష్ట్రాలకు (ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, గోవా, అస్సాం, తమిళనాడు, పంజాబ్, బిహార్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జమ్మూకశ్మీర్) మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రికార్డు ఉండగా.. తక్కిన 16 రాష్ట్రాలకు ఇంకా ఆ ఘనత దక్కవలసి ఉంది. పై పదమూడు రాష్ట్రాలలో మళ్లీ.. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రాష్ట్రాలు ఇద్దరు మహిళా సి.ఎం.లను చూశాయి. ఢిల్లీకి సుష్మా స్వరాజ్, షీలాదీక్షిత్; తమిళనాడుకు జానకీ రామచంద్రన్, జయలలిత, ఉత్తర ప్రదేశ్‌కు సుచేతా కృపలానీ, మాయావతి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్ ఏళ్లు దాటినా రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యం లేదని చెప్పలేం కానీ, తగినంత ప్రాధాన్యం లేదని మాత్రం సంఖ్యలు, శాతాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లో ఇంకా సగం పైగానే ఏనాడూ మహిళా ముఖ్యమంత్రుల పాలనలో లేవు. పార్లమెంట్ సభ్యత్వంలో కూడా మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది 16వ లోక్‌సభ. అది కూడా ముగింపునకు వచ్చేసింది. మొత్తం 543 లోక్‌సభ ఎంపీలలో (ఇద్దరు నామినేటెడ్ సభ్యుల్ని మినహాయిస్తే) 65 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే కేవలం 12 శాతం! రాజ్యసభలో 244 మంది సభ్యులుంటే వారిలో మహిళా ఎంపీలు 24 మందే. అంటే 11.5 శాతం. వచ్చే ఎన్నికల్లో ఈ శాతం పెరగడంతో పాటు, ఇప్పటికింకా మహిళా ముఖ్యమంత్రుల పాలన లోకి రాని రాష్ట్రాలు మహిళను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే అది రికార్డే అవుతుంది. రికార్డు మాట అటుంచి రాజకీయాల్లో మెరుగైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. మహిళా సి.ఎం.లు భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ మొదట స్వాతంత్య్ర సంగ్రామ యోధురాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 14న నెహ్రూ ‘ట్రిస్ట్ విత్ డెస్టీనీ’ ప్రసంగానికి కొన్ని నిముషాల ముందు వందే మాతర గీతాన్ని కృపలానీనే ఆలపించారు. నందిని సత్పతి ఎం.ఎ చదివారు. కాలేజ్‌లో కమ్యూనిస్టు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లి, రాజీవ్ గాంధీ కోరడంతో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మంత్రివర్గ సభ్యురాలిగా ఉన్నారు. శశికళా కకోద్కర్ని ‘తాయి’ అనేవారు. అంటే పెద్దక్క అని. పీజీ చేశాక శశికళ సామాజిక సేవలో ఉండిపోయారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలో ముఖ్య నాయకురాలు. సయేదా అన్వారా తైమూర్ అలిఘర్ ముస్లిం యూనివర్సిటీలో చదివారు. జొర్హత్లోని దేవీచరణ్ బారువా గర్ల్స్ కాలేజీలో ఎకనమిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. జానకి.. ఎం.జి.రామచంద్రన్ భార్య. ఎం.జి.ఆర్. చనిపోయాక పార్టీలోని ఒక వర్గం జానకిని సి.ఎం.గా ఉండమని కోరింది. అయితే 24 రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉండగలిగారు. తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇక జయలలిత.. చనిపోయే నాటికి తమిళనాడు సి.ఎం.గా ఉన్నారు. ముఖ్యమంత్రులుగా పని చేసిన మహిళల్లో మిగతావారైన మాయావతి, రబ్రీదేవి, సుష్మాస్వరాజ్, షీలాదీక్షిత్, ఉమాభారతి, వసుంధరా రాజే, మెహబూబా మఫ్తీ నేటికింకా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తన 74వ వయసులో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న రాజీందర్ కౌర్ భత్తాల్ నాటికీ, నేటికీ పంజాబ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రే. ఆమె తర్వాత ఇంకో మహిళ ఆ స్థానంలోకి రాలేదు. -
ప్రేమలో ఓడిపోయినందుకే అలా..
సినిమా: ప్రేమలో ఓటమి కారణంగానే అలాంటి ఏహ్యభావం కలిగిందని చెప్పింది నటి నిత్యామీనన్. తనకు అనిపించింది చెప్పడానికి మొహమాట పడడం కానీ, భయపడడం కానీ తెలియని నటి ఈ సంచలన నటి. అయితే జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. బహుభాషానటిగా రాణిస్తున్న నిత్యామీనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. అవేంటో చూద్దాం. ప్ర: మాతృభాష(మలయాళం)లో నటనకు చాలా గ్యాప్ వచ్చినట్లుందే? జ:మలయాళ చిత్రాలు కాదనుకుని ఇతర భాషా చిత్రాల్లో నటించడం లేదు. తమిళం, తెలుగు భాషల్లో వచ్చిన అవకాశాలను ఒప్పుకుని చేస్తున్నప్పుడు వాటిని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టే అవకాశం ఉంటుంది. దీంతో మలయాళంలో అవకాశాలను అంగీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. నాకు 6 భాషలు తెలుసు. ఇంకా మరిన్ని భాషలను నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంది. అలా బెంగాలీ భాషను నేర్చుకుంటున్నాను. ప్ర: ఒక తరుణంలో మీకు నటనపై విరక్తి కలిగిందనే ప్రచారం జరిగింది. దీని గురించి? జ:నిజం చెప్పాలంటే నేను ఇష్టపడి ఈ రంగంలోకి రాలేదు. పత్రికారంగంలోకి రావాలని ఆశ పడ్డాను. అలాంటిది ప్లస్‌టూ చదువుతున్న సమయంలో వేసవి సెలవుల్లో ఉన్నప్పుడు దర్శకుడు కేబీ.కుమరన్ ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంలో నటించడానికి పిలిచారు. షూటింగ్ లండన్‌లో అని చెప్పడంతో ఆ మహానగరాన్ని చూడాలన్న ఆసక్తితో నటించడానికి అంగీకరించాను. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో సినిమా కథలు రాసుకుంటున్నాను. అలా రెండు కథలను రెడీ చేశాను. ప్ర:మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మహిళా సంఘంలో మీరు సభ్యులుగా ఉన్నట్లు లేదే? జ:సినీ పరిశ్రమలో మహిళలకంటూ ఒక సంఘం అవసరం లేదని నేను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అయితే అలాంటి సంఘాలు కోరుకునేవారికి అది అవసరం అవుతుంది. అయితే నా రూటు సపరేట్. ఇంతకు ముందు మలయాళ చిత్ర పరిశ్రమలో నాకు ఎదురైన సమస్యలను నేను పరిష్కరించుకున్నాను. అది నా గుణం. అదేవిధంగా కొన్ని చేదు అనుభవాల కారణంగా షూటింగ్‌ల నుంచి బయటకు వచ్చినట్లు జరిగిన ప్రచారంలోనూ నిజం లేదు. కథలు నచ్చి చేస్తున్నప్పుడు షూటింగ్ నుంచి బయటకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది. మీటూ అనేది సినిమాలో మాత్రమే కాదు. అయితే సినీమా వాళ్లు సెలబ్రిటీలు కావడంతో అలాంటి వాటిని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ప్ర:సాధారణంగా మీరు ఏకాంతం కోరుకుంటారట? జ: అలా అనేం లేదు. అందరి మధ్య ఉండడంతో పాటు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. నేను ఆస్తికురాలిని. మనకు పైన ఒక శక్తి ఉంటుందని నమ్ముతాను. సంగీతం అంటే ఇష్టం. సంగీతంలో శిక్షణ పొందాను కూడా. అయినా సినిమాల్లో పాడే అదృష్టం కలగలేదు. ప్ర:మీ గురించి ప్రచారం అయ్యే వదంతుల గురించి? జ: వదంతుల గురించి నేను పట్టించుకోవడం లేదు. ఇతరులకు వేదన కలిగించేవారు అందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. తొలి ప్రేమలో నేను విసిగి పోయాను. అలా ప్రేమలో ఓడిపోయాను. అందుకే కొంతకాలం మగవాళ్లను అసహ్యించుకున్నాను. ఆ తరువాత ప్రేమ జోలికే పోలేదు. ఒక తెలుగు నటుడి కుటుంబ జీవితంలో చిచ్చుకు నేనే కారణం అని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆ నటుడు నేను కలిసి నటించిన చిత్రం విడుదల కావడంతోనే అలాంటి వదంతులు ప్రచారం అయ్యాయి. అప్పుడు నేను చాలా బాధకు గురయ్యాను. నన్ను బాధకు గురి చేసిన వారు సంతోషించి ఉండవచ్చు. అయితే అప్పుడు నాపై వచ్చిన ప్రేమ వదంతులు నిజం కాదని ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఆ నటుడు వివాహ రద్దు పొంది చాలా కాలమైంది. అప్పటి వదంతుల్లో నిజం ఉంటే ఇప్పుడు ఆ నటుడు నేను పెళ్లి చేసుకునేవారం కదా! నా లోకం నాకు మాత్రమే సొంతం. పెళ్లి కోసం ఎవరినో ఒకరిని జీవిత భాగస్వామిని చేసుకోను. నాకు సరైన వాడు తారస పడినప్పుడు పెళ్లి చేసుకుంటాను. -
సావిత్రి పాత్రలో నేను ప్రతిబింబించేలా..!
జయలలితగా నటించడం సవాలే అంటోంది నటి నిత్యామీనన్. దక్షిణాదిలో సంచలన నటీమణుల్లో ఈ అమ్మడు ఒకరని చెప్పకతప్పదు. పాత్ర నచ్చితే అందులో జీవించడానికి ఎంతదాకైనా వెళ్లడానికి వెనుకాడని నటి నిత్యామీనన్. అదే నచ్చకపోతే అది ఎలాంటి చిత్రమైనానిర్మొహమాటంగా నిరాకరించేస్తుంది. అందుకు మణిరత్నం అవకాశాన్నే కాదనడం ఒక ఉదాహరణ. అలాంటి ఈ కేరళా భామ త్వరలో దివంగత ముఖ్యమంత్రి జయలలితగా మారడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిత్యామీనన్‌తో చిన్న చిట్‌చాట్.. ప్ర: మలయాళ చిత్రాలకే అధిక ప్రాముఖ్యత నిస్తున్నారనే ప్రచారం గురించి మీ స్పందన? జ: అలాంటిదేమీ లేదు. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చితే అది ఏ భాషా చిత్రమైనా చేయడానికి రెడీ. నాకు కథ, కథా పాత్రలే ముఖ్యం. చాలా అవకాశాలు వస్తున్నా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరిస్తున్నాను. ప్ర: ఎన్టీఆర్ చిత్రంలో సావిత్రిగా నటించడానికి శిక్షణ తీసుకున్నారా? జ:ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నప్పటికే చిత్ర షూటింగ్ చాలా వరకూ పూర్తి అయ్యింది. అందుకని శిక్షణ తీసుకునేంత సమయం లభించలేదు. సాధారణంగా అలాంటి పాత్రల్లో నటించేటప్పుడు శిక్షణ అవసరం అని భావిస్తాను. అయితే ఎన్టీఆర్ చిత్రంలో నటించడానికి అలాంటి సందర్భం కుదరలేదు. అయినా అందులో సావిత్రి పాత్ర బాగా వచ్చింది. ఏ చిత్రంలోనైనా పాత్రగా మారాలని నేను భావిస్తాను. సావిత్రి పాత్రలో నేను ప్రతిబింబించేలానే ఉంటుంది. ప్ర: జయలలిత పాత్రలో నటించనుండడం గురించి? జ: జయలలిత వంటి గొప్ప నాయకురాలిగా నటించేటప్పుడు చాలా శ్రద్ధ, బాధ్యత అవసరం. సాధారణంగా నటించడం కుదరదు. ఆ బాధ్యత దర్శకులకే కాదు, నటీనటులకు ఉండాలి. జయలలిత బయోపిక్ గురించి దర్శకురాలు ప్రియదర్శిని చెప్పినప్పుడు ఆమెలోని అంకిత భావం అర్థమైంది. అందుకే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అయితే నాకిది సవాల్‌తో కూడిన కార్యమే. ఆ పాత్రలో నటించడానికి నేను మానసికంగా, శారీరకంగానూ మారాల్సి ఉంది. జయలలిత పూర్తి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్ర: ఇతర చిత్రాల వివరాలు? జ: కొత్తగా రెండు మలయాళ చిత్రాలు అంగీకరించాను. వాటితో పాటు హిందీలో అక్షయ్‌కుమార్‌తో కలిసి మిషన్ మంగళ్ చిత్రంలో నటిస్తున్నాను. ప్ర:హిందీలో నటించడం సవాల్‌గా భావిస్తున్నారా? జ: ఇందులో సవాల్ ఏముంటుంది. భాష కొత్త, పరిస్థితులు వేరుగా ఉంటాయి అంతే. మిషన్ మంగళ్ చిత్ర కథను ఒక అభిమానిగా విని ఆశ్చర్యపోయాను. చంద్రమండలంలోకి భారతీయ ఇస్రో శాస్తవేత్తలు పంపిన మంగళ్ అనే రాకెట్ కథ ఇది. అలాంటి చిత్రంలో నేనూ ఒక భాగం అవుతున్నందుకు గర్వంగా ఉంది. -
‘అమ్మ’కు అవమానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం సాక్షిగా అమ్మకు అవమానం జరిగింది. అట్టహాసంగా చేయాల్సిన జయలలిత విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి అమ్మను అవమానాలపాలు చేశారని పార్టీ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా దుమ్మెత్తి పోశారు. అన్నాడీఎంకేను స్థాపించింది ఎంజీ రామచంద్రన్. ఎంజీఆర్ మరణం తరువాత పార్టీ పగ్గాలను జయలలిత చేపట్టారు. అయితే ఎంజీఆర్ కంటే జయలలిత అంటేనే పార్టీ శ్రేణులు హడలిపోయేవారు. కూర్చుంటే ఏమో, నిలబడితో ఏమో అన్నట్లుగా భయపడుతూ వినయ విధేయతలు ప్రదర్శించేవారు. జయ కన్నుమూసిన తరువాత శశికళ పట్ల అదే స్థాయిలో పాదనమస్కారాలు, క్రమశిక్షణ పాటించేవారు. అమ్మ మరణంపాలైంది, చిన్నమ్మ జైలు పాలైంది. దీంతో అన్నాడీఎంకేలో అందరికీ ఆకాశమంత స్వేచ్ఛ లభించింది. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఒకప్పుడు ఎంజీ రామచంద్రన్ విగ్రహం మాత్రమే ఉండేది. జయ మరణంతో ఆమె విగ్రహాన్ని కూడా పెట్టాలని భావించారు. ఈ ఏడాది ఫిబ్రవరి24వ తేదీన జయ 70వ జన్మదినం సందర్భంగా పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి ఆమె విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహంలో జయ ముఖకవళికలు ఏమాత్రం గోచరించక పోవడంతో తీవ్ర విమర్శల పాలైంది. విమర్శలు వెల్లువెత్తడంతో సదరు విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహం పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో కొత్త విగ్రహానికి ఆర్డర్ ఇచ్చారు. జయ రూపురేఖలతో చూడముచ్చటగా తయారైన ఈ విగ్రహాన్ని గతనెల 23వ తేదీన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేర్చారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఎంజీఆర్ విగ్రహం పక్కన అమర్చి ప్రారంభోత్సవ తేదీ కోసం అందరూ ఎదురుచూశారు. ఎట్టకేలకూ బుధవారం అమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. మీడియా వారందరికీ ఆహ్వానాలు కూడా పంపారు. బుధవారం ఉదయం అందరూ అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకోగా పరిసరాల్లో ఎక్కడా బ్యానర్లు, ఫ్లెక్సీల హడావుడి కనిపించలేదు. పార్టీ వారికి కనీస సమాచారం లేదని తెలిసింది. అంతేగాక విగ్రహంలోని జయలలిత ముఖంపై ఓ చిన్నపాటి తెల్లటి తుండుగుడ్డ (టవల్) ఆరేసినట్లుగా కప్పి ఉండడంతో విస్తుపోయారు. కొద్దిసేపటికి ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అక్కడికి చేరుకుని జయ విగ్రహం కిందివైపు అమర్చిన అమ్మ ఫొటోపై పూలుజల్లి అంజలిఘటించి వెళ్లిపోయారు. ఆ తరువాత ఎవరో వచ్చి అమ్మ ముఖంపై కప్పి ఉంచిన తుండుగుడ్డను తొలగించారు. జయలలిత విగ్రహావిష్కరణ ఇలాగేనా చేసేది గుసగుసలాడుకున్నారు. జయ జీవించి ఉండగా వణికిపోయే పార్టీ శ్రేణుల్లో ఎంతటి నిర్లక్ష్యం తాండవిస్తోందని ముక్కున వేలేసుకున్నారు. అయితే అప్పటికే విగ్రహంపై తుండుగుడ్డ ఫొటో వాట్సాప్‌లో వైరలైంది. తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. దీంతో మంత్రి జయకుమార్ హడావుడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొదటి విగ్రహాన్ని ఎంతో సంప్రదాయబద్ధంగా ఆవిష్కరించామని, అయితే ఆ విగ్రహంపై విమర్శలు రావడంతో దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించామన్నారు. అందుకే విగ్రహావిష్కరణను భారీ ఎత్తున నిర్వహించలేదని ఆయన సమర్థించుకున్నారు. -
నేనే దగ్గరుండి వారి పెళ్లి చేస్తా..
చెన్నై, పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు రాజకీయ ప్రేరేపిత శక్తి. తాను రాజకీయాల్లోకి రావడం ఖయం అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. స్త్రీశక్తి పేరుతో సేవాసంఘాన్ని నెలకొల్పిన ఈ భామ క్యాస్టింగ్ కౌచ్ వంటి వివాదాస్పద అంశాలపైనా ధైర్యంగా స్పందించిందన్నది గమనార్హం. కాగా ఈ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. కథానాయకి, ప్రతినాయకి అని తారతమ్యం చూపకుండా అ అమ్మడు నచ్చిన కథా పాత్రలను ఎడా పెడా చేసేస్తోంది. కాగా వరలక్ష్మీపై వదంతులు చాలానే దొర్లుతున్నాయి. అందులో నటుడు విశాల్‌తో ప్రేమ, త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్నది ఒకటి. అలాంటిది ఈ సంచలన నటి విశాల్ హీరోగా నటించి, నిర్మించిన సండైకోళి–2లో విలనిజాన్ని ప్రదర్శించింది. తాజాగా విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్రంలో రాజకీయ నాయకురాలిగానూ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించింది. కీర్తీసురేశ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకుడు. సర్కార్ చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఛానల్‌కు భేటీ ఇచ్చిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. ప్ర: విశాల్‌తో పెళ్లా? జ: నటుడు విశాల్ తనకు అత్యంత సన్నిహితుడు. ఏ విషయాన్నైనా మేమిద్దరం షేర్ చేసుకుంటాం. అయితే మేమిద్దరం ప్రేమించుకోవడం లేదు. విశాల్‌కు ఏ అమ్మాయితోనైనా పెళ్లి కుదిరితే నేనే దగ్గరుండి వారి పెళ్లి జరిపిస్తాను. విశాల్ పెళ్లి చేసుకుంటే సంతోష పడేవారిలో నేను ముందుంటాను. అలాంటిది ఏ కారణంతో విశాల్‌తో నన్ను కలిపి ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు. ఇకపోతే చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేస్తారా? అని అడుగుతున్నారు. వారందరికీ చెప్పేదొకటే కచ్చితంగా నేను రాజకీయాల్లోకి వస్తా. అయితే అందుకు మరో ఐదేళ్లు పడుతుంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ నాయకత్వ శూన్యత నెలకొన్న మాట నిజమే. దాన్ని పూర్తి చేయడానికే నటుడు రజనీకాంత్, కమలహాసన్ వంటి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు వారిని ఆదరిస్తారా? అన్నది వేచి చూడాలి. జయలలిత ఉత్తమ పరిపాలనాధక్షురాలు. ఆమెను మూడు సార్లు కలిసే అవకాశం నాకు లభించింది. రాజకీయపరంగా జయలలితనే నాకు ప్రేరణ. గొప్ప పాలకురాలే కాదు, మంచి విద్యావేత్త కూడా. ఒంటరి స్త్రీగా రాష్ట్రాన్ని పరిపాలించారు. నాన్న పార్టీలో చేరను మరో ఐదేళ్లలో నా రాజకీయ రంగప్రవేశం ఉంటుంది. నా తండ్రి శరత్‌కుమార్ తన పార్టీలో చేరమని ఎప్పుడో ఆహ్వానించారు. నేనే నిరాకరించాను. ఆయన పార్టీ ద్వారా నేను రాజకీయాల్లోకి పరిచయం కాను. ఏ పార్టీలో చేరేది తరువాత వెల్లడిస్తాను. కాగా ఇంతకు ముందు రాష్ట్రంలో రాజకీయ నాయకత్వ శూన్యం ఏర్పడిందనే వ్యాఖ్యలు చేసిన నటుడు రజనీకాంత్‌పై అన్నాడీఎంకే నేతలు మాటల దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి. -
అమ్మ అవుతారా?
హెడ్డింగ్ చదవగానే ఏదేదో ఊహించుకునేరు. నయనతార తల్లి కాబోతున్నారేమో అన్నది మీ ఊహ అయితే తప్పులో కాలేసినట్లే. ఆన్‌స్క్రీన్ ‘అమ్మ’గా కనిపించబోతున్నారని చెబుతున్నాం. ఆల్రెడీ తల్లి పాత్ర చేశారు కదా.. ఇప్పుడు కొత్తేంటి అనుకుంటున్నారా? ఆ పాత్ర వేరు. ఈ ‘అమ్మ’ పాత్ర వేరు. తమిళనాట ప్రజలందరికీ ‘అమ్మ’ అయిన నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించబోతున్నారు నయన్. ప్రస్తుతం ఈ వార్త చెన్నైలో జోరుగా షికారు చేస్తోంది. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా మూడు బయోపిక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే నయన్ ఈ మూడు ప్రాజెక్ట్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్‌లో కాకుండా కొత్త చిత్రంలో ఈ పాత్ర పోషించనున్నారట. ‘పందెం కోడి’ ఫేమ్ లింగుస్వామి జయలలిత జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో నయనతారను టైటిల్ రోల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే... జయలలిత అంటే నయనతారకు చాలా అభిమానం. ఓ సందర్భంలో జయలలిత గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు – ‘‘జయలలితగారి పాత్రకు నేను సూట్ అవుతానో లేదో తెలియదు కానీ అవకాశం వస్తే మాత్రం చేయాలని ఉంది’’ అని నయనతార పేర్కొన్నారు. -
అమ్మ అంత్యక్రియల ఖర్చు రూ.కోటి
సాక్షి, చెన్నై : దివంగత సీఎం అమ్మ జయలలితకు జరిగిన అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఖర్చు పెట్టింది. అపోలోలో వైద్య పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని చెల్లించనట్టు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు వెలుగులోకి వచ్చింది. అమ్మ జయలలిత 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది, చివరకు అనంత లోకాలకు వెళ్లారు. ఆమె మరణం అన్నాడీఎంకేకు తీరని లోటు. అన్నాడీఎంకే ముక్కలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అమ్మ మరణం మీద అనుమానాలు సైతం బయలు దేరడంతో అందుకు తగ్గ విచారణ సాగుతూవస్తోంది. ఈ పరిస్థితుల్లో మదురై కేకే నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సయ్యద్ సమీమ్ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా సీఎం ప్రత్యేక సెల్‌ను ఆశ్రయించారు. అమ్మ జయలలిత ఎప్పుడు మరణించారు? ఆమెకు అందించిన వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించింది? ఆమె అంత్యక్రియలకు ఏమేరకు ఖర్చు పెట్టారు?, జయలలిత ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కాబట్టి, మాజీలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఆమె తరఫున ఎవరు తీసుకుంటున్నారు? ఇలా పలు రకాల ప్రశ్నల్ని సంధించి, సమాధానం రాబట్టారు. ఈ వివరాలను ఆయన ఆదివారం బయట పెట్టారు. ఆ మేరకు ఆమ్మ మరణించిన తేదీని 5.12.2016గా పేర్కొన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని చెల్లించలేదని వివరించారు. అంత్యక్రియల నిమిత్తం ప్రజా పనుల శాఖ తరఫున రూ.99 లక్షల 33 వేల 586 ఖర్చు పెట్టినట్టు పేర్కొన్నారు. పెన్షన్ వ్యవహారం అసెంబ్లీ కార్యదర్శి పరిధిలో ఉందని, ఈ దృష్ట్యా, ఇందుకు తగ్గ సమాధానం అసెంబ్లీ కార్యదర్శిని అడగాల్సిందేనని దాటవేశారు. -
ఆశపడ్డా కానీ...
సినిమా: ఆశ పడ్డాను కానీ..అంటోంది చెన్నై చిన్నది త్రిష. జీవితంలో అప్ అండ్ డౌన్ అన్నది ప్రతి వ్యక్తికి సహజంగా జరిగేదే. అదేవిధంగా ఆశ పడినవన్నీ దరిచేరవు కూడా. ఇందుకు నటి త్రిష అతీతం కాదు. అయితే జరిగేవన్నీ మన మంచికేనని జీవితాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తిత్వం కలిగిన ఈ ముద్దుగుమ్మ తను ఆ మధ్య పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన తన ప్రేమ వ్యవహారం గురించి లైట్‌గా తీసుకుని నటిగా కొనసాగుతోంది. ఇక ఈ మధ్య సరైన సక్సెస్‌లు కూడా లేకపోవడంతో మార్కెట్ కూడా కాస్త డల్ అయ్యింది. అలాంటి సమయంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల ఆశ నెరవేరే అవకాశం పేట చిత్రంతో వచ్చింది. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేక పోతున్నాయి. మరో విషయం ఏమిటంటే విజయ్‌సేతుపతితో ఈ అమ్మడు నటించిన 96 చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో త్రిష చాలా ఉత్సాహంగా ఉంది. ఎంతగా అంటే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశానని నమ్మకంతో చెప్పేంతగా. ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో తన భావాలను పంచుకుంటూ రజనీకాంత్, విజయ్‌సేతుపతిలతో నటించాలన్న కోరిక నెరవేరిందని చెప్పింది.అంతే కాదు మరో రౌండ్‌కు నేనూ రెడీ అయ్యాను అంది. రజనీకాంత్‌తో నటిస్తున్న పేట చిత్రం కోసం తన బరువు, జుత్తు పొడవు తగ్గించుకున్నానని చెప్పింది. ఒక రజనీకాంత్ గురించి చెప్పాలంటే సూపర్‌స్టార్ అన్న ఎలాంటి అహం లేకుండా చాలా నిరాడంబరంగా, అత్యంత సహజంగా నడుచుకుంటారని తెలిపింది. మీతో నటించడం నా డ్రీమ్ అని చెప్పగా ఆయన చిన్న దరహాసం చేశారని చెప్పింది. ఇకపోతే చాలా మంది అడుగుతున్న ప్రశ్న పెళ్లెప్పుడు అని, అయితే ప్రస్తుతానికి పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. అదే విధంగా ఎవరినీ ప్రేమించడం లేదని అంది. బాయ్‌ఫ్రెండ్ కూడా లేడని చెప్పింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఆశ పడ్డానని, అయితే ఆ అవకాశం వేరెవరికో దక్కిందని చెబుతున్నారని అంది. అందువల్ల తనకెలాంటి బాధ లేదని త్రిష పేర్కొంది. -
నటినవ్వాలని అనుకోలేదు!
సినిమా: ఆ నటుడెంత మంచి వాడో అని ప్రశంసల వర్షం కురిపిస్తోంది నటి నిత్యామీనన్. మాతృభాష మలయాళం నుంచి, తమిళం, తెలుగు అంటే పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా నటించడానికి రెడీ అనే నటి నిత్యామీనన్. అందుకే దక్షిణాదిలో ఈ బ్యూటీకి నటిగా మంచి పేరు ఉంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఈ మధ్య విజయ్‌కు జంటగా మెర్శల్ చిత్రంలో నటించి ఇతర హీరోయిన్లు, సమంత, కాజల్‌అగర్వాల్ కంటే మంచి పేరు కొట్టేసింది. తాజాగా నయనతార, త్రిష వంటి ప్రముఖ నటీమణులను దాటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించింది. ఈ సందర్భంగా ఈ బ్యూటీతో చిన్న చిట్‌చాట్.. ప్ర: నిత్యామీనన్ మీది ఎలాంటి క్యారెక్టర్? జ: చాలా సహజంగా ఉంటాను. ఆహారం, నిద్రించే స్థలం లాంటి వాటి విషయంలో చాలా సర్దుకుపోయే స్వభావం నాది. అదే విధంగా నేను చాలా సెన్సిటివ్ కూడా. ప్ర: చిత్రాల ఎంపికలో ఎలా? జ: ముందు చిత్ర కథ నన్ను ఆకట్టుకోవాలి. అలాంటి కథా చిత్రాల్లోనే నటించడానికి అంగీకరిస్తాను. ఈ విషయంలో నా నిర్ణయాన్ని ఇప్పటి వరకూ మార్చుకోలేదు. చాలా చిత్రాల కంటే మంచి కథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటాను. అలా మంచి కథా పాత్రలు లభించడం కూడా యథేచ్ఛగానే జరుగుతోంది. ప్ర: మీ దృష్టిలో కోలీవుడ్ హీరోలు? జ: నటుడు విజయ్ చాలా ప్రశాంతంగా ఉంటారు. షూటింగ్ స్పాట్లో ఆయన ఉన్నట్టే తెలియనంతగా వ్యవహరిస్తారు. చాలా మితభాషి. ఇక విక్రమ్‌లా పాత్రగా మారిపోవడానికి శ్రమించే నటుడిని మరొకరిని చూడలేదు. అంతగా శ్రద్ధ చూపుతారు. ఆయన మాదిరి నటించాలని ఆశ పడుతున్నాను. నటుడు దుల్కర్సల్మాన్ నేను మంచి స్నేహితులం. ఇకపోతే నేను చూసిన వారిలోనే ఎంతో మంచి వ్యక్తి సూర్య.ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు చాలా పాజిటివ్ అనిపించింది. ప్ర: మీకు అత్యంత సన్నిహితురాలు ఎవరూ? జ: నటి రోహిణి. నేను చెన్నై వస్తే ఆమె ఇంట్లోనే బస చేస్తాను. భోజనం కూడా అక్కడే.అంత సన్నిహితురాలు రోహిణి. ప్ర: గోల్ అంటూ ఏమైనా ఉందా. జ: నిజం చెప్పాలంటే నేను మొదట్లో జర్నలిస్ట్‌ను కావాలని ఆశ పడ్డాను. అందుకే జర్నలిజం చదివాను. అలా పత్రికా విలేకరిగా కొత్త కొత్త విషయాలను చేయాలనుకున్నాను. ఆ తరువాత ఛాయాగ్రాహకురాలిని అవ్వాలని అనుకున్నాను. అసలు నటినవ్వాలని కోరుకోలేదు. ఇప్పుడు దర్శకత్వం చేపట్టాలన్న ఆశ ఉంది. వాస్తవ సంఘటనలో చిత్రాలు చేయాలనుకుంటున్నాను. -
అమ్మ మిస్టరీ.. బాంబు పేల్చిన పన్నీర్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణ మిస్టరీ అటు ఇటూ తిరిగి చివరకు అపోలోకు చుట్టుకుంది. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో అమ్మ గడిపిన 74 రోజుల సీసీటీవీ పుటేజీ దృశ్యాలపై విచారణ కమిషన్ పట్టుబట్టడం, అవి చెరిగిపోయాయని, అసలు రికార్డేకాకుండా ఒక అధికారి స్విచ్ఆఫ్ చేయమన్నాడని భిన్నమైన వాంగ్మూలాలు చోటుచేసుకోవడంతో అపోలో ఆసుపత్రిని సందర్శించేందుకు కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి సిద్ధమవుతున్నారు. జ్వరం, డీహైడ్రేషన్...కేవలం ఈ రెండు వ్యాధులతో బాధపడుతూ అపోలోలో చేరారని 2016 సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. జయ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు, త్వరలో ఆరోగ్యం కుదుటపడుతుంది, డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. అయితే బులెటిన్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా అదే ఏడాది డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. దీంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. ప్రతిపక్షాలు సైతం సీబీఐ విచారణకు పట్టుబట్టాయి. అప్పట్లో అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన పన్నీర్‌సెల్వం సైతం విచారణకు పట్టుబట్టారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ఎదుట సుమారు వందమందికి పైగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ దశలో అపోలో ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల పుటేజీ కావాలని కమిషన్ ఇటీవల కోరినపుడు అవి చెరిగిపోయాయని బదులువచ్చింది. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో టీటీవీదినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ జయ చికిత్స పొందుతున్న దృశ్యాలను బైటపెట్టాడు. అవి మార్ఫింగ్ దృశ్యాలను కొందరు కొట్టిపారేసినా స్వయంగా శశికళ చిత్రీకరించారని నమ్మబలికారు. పుటేజీలపైనే పట్టుబట్టి ఉన్న కమిషన్ అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్, వైద్యులు పద్మావతి, భువనేశ్వరి, అరుళ్సెల్వన్, మాజీ ఎంపీ మనోజ్‌పాండియన్, శశికళ తరఫు న్యాయవాది సెంధూరపాండి వేర్వేరుగా మంగళవారం పిలిపించి విచారించింది. ఈ సందర్భంగా అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, చికిత్సలో భాగంగా వార్డు నుంచి జయను బైటకు తీసుకొచ్చినపుడు సీసీ టీవీ కెమెరాల స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ఒక అధికారి ఆదేశించినట్లు విచారణ కమిషన్ ముందు అపోలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్ ఇచ్చిన వాంగ్మూలం కలకలానికి కారణమైంది. జయ చికిత్సకు సంబంధించిన బులెటిన్లు వేరేవారు సిద్ధం చేయగా, తాను సంతకం మాత్రమే చేశాను అని సీఓఓ చెప్పారు. అయితే ఆ బులెటిన్ తయారు చేసినవారు ఎవరని కమిషన్ ప్రశ్నించగా ఆయన వారంరోజుల గడువు కోరడంతో కమిషన్ మంజూరు చేసింది. జయ చేరిన 2016 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విడుదలైన బులెటిన్లలో పొంతనలేదు, వాటిని కూడా వివరించాలని కమిషన్ ఆదేశించింది. సీసీటీవీ కెమెరాలు స్వీచ్‌ఆఫ్ చేయాలని ఒక అధికారి ఆదేశించినట్లుగా అపోలో సెక్యూరిటీ అధికారి తనతో అన్నాడని సుబ్బయ్య చెప్పడంతో సదరు అధికారి ఎవరని కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సైతం తెలియదనే సమాధానమే వచ్చింది. సెక్యూరిటీ అధికారి ఇళంగోవన్ మృతిచెందడం వల్ల స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిన అధికారిని గుర్తించేందుకు ఎవరిని అడగాలో తెలియడం లేదని కూడా ఆయన అన్నాడని కమిషన్ వర్గాలు చెప్పాయి. ఈ జవాబుకు ఆగ్రహించిన కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ‘చనిపోయిన వారిని అడ్డుపెట్టుకుని వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా’ అని గద్ధించగా ఆయన మౌనం పాటించినట్లు తెలిసింది. 2016 సెప్టెంబర్ 22న పోయెస్‌గార్డెన్‌లో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు పుటేజీలను సేకరించాలని, అపోలో ఆసుపత్రిలో అదే నెల 23,24 తేదీల పుటేజీని పరిశీలించాలని, పోయెస్‌గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రి వరకున్న 17 సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ మంగళవారం కమిషన్ ముందు హాజరై ఆర్ముగస్వామిని కోరాడు. కమిషన్ సైతం ఆయా పుటేజీలను సేకరించాలని నిర్ణయించుకుంది. పోయెÜగార్డెన్, అపోలో ఆసుపత్రిని సైతం పరిశీలించాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. మరోబాంబు పేల్చిన పన్నీర్: సీసీటీవీ పుటేజీల వివాదం ఇలా ఉండగా, డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మరిన్ని అనుమానాలు రేకెత్తించే వ్యాఖ్యలతో బాంబుపేల్చారు. చెన్నై తమిళనాడు రాష్ట్రం తేనీలో మంగళవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అపోలో ఆసుపత్రిలో జయను చూసేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎంత ప్రయత్నించినా చూడలేక పోయాను. అమ్మ చికిత్స పొందిన 74 రోజులూ ఆసుపత్రి కిందకే పరిమితమైనా. రోజులు గడుస్తున్నా జయ ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో మెరుగైన చికిత్సకు అమెరికాకు పంపాలని నిర్ణయించుకున్నా. అమ్మకు ఏమైనా జరిగితే ప్రజల తమను రోడ్లపైకి రానీయరని భయపడ్డా. ఇదే విషయాన్ని తాను ప్రస్తావించి బతిమాలా. ‘మాపై నమ్మకం లేదా’ని అపోలో యాజమాన్యం నన్ను ఎదురుప్రశ్నించి నిరాకరించిందని అన్నారు. -
‘ది ఐరన్ లేడీ’పై స్పందించిన కమల్ హాసన్
సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, దిగ్గజ నాయకురాలు జయలలిత బమోపిక్‌పై కమల్ హాసన్ స్పందించారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన శక్తిమంతమైన మహిళ జయలలిత అని కొనియాడారు. ఈ సినిమా అన్నాడీఎంకే పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొస్తుందనీ, ‘అమ్మ’ నిజమైన ఐరన్‌లేడీ అని నిరూపిస్తుందని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు మారాలని మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేటి ఆధునిక సమాజం కులం, మతం గురించి మాట్లాడేందుకు అనుమతించదని వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో కుల, మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశద్రోహమే అవుతుందని హెచ్చరించారు. కాగా, ‘జయలలిత బయోపిక్‌కి ‘ది ఐరన్ లేడి’ అనే పేరును ఖరారు చేశారు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఏఆర్ మురుగదాస్ లాంచ్ చేశారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. జయ పుట్టిన రోజున (ఫిబ్రవరి 24) షూటింగ్ ప్రారంభం కానుంది. -
జయలలిత చికిత్స వీడియో దృశ్యాలు లేవు!!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ వీడేనా? పలువురిలో చోటుచేసుకున్న అనుమానపు మేఘాలు విచారణ కమిషన్ నివేదికతో తొలగిపోయేనా?.. అన్న ప్రశ్నలకు సమా«ధానం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. జయ విచారణలో కీలకమైన జయకు చికిత్స వీడియో దృశ్యాలు చెరిగిపోయినట్లు అపోలో ఆస్పత్రి చెప్పడంతో కమిషన్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: దేవుళ్లలా కొలుచుకునే రాజకీయ నేతలకు అస్వస్థత చేకూరినపుడు ప్రజలు తల్లడిల్లిపోవడం సహజమే. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎంజీ రామచంద్రన్ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో, ఆ తరువాత అమెరికాలో ఆయన చికిత్స పొందారు. ప్రజల కోరిక మేరకు ఆస్పత్రిలో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అమెరికాలో చికిత్స పొందుతూనే ఎంజీఆర్ మరణించినా ప్రజలు ఎలాంటి అనుమానాలు వ్యక్తంచేయలేదు. అయితే అదే తీరులో జయలలిత సైతం ముఖ్యమంత్రి హోదాలోనే 2016 సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అనారోగ్యమే, రెండు మూడు రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అవుతారని వైద్యులు, ప్రభుత్వం ప్రకటించడంతో అమ్మ అభిమానులు ఊరట చెందారు. అయితే వైద్యులు చెప్పినట్లుగా అమ్మ విడుదల కాలేదు. జయ చికిత్స పొందుతున్న వీడియో లేదా ఫొటోలు విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు అనేకసార్లు కోరారు. ఆరోగ్యం కుదుటపడిందనే రోజుల తరబడి ప్రచారాలు సాగుతుండగానే అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన జయ కన్నుమూయడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకేలోని వారేగాక ప్రతిపక్షాలు సైతం అనేక అనుమానాలు వ్యక్తంచేశాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయి. పలుచోట్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామి చైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు విచారణ కమిషన్‌ను నియమించింది. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన సుమారు వందమందికి పైగా కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జయకు చికిత్స చేసిన అపోలో, ఢిల్లీ నిమ్స్ వైద్యులను సైతం కమిషన్ విచారించింది. ఈ దశలో అపోలో ఆస్పత్రిలో జయకు చికిత్స చేసిన వీడియో దృశ్యాలను కమిషన్ అనేకసార్లు కోరింది. అయితే వీవీఐపీలు చికిత్స పొందుతున్న గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో బదులిచ్చింది. అయితే అపోలో మాటలకు భిన్నంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో స్వతంత్య్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ అనుచరుడు వెట్రివేల్ జయ చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను విడుదల చేసి కలకలం రేపాడు. అవన్నీ గ్రాఫిక్ దృశ్యాలని కొందరు ఆక్షేపించినా శశికళే స్వయంగా చిత్రీకరించారని చెప్పడంతో అందరూ నమ్మారు. దీంతో అపోలో మరో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చెరిగిపోయాయని వివరణ అపోలో ఆస్పత్రి న్యాయవాది మైనాబాష మాట్లాడుతూ, వీడియో దృశ్యాలపై కమిషన్‌కు వివరణ ఇచ్చామని తెలిపారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు అమరుస్తామని, వీటిల్లోని దృశ్యాలు సైతం వీవీఐపీలు ఉండేచోట కెమెరాలు ఉండవని తెలిపామని అన్నారు. ఈ కెమెరాల ద్వారా నమోదైన దృశ్యాలు నెలరోజులకు మించి ఉండవని, మరో దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, ఇలానే జయ చికిత్స దృశ్యాలు సైతం చెరిగిపోయాయని పేర్కొంటూ ఈనెల 11వ తేదీన కమిషన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశామని అన్నారు. నిపుణులను పంపాలని నిర్ణయం అపోలో ఇచ్చిన వివరణ, ఆస్పత్రిలో సీసీటీవీ సర్వర్లను పరిశీలించి చెరిగిపోయిన దృశ్యాలను సేకరించే వీలుందా తెలుసుకునేందుకు ఒక నిపుణుల బృందాన్ని అపోలో ఆస్పత్రికి పంపాలని కమిషన్ నిర్ణయించింది. వీవీఐపీలు చికిత్స పొందుతున్న చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో ఇచ్చిన సమాధానంపై ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం రాబట్టాలని ఆదేశించింది. ఈ విషయపై అపోలో ఆస్పత్రి సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్‌ను ఈనెల 25వ తేదీన మరోమారు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. జయ మరణంపై ఇప్పటికే అనుమాన మేఘాలు కమ్ముకుని ఉండగా సీసీటీవీ దృశ్యాలు అందుబాటులో లేకపోవడం, శశికళ తదితరులను ఇంకా విచారించాల్సి ఉండడంతో మిస్టరీ వీడేనా అని ఆలోచనలో పడ్డారు. -
నెచ్చెలి.. నిజం చెప్పాలి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ముసురుకున్న అనుమానపు మేఘాలను తొలగించేందుకు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ వేగం పెంచింది. జయ నెచ్చెలి శశికళ నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని ఆశిస్తోంది. డెప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఇతర మంత్రుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిషన్ గత ఏడాది సెప్టెంబర్ నుంచి రంగంలోకి దిగింది. ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీతో కమిషన్ పదవీకాలం ముగుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత బంధువులు, శశికళ బంధువులు, వారి సహాయకులు, ప్రభుత్వ విధుల్లో జయకు సహకరించిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, జయకు చికిత్స చేసిన అపోలో, ఎయిమ్స్ వైద్యులు, ప్రభుత్వ డాక్టర్లు ఇలా సుమారు వందమందికి పైగా సాక్షులను విచారించినా ఇంకా విచారణ ముగియలేదని అంటున్నారు. ముఖ్యంగా శశికళ బంధువులు, వైద్యులు చెప్పిన వివరాలు పొంతనలేనివిగా ఉండడంతో కమిషన్ అనుమానిస్తోంది. జయ మరణంపై సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. జయలలితకు అందరికంటే అత్యంత సన్నిహితురాలైన శశికళ పాత్ర, శశికళ సలహాలు, సూచనల ప్రకారమే జయలలితకు చికిత్స అందడం, అపోలోలో చేర్చిన నాటి నుంచి అంతిమ సంస్కారం ముగిసే వరకు అన్నీ తానై చూసుకోవడాన్ని కమిషన్శితంగా పరిశీలిస్తోంది. జయ మరణంపై శశికళను ముఖ్యమైన సాక్షిగా భావిస్తోంది. శశికళ చెప్పే విషయాలు కీలకంగా మారగలవని అంచనావేస్తోంది. ఈ కారణంగా శశికళను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అయితే శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. విచారణ నిమిత్తం అమెను చెన్నైకి పిలిపించుకుంటే అనేక చట్టపరమైన చిక్కులను అధిగమించాల్సి వస్తుందని కమిషన్ అభిప్రాయపడుతోంది. ఈ కారణంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే జయకు చికిత్స చేసిన సింగపూర్ డాక్టర్లను సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనున్నారు. శశికళను విచారించిన తరువాత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, వైద్యమంత్రి విజయభాస్కర్లను సైతం విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం వారిద్దరికీ సమన్లు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిద్దరితోపాటు మంత్రులు తంగమణి, వేలుమణి, లోక్‌సభ ఉపసభాపతి తంబిదురైలను కూడా విచారించనుంది. అవసరమైతే అపోలో ఆసుపత్రి వైద్యులను మరోసారి పిలిపించుకోవాలని భావిస్తోంది. అనేక ముఖ్యులను విచారించాల్సి ఉన్నందున కమిషన్ గడువు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
జయ మరణం : ఎయిమ్స్ వైద్యులకు సమన్లు
సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు... రిటైర్డ్ జడ్జి ఎ. అరుముగ స్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే 75 మంది సాక్ష్యులతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన కమిషన్.. దర్యాప్తును వేగవంతం చేసింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితను పర్యవేక్షించిన ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జీసీ ఖిల్ననీ (పల్మనాలజీ విభాగం), అంజన్ త్రిఖా(ఎనిస్థీయాలజీ ప్రొఫెసర్ ), నితీష్ నాయక్(కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్)లు ఆగస్టు 23, 24 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి (సెప్టెంబరు 22, 2016) మరణించే రోజు(డిసెంబరు5, 2016) వరకు ఈ ముగ్గురు వైద్య నిపుణుల బృందం ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. కాగా అనారోగ్యానికి గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించిన సంగతి తెలిసిందే. జయ అనారోగ్యం, చికిత్స తదితర విషయాలను గోప్యంగా ఉంచడం.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తమను సైతం లోపలికి వెళ్లి అమ్మను చూడనివ్వలేదని అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఆరోపించడంతో జయ మరణం ఒక మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు, 2017లో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. -
కమల్‌హాసన్‌పై కేసు
చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్–2 రియాలిటీ షోలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. లూయిసల్ రమేశ్ అనే లాయరు ఈ కేసు వేశారు. జయను ‘నియంత’తో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కావాలనే అమ్మపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జయను కించపరుస్తూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌లో నిర్వహించే టాస్కుల్లో భాగంగా ఒకరు డిక్టేటర్లా వ్యవహరించాల్సి వచ్చింది. వారాంతంలో ఆ టాస్క్‌పై చర్చ జరిపే క్రమంలో ‘రాష్ట్రాన్ని నియంతలా పాలించిన వారికి ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసు కదా’అని కమల్ వ్యాఖ్యానించారు. -
కేసు నమోదు : చిక్కుల్లో బిగ్‌బాస్ 2!
చెన్నై : రాజకీయ ప్రత్యర్ధి ఎవరన్నది నిర్ణయించుకునే సమయం అసన్నమైందని ఇటీవల వ్యాఖ్యానించిన మక్కళ్ నీది మయం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్-2 రియాల్టీ షోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కమల్ హాసన్, బిగ్‌బాస్ 2 నిర్వాహకులతో పాటు షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీలపై చెన్నై నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. ఉద్దేశపూర్వకంగానే కమల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రసారమైన ఓ ఎపిసోడ్లో వీక్లీ టాస్క్ జరిగింది. ఆ ఎసిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్ ఒకరు నియంతగా వ్యవహరించాల్సి వచ్చింది. తర్వాతి ఎపిసోడ్లో హోస్ట్ కమల్ ఆ టాస్క్ గురించి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తే నేతలకు ఎలాంటి గతి పడుతుందో అందరూ చూశారని పేర్కొన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలితను నియంతగా చూపించే యత్నం జరిగిందని ఆరోపిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని లూయిసాల్ రమేష్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియాల్టీ షో అయినందున కమల్ హాసన్, బిగ్‌బాస్ 2 తమిళ్ నిర్వాహకులు, షో ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ ఛానల్లపై చర్యలు తీసుకోవాలని రమేష్ తన ఫిర్యాదులో కోరారు. కాగా, ఇలాంటి రియాల్టీ షోలు తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు సామాజికవేత్తలు ఇటీవల విజయ్ టీవీ ఛానల్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. తమిళ ఆచారాలను మంటగలుపుతున్నారని విమర్శిస్తూ.. బిగ్‌బాస్ తమిళ రియాల్టీ షోపై నిషేధం విధించాలని హిందూ మక్కల్ కట్చి (హెచ్ఎంకే) పార్టీ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షో మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. -
‘జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదు’
చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి చేస్తున్న వాదనలను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. జయలలిత తన జీవితకాలంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. కేసు విచారణలో భాగంగా మంగళవారం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారయణ్ ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందజేశారు. అదే విధంగా అమృత, జయలలిత కూతురని చెప్పాడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. పిటిషనర్ కేవలం ఆస్తి కోసమే ఈ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ఒకవేళ అమృత జయలలిత కూతురు అయితే ఆమెతో ఒక్క ఫొటో కూడా ఎందుకు దిగలేకపోయారో చెప్పాలన్నారు. అమృత ఫిర్యాదులో 1980 తను జన్మించినట్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రాస్తావించారు. ఆమె పుట్టిన తేదీకి నెల రోజుల ముందు ఓ అవార్డు కార్యక్రమంలో జయలలిత పాల్గొన్న వీడియోలను ఆయన కోర్టుకు అందజేశారు. ఆ వీడియోల్లో జయలలిత గర్భంతో ఉన్నారని అనడానికి ఎటువంటి అనవాళ్లు లేవని కోర్టుకు విన్నవించారు. అమృత కోరినట్టు డీఎన్ఏ టెస్ట్ కావాలంటే.. జయలలిత బంధువులు ఉన్నారని ఆయన తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా తను జయలలిత కూతురిని అని నిరూపించుకోవాలంటే ఆమె పార్ధీవదేహాన్ని వెలికితీసి డీఎస్ఏ పరీక్షలు నిర్వహించాలని అమృత కోరిన సంగతి తెలిసిందే. -
అమ్మ... అమృత..
ప్రతి మనిషి జన్మలోనూ ‘తల్లి నిజం.. నాన్న నమ్మకం’ అనేది ప్రాచీన నానుడి. తాను పలానా దంపతుల సంతానం అని చెప్పుకోవాలంటే సదరు భార్యాభర్త జీవించి ఉన్నపుడే ప్రకటించాలి. అది జరగనపుడు సశాస్త్రీయమైన తిరుగులేని విధానం డీఎన్ఏ పరీక్ష. అయితే డీఎన్ఏ పరీక్ష చేయాలంటే రక్త నమూనాలు తప్పనిసరి. జయలలిత తన తల్లి అంటున్న అమృత వాదనలోని నిజానిజాల కోసం జయ పార్థివదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి డీఎన్ఏ పరీక్షలు చేయవచ్చు. అంతటి అవకాశాలు కనుచూపుమేరలో లేవు. ఇక ఏకైక ప్రత్యామ్నాయం రక్తనమూనాలే. అపోలో ఆస్పత్రిలో జయ సుదీర్ఘకాలం చికిత్స పొందినపుడు వివిధ పరీక్షల కోసం సేకరించిన రక్తం ఉంటుందని కోర్టు భావించింది. అయితే సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశామని, తమ వద్ద నమూనాలు లేవని అపోలో తేల్చి చెప్పేసింది. దీంతో అమృత వారసత్వ కేసుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. డీఎన్ఏ పరీక్ష ద్వారా రుజువుచేసుకునేందుకు అవసరమైన జయలలిత రక్త నమూనాలు తమ వద్ద లేవంటూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేసింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. జయకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్లరూపాయల స్థిర, చరాస్థులు ఉన్నా వారసులుగా ఎవరూ లేరు. జయ అన్నకుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా గుర్తింపుకోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ దశలో బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి తాను జయలలిత, శోభన్‌బాబుల ప్రేమ ఫలమని ప్రకటించుకుంది. జయ వారసురాలిగా తనను ప్రకటించాలని కోరుతూ గత ఏడాది ఆఖరులో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మెరీనా బీచ్ సమాధి నుంచి జయ పార్థివదేహాన్ని బయటకు తీసి అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయాలని, తనకు డీఎన్ఏ పరీక్ష చేయాల్సిందిగా కోర్టును కోరింది. ఈ కేసు న్యాయమూర్తి వైద్యనాథన్ సమక్షంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు వచ్చింది. జయలలిత వారసురాలినని చెప్పుకునేందుకు అమృత వద్ద అధికార పూర్వమైన ఆధారాలు లేనందున ఈ కేసును విచారణకు స్వీకరించరాదని తమిళనాడు ప్రభుత్వం వాదన ప్రారంభించింది. ఈ పరిస్థితిలో జయలలిత రక్తనమూనాలు ఉన్నాయా అనే విషయంలో బదులివ్వాల్సిందిగా అపోలో యాజమాన్యాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అమృత పిటిషన్ కొట్టివేయాలని.. జయలలిత ఆస్తులను కాజేసే ఉద్దేశంతో అమృతవేసిన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. అమృత దాఖలు చేసిన కేసు గురువారం విచారణకు రాగా అపోలో ఆస్పత్రి యాజమాన్యం తరఫు న్యాయవాది మైమునాబాషా బదులు పిటిషన్ దాఖలు చేశారు. అపోలో తరఫున మరో పిటిషన్ అపోలో ఆసుపత్రి న్యాయవిభాగం మేనేజర్ మోహన్‌కుమార్ తరఫున మరో పిటిషన్ వేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘2016 సెప్టెంబరు 9వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు 75 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు మెరుగైన చికిత్సను ఆమెకు అందజేశారు. జయలలిత మరణం తరువాత అదే ఏడాది డిసెంబరు 7వ తేదీన ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశాం. ప్రస్తుతం అపోలో ఆస్పత్రి స్వాధీనంలో జయలలితకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, రక్త నమూనాలు లేవు’’ అని కోర్టుకు వారు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు 4వ తేదీకి వాయిదావేశారు. -
‘జయ బయలాజికల్ శాంపిల్స్ లేవు’
సాక్షి, చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయలాజికల్ శాంపిల్స్ తమ వద్ద లేవని ఆమె చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన అమృత తాను జయలలిత కుమార్తెను అంటూ ముందుకురావడంతో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వైద్యనాధన్ కోరిన వివరాలకు బదులిస్తూ ఆస్పత్రి యాజమాన్యం ఈ మేరకు నివేదించింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు కేసు విచారణ సందర్భంగా అమృత వాదనలకు జయ మేనల్లుడు, మేనకోడలు దీపక్, దీపలు అభ్యంతరం తెలిపారు. జయలలిత కుమార్తెను తానేనంటూ అమృత చేస్తున్న వాదనకు ఎలాంటి ఆధారాలూ లేనందున పిటిషనర్ కేవలం సివిల్ కోర్టునే ఆశ్రయించాలని అన్నారు. అమృత పోయెస్ గార్డెన్స్ నివాసంలో జయలలితను కలిసినట్టు లేదా జయలలిత బెంగళూరు పర్యటనల సందర్భంగా అమృతను కలిసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. కాగా కేసు తదుపరి విచారణను కోర్టు జూన్ 4కు వాయిదా వేసింది. -
కాజల్ స్పందించింది
మీడియాల్లో వచ్చే వార్తల్లో ఏది వాస్తవమో.. ఏది అబద్ధమో స్వయంగా సెలబ్రిటీలే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నటి కాజల్ అగర్వాల్ తనపై వస్తున్న ఓ వార్తపై స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె జయలలిత పాత్రను పోషించబోతుందన్న వార్త ఒక్కటి గత కొన్ని రోజులుగా వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వార్త నిజం కాదని ఆమె వివరణ ఇచ్చారు. ‘ఎన్టీఆర్ బయోపిక్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. జయలలిత పాత్ర పోషిస్తున్నానన్న వార్తలో నిజం లేదు’ అని కాజల్ స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ చిత్రంలో ఈ పాత్ర ఎవరు పోషించబోతున్నారన్న దానిపై ఆసక్తి మొదలైంది. మరోపక్క ఈ చిత్రంలో బాలకృష్ణ తప్ప.. మిగతా పాత్రలేవీ ఇంకా ఖరారు చేయలేదని చిత్ర యూనిట్ ప్రకటించినా రోజుకో వార్త వినిపిస్తోంది. దిగ్గజ నటుడు, దివంగత నేత ఎన్టీఆర్ జీవితగాథగా ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కిస్తుండగా.. సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. దసరాకి ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జయ స్పృహలో ఉండే సంతకం చేశారు!
టీ.నగర్: తమిళనాడులో 3 నియోజకవర్గాల ఉపఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో జయలలిత స్పృహలో ఉండగానే సంతకం చేసినట్లు ఆమె మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ వెల్లడించింది. ఆమె అపోలో ఆసుపత్రిలో ఉన్నకాలంలో రాష్ట్రంలో 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. రెండాకుల చిహ్నం కేటాయింపునకు సంబంధించిన బీ ఫారంలో జయలలిత వేలిముద్ర ఉంది. వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయ స్పృహలోనే ఉన్నట్లు వైద్యుడు బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. బాలాజీ వాంగ్మూలం వాస్తవమేనని విచారణ కమిషన్ తాజాగా నిర్ధారించింది. ఆసుపత్రి గదిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్నది నిజమేనని, తర్వాత ఆమె వేలికి అంటుకున్న సిరాను బాలాజీ తుడిచేందుకు ప్రయత్నించగా ఆయన్ని అడ్డుకుని శశికళ సిరాను తుడిచినట్లు తెలిపింది. -
జయ మృతి కేసులో ఊహించని మలుపు!
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి అనేక అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలితత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యం, చికిత్స తదితర విషయాలను గోప్యంగా ఉంచడం.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తమను సైతం లోపలికి వెళ్లి జయను చూడనివ్వలేదని అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఆరోపించడంతో ఆమె మృతి ఒక మిస్టరీగా మారింది. ఆమె మృతి వెనుక కారణాలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత మృతికి సంబంధించి మరో సంచలన అంశం వెలుగుచూసింది. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీసీటీవీ కెమెరాలు బంద్ (స్విచ్చాప్) చేశారని, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నంతకాలం అవి పనిచేయలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందినతీరు వీడియో రికార్డు కాలేదని తేలిపోయింది. దీంతో ఆస్పత్రిలో నిజానికి ఏం జరిగిందనే దానిపై మరిన్ని అనుమానాలు వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ‘దురదృష్టవశాత్తు సీసీటీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేశారు. జయలలిత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాక.. ఐసీయూను పూర్తిగా ఆమె కోసమే కేటాయించాం. అందువల్ల ప్రతి ఒక్కరూ సీసీటీవీ దృశ్యాలు కూడా చూడకూడదని, వాటిని తొలగించాం’ అని అపోలో చైర్మన్ సీ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. -
జయలలిత వేలిముద్రలపై సుప్రీం తీర్పు
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసుపై సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది. జయలలిత వేలిముద్రలు సమర్పించాలని పరప్పణ అగ్రహారం జైలు అధికారులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేసు విచారణలో భాగంగా జయ లలిత వేలిముద్రలు సేకరించడాన్ని నిలుపుదల చేయాలని, వేలిముద్రలు లేకుండానే కేసు విచారణ పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుపరంకండ్రం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏఐడీఎంకే నేత ఎకే బోస్ ఎన్నికను సవాలు చేస్తూ డీఎంకే నేత శరవణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జయలలిత స్పృహలో లేని సమయంలో అమె అనుమతి లేకుండా వేలిముద్రలు తీసుకున్నారని, అమె సమ్మతి లేకుండా తీసుకున్న వేలిముద్రలు చెల్లవని ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ 2016లో శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన మద్రాసు హైకోర్టు కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలు అధికారుల వద్ద జయలలిత వేలిముద్రలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను తప్పుబడుతూ జయలలిత వేలిముద్రల సేకరణను విరమించుకోవాలని సుప్రీకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం విషయమై ఆమె నెచ్చెలి శశికళ పలు కీలకమైన విషయాలు వెల్లడించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత వాష్‌రూమ్‌లో కుప్పకూలారని, అయినా, ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని శశికళ తెలిపారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా.. నాలుగుసార్లు వీడియో చిత్రీకరించారని, ఆస్పత్రిలో ఆమెను పన్నీర్ సెల్వం, తంబిదురై వంటి అన్నాడీఎంకే సీనియర్ నేతలు కలిశారని చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరుపుతున్న రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు ఆమె ఈ మేరకు వివరాలు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను తాము కలువలేదని, చూడలేదని పన్నీర్ సెల్వం, తంబిదురైతోపాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులు, ఆమెకు అందజేసిన చికిత్స తదితర అంశాల్లో అనుమానాల నివృత్తి కోసం హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏ అరుముఘస్వామి నేతృత్వంలో దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. జయ మృతికి దారితీసిన పరిస్థితులను రిటైర్డ్ జడ్జికి వివరించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత అనారోగ్యానికి గురయ్యారని, అదే రోజున ఆమెను ఆస్పత్రిలో చేర్చామని శశికళ చెప్పారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. జయలలిత స్పృహలోకి వచ్చారని, తనను ఎక్కడికి తీసుకెళుతున్నారని ఆమె ప్రశ్నించారని తెలిపారు. పోయెస్ గార్డెన్లో ఉన్న తన నివాసంలోని మొదటి అంతస్తు వాష్‌రూమ్‌లో జయలలిత సృహకోల్పోయి పడిపోయారని చెప్పారు. ‘ఆమె వెంటనే నన్ను సాయానికి పిలిచారు. నేను వెళ్లి ఆస్పత్రికి వెళ్దామని సూచించాను. కానీ ఆమె వద్దన్నారు. అంతలో ఆమె స్పృహ కోల్పోవడంతో నేనే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాను’ అని శశికళ వివరించారు. -
నటరాజన్ లేకపోతే జయలలిత లేదు
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలితకు రాజకీయ సహాయకుడిగా శశికళ భర్త నటరాజన్ వ్యవహరించేవారు. ఒకానోక దశలో రాజకీయాలను వదిలేద్దామని నిర్ణయించుకున్న జయలలితను అడ్డుకున్న ఆయన.. తర్వాత ఆమె వెన్నంటి ముందుకు నడిపించారు. ‘జయ రాజకీయ నీడ’గా నటరాజన్‌ను అభివర్ణించే విశ్లేషకులు ఆయన మృతి నేపథ్యంలో ప్రస్థానాన్ని గుర్తు చేస్తున్నారు. మార్చి 1989 జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సభలో జరిగిన ఘోర అవమానానికి మనస్థాపం చెంది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను తన కార్యదర్శి ద్వారా ఆమె స్పీకర్‌కు పంపారు. అయితే పోయెస్ గార్డెన్‌లోని తన అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న నటరాజన్ ఆ లేఖను తన దగ్గరికి తెప్పించుకుని దానిని జాగ్రత్తగా తన ఇంట్లో భద్రపరిచారు. తర్వాత జయను ఒప్పించి ఆమె నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు. అదే ఏడాది తేనీ ఈశ్వరన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎంకే ప్రభుత్వం నటరాజన్ ఇంటిపై తనిఖీలకు ఆదేశించింది. ఆ సమయంలో ఈ లేఖ బయటపడగా.. అధికారులు దానిని మీడియాకు కూడా విడుదల చేశారు. ఆ రకంగా జయను రాజకీయ సన్యాసం తీసుకోనీయకుండా అడ్డుకున్న నటరాజన్ తర్వాత.. ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. జయను నేనే సీఎం చేశా... ఈ మాట తరచూ నటరాజన్ నోటి నుంచి మీడియా పూర్వకంగానే వెలువడుతూ ఉండేది. తమిళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన ఎప్పటికప్పుడు పరితపిస్తూ ఉండేవారు. ఏదో ఒక రోజు జయలలిత ప్రధాని అవుతారని.. తాను తమిళనాడు ముఖ్యమంత్రిని అయి తీరుతానని నటరాజన్ తరచూ అనుచరులతో ప్రస్తావిస్తూ ఉండేవారంట. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నటరాజన్ మురుతప్ప.. ప్రభుత్వ ఉద్యోగిగా.. వ్యాపారస్థుడిగా.. అంతకు మించి జయలలితకు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఆయన.. ఆ సమయంలో కలెక్టర్‌గా ఉన్న చంద్రకళకు సహయకుడిగా పని చేశారు. ఆ సమయంలోనే ఆయన భార్య శశికళ వీడియో పార్లర్ ద్వారా జయలలితతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం క్రమంగా బలపడి.. ఎంజీఆర్ మరణం తర్వాత నటరాజన్-శశికళ దంపతులు జయ పంచన చేరారు. అప్పటి నుంచి ఆమె తీసుకునే రాజకీయ నిర్ణయం ప్రతీదాంట్లో నటరాజన్ తన ప్రభావం చూపుతూ వచ్చారు. నటరాజన్‌కి ఉన్న రాజకీయ పరిజ్ఞానాన్ని నమ్మి చీఫ్, హోం సెక్రెటరీల నియామకం దగ్గరి నుంచి.. నిధుల కేటాయింపులో సైతం ఆయన సలహాలు తీసుకుని జయలలిత నిర్ణయాలు ప్రకటించేవారు. అదిగో ఆ వ్యవహారమే తర్వాత వివాదాస్పదంగా మారింది. జయను చాలా విషయాల్లో ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నాడీఎంకే శ్రేణుల నుంచి కూడా విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఆమె మాత్రం నటరాజన్‌కు ప్రాధాన్యం ఇవ్వటం మానలేదు. జాతీయ స్థాయి నేతలు సైతం తన ఇంట ఆతిథ్యం తీసుకునేంత స్థాయికి నటరాజన్ పేరును అప్పటికే ఆయన సంపాదించుకున్నారు. అయితే ఒకానోక దశలో తన హోదాకే ఎసరు పెట్టే స్థాయికి నటరాజన్ చేరుకోవటం, పైగా మన్నార్గుడి మాఫియా పేరిట అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఆయన్ని జయలలిత వేద నిలయానికి దూరం పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఆయన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పక్కకు తప్పుకునేలా చేశాయి. జయలలిత మరణానంతరం తిరిగి తెరపైకి వచ్చిన నటరాజన్.. రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. చివరకు అక్రమాస్తుల కేసులో భార్య శశికళ అరెస్ట్ తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. -
ఎంజీఆర్, జయలలిత కాంబినేషన్లో 29వ చిత్రం
తమిళసినిమా: దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత కలిసి 28 చిత్రాల్లో నటించారు. అవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందినవే. తాజాగా ఆ జంట 29వ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. మరణించిన వారు మళ్లీ నటించడమేంటీ అనుకుంటున్నారా? అవును.. అత్యం త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంజీఆర్, జయలలిత జంట గా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు అనే యానియేషన్ చిత్రం తెరకెక్కుతోంది. ఎంజీఆర్ కథానాయకుడిగా 1972లోనే హాంకాంగ్, జపాన్ వంటి దేశాల్లో ఉలగం చుట్రుం వాలిభన్ అనే బ్రహ్మండ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఎంజీ ఆర్ దానికి సీక్వెల్‌గా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రం చేయాలని భావించారు. ఆ తరువాత ఆ యన రాజకీయ రంగప్రవే శం చేయడంతో ఆ చిత్రం తెరకెక్కలేదు. కాగా అదే పేరుతో ఉళగం చుట్రుం వాలిబన్ చిత్రానికి సీక్వెల్‌గా అప్పట్లో ఎంజీఆర్‌తో కలిసి పలు చిత్రాలలో నటించిన ఆయన స్నేహితుడు ఐసరి వేలన్ కొడు కు ఐసరి గణేశ్ వేల్స్ ఫి లిం ఇంటర్నేషనల్, ప్రభుదేవా స్టూడియోస్ సంస్థలు కలిసి యానిమేషన్ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల ఎంజీఆర్ 101వ జయంతి రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆయన 102వ జయంతి సందర్భంగా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో ఎంజీఆర్‌కు జంటగా జయలలిత నటింపజేస్తున్నట్లు ఆమె జయంతి సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర సృష్టికర్త (దర్శకుడు) అరుణ్మూర్తి మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక ప్రయోగంగా నిలిచిపోతుందన్నారు. ప్రేక్షకుల మనసుల్ని గెలుసుకున్న పురట్చి తలైవన్ ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలితలను మళ్లీ తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇలాంటి యానిమేషన్ చిత్రాలను వాల్ట్ డిస్నీ లాంటి సంస్థలు రూపొందించడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని, తాము ఏడాదిలో పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎంజీఆర్ చిత్రాల ఫార్ములా ఈ చిత్రంలోనూ ఉంటుందని, అప్పటి కాలానికి తగ్గట్టుగానే చిత్ర కథనాన్ని తయారు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
రచ్చకెక్కిన ‘అమ్మ’ విగ్రహం.!
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత విగ్రహం రచ్చకెక్కింది. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టారన్న విమర్శలు అన్నాడిఎంకే పాలకుల్ని ఇరకాటంలో పడేసింది. దీంతో ఆ విగ్రహాన్ని మార్చేందుకు నిర్ణయించారు. అన్నాడిఎంకే వర్గాలు అమ్మ జయలలిత 70వ జయంతి వేడుక శనివారం ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, అస్సలు అక్కడ ఉన్న విగ్రహం జయలలిత దేనా..? అన్న ప్రశ్న అందరిలో మొదలైయింది. జయలలిత ముఖం పోలికలు ఆ విగ్రహంలో లేవన్న విమర్శలు బయలు దేరాయి. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టినట్టున్నారని అన్నాడిఎంకే కేడర్ సైతం విమర్శల్ని గుప్పించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే, ఆ విగ్రహం చర్చ హోరెత్తింది. అక్కడున్నది అమ్మా...చిన్నమ్మా..? అంటూ కొందరు ప్రశ్నించారు. కొందరు సీనియర్ నేత వలర్మతిని నిలబెట్టినట్టుందని, మరి కొందరు సీఎం పళని స్వామి సతీమణి ముఖాన్ని పోలినట్టుందని రక రకాల వ్యంగ్యాస్త్రాలతో సామాజిక మాధ్యమాల ద్వారా అన్నాడిఎంకే వర్గాలపై దాడి చేసిన వాళ్లు ఎక్కువే. విగ్రహావిష్కరణ సమయంలో మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ను పదే పదే మీడియా ప్రశ్నించగా, అమ్మ విగ్రహమే క్షుణ్ణంగా చూడండంటూ సమాధానం ఇచ్చి వెళ్లడం మరింత చమత్కారాలకు దారి తీశాయి. మార్పుకు నిర్ణయం : అమ్మ ఎక్కడ ..? అని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తడం ఓ వైపు ఉంటే, మరో వైపు అన్నాడిఎంకే వర్గాలు సైతం విగ్రహం మీద పెదవి విప్పడం చర్చకు దారి తీసింది. అన్నాడిఎంకే కేడర్ అమ్మేది అని ప్రశ్నించే స్థాయి పరిస్థితి చేరింది. అదే సమయంలో అన్నాడిఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ సైతం పన్నీరు, పళనిల తీరుపై విమర్శల దాడిని పెంచారు. అమ్మ విగ్రహాన్ని పరిహాసం చేశారని మండి పడ్డారు. అమ్మ విగ్రహాన్నే సక్రమంగా చేయించ లేని వాళ్లు, ఇక పార్టీ నిర్వాకాన్ని ఏ మేరకు ఒలక బెడుతున్నారో కేడర్ పరిగణించాలని సూచించారు. ఇక, జయలలిత మేన కోడలు దీప సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేని డిమాండ్ చేశారు. అలాగే, ఈ విగ్రహావిష్కరణకు దూరంగా ఉన్న మైలాడుతురై ఎంపి భారతి మోహన్ కూడా విమర్శలు ఎక్కుబెట్టడం విగ్రహం ఆవిష్కరణ రచ్చకెక్కింది. ఇది మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉండటంతో పాలకులు మేల్కొన్నట్టున్నారు. విగ్రహాన్ని మార్చేందుకు తగ్గ చర్యల్లో పడ్డారు. ఈ విషయంగా మత్స్య శాఖ మంత్రి జయకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఆ విగ్రహాన్ని మార్చి, మరో విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ రచ్చను ఇంతటితో వదలి పెట్టాలని వేడుకోవడం గమనార్హం. -
జయలలిత విగ్రహంపై రచ్చ రచ్చ..
-
ముఖ్యమంత్రి సతీమణిలా జయ విగ్రహం!
సాక్షి, చెన్నై : దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విగ్రహంపై వివాదం నెలకొంది. జయలలిత విగ్రహంలోని పోలికలు ముఖ్యమంత్రి పళనిస్వామి సతీమణిని పోలినట్లు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జయలలిత 70వ జయంతి సందర్బంగా పాలకఅన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత నేత భారీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం నెలకొల్పింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా నెల్లూరులో రూపుదిద్దుకున్న జయ విగ్రహాన్ని గత ఏడాదే పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించాల్సి ఉండగా, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. -
‘బతికుంటే శశికళతో ఊచలు లెక్కిస్తుండేది’
సాక్షి, చెన్నై : అసెంబ్లీలో జయలలిత ఫోటో నెలకొల్పటంపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోమవారం అసెంబ్లీలో అమ్మ ఫోటోను అన్నాడీఎంకే నెలకొల్పింది. అయితే అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి అంత సముచిత గౌరవం ఇవ్వడమేంటని? డీఎంకే ప్రశ్నలు గుప్పిస్తోంది. ‘ఒకవేళ జయలలిత ఇప్పుడు బతికి ఉంటే శశికళతోపాటు జైల్లో కూర్చుని ఊచలు లెక్కించేది. తమిళ గౌరవాన్ని చాటిన గొప్ప సీఎంల ఫోటోలు అసెంబ్లీలో ఉన్నాయి. అలాంటి వారి మధ్య నేరస్థురాలైన జయలలిత ఫోటోను ఉంచటం ఏంటి?. ఇది ముమ్మాటికీ అసెంబ్లీకి అవమానమే. తక్షణమే ఆ ఫోటోను తొలగించాలి’ అని డీఎంకే అధినేత స్టాలిన్ మండిపడ్డారు. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక ఈ కార్యక్రమాన్ని డీఎంకేతోపాటు, కాంగ్రెస్, ఐయూఎంఎల్ కూడా బహిష్కరించాయి. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. అయితే ప్రభుత్వం మాత్రం అవేం పట్టన్నట్లు స్పీకర్ ధన్పాల్ చేతుల మీదుగా ఫోటోను ఆవిష్కరించేసింది. ఏడు ఫీట్ల ఎత్తున్న జయలలిత ఫోటోను సరిగ్గా ప్రతిపక్షాల బెంచ్ వైపు చూసే విధంగా అమర్చారు. ఈ కార్యక్రమంలో సీఎం పళని సామి, పన్నీర్ సెల్వం, మంత్రులు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గతంలో మెరీనా బీచ్‌లో ఆమె స్మారక స్థూపం నెలకొల్పే సమయంలో కూడా సరిగ్గా ఇలాంటి విమర్శలే వినిపించాయి. అసెంబ్లీలో నెలకొల్పిన జయలలిత ఫోటో -
కుటుంబీకులపై శశికళ అసహనం
సాక్షి, చెన్నై: బంధుగణానికి చిన్నమ్మ శశికళ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. న్యాయవాదుల ద్వారా తన సందేశాన్ని పంపించారు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ప్రతినిధి, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్‌కు వ్యతిరేకంగా ఆ కుటుంబంలోనే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఓ వైపు, వదిన ఇలవరసి కుమార్తె కృష్ణ ప్రియ మరో వైపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దినకరన్‌కు వ్యతిరేకంగా కృష్ణప్రియ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో చాపకింద నీరులా సాగుతూ వచ్చిన విభేదాలు, తాజాగా రాజకీయ వేదికగా తలబడ్డేందుకు సిద్ధం అవుతుండడం చర్చకు దారి తీసింది. ఈ సమాచారాలు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దృష్టికి చేరింది. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో కుటుంబంలో సాగుతున్న పరిణామలపై చిన్నమ్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలంటూ వాదులాటలు వద్దని, సంయమనంతో వ్యవహరించాలని, దూకుడును పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు సాగాలని కుటుంబీకులకు న్యాయవాదులు ద్వారా ఆమె సందేశాన్ని పంపించినట్టు అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో చర్చసాగుతోంది. -
దినకరన్ కు పోటీగా కృష్ణప్రియ?
సాక్షి, చెన్నై : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబాలకు రాజకీయ లాభం చేకూర్చకపోగా విభేదాల చిచ్చుపెట్టింది. దినకరన్‌కు వ్యతిరేకంగా పలువురు కుటుంబ సభ్యులు రాజకీయబాటలు వేస్తుండగా, శశికళ అన్న కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ (ఇళవరసి కుమార్తె) ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున రాజకీయ ప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలు ఏకమైన ఆర్కేనగర్ ఎమ్మెల్యే, శశికళ అక్క కుమారుడైన టీటీవీ దినకరన్‌ను పార్టీతో సంబంధం లేకుండా ఏకాకిని చేశారు. ఈపీఎస్, ఓపీఎస్లను లెక్కచేయకుండా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు దినకరన్ పక్షాన నిలిచారు. ఆ తరువాత పార్టీ, రెండాకుల చిహ్నం ఎడపాడి వశం కావడంతో దినకరన్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు వెళ్లిపోయారు. దీంతో దినకరన్ బలం 18 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఈ 18 మందిపై కూడా స్పీకర్ చేత సీఎం అనర్హత వేటు వేయించారు. ఈ వేటు వివాదం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలను సవాలుగా తీసుకున్న దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్దిగా పోటీచేసి వ్యూహాత్మకంగా గెలుపొందారు. దినకరన్ గెలుపు ఎడపాడిని బెంబేలుకు గురి చేసింది. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం, అధికారం చేతిలో ఉన్నా దినకరన్ గెలుపొందడంతో ఎడపాడి, పన్నీరు కంగారుపడగా, జైల్లో ఉన్న శశికళకు అంతులేని ఆనందం కలిగింది. అంతేగాక కొత్తపార్టీ పెట్టాలనే ఆలోచన ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆర్కేనగర్లో గెలుపు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడాలనే ఆశ దినకరన్లో ఏర్పడింది. కొత్త పార్టీపై దినకరన్ తరచూ శశికళను కలుస్తున్నారు. అంతేగాక జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ దినకరన్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దినకరన్ రాజకీయ ఎదుగుదల, శశికళకు మరింత చేరువకావడం కుటుంబ సభ్యులకు కంటగింపుగా మారింది. పైగా శశికళ భద్రంగా దాచి ఉంచిన జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకోసం దినకరన్ వినియోగించుకోవడం మరింత మనస్పర్థలకు దారితీసింది. ఇదే అంశంపై కృష్ణప్రియ, దినకరన్‌ల మధ్య విభేధాలు తలెత్తాయి. కృష్ణప్రియ సైతం దినకరన్‌ను వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. ఈనెల 24వ తేదీన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వివాదమే కృష్ణప్రియను రాజకీయ అరంగేట్రానికి పురిగొల్పినట్లు భావిస్తున్నారు. కాగా, శశికళ తమ్ముడు దివాకరన్, ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియల అడుగు జాడలోనే దినకరన్ సోదరుడు భాస్కరన్ సైతం రాజకీయ ప్రవేశంపై తహతహలాడుతున్నారు. శశికళ మనస్తాపం.. 2015 డిసెంబరు 4వ తేదీనే జయ కన్నుమూసినట్లు దివాకరన్ ప్రకటించి వివాదం లేవనెత్తడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇకపై అలాంటి ప్రకటనలు చేయరాదని ఖండించారు. ఇలా ఒక్కొక్కరుగా దినకరన్‌కు దూరం జరిగిపోవడమేగాక కుటుంబ సభ్యుల మధ్య కీచులాటలతో శశికళ మనస్తాపానికి గురవుతున్నారని తెలుస్తోంది. విబేధాలు తీవ్రం.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీచేస్తామని దినకరన్ సోదరుడు భాస్కరన్ ఇటీవల ప్రకటించారు. భాస్కరన్ చేసిన ప్రకటన దినకరన్ అనుచరుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దినకరన్ సోదరుడే రాజకీయాల్లోకి దిగితే ఎవరివైపు నిలవాలనే ఆలోచనలో పడ్డారు. కాగా తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే క్యాడర్లో కొంతవరకు శశికళ తమ్ముడు దివాకరన్ వైపు ఉండేది. అయితే జయ మరణం తరువాత కొందరు చేజారిపోగా మరి కొంతమంది దినకరన్ పక్షాన నిలిచి ఉన్నారు. వీరందరినీ తనవైపు తిప్పుకోవాలని దివాకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. -
మరో బాంబు పేల్చిన శశికళ సోదరుడు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాది పూర్తైనా అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘అమ్మ’ ఎలా చనిపోయారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ మరో బాంబు పేల్చారు. జయలలిత ఒకరోజు ముందుగానే కన్నుమూశారని వెల్లడించారు. 2016 డిసెంబర్ 4నే ‘అమ్మ’ చనిపోయిందని, అయితే 5న మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారని తెలిపారు. జయలలిత మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగుతారన్న భయంతో ఆమె మరణవార్తను ఆలస్యంగా ప్రకటించాలని అన్నాడీఎంకే పార్టీ సూచించడంతో ఈవిధంగా చేశారని వివరించారు. ‘జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం 5.15 గంటలకు మరణించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంతో అన్నాడీఎంకే పార్టీ ‘అమ్మ’ మరణవార్తను ఆలస్యంగా ప్రకటించింది. ఈలోపు రాష్ట్రంలోని అన్ని అపోలో ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచార’ని వెల్లడించారు. జయలలిత తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ‘అమ్మ’ మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేయడంతో పళనిస్వామి ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. -
ఎట్టకేలకు అమ్మ వారసులపై స్పష్టత
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అమ్మ జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోపు వేదనిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకుంటామన్నారు. వేద నిలయంలో రహస్య గదులు, అండర్ గ్రౌండ్లో ప్రత్యేక గదులు ఉన్నాయా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం నిరాకరించారు. చెన్నై పోయెగార్డెన్‌లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక మందిరంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనం స్వాధీనానికి తగ్గ కసరత్తుల్ని చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ చేపట్టారు. ఆయన నేతృత్వంలో ఇరవై మందితో కూడిన బృందం ఆ వేదనిలయంలో పరిశీలనలు జరుపుతూ వస్తున్నది. ఇప్పటికే ఆ భవనం, స్థలం వివరాలు, ఆస్తి విలువ లెక్కింపు తదితర ప్రక్రియలు ముగించారు. ఇక, ఆ నిలయంలోని రెండు గదుల్ని ఆదాయ పన్ను శాఖ వర్గాలు సీజ్ చేసి ఉండడంతో, అందులో ఏమున్నదోనన్న పరిశీలన సాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఆ నిలయంలో పరిశీలన అనంతరం అన్భు సెల్వన్ మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆస్తులకు తామంటే తాము వారసులు అని ఆమె మేన కోడలు దీప, మేనళ్లుడు దీపక్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అలాగే, తానే అమ్మ బిడ్డనంటూ బెంగళూరుకు చెందిన అమృత తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జయలలితకు ప్రత్యక్షంగా ఎలాంటి వారసులు లేరని కలెక్టర్ అన్భుసెల్వన్ స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలిత నివాసం విలువ లెక్కింపు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, ఆ భవనాన్ని పూర్తిగా ప్రభుత్వం గుప్పెట్లోకి నాలుగు నెలల్లోపు తీసుకుంటామన్నారు. ఆ తదుపరి స్మారక మందిరంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా అమ్మకు వారసులు ఎవరు లేరని, అయినా, తమ నిబంధనల మేరకు అన్ని ప్రక్రియలు ముగించినానంతరం పబ్లిక్ నోటీసు జారీ చేయడం జరుగుతుందన్నారు. అప్పుడు ఎవరైనా ఆక్షేపణ వ్యక్తం చేసినా, ఆధారాలతో వచ్చినా ఆ సమయంలో అందుకు తగ్గ నిర్ణయాలతో లెక్కింపుకు తగ్గట్టు వెల కట్టడం జరుగుతుందన్నారు. ఆదాయ పన్ను శాఖ వర్గాలు తమకు సహకరిస్తామని చెప్పారని, ఆ రెండు గదుల్ని త్వరితగతిన తమకు అప్పగిస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, పలు ప్రశ్నల్ని సంధించగా ఆయన దాట వేత ధోరణి అనుసించారు. చివరగా వేదనిలయంలో రహస్య గదులు ఉన్నట్టు, పాతాళంలోనూ గదులు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయే, వాటిని చూశారా అని ప్రశ్నించగా కాస్త తడబాటు అనంతరం ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం. -
సీల్ వేసిన రెండు గదులు తెరిచి సోదాలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయస్ గార్డెన్లో మరోసారి ఐటీ దాడులు జరిగాయి. అలాగే జయ టీవీ కార్యాలయంలో సైతం ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బోగస్ సంస్థలను స్థాపించి కోట్లాది రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై జయ నెచ్చెలి శశికళ, ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కుటుంబీకులే లక్ష్యంగా ఐటీ దృష్టి సారించింది. శశికళ బంధుమిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో గత ఏడాది నవంబరు 10వ తేదీన 187 చోట్ల ఏకకాలంతో 1600 మంది అధికారులు దాడులు జరిపి ఐదురోజులపాటూ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రూ.1,480 కోట్ల పన్నుఎగవేతను గుర్తించారు. అంతేగాక లెక్కల్లో చూపని బంగారు, వజ్రాలు, కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్17వ తేదీన శశికళ బంధువుల ఇళ్లతోపాటూ జయలలిత వ్యక్తిగత కార్యదర్శి పూంగున్రన్ ఇంటిపైనా, అదే రోజు రాత్రి పోయస్‌గార్డెన్‌లోని జయ నివాసంలో మళ్లీ దాడులు జరిపారు. జయ నివాసంలోని రెండు గదులకు ఐటీ అధికారులు ఆరోజు సీలు వేశారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఐదుగురు అధికారులు అకస్మాత్తుగా జయ నివాసంలోకి ప్రవేశించారు. గతంలో సీలు వేసిన రెండు గదులను తెరిచి సోదాలు జరిపారు. అలాగే జయ నివాసం పక్కనే ఉన్న జయ టీవీ పాత కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కాగా, జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు ప్రభుత్వం 20 మందితో కూడిన బృందాన్ని నియమించింది. నాలుగు నెలల్లోగా మందిరం పనులు పూర్తి చేయాలని గడువు విధించింది. -
పోయెస్ గార్డెన్ వద్ద టెన్షన్ : జయ గదులు తెరవొద్దు!
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో ఐటీ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయమే వేదనిలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న శశికళ వర్గీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోయెస్ గార్డెన్ పరిసర ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 5 బెటాలియన్ల అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆ రెండు గదులే కీలకం : విశాలమైన వేదనిలయం భవంతిని జయ స్మారక కేంద్రంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే తీర్మానించింది. పొంగల్(సంక్రాంతి)లోపే ఆ కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సీఎం పళని.. ఆ మేరకు చేయవలసిన పనుల బాధ్యతను చెన్నై కలెక్టర్‌కు అప్పగించారు. అయితే, జయ పర్సనల్ గదులు రెండింటి విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఎందుకంటే.. గతంలో ఐటీ శాఖ వేదనిలయంలో సోదాలు నిర్వహించినప్పుడు ఆ రెండు గదులను సీజ్ చేశారు. వాటిని అలాగే వదిలేసి స్మారక కేంద్రంగా మార్చడం దాదాపు అసాధ్యం. కాబట్టే ఆ గదులను తెరిచే విషయమై ఐటీ, రాష్ట్ర రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ వారు వేదనిలయానికి వచ్చారు. జయ గదుల్ని తెరవొద్దు : సీజ్ చేసిన రెండు గదుల్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలియగానే శశికళ వర్గంలో కలకలం మొదలైంది. పెద్ద సంఖ్యలో పోయెస్ గార్డెన్ వద్దకు చేరుకున్న శశి వర్గీయులు.. ‘అమ్మ గదులను తెరవొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ప్రజల దృష్టిలో జయ ఇమేజ్ను దెబ్బతీసేందుకే పళని-పన్నీర్లు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. వేదనిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చినా, అమ్మ నివసించిన గదులను మాత్రం తెరవకుండా అలానే వదిలేయాలని శశికళ వర్గం మొదటి నుంచీ వాదిస్తోంది. ఇంతకీ ఏమున్నాయక్కడ?: జయలలిత బతికున్నప్పుడు వినియోగించిన ఆ రెండు గదుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు సమాచారం. గతంలో ఐటీ దాడుల అనంతరం ఆ రెండు గదులను సీజ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ గదుల్లోని అన్ని వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికే స్వాధీనం చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. కానీ శశి వర్గం మాత్రం అసలు గదులను తెరవనే తెరవొద్దని ఆందోళన చేస్తోంది. -
జయలలిత ఇంట్లో సోదాలు
-
అది బీజేపీ వ్యతిరేక ఓటు కానేకాదు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్ష అన్నాడీఎంకే తిరుగుబాటు అభ్యర్థి, వీకే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ దాదాపు 40 వేల మెజారిటీతో విజయం సాధించడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. దినకరన్‌కు నేడు 40,707 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాడు జయలలిత 39 వేల మెజారిటీతోనే విజయం సాధించారు. దానర్థం జయలలితకన్నా దినకరన్ ఎక్కువ ఆదరణ కలిగిన వ్యక్తని అర్థం కాదు. పాలకపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి ఈ. మధుసూదన్‌కు ఈ ఎన్నికల్లో 48,306 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుధుగణేశ్ 24,651 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమై దినకరన్ విజయం సాధిస్తున్న సూచనలు కనిపించగానే వివిధ టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు తమ విశ్లేషణలు వినిపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఇది ప్రజలిచ్చిన తీర్పంటూ పలు పార్టీల నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి నిర్ణయాలే కాకుండా బలవంతంగా హిందీ భాషను రుద్దడం, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’ లాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు దినకరన్‌కు ఓటేశారని తేల్చారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలనుకుంటే డీఎంకే అభ్యర్థిని గెలిపించేవారు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ డీఎంకే. కాగా, డీఎంకే అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. బీజేపీ మతతత్వ వాదాన్ని వ్యతిరేకించే ప్రజలు దినకరన్‌వైపు మొగ్గుచూపారని కూడా అంటున్నారు. మతతత్వంపై పోరాడాలన్న తపన ప్రజల్లో ఏ కోశాన, ఎక్కడా కనిపించలేదు. డబ్బు ప్రవాహం ప్రభావం వల్లనే దినకరన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. దినకరన్ ఎన్నికల కోసం దాదాపు వంద కోట్ల రూపాయలను కుమ్మరించారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల మొదట్లోనే ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ఉప ఎన్నికల్లో డబ్బే ప్రధాన ప్రభావం చూపిస్తుందని తేలడం ఇదే మొదటిసారి కాదు. 2003లో శాంతకులం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఏఐఏడీఎంకే అభ్యర్థి విజయం సాధించడంలో డబ్బు ప్రభావం మొదటిసారి కనిపించింది. అప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంతో ఆగ్రహం ఉన్నప్పటికీ పాలక పక్ష అభ్యర్థినే గెలిపించడం, డబ్బును విచ్చలవిడిగా వెదజల్లడం స్పష్టంగా కనిపించింది. ఎన్ని చర్యలు తీసుకున్నా మన ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడంలో విఫలం అవుతోంది. -
జయ మృతిపై శశికళ, అపోలో చైర్మన్‌కు సమన్లు
చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డికి కమిషన్ సమన్లు ఇచ్చింది. 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కాగా అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. జయలలితన శ్వాస తీసుకోలేని స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించామని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్‌కు గతంలో వెల్లడించారు. మరోవైపు జయను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆమె జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనను ఇచ్చినట్లు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా పేర్కొన్న విషయం విదితమే. అంతేకాకుండా జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో శశికళ... ఎవరినీ లోనికి అనుమతించలేదని, జయను చూడనివ్వలేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. జయలలిత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆమె మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. దీంతో విచారణ కమిషన్... ఇందుకు సంబంధించి ఒక్కొక్కరినీ విచారణ చేస్తోంది. తాజాగా శశికళతో పాటుగా ప్రతాప్ రెడ్డి, ప్రీతారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇక జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అనూహ్యంగా బుధవారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియో విడుదల చేశారు. -
శశికళ మాజీ సీఎం?.. ఇదేంది ఇమ్రాన్ ఖాన్!?
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ దారుణంగా పొరపడ్డారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరును శశికళగా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ మధ్యే చనిపోయిన శశికళ.. ప్రజల మనసుల్లో బతికే ఉన్నారంటూ.. ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇమ్రాన్ ఖాన్.. వాస్తవాలు తెలుసుకుని ట్వీట్ చేస్తే మంచిది. లేకపోతే పరువు పోతుంది అంటూ విమర్శకులు వరుస ట్వీట్లు గుప్పించారు. అవినీతి గురంచి ఇమ్రాన్ మాట్లాడుతూ... ‘దక్షిణ భారత ప్రముఖ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ ఈ మధ్యే మరణించారు. ఆమె ఇంట్లో భారీ స్థాయిలో బంగారు, వెండి, కోట్ల రూపాయల అక్రమ సొమ్మును గుర్తించారు. ఇదంతా అవినీతి సొమ్మే. పేద ప్రజల నుంచి దోచుకున్నదే’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. వెంటనే ఇమ్రాన్ ఖాన్ వెంటనే తొలగించారు. ఇమ్రాన్ తప్పుడు ట్వీట్‌పై గల్ఫ్ న్యూస్‌లో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సాదిక్ ఎస్ భట్ గుర్తించారు. వెంటనే ఆయన డియర్ ఇమ్రాన్ ఖాన్, మీరు తప్పుడు ట్వీట్ చేశారు. దానిని దిద్దుకోండి అంటూ రిప్లయి ట్వీట్ చేశారు. అంతేకాక చనిపోయింది జయలలిత అని, అవినీతి ఆరోపణలపై ఇప్పుడు జైల్లో ఉన్నది శశికళ అని ఆయన చెప్పారు. జయలలితకు శశికళ స్నేహితురాలు అని చెప్పారు. ఇదిలాఉండగా.. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి తప్పుడు ట్వీట్లు చాలనే చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి కూడా ఇటువంటి పొరపాటునే ట్విటర్లో చేశారు. Dear @ImranKhanPTI you got it completely wrong. Sasikala is in jail. Her friend Jayalalitha, ex-CM of Tamil Nadu, died late last year and those pictures are obviously fake. One expects better from a senior politician like you. pic.twitter.com/6arkmZBYVD — Sadiq S Bhat (@sadiquiz) December 19, 2017 -
20 సెకన్ల వీడియో.. ప్రభావం ఎంత?
సాక్షి, చెన్నై : పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండువారాలు ప్రచారం నిర్వహిస్తే.. సరిగ్గా 24 గంటలకు ముందు జయలలిత వీడియో విడుదల చేసి దినకరన్ వర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటిదాకా వార్తల్లో నిలిచిన అంశాలను ముఖ్యంగా డబ్బు పంపిణీ వంటి వాటిని ఈ వార్త ఒక్కసారిగా తెరవెనక్కు నెట్టేసింది. అనర్హత వేటు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే వెట్రివెల్ వీడియోను విడుదల చేస్తూ ఉప ఎన్నికకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం అమ్మ మరణం వెనుక శశికళ పాత్ర లేదని నిరూపించేందుకు.. చికిత్స మెరుగ్గా అందించామని చెప్పేందుకే విడుదల చేశామని చెప్పటంతోనే అసలు చర్చ మొదలైంది. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం తనకేం పట్టన్నట్లు ఉండటం.. పైగా నేతలను మౌనంగా ఉండాలంటూ ఆదేశించటం... ఈ ఎపిసోడ్ వెనుక వేరే ఏదో మతలబు ఉందన్న సంకేతాలను ముందుగా అందించింది. ప్రతిపక్షాలు కూడా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో పెద్దగా స్పందించలేదు. కానీ, ఏడాది తర్వాత ఈ సమయంలోనే ఎందుకు రిలీజ్ చేశారన్న ప్రశ్న.. వీడియో అసలుదేన్నా అన్న అనుమానంతో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల దినకరన్ వర్గానికి ఒరిగేదేం లేదని వారంటున్నారు. వీడియో చూసి ఎమోషనల్‌గా అమ్మ సెంటిమెంట్‌కు జనాలు కనెక్ట్ అయ్యి ఓట్లు వేయటం కూడా అనుమానమేనని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ‘ టిపికల్ పొలిటికల్ స్టంట్’ గా దీనిని అభివర్ణిస్తున్న విశ్లేషకులు.. దాని ప్రభావం తెలియాలంటే మరో మూడు రోజులు(ఫలితాలు వచ్చేదాకా) ఓపిక పట్టాల్సిందేనంటున్నారు. -
జయ వీడియో.. ఇంత దిగజారుడు రాజకీయమా?
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో తాజాగా వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. జయలలిత సొంత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఈ వీడియోలు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. పలు అనుమానాల నడుమ జయలలిత మృతి మిస్టరీగా మారగా.. ఇప్పుడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ వీడియో, ఫొటోలు విడుదల కావడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ' ఇప్పటికే జయలలిత మృతి మిస్టరీగా మారింది. ఇప్పుడు ఈ వీడియోలు విడుదల చేసి ఆమె మృతిపై రాజకీయం చేస్తున్నారు. ఇంతకన్నా దిగజారడం ఉండదు. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఈ ఈ వీడియో ప్రభావం ఉండదు' అని ఆయన అన్నారు. అయితే, ఈ వీడియో విడుదలను శశికళ, దినకరన్ వర్గం సమర్థించుకుంటోంది. అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందించిన చికిత్సపై కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి ఆరోపణలను కొట్టిపారేసేందుకే ఈ వీడియోను విడుదల చేశామని దినకరన్ వర్గం నేత టీ సెల్వన్ పేర్కొన్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఎలాంటి కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధమని చెప్పారు. కాగా, సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురువారం జరగనుంది. -
శ్వాస తీసుకోలేని స్థితిలో ఆస్పత్రికి జయ!
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆమె మృతి విషయంలో తాజాగా అపోలో ఆస్పత్రి టాప్ అధికారిపలు కీలక విషయాలు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 22న జయలలితను అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె అప్పుడు శ్వాస తీసుకోలేనిస్థితిలో ఉన్నారని అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. ‘శ్వాస తీసుకోలేని స్థితిలో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించాం’ అని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్‌కు తెలిపారు. ‘అయితే, చివర్లో అందరికి ఆశలకు భిన్నమైన ఫలితం వచ్చింది. అయినా అది విధి చేతుల్లో ఉంటుందని, ఆ విషయంలో ఎవ్వరం ఏమి చేయలేమని నేను భావిస్తాను’ అని ఆమె అన్నారు. జయలలిత మృతి పట్ల వస్తున్న అనుమానాలు, వివాదాలపై స్పందిస్తూ..ఢిల్లీ, ఎయిమ్స్, విదేశాలకు చెందిన ఉత్తమ వైద్యులతో జయలలితకు చికిత్స అందించామని, అపోలో ఆస్పత్రి ఉత్తమ చికిత్స అందించిందని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయమై విచారణ కొనసాగుతోందని, పూర్తి సమాచారాన్ని విచారించిన తర్వాత మిస్టరీ వీడిపోతుందని ఆమె అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ అరుముగస్వామి నేతృత్వంలో జయలలిత మృతిపై అనుమానాల నివృత్తికి ఎంక్వైరీ కమిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసింది. జయలలితకు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె పక్కన ఆమె ఆమోదించిన వ్యక్తులు, అవసరమైన వైద్యులు, నర్సులు ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్న విషయంలో ఆమెకు తెలుసా? అన్న ప్రశ్నకు తాను ఆమె పక్కన లేనందున సమాధానం చెప్పలేనని అన్నారు. అప్పటి ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల ఖరారు కోసం జయలలిత వేలిముద్రలను సేకరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
అమ్మకు.. లాలి
జయలలిత మరణంపై వివాదాలు ఎన్ని ఉన్నా, తమిళనాడు మొత్తం నిన్న.. డిసెంబర్ 5న ఆమెకు శ్రద్ధాంజలి ఘటించింది. జయ చనిపోయి ఏడాది అయింది. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు జయ విలక్షణమైన వ్యక్తిత్వం గురించి రాశాయి. 30 ఏళ్ల వయసులో జయ ‘కుముదం’ అనే పత్రికలో బయోగ్రఫీని పోలిన రచనలు చేశారు. ‘దేవుడు కనుక నాకు మళ్లీ మనిషిగా పుట్టే వరాన్ని ప్రసాదిస్తే స్కూల్లో చేరి హాయిగా చదువుకుంటాను’ అని ఆమె రాసుకున్నారు. జయ చిన్నప్పుడు, తన పక్కనే పడుకుని ఉన్న తల్లి కొంగును చేతికి చుట్టుకుని నిద్రపోయేవారట. తల్లి ఆ కొంగును తప్పించగానే చిన్నారి జయ నిద్ర లేచేదట. అందుకని, ఆమెకు నిద్రాభంగం కలక్కుండా, తన చెల్లిని వచ్చి పడుకోమని చెప్పి, అప్పుడు పైకి లేచేవారట జయ తల్లి. తండ్రి గురించి కూడా జయ కొన్ని విషయాలు చెప్పుకున్నారు. ఆయనకు ఏ పనీ చేతయ్యేది కాదు. సంపాదన లేదు. ఖర్చుమాత్రం ఎక్కువగా పెట్టేవారు. ఆయన చదువుకున్న వారే అయినప్పటికీ ఏనాడూ చిన్న ఉద్యోగం కూడా చేయలేదు. ఆ సంగతిని జయ బహిర్గతం చేశారంటే తండ్రి వైఖరి వల్ల ఆమె ఎంతగా బాధపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. చదువును వదలడం ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చి, ఇష్టం లేకుండానే సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి తమిళుల ఇష్ట కథానాయికగా ఎదిగిన జయలలిత జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉన్నాయి. -
'అమ్మ'కు ఘన నివాళి
-
జనసంద్రంగా మారిన మెరీనా బీచ్
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు 'అమ్మ' సమాధి వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద గల జయలలిత సమాధి వద్ద సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం 'అమ్మ'కు ఘన నివాళి అర్పించారు. వీరితో పాటు తమిళనాడు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జయకు నివాళులు అర్పించారు. అమ్మతో తమ అనుబంధాన్ని, రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుని పలువురు నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. పళని, పన్నీర్ నేతృత్వంలో మెరీనా బీచ్ నుంచి జయ అభిమానులు, పార్టీ శ్రేణులు శాంతియుత ర్యాలీ చేపట్టాయి. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన స్వల్ప అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. 5వ తేదీన సాయంత్రం అమ్మ కన్నుమూశారని ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. చెన్నై మెరీనాబీ చ్లో ఎంజీఆర్ సమాధి పక్కనే 6వ తేదీన జయకు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. -
అమ్మ.. నిన్ను మరువం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మా అంటూ తమిళ ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే జయలలిత తొలి వర్ధంతికే న్యాయపరమైన చిక్కులు సృష్టించే ప్రయత్నం జరిగింది. అయితే సోమవారం ఆ చిక్కులు తొలగిపో వడంతో వర్ధంతి నిర్వహణకు ప్రభుత్వం సన్నాహమైంది. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన స్వల్ప అనారోగ్యకారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిసెం బర్ 4న సాయంత్రం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు సమాచారం వచ్చింది. 5వ తేదీన సాయంత్రం కన్నుమూసినట్లుగా అధికారిక ప్రకటన విడుదలైంది. చెన్నై మెరీనాబీ చ్లో ఎంజీఆర్ సమాధి పక్కనే 6వ తేదీన జయకు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోగ్యంగా ప్రచారం చేసిన జయలలిత అకస్మాత్తుగా ఆస్పత్రి పాలుకావడం, కోలుకుంటున్నారని, రేపో మాపో డిశ్చార్జి అని ప్రచారం జరుగుతుండగానే కన్నుమూసారు. దీంతో జయ మరణంపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. జయ నెచ్చెలి శశికళవైపు అందరూ అనుమానంగా చూశారు. నిరసన గళం ఆస్పత్రిలో 75 రోజుల పాటు అత్యున్నత స్థాయిలో అంతర్జాతీయ వైద్యులు చేసిన చికిత్స ఏమైందని దేశవ్యాప్తంగా ప్రశ్న తలెత్తింది. ప్రతిపక్షాలు నిరసన గళమెత్తాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయి. అన్నాడీఎంకేలో చీలికవర్గ నేత పన్నీర్‌సెల్వం సైతం విచారణకు పట్టుబట్టారు. నలువైపులా వస్తున్న ఒత్తిళ్లతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25వ తేదీన రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించారు. మూడునెలల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్‌కు సీఎం గడువు విధించారు. వేలిముద్రలపై వివాదం గత ఏడాది అక్టోబరులో వచ్చిన మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే అభ్యర్థులకు జారీచేసిన బీఫారంలోని జయ వేలిముద్రలు ఆమె మరణించిన తరువాత వేసిన వని డీఎంకే న్యాయవాది శరవరణన్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడంతోపాటు వేలిముద్రల్లోని తేడాలను మీడియా ముందు ప్రదర్శించారు. జయలలిత మరణం అక్టోబరా లేక డిసెంబరా అనే అనుమానాలను ప్రజల్లో ఆయన లేవనెత్తారు. ఇప్పటికే అనేకమందిని విచారించిన కమిషన్ సోమవారం మరో 60 మందికి సమన్లు జారీచేసింది. హైకోర్టులో పిటిషన్ జయలలిత తొలి వర్ధంతి దగ్గరపడడంతో డిసెంబర్ 5వ తేదీన జయ సమాధి వద్ద వర్దంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ సన్నాహాలను అడ్డుకునే విధంగా న్యాయవాది దురైస్వామి మద్రాసు హైకోర్టులో గతనెల 28వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత వర్ధంతిని డిసెంబర్ 5వ తేదీన ప్రభుత్వం నిర్వహించకుండా స్టే విధించాలని పిటిషన్లో కోరారు. జయ మరణ తేదీ, సమయం నిర్ధారణ జరిగే వరకు అధికారికంగా వర్ధంతి నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించరాదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా హైకోర్టు న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ కొట్టివేశారు. అలాగే, జయ మరణ మిస్టరీపై పోలీసు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఆర్ కృష్ణమూర్తి అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వం తరఫున విచారణ కమిషన్ నియమించిన తరువాత మరో పోలీసు కేసు అవసరం ఏమిటని న్యాయవాదికి అక్షింతలువేసింది. దీంతో నేడు (మంగళవారం) జయలలిత తొలి వర్ధంతికి మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ ఉద్యోగులు వేర్వేరుగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. -
జయ కూతురినంటూ పిటిషన్..కోర్టు ఆగ్రహం!
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలినంటూ మరో మహిళ ముందుకొచ్చారు. జయలలిత కూతురిని తానేనని, కావాలంటే తనకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించవచ్చునని బెంగళూరు చెందిన అమృత అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకొచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జయలలిత కూతురిని తానేనని ఈ నెల 22న అమృత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించేందుకు ముందుకురావడంతో ఈ పిటిషన ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత కూతురైన తనను ఆమె సోదరి, భర్త పెంచి పెద్ద చేశారని, డిసెంబర్ 5న జయలలిత మృతిచెందిన తర్వాత తన జన్మరహస్యాన్ని వారు తనకు వెల్లడించారని అమృత తన పిటిషన్లో పేర్కొన్నారు. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జయలలి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో జయ వారసులమంటూ గతంలో కూడా కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. -
‘అలా చేయడం అమ్మను అవమానించడమే’
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో ఐటీ సోదాలు చేయడం అమ్మను అవమానించడమే అని అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు.. పోయెస్ గార్డెన్, వేద నిలయంలో ఐటీ దాడులు నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. ఈపీఎస్, ఓపీఎస్ కలిసే ఈ డ్రామా ఆడుతున్నారని దినకరన్ మండిపడ్డారు. డీఎంకే హయాంలో జయలలిత నివాసంలో సోదాలు జరిగాయని, అయితే ఇప్పుడు అన్నాడీఎంకే పాలనలోనే పోయెస్ గార్డెన్లో తనిఖీలు జరగడంతో జయలలిత ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇటీవల శశికళ, దినకరన్, జయ టీవీ కార్యాలయంతో పాటు దేశంలోనే 187 ప్రాంతాలలో రికార్డు స్థాయిలోదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడులపై గుంభనంగానే ఉన్నా జయలలిత నివాసంలో తనిఖీలపై తీవ్ర నిరసన ఎదురవుతోంది. ముందస్తుగానే న్యాయస్థానం అనుమతి తో జయటీవీ ఎండి వివేక్ నుండి తాళాలు తీసుకున్న అధికారులు జయ నివాసంలో సుమారు మూడు గంటలపాటు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి జయ అంతరంగిక గదితోపాటు ఆమె సహాయకుడైన పూకుండ్రన్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు అక్కడి నుండి ఓ ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి జయ నివాసంలో ఐటీ దాడులు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటుంది. -
శశికళకు భారీ షాక్!
నకిలీ, బోగస్ పేర్లతో ఉన్న సంస్థల జప్తులో భాగంగా శశికళ, ఆమె కుటుంబ ఆస్తులపై కేంద్రం గురిపెట్టినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తుల్లో సీఎం పళనిస్వామి ప్రభుత్వం నిమగ్నమైనట్టు తెలిసింది. నల్లధనం నిర్మూలన లక్ష్యంగా చర్యలు చేపట్టిన కేంద్రం, నకిలీ, బోగస్ సంస్థలను గుర్తించి, వాటి భరతం పట్టే విధంగా ముందుకు సాగుతోంది. ఆయా సంస్థల ఆస్తుల్ని జప్తుచేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, కుటుంబీకుల సంస్థలు కూడా ఉన్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో అమ్మ జయలలిత గొడుగు నీడలో గతంలో చిన్నమ్మ శశికళ కుటుంబం సాగించిన అవినీతి భాగోతాలకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని పసిగట్టిన జయలలిత 2011లో శశికళ కుటుంబీకుల్ని సాగనంపిన విషయం తెలిసిందే. జయలలితకు తెలియకుండా కోట్లాది రూపాయాల్ని ఆర్జించి, విదేశీ బ్యాంకుల ద్వారా కొన్ని సంస్థలకు నగదు బదిలీలు సాగినట్టు ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చి ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం కేసు శశికళతో పాటు ఆమె కుటుంబానికి చెందిన పలువురి మీద ఉండడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన జాబితాలో పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ, ఆమె కుటుంబానికి చెందిన పలు సంస్థల పేర్లు ఉన్నట్టు తెలిసింది. నకిలీ కంపెనీలుగా గుర్తింపు శశికళ, ఆమె కుటుంబీకుల పేర్లతో ఉన్న ఆరేడు కంపెనీలు నకిలీవిగా గుర్తించి, వాటి ఆస్తుల జప్తు మీద దృష్టి పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఎప్పుడెప్పుడు చిన్నమ్మ కుటుంబం భరతంపడుదామా..? అని ఎదురుచూస్తున్న సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పాలకులు ఇందుకు తగ్గ పనుల్ని చాప కింద నీరులా వేగవంతం చేసినట్టు తెలిసింది. చిన్నమ్మ కుటుంబీకుల ఆస్తుల్ని, సంస్థల్ని గుర్తించడం పాలకులకు పెద్ద కష్టం ఉండదని చెప్పవచ్చు. ఇందుకు కారణం, ఇదివరకు చిన్నమ్మ గొడుగు నీడలో అమ్మకు పాదపూజ చేసిన వాళ్లే ప్రస్తుతం అధికారంలో ఉండటమే. -
చిక్కేది ఎవరో?
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై కమ్ముకున్న అనుమానాల మేఘాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఏట్టకేలకూ పనిచేయడం ప్రారంభించింది. కమిషన్ చైర్మన్‌గా గతంలో బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి శుక్రవారం చెన్నై ఎళిలగం భవనంలోని కమిషన్ కార్యాలయానికి వచ్చి విచారణ పనుల్లో నిమగ్నమయ్యారు. జయ మరణ మిస్టరీకిబాధ్యులను చేసే ప్రయత్నంలో ఎవరెవరు విచారణకుగురవుతారోననే చర్చ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై : స్వల్ప అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తరువాత బాహ్య ప్రపంచంలోకి రాకుండానే అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. కోలుకుని ఇంటికెళ్లాల్సిన జయలలిత కానరానిలోకాలకు పోవడంపై అమ్మ అభిమానులు కోపంతో భగ్గుమన్నారు. న్యాయవిచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని అప్పటి అన్నాడీఎంకే చీలిక వర్గనేత పన్నీర్‌సెల్వం, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నలువైపులా ఒత్తిడి పెరగడంతో న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సీఎం ఎడపాడి పళనిస్వామి గత నెల 25వ తేదీన ఒక ప్రకటన చేశారు. కమిషన్ చైర్మన్‌గా రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామిని నియమించి జయ మరణంపై మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చెన్నై మెరీనాబీచ్రోడ్డులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ ఎళిలగం భవనంలో కమిషన్ కార్యాలయాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా కమిషన్ ఏర్పాటై నెలరోజులు పూర్తయినా దాటినా విచారణ ప్రారంభం కాలేదు. కార్యాలయ పనులు పూర్తికానందున మరింత జాప్యం ఖాయం, గడువులోగా నివేదిక సమర్పణ అసా«ధ్యమని రెండురోజుల క్రితం మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమిషన్ కార్యాలయానికి వచ్చి పనులు ప్రారంభించారు. ఈనెల 30వ తేదీన పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని పరిశీలించడం ద్వారా ఆర్ముగస్వామి తన విచారణకు శ్రీకారం చుట్టనున్నారు. న్యాయవిచారణ సందర్భంగా ఎవరెవరిని విచారణకు పిలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పోయెస్‌గార్డెన్‌లోని జయ ఇల్లు వేదానిలయం పరిశీలనతో విచారణలో అసలైన అంకం సోమవారం ప్రారంభం అవుతుంది. విచారణ పారదర్శకంగా జరుగుతుందాని ప్రశ్నించగా ‘తప్పకుండా’ అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఒక నోటీసు బోర్డు పెట్టారు. అందులో...జయలలిత మరణం గురించి ప్రత్యేక సమాచారం ఉన్నవారు, నేరుగా సంబంధాలు ఉన్నవారు తగిన ఆధారాలతో సత్యప్రమాణ పత్రం ద్వారా లిఖితపూర్వకంగా తెలుపవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 22వ తేదీలోగా నేరుగా లేదా పోస్టు ద్వారా తమ సమాచారాన్ని చేరవేయవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా, జయ మరణ నేపథ్యంతో సంబంధం ఉన్నవారిని ఆయన నేరుగా పిలిపించి మాట్లాడతారా లేక ఆయన వెళ్లి విచారిస్తారు, విచారణ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి అనే ప్రశ్నలు నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా, పార్టీ నుంచి చీలిపోయిన తరువాత పన్నీర్‌సెల్వం వర్గంలోని కొందరు నేతలు తమ వద్ద సాక్ష్యాధారాలున్నట్లు మీడియా వద్ద ప్రకటించారు. అయితే ప్రస్తుతం వారంతా ఎడపాడితో కలిసిపోయారు. ప్రజలు ఎక్కువగా అనుమానిస్తున్న శశికళను ప్రధానంగా విచారించాలని కోరుకుంటున్నారు. విచారణ కోసం ఆమెను చెన్నైకి రప్పిస్తారా, కమిషన్ చైర్మనే బెంగళూరు జైలుకు వెళతారా, చికిత్స చేసిన లండన్ వైద్యుడి మొదలుకుని అపోలో వైద్యబృందం కూడా కమిషన్ వద్ద క్యూకట్టాల్సిందేనాని చర్చోపచర్చలు సాగుతున్నాయి. -
అమ్మ కారు ఆమెకేనట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో జయలలితది ఒక బ్రాండ్. వేష, భాషలే కాదు రాజకీయ చతురతలో సైతం ఆమెది ప్రత్యేక శైలి. సుమారు ఏడాది క్రితం అమ్మ మరణంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోగా, ప్రస్తుతం శశికళ సంచారంతో జయ వినియోగించిన కారు ఒక కథగా మారింది. అన్నాడీఎంకేలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను ‘టీఎన్ 09–బీఇ 6167’ ఈ నంబరు ఏ వాహనానిది అని అడిగితే అమ్మ కారుదని ఠక్కున చెప్పేస్తారు. డ్రైవర్ పక్కన ఆశీనులైన అమ్మ అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ రోడ్డున సాగిపోతుంటే అభిమానులు ఆనందపరవశులై జయ జయ ధ్వానాలు చేసేవారు. ఆ వాహనం, రిజిస్ట్రేషన్ నెంబరు అన్నాడీఎంకే శ్రేణుల హృదయాల్లో అంతగా ముద్రపడిపోయింది. జయలలిత మరణం తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టన శశికళ తన చీరకట్టు, పాపిడిబొట్టు సైతం జయలలితలాగనే మార్చుకుని అదే కారుల్లో పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారు. మంత్రి పదవులను కాపాడుకోదలుచుకున్న నేతలు అమ్మకు పెట్టినట్లే చిన్నమ్మకు సైతం వంగివంగి దండాలు పెట్టారు. అయితే కార్యకర్తలు మాత్రం శశికళను ఖాతరు చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత చిక్కినపుడు రెండు టయోటా బ్రాడా కార్లు, ఒక టెంపో ట్రావలర్, ఒక టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, అంబాసిడర్ కారు, మహేంద్ర బొలెరో, స్వరాజ్ మజ్దా మేక్సీ, 1990 మాడల్ కాంటెసా కారు తదితర 9 వాహనాలను కేసులో చేర్చారు. 1996 నాటి ధరల ప్రకారం ఈ వాహనాల విలువ రూ..42.25 లక్షలుగా లెక్క కట్టారు. జామీనులో బైటకు వచ్చిన అనంతరం 6167 కారును జయ వాడటం ప్రారంభించారు. ఈ కారులోనే సచివాలయం, పార్టీ ప్రధాన కార్యాలయం సహా అన్ని కార్యక్రమాలకు జయ వినియోగించేవారు. కాగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు పెరోల్‌పై ఐదు రోజుల చెన్నైలో ఉన్న శశికళ ప్రస్తుతం 6167 కారునే వినియోగిస్తున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తరువాత పోయస్గార్డెన్లో ఉన్న ఈ కారు ఎలా, ఎప్పుడు బైటకు వెళ్లింది, ఇన్నాళ్లు ఎవరి స్వాధీనంలో ఉంది, ఒక ముఖ్యమంత్రి వినియోగించిన కారు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి నేడు శశికళ వినియోగంలోకి ఎలా వచ్చిందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై దినకర్ వర్గంలోని ఒక నేత మాట్లాడుతూ, కార్లన్నీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుకున్నందున తనపేరుపై కార్లు ఉంటే అచ్చిరాదని భావించిన జయలలిత దినకరన్ పేరున ఒకటి, అతని భార్య అనూరాధ పేరున మరో కారును కొన్నట్లు తెలిపారు. మరణించే వరకు జయలలిత ఈ రెండు కార్లనే వినియోగించగా, ఆ తరువాత దినకరన్ స్వాధీనంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సదరు కారుపై శశికళ మోజుపడటంతో మరెవ్వరూ వినియోగించ కుండా జాగ్రత్త చేయగా ఆమె కోర్కె మేరకు పెరోల్ ఐదురోజుల వినియోగానికి 6167 కారును బైట పెట్టినట్లు ఆయన వివరించారు. జయ సమాధి వద్దకు నో పెరోల్‌పై బెంగళూరు జైలు నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి, ఇంటి మధ్య తిరుగుతున్న శశికళ పనిలో పనిగా జయలలిత సమాధి వద్దకు వెళ్లాలనే ప్రయత్నాలను పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. జైలు కెళ్లే ముందు అమ్మ సమాధిని శశికళ దర్శించకున్న సమయంలో సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరచడాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. సుమారు 7 నెలల తరువాత జైలు నుండి వచ్చిన శశికళను మరలాఅమ్మ సమాధి వద్దకు అనుమతిస్తే ఎటువంటి పోకడలకు పోతారోనని పోలీసు అనుమానిస్తోంది. పెరోల్ సమయంలో రాజకీయ జోక్యం ఎంతమాత్రం ఉండరాదని షరతు విధించగా, అమ్మ సమాధిని దర్శించుకోవడం కూడా రాజకీయాల కిందకు వస్తుందని భావించి ఆమె కోర్కెను పోలీసుశాఖ నిరాకరించింది. కాగా, శశికళ సోమవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి భర్త నటరాజన్‌ను మూడో రోజు పరామర్శించారు. -
చిహ్నం కోసం..
రెండాకుల చిహ్నం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఎదుట లక్షలాదిగా ప్రమాణ పత్రాలను ఈపీఎస్, ఓపీఎస్, టీటీవీ శిబిరాలు సమర్పించి ఉన్నాయి. ప్రమాణ పత్రాల సమర్పణ పర్వం ముగియడంతో ఆరో తేదీన విచారణ నిర్వహించేందుకు సీఈసీ వర్గాలు నిర్ణయించాయి. చిహ్నం తమకే దక్కుతుందని ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, చెన్నై : జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీ రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం శిబిరాల ఏకంతో అందుకు తగ్గ ప్రమాణ పత్రాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరాయి. అయితే, ఇరు శిబిరాల ఏకంతో పాటుగా సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, తదుపరి సాగిన పరిణామాలను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చేందుకు సీఎం, డిప్యూటీ శిబిరాలు సిద్ధమయ్యాయి. అలాగే, అన్నాడీఎంకే తమదేనన్నట్టు చిన్నమ్మ శశికళ తరపున ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సైతం తన వద్ద ఉన్న ప్రమాణ పత్రాలు, వివరాలతో కూడిన ఆధారాలను సీఈసీకి సమర్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు శనివారంతో ముగియడంతో ఆ రోజున ప్రమాణ పత్రాలు చెన్నై నుంచి ఢిల్లీకి లారీల్లో తరలించి మరీ దాఖలు చేయడం గమనార్హం. 6న విచారణ సీఈసీ ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది. దీంతో ఆ రోజున తమ వద్ద ఉన్న అన్ని వివరాలు, ప్రమాణ పత్రాలను లక్షలాదిగా సీఎం, డిప్యూటీ, దినకరన్ శిబిరాలు వేర్వేరుగా దాఖలు చేశాయి. సీఎం, డిప్యూటీల తరఫున మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, ఉదయకుమార్, సీనియర్లు కేపి మునుస్వామి, మనోజ్ పాండియన్, ఎంపీ మైత్రేయన్ ఢిల్లీ వెళ్లి అన్ని వివరాలను అందించారు. దినకరన్ తరఫున కర్ణాటక పార్టీ నేత పుహలేంది నేతృత్వంలోని బృందం ప్రమాణ పత్రాలను సమర్పించాయి. ఈ పర్వం ముగియడంతో ముందుగా నిర్ణయించిన మేరకు ఆరో తేదీన రెండాకుల చిహ్నం కైవసం వ్యవహారం విచారణకు సీఈసీ చేపట్టనుంది. దీంతో ఆ చిహ్నం దక్కేదెవరికో అన్న ఉత్కంఠ పెరిగింది. అదే సమయంలో తమకు మరో రెండు రోజులు గడువు ఇస్తే, అదనంగా ప్రమాణ పత్రాలు దాఖలు చేస్తామని మరో మారు దినకరన్ అభ్యర్థించగా సీఈసీ నిరాకరించింది. ఈ విషయంగా దినకరన్‌ను ప్రశ్నించగా, తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ సమర్పించామని, ఆ చిహ్నం తమకు దక్కుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలోని స్లీపర్ సెల్ ఎమ్మెల్యేలు మరి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయం అని పేర్కొన్నారు. ప్రభుత్వ కుప్పకూలడం ఖాయం : స్టాలిన్ అన్నాడీఎంకే పరిణామాలపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారు ఘనత ఏపాటితో ఆర్థిక పరిస్థితి స్పష్టం చేస్తోందని విమర్శిస్తూ, మోదీ అభయం ఉన్నా, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఖాయం అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ పళని స్వామి సీఈసీ వద్ద ప్రత్యేకంగా ఓ లేఖను సమర్పించడం గమనార్హం. అందులో అన్నాడీఎంకే నియమ నిబంధనలు గతంలో ఉన్నవే అనుసరించే రీతిలో సీఈసీ నిర్ణయం తీసుకోవాలని అందులో కోరారు. -
జయ మరణంపై స్టాలిన్ కొత్త పరిష్కారం
చెన్నై : అన్నాడీఎంకే మంత్రులకు నిజ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపట్ల తమకు అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని ముందునుంచి డిమాండ్ చేస్తున్న ఆయన తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి స్పందించారు. తాము జయలలితను చూశామని, ఆమెను ఆస్పత్రిలో కలిశామని కొందరు మంత్రలు, తాము చెప్పినవి అబద్ధాలని ప్రజలను మోసం చేసినందుకు క్షమించాలని మరికొందరు మంత్రులు చెప్పడం, ఆస్పత్రిలో చేరే సమయంలో జయలలిత స్పృహలో లేరని, ఆమె శ్వాస కూడా లేకుండా మగతగా పడి ఉన్నారని తాజాగా మెడికల్ రిపోర్టు బయటకు రావడంతో జయలలిత మృతి విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ స్పందిస్తూ 'ఈ అనుమానాలన్నింటికి పరిష్కారం ఒక్కటే అదే లై డిటెన్షన్ టెస్ట్. ప్రస్తుతం ఉన్న మంత్రులందరికీ నిజనిర్దారణ పరీక్ష చేస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయి' అని ఆయన రిపోర్టర్లకు చెప్పారు. -
నిజంగానే చూశారా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆస్పత్రిలో అందిన వైద్య చికిత్సపై తమిళనాడు మంత్రులు తలో వాదన వినిపిస్తూ ప్రజలను కంగు తినిపిస్తున్నారు. పొంతనలేని వ్యాఖ్యలతో అయోమయానికి గురి చేస్తున్నారు. ‘అమ్మ’ మృతిపై అనుమానాల నివృత్తి కోసం రిటైర్ట్ జడ్జి అర్ముగస్వామి నేత్వత్వంలో తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. జయలలిత కోలుకుంటున్నట్లుగా అపోలో ఆస్పత్రి వద్ద తనతోపాటు ఇతర మంత్రులు, పార్టీ ప్రముఖులు చెప్పిందంతా అబద్ధమని, శశికళకు భయపడే అలా చెప్పామని మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ ఇటీవల బహిరంగంగా ప్రకటించి కలకలం రేపారు. మరోవైపు జయను తామంతా నేరుగా చూశామని మంత్రి సెల్లూరు రాజా మంగళవారం పేర్కొన్నారు. అయితే ఆమెను ఎవరూ చూడలేదని, శశికళకు భయపడి చూసినట్లుగా చెప్పామని మంత్రి కేసీ వీరమణి షోళింగనల్లూరు బహిరంగ సభలో చెప్పారు. మంత్రి వెల్లమండి నటరాజన్ సైతం జయను చూడలేదని తాజాగా తెలిపారు. ఇక జయలలిత ద్రాక్ష తింటుండగా తాను చూశానని ఆమె మేనల్లుడు దీపక్ చెప్పటం గమనార్హం. ఈ నేపథ్యంలో కమిషన్ విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని మంత్రులు జయకుమార్, ఉదయకుమార్ తెలిపారు. -
అమ్మ మృతి.. అన్నీ అబద్ధాలే!
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు పళని ప్రభుత్వం కూడా వెనకంజ ఎందుకు వేస్తుందన్న ప్రశ్న ఆమె అభిమానులను ఇప్పటికీ వేదిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కీలక నేత దిండిగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయి. తీవ్ర అస్వస్థకు గురైన జయలలితను గత ఏడాది సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం అన్నాడీఎంకే పార్టీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి హాజరైన శ్రీనివాసన్ మాట్లాడుతూ... ఆమ్మ ఆస్పత్రిలో ఉన్న సమయంలో తాను మీడియా ముందు అబద్దపు ప్రకటనలు చేశానని చెప్పారు. ‘‘ఆ సమయంలో సోషల్ మీడియాలో అమ్మ ఆరోగ్యంపై పుకార్లు చెలరేగాయి. పార్టీని కాపాడుకునేందుకు కీలక నేతలు ఆమె కోలుకుంటుందని ప్రకటనలు చేశారు. కానీ, నిజానికి లోపల ఏం జరిగిందో? ఆమె ఎలా ఉందో? ఎవరికీ తెలియని పరిస్థితి’’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ‘జయకు ఓవైపు చికిత్స జరుగుతున్న సమయంలో ఆమె ఉన్న అంతస్తులోకి ఎవరినీ అనుమతించలేదు. గవర్నర్ విద్యాసాగర్ రావుసహా బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. కేంద్ర మంత్రి అరుణ జైట్లీ ఇలా ప్రముఖులను కూడా ఆమెను చూడనివ్వకుండా శశికళ అడ్డుకున్నారు. వారందరినీ అపోలో ఆస్పత్రుల హెడ్ ప్రతాప్‌రెడ్డి గదిలో కూర్చోబెట్టి ఆమె మాట్లాడారు. ఈ లెక్కన్న అమ్మ మృతిపై అనుమానాలు.. మరణం వెనుక ముమ్మాటికీ శశికళ, దినకరన్ హస్తం ఉంది’’ అంటూ శ్రీనివాసన్ ఆరోపించారు. అయితే దినకరన్ మాత్రం శ్రీనివాసన్ చేసిన ఆరోపణలను ఖండించారు. అక్టోబర్ 1 తర్వాత శశికళ అసలు జయలలిత దగ్గరే లేదని, పైగా జయను పరామర్శించినట్లు స్వయంగా గవర్నరే చెప్పిన విషయాన్ని దినకరన్ ప్రస్తావించారు. మొత్తానికి ఆస్పత్రిలో ఉన్న 72 రోజుల్లో... 65 రోజులు ఆరోగ్యంగానే ఉన్నారని.. పాలనా వ్యవహారాలు చూసుకోవటం.. కావేరీ జల వివాదంపై ప్రకటన.. ఉప ఎన్నిక గురించి ప్రస్తావన.. చివరకు తమిళ ప్రజల పూజలతో పునర్జన్మ అంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ పచ్చి అబద్ధమని శ్రీనివాసన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైపోయింది. దక్షిణాది ని రక్షిద్దాం... , అమ్మ తర్వాత నేనే సీఎం! -
తమిళనాట అమ్మ జనసేన పార్టీ
చెన్నై: తమిళనాట కొత్త రాజకీయ పార్టీ స్థాపించుటకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అమ్మ జనసేన పార్టీ స్థాపించనున్నారు. అదే విధంగా పార్టీ జండాను కూడా ఖరారు చేశారు. ఈ పార్టీ ఆంధ్ర, తెలంగాణా ,కేరళ. పుదుచ్చేరి, కర్ణాటక ప్రాంతాల్లో స్థాపించబడుతోంది. ‘ దక్షిణాది ని రక్షిద్దాం ’... అనే నినాదం తో ఈ ప్రాంతాల్లో ప్రజల ముందుకు వస్తోంది. దక్షిణాది లో ప్రధానమంత్రి, వారి మంత్రి వర్గ సహచరుల కార్యాలయాల సాధన, నేలలో 5 రోజులు ఇక్కడ ఉండే విధంగా పోరాటం చేయాలి. విద్యా, వైద్య, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు కు నేలకు 5 వేలు అన్నదాత పేరుతో పెన్షన్ ఇచ్చే విధంగా పోరాటం, పొలం బాటలో మరణించిన వారికి ఆర్ధిక సహాయం ,ఆహార పంటలను పండించే రైతులకు కావాల్సిన విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు ఉచితంగా ఇవ్వటం, రైతు కోఆపరేటివ్ సొసైటీలు పెట్టి వారికి నిత్యవసర వస్తువులను జి.ఎస్.టి లేకుండా ఇవ్వటం, వాణిజ్య పంటలు కాకుండా ఆహార పంటలు పండించే వారికి ప్రభుత్వం అవసరమైన ట్రాక్టర్లు, పంట కటింగ్ మిషన్లను ఎలాంటి అద్దె లేకుండా కేవలం డీజిల్ ధర చెల్లించినచో రైతు కార్పొరేషన్ ద్వారా ఉచితంగా ఇవ్వటం, ప్రతిబిడ్డ పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు పోషణ నిమిత్తం నెలకు రూ. 1,500 చైల్లించాలని, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు నెలకు మందులకు, వారి అవసరాలకు రూ. 3 వేలు చెల్లించుటకు చర్యలు, పిల్లలకు 1వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉచిత విద్య, ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు విదేశీ చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులు చైల్లించటం, రూ. 15,000 లోపు జీతం గల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి కత్తిరింపులు లేకుండా నికర జీతాన్ని చెల్లించడం, మల్టిఫ్లెక్స్ సినిమా థియేటర్లలో కచ్చితంగా సగం సీట్లు టికెట్ ధరలు రూ. 50 మించకుండా ఉండటం. ప్రాంతీయ చిత్రాలను విధిగా అన్ని సినిమా హాళ్లలో ప్రదర్శించే విధంగా చర్యలు. సినిమా హాల్స్ నందు పార్కింగ్, తినుబండారాల దోపిడీని నియంత్రించడం. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్ లో 25 శాతం పేదవారికి పుట్టినప్పటి నుండి 5 ఏళ్ల వరకు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు విధిగా ఉచిత వైద్యం అందిచటం. మాతృభాషలో చదువుకున్న వారికి ఉద్యోగాలో, కళాశాలలో ప్రవేశానికి స్పెషల్ కోటా. ప్రతి గ్రామీణ విలేకరులకు నెలకు రూ. 5,000 చెల్లించటం, గ్రామీణ విద్యార్థులకు, ప్రైవేటుగా రూ. 5,000 లోపు జీతం ఉన్న వారికి ఉచిత బస్ ప్రయాణం. ప్రతి ఇంటికీ బాత్రూమ్ నిర్మించకపోతే ప్రభుత్వ రాయితీలు రద్దు చేసే విధంగా చట్టం. 18 నుంచి 50 ఏళ్ల మహిళలకు ఉచితంగా కేర్ ఫ్రీని అందించడం. పుట్టిన ప్రతిబిడ్డకు ఉచితంగా ఒక కిట్టుతో పాటు వెండి మొలతాడు. ప్రతి వికలాంగుడికి ప్రభుత్వ ఉద్యోగం, లంచగొండి ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ తో పనిలేకుండా కచ్చితంగా నేరుగా ఉద్యోగ విరమణ. మరణించిన పేదల దహన సంస్కారల కొరకు రూ. 5,000 చెల్లించుట. ప్రతి గ్రామానికో గ్రంధాలయం, అందులో ఇంటర్నెట్ సౌకర్యం. పేద వయసు మళ్లిన కళాకారులను వృద్ధాశ్రమంలో చేర్చి వారికి డాక్టర్లతో పర్యవేక్షణ. నెలకు రూ. 5,000 లోపు ఆదాయం ఉన్న సెల్ ఫోన్ వినియోగదారులకు నెలకు 1 జి. బి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం. పట్టణ ప్రాంతాల్లో రద్దీ గా ఉండే ప్రాంతాల్లో నేరుగా ప్రజల వద్దకు పాలన, మీ సమస్య 24 గంటల్లో వెబ్ కెమెరాల ద్వారా మా పరిష్కారం. ‘ సేవ్ దక్షిణ భారత్’ అనే నినాదంతో ఈ పార్టీ పనిచేస్తుందని కేతిరెడ్డి తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ, జయలలిత సమాధి వద్ద ప్రతిన బూని పాదయాత్ర ద్వారా దక్షిణ భారతదేశం మొత్తం తిరిగి ప్రజాధికారం విలువలను ప్రజలకు తెలియ చేయనున్నట్లు.. ఓటుకు ఉన్న సత్తాను, అలాగే తన ఉద్దేశాన్ని ప్రజలకు ఈ పాదయాత్ర ద్వారా తెలుపనున్నట్లు కేతిరెడ్డి చెప్పారు. -
'జయ మృతి తర్వాత నేనే సీఎం అయ్యేవాడిని'
కోయంబత్తూరు: దివంగత నేత జయలలిత మరణించిన వెంటనే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడినని, కానీ సీఎం కావాలని ఆనాడు తాను కోరుకోలేదని అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ అన్నారు. తాను సీఎం పదవి తిరస్కరించడంతోనే శశికళ.. పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా నియమించారని చెప్పుకొచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శశికళ సైతం సీఎం పదవి చేపట్టే అవకాశమున్నా.. ఆమె కూడా ఆ పని చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు శశికళను, తనను పక్కనబెట్టి పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు శశికళను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఇటీవల విలీనమై.. అన్నాడీఎంకే నుంచి శశికళను, దినకరన్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పళనిస్వామి ప్రభుత్వంపై దినకరన్ తిరుగుబాటు లేవనెత్తారు. -
ఎడపాడికి ఎదురుదెబ్బ!
♦ మైనార్టీలోకి పడిపోయిన ప్రభుత్వం ♦ అదృష్ట సంఖ్యకు ఆమడదూరం ♦ గోడ దూకకుండా దినకరన్ జాగ్రత్తలు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్గ పోరు, అసంతృప్తివాదులతో ఊగిసలాడుతున్న ఎడపాడి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అదృష్ట సంఖ్యకు ఆమడ దూరంలో ఉండే ఈ సర్కారు ఉండేనా ఊడేనా అనే చర్చ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పన్నీరు కలయికతో సంబరపడ్డ పళని స్వామికి వెంటనే షాక్ తగిలింది. దీంతో ప్రభుత్వం పరిస్థితే అయోమయంలో పడిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో 32 ఏళ్లపాటూ వెన్నంటి నిలిచిన శశికళ జయ మరణం తరువాత పార్టీ, ప్రభుత్వం ఇక తన చెప్పు చేతుల్లోనే అని ఆశించారు. ఆమె ఆశించినట్లుగానే కొన్నాళ్లు సాగింది. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన నాటి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. శశికళ జైలు కెళ్లడం, తన ప్రతినిధిగా నియమితుడైన దినకరన్ సైతం పార్టీకి పూర్తిగా దూరం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 36 మంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారని భావిస్తూ వచ్చిన దినకరన్ మద్దతుదారుల సంఖ్య 19కి పడిపోయింది. ఎడపాడి, పన్నీర్ ఏకం కావడం శశికళ వర్గాన్ని మరింతగా బాధించింది. శశికళ సుదీర్ఘ రాజకీయ ఎత్తుగడలతో చేజిక్కించుకున్న అన్నాడీఎంకేలోనూ, ప్రభుత్వంలోనూ తమకు స్థానం లేకపోవడం ఏమిటని దినకరన్ వర్గం ప్రశ్నించడం ప్రారంభించింది. 22 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న తమను కాదని 11 మంది ఎమ్మెల్యేల బలం కలిగిన పన్నీర్‌ను అక్కున చేర్చుకోవడం ఏమిటని నిలదీసింది. నాడు కూవత్తూరు.. నేడు పుదుచ్చేరి జయ మరణం, పన్నీర్‌సెల్వం తిరుగుబాటు, దినకరన్ కుట్రలతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా నెలలుగా ఊగిసలాడుతోంది. ఎడపాడి, పన్నీర్ వర్గాల విలీనంతో ప్రభుత్వం మరింత సంక్లిష్ట దశలో పడిపోయింది. ఐదుగురు ఎమ్మెల్యేల కోసం ఎడపాడి ఎత్తువేసేలోగా ముందుగానే చిత్తు చేయాలని దినకరన్ వేగంగా కదిలారు. విలీనం అయిన మరుసటి రోజునే 19 మంది ఎమ్మెల్యేల చేత ఖంగు తినిపించారు. అంతేగాక తన వైపున గట్టిగా నిలిచి ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం తిరుగుబాటు సమయంలో మహా బలిపురం సమీపం కూవత్తూరులో శశికళ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలను నడిపించి సఫలీకృతులైనారు. ఆ అనుభవాన్ని ఒంటబట్టించుకున్న దినకరన్ మంగళవారం ఒక ప్రత్యేక బస్సులో పుదుచ్చేరికి తరలించారు. డీఎంకే అవిశ్వాస పరీక్ష పెట్టడం లేదా, గవర్నరే బలపరీక్షకు ఆదేశించడం పూర్తయితేగానీ 19 మంది ఎమ్మెల్యేలకు విముక్తి ఉండదని సమాచారం. -
'జయ మృతి విచారణకు కరుణించిన వెంకన్న'
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించడంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని తమిళనాడు ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. జయ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని గతంలో చెన్నై నుంచి తిరుమల వచ్చి ర్యాలీ నిర్వహించిన కేతిరెడ్డి అనంతరం వెంకటేశ్వర స్వామికి వినతిపత్రంతో పాటు మొక్కులు సమర్పించుకున్నారు. పళనిస్వామి నిర్ణయానికి మద్ధతు తెలిపిన ఆయన శనివారం మరోసారి తిరుమలకు వెళ్లి మొక్కులు సమర్పించుకోనున్నారు. వెంకన్న స్వామి కరుణించినందువల్లే విచారణ ప్రారంభం కానుందని, అమ్మ మృతికి కారణాలు నెగ్గుతేలాలని ఆకాంక్షించారు. జయలలిత మృతిపై ప్రధాని నరేంద్ర మోదీని గతంలో కలిసి సీబీఐ విచారణ కోసం విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జయ మృతిపై గతంలో సీఎంగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం ఎలాంటి విచారణకు మొగ్గుచూపలేదని, పదవికి రాజీనామా చేసిన తర్వాత జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో అమ్మ వీరవిధేయుడే ఆమె మృతిపై నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో అన్నాడీఎంకేపై ప్రజలు నమ్మకం కోల్పోయినట్లు కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ మద్ధతుతోనే జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అందుకు కారణమైన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 70 రోజులకు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న హఠాత్తుగా జయ మృతి చెందగా, దీని వెనుక ఆమె సన్నిహితురాలు శశికళ కుట్ర జరిగి ఉండొచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. జయకు ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి, వీఐపీలను కలవనీయకపోవడం, అక్కడ సీసీటీవీలు లేకపోవడంపై ఆమె మృతిపై సందేహాలున్నాయని సీబీఐ విచారణ జరిపించాలని అదే నెల 14న సుప్రీంకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆమె మృతిపై నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొంటూ.. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గతంలో ఆయన ధర్నా చేపట్టారు. సీబీఐ విచారణ కోసం మద్ధతు తెలపాలని కోరుతూ ఎంపీలందరికీ వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో జయపై విష ప్రయోగం జరగడంపై, పోయెస్ గార్డెన్లో అమ్మపై కుట్రలు జరిగాయని పిటిషన్లో పేర్కొన్నారు. విష ప్రయోగం తర్వాత శశికళను జయ పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టడం.. ఆపై కొన్ని రోజుల తర్వాత పథకం ప్రకారం పోయెస్ గార్డెన్లో శశికళ అడుగెపెట్టారని ఆరోపణలున్నాయి. జయలలిత జైలులో ఉండగా అన్నాడీఎంకే నేత నామినేషన్ పత్రాలపై వేసిన వేలిముద్రలు అమ్మవి కాదని, శశికళవని ఆయన పేర్కొన్నారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదంటూ ఇటీవల సీఎం పళనిస్వామి శిబిరం తేల్చడం, మరోవైపు అమ్మ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించడంతో పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. తిరుమలలో తన మద్ధతుదారులతో కేతిరెడ్డి (ఫైల్) సంబంధిత కథనం జయలలిత మరణంపై న్యాయ విచారణ -
జయ టార్గెట్ చేశారు
♦ విశ్వరూపం విడుదలలో రాజకీయం ♦ కామరాజనాడార్, ఎంజీఆర్, శివాజీ కూడా విద్యావేత్తలు కాదు ♦ పౌరుడిగా విమర్శించే హక్కుంది ♦ రాజకీయ పార్టీకోసం ఒత్తిడి చేయవద్దు ♦ ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, చెన్నై : జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను టార్గెట్ చేశారని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రశ్నకు బదులేదీ’ కార్యక్రమం కింద ‘తంది’ తమిళచానల్కు కమల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం ప్రసారమైంది. ఈ సందర్భంగా ఆయన పలు ఆంశాలను ఆయన ముక్కుసూటిగా ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే.. రాజకీయ విమర్శలు కొత్తగా చేస్తున్నవి కాదు, ముఖ్యమంత్రి జయలలిత నా సినీజీవితంపై ప్రత్యేకంగా గురిపెట్టారు. విశ్వరూపం సినిమాలో ఒక సామాజికవర్గాన్ని కించపరచలేదు, ఈ విషయాన్ని వారే అంగీకరించారు. సినిమా విడుదల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆనాటి పాలకుల రాజకీయమే. సినిమాను రాజకీయం చేసిన ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిపోయిన నేను రాష్ట్రం లేదా దేశం విడిచి వెళతానని అన్నాను. అంటే తెల్లదొరలతో చేరిపోతానని కాదు. ఇలాంటి వేధింపులు లేని మరో రాష్ట్రంలో స్థిరపడతానని అర్థం. నేను తీసుకున్న నిర్ణయానికి సిగ్గుపడాల్సిన నేతలు నేడు విమర్శలు చేస్తున్నారు. మనస్సులో ఏదో పెట్టుకుని నేను విమర్శలు చేయడం లేదు, ప్రజలతో పంచుకుంటున్నాను. దేశం మంచి మార్గంలో పయనించాలని ఒక పౌరుడిగా కోరుకోవడం, విమర్శించిడం నా హక్కు. దీన్ని ఎవరు తప్పు పట్టినా పట్టించుకోను. రజనీకాంత్ పార్టీ పెట్టినా తప్పుంటే విమర్శలకు వెనుకాడను. తమిళనాడు ప్రజలు నాయకత్వ లక్షణాలను ఉన్నవారిని కాకుండా నిపుణులను మాత్రమే వెదుకుతున్నారు. నాకు కనీసం ప్రాథమిక విద్య కూడా లేదని కొందరు హేళన చేస్తున్నారు. కామరా>జనాడార్ చదుకోకున్నా ప్రత్యేకమైన సమర్థత కలిగిన వారు, ప్రజల మన్నలను పొందారు. శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ కూడా ఉన్నత విద్యలు అభ్యసించలేదు. అయితే వారు ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా నిరూపించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు నేడు అటువంటి నేతలు లేరు. నిర్మాతగా, నటుడిగా సరైన మార్గంలో వెళుతున్నా, క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. నా చిన్నతనం నుంచే ఇంట్లో అందరం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మనఃపూర్వకంగా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తాం. ఈ చర్చల్లో ఆస్తికత్వం, నాస్తికత్వం అంశాలు కూడా మా చర్చల్లో చోటు చేసుకుంటాయి. మనసుకు తోచిన అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఎప్పుడూ నేను జంకలేదు. -
అమ్మ లేని లోటు కనిపిస్తోంది: మోదీ
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దివంగత ముఖ్యమంత్రి జయలలితను స్మరించుకున్నారు. 'అమ్మ ఇక్కడ లేని లోటు కనిపిస్తోంది. ఆమె ఆత్మ తన ఆశీస్సులను మనకు అందిస్తూనే ఉంటుంది' అని ప్రధాని మోదీ అన్నారు. 'అమ్మ ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే.. ఆమె ఎంతో సంతోషించి ఉండేవారు. శుభాకాంక్షలు తెలిపేవారు. మనమందరం గుర్తించుకోదగిన నేత ఆమె' అని అన్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారక మండపాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రామేశ్వరం జిల్లా పేయ్‌కరుంబులో రూ.15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కలాం యువతకు ఎంతగానో ప్రేరణ ఇచ్చారు. ఈ రోజు ఎంతోమంది యువత జాబ్ క్రియేటర్లుగా ఎదగాలనుకుంటున్నారు' అని చెప్పారు. కలాంను పేయ్‌కరుంబులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో రూ.15 కోట్లతో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు. అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా మోదీ ఈ మండపాన్ని ఆరంభించారు. అలాగే కలామ్ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అంతకు ముందు కలామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. -
జయలలిత సమాధిని తొలగించాలి
- మద్రాస్ హైకోర్టులో పిటిషన్ చెన్నై: దివంగత ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత మృతదేహాన్ని మెరీనాబీచ్ నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. ఎస్.దురైస్వామి అనే న్యాయవాది ఇటీవల వేసిన ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) సోమవారం విచారణకు వచ్చింది. అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ వంటి మహామహుల స్మారకాల సమీపంలో దోషిగా తేలిన జయలలిత సమాధి నిర్మాణం సరికాదని పిటిషనర్ వాదించారు. అంతేగాక బీచ్ తీరం నుంచి 500 అడుగుల్లో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకూడదని పర్యావరణ శాఖ నిషేధాజ్ఞలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయా కారణాల దృష్ట్యా మణిమండప నిర్మాణ పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని బీచ్ నుంచి తొలగించేలా ఆదేశించాలని పిటిషనర్ వాదించారు. -
'అమ్మ' ఫొటోలు గాయబ్!
చెన్నై: దివంగత నేత జయలలిత బతికున్నప్పుడు అన్నాడీఎంకేకు చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె పట్ల అపారమైన గౌరవాభిమానాలను చూపేవారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె పట్ల గౌరవాన్ని చాటుతూ అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని తమ టేబుళ్లపై జయలలిత ఫొటోలను పెట్టుకున్నారు. ఏదైనా అంశంపై సభలో మాట్లాడాల్సినప్పుడు, బల్లపై చరచాల్సినప్పుడు చాలా జాగ్రత్తగా అమ్మ ఫొటొను పక్కకుపెట్టి ఆ పని చేసేవారు. అలాంటి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తాజాగా తమ టేబుళ్ల నుంచి జయలలిత ఫొటోను తొలగించడం గమనార్హం. ఇటీవలి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల టేబుళ్లపై జయలలిత ఫొటోలు లేవు. అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లోనూ, డైరీల్లోనూ, ఆహ్వానాల్లోనూ జయలలిత ఫొటో ప్రముఖంగా కనిపించేది. గత బడ్జెట్ సమావేశాల్లోనూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రుల టేబుళ్ల ముందు ఆమె ఫొటోలు కనిపించాయి. కానీ, ఈ సమావేశాలకు వచ్చేసరికి తమ టేబుళ్లపై ఉన్న జయ ఫొటోను తొలగించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
ఎన్నికలకు శశికళ సిద్ధం!
చెన్నై : కేడర్ మన్ననలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా సంస్థాగత ఎన్నికల ద్వారా ఎంపికయ్యేందుకు శశికళ సిద్ధంగానే ఉన్నారని ఆమె భర్త, సంపాదకుడు నటరాజన్ వ్యాఖ్యానించారు. అమ్మ జయలలిత మరణంలో ఎలాంటి అనుమానాల్లేవు అని పేర్కొన్నారు. శశికళ ఎన్నడూ ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ సోమవారం ఓ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో దివంగత సీఎం జయలలిత ఆరోగ్యం గురించి, శశికళ , పన్నీరు సెల్వం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు.. జయలలిత మరణించారన్న విషయాన్ని తాను నేటికీ జీర్ణించుకోలేకున్నట్టు పేర్కొన్నారు. ఆమె మరికొంత కాలం తమిళ ప్రజలకు సేవలు అందిస్తారని భావించినట్టు తెలిపారు. తన ఆరోగ్యం గురించి జయలలిత నిర్లక్ష్యం వహించినట్టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో, కారు ఎక్కే సమయంలో ఆమెకు సాయంగా భద్రతాధికారులు చేతిని అందించే వారని, ఆ అధికారులైనా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని సూచించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రోగం వస్తే మందులు వేసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే సమస్య జఠిలం అవుతుందన్న విషయాన్ని పరిగణించాల్సిన అవసరం ఉందని సూచించారు. జయలలిత మీద శశికళకు ఎంతో గౌరవం ఉందని, ఆరోగ్య విషయంగా ఆమెకు సూచనలు, సలహాలు ఇచ్చారో ఏమో గానీ, ఇచ్చేందుకే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే, ఎన్నడూ ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం శశికళ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. జయలలితను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా వెన్నంటి ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అమ్మ మరణంలో ఎలాంటి అనుమానాలు లేవు అని, రాజకీయ లబ్ధి కోసం పన్నీరు సెల్వం లాంటి వాళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. అనుమానం అన్నది ఉండి ఉంటే, సీబీఐ విచారణకు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆదేశించి ఉండాల్సిందని పేర్కొన్నారు. అపోలో, ఎయిమ్స్ , లండన్ వైద్యులు అమ్మ ఆరోగ్యం మెరుగుకు అందించిన చికిత్సల గురించి ఇప్పటికే వివరించి ఉన్నారని, అలాంటప్పుడు అనుమానాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అన్నాడీఎంకేని రక్షించుకోవాల్సిన బాధ్యత శశికళ మీద ఉందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ›ప్రధాన కార్యదర్శి నియమాకాన్ని ఎన్నికల కమిషన్ రద్దుచేసిన పక్షంలో ఎన్నికల ద్వారా మళ్లీ ఎన్నికయ్యేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారన్నారు. రెండాకుల చిహ్నం అమ్మశిబిరానికి తప్పకుండా దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం పళని స్వామి, శశికళ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ చివరగా ఆయన ముగించడం గమనార్హం. ఇక, అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ దాఖలు చేసుకున్న తీర్పు పునస్సమీక్షా పిటిషన్ ఆరో తేదీ విచారణకు రానున్నడంతో ఆమె భర్తతో పాటు, ఆ శిబిరం వర్గాలు ఎదురుచూపుల్లో ఉన్నాయి. -
రజనీని అడ్డుకుంటున్న కుటుంబసభ్యులు
►తలైవా ఇంట..రాజీకీయం! ►శారీరక, మానసిక శ్రమ తప్పదని హితవు ►అభిమాన సంఘాలతోనే ప్రజాసేవని సూచన చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ముందుకు మూడు అడుగులు, వెనక్కు రెండడుగులుగా సాగుతోంది. ఇంతకూ రజనీ రాజకీయ పార్టీ పెడతారా లేక మరేదైనా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వస్తారాని ప్రజలు బుర్రలు బద్దలుకొట్టుకుంటుండగా ఆయన కుటుంబ సభ్యులే బ్రేక్ వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత నెలలో ఐదురోజులపాటు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ రాజకీయాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలపై పరోక్షంగా విమర్శలు, మరికొందరు పేర్లు ప్రస్తావించి ప్రశంసలతో వివాదాలు రేకెత్తించారు. రజనీకాంత్ తమిళేతరుడని, రాజకీయ పార్టీ పెట్టడమో, సీఎం కావడమో సహించేది లేదని కొన్నిపార్టీలు దుయ్యబట్టాయి. మరి కొందరు స్వాగతించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లో వస్తానని యథాప్రకారం పేర్కొన్న రజనీకాంత్, ‘యుద్ధం వస్తుంది, ఇపుడు వెళ్లి అపుడు రండి’ అంటూ అభిమానులకు నర్మగర్భంగా సంకేతాలు ఇచ్చారు. కాల షూటింగ్ కోసం ముంబయి వెళ్లినపుడు అమితాబచ్చన్‌ను కలిసి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోగా, రాజకీయాల్లో తన అనుభవాలను అమితాబ్ వివరించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి దారుణంగా విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో పార్టీ పెడితే తనకు ఎదురయ్యే సమస్యలు, ఫలితాలు ఎలా ఉంటోయోనని రజనీకాంత్ బేరీజు వేసుకుంటున్నారు. జయలలిత మరణం, కరుణానిధి బైటకు రాలేని స్థితిలో అనేక పార్టీల నేతలు సీఎం కుర్చీకోసం కలలు కంటున్నారు. ఈ పరిస్థితిలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా రజనీకాంత్ సంకేతాలు ఇవ్వడం ప్రారంభించారు. జూలై లేదా ఆగస్టులో మలి విడత అభిమానుల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రజనీ ఇటీవల ప్రకటించారు. రజనీని వారిస్తున్న కుటుంబ సభ్యులు: రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంతవరకు జరిగిన కసరత్తు ఇలా ఉండగా, తాజాగా కొత్త కోణం బైటపడింది. అసలు మనకు రాజకీయాలే వద్దు అని కుటుంబసభ్యులు రజనీకాంత్‌ను వారిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రజనీకాంత్ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలపై కుటుంబ సభ్యులు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రజనీకాంత్ సింగపూరులో చికిత్స, అమెరికాలో విశ్రాంతి తీసుకున్నారు. ఈనెల మరలా అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంటారని ఇటీవల సమాచారం వచ్చింది. కాలా షూటింగ్ షెడ్యూలు ముగిసిన తరువాత రజనీ అమెరికా పయనం ఉండొచ్చని తెలుస్తోంది. రజనీ ఆరోగ్యం ఇలా ఉండగా, రాజకీయాల్లోకి వస్తే అలుపెరగకుండా తిరగాలి, పూర్తిగా విశ్రాంతి ఉండదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పైగా ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని జీర్ణించుకోలేక మానసిక ప్రశాంతత సైతం ఆయనకు కరవవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితుల్లో రాజకీయాలు సమంజసం కాదని వారు రజనీకి నచ్చజెపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాసేవే చేయదలుచుకుంటే అభిమాన సంఘాలనే చారిటబుల్ ట్రస్ట్‌గా మార్పుచేసి ద్వారా కొనసాగించవచ్చని వారు సూచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీన రజనీకాంత్ జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన వెలువడగలదని కొందరు నమ్ముతున్నారు. -
జయలలిత బంగ్లాలో అస్తిపంజరం
టీనగర్ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు తన గెస్ట్‌హౌస్‌గా ఉపయోగించుకున్న సిరుతాపూర్ బంగ్లా వద్ద అస్తిపంజరం కనిపించడం ప్రకంపనలు కలిగిస్తోంది. బంగ్లాలో గస్తీ కాస్తున్న సాయుధ పోలీసులకు సోమవారం అస్తిపంజరం కనిపించింది. దీంతో ఒక్క సారిగా కలకలం రేగింది. జయలలిత బంగ్లా వెనుక భాగంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి అవశేషాలుగా తెలుస్తోంది. ఆస్థి వ్యవహారంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన తర్వాత పోయెస్‌గార్డెన్, సిరుతాపూర్, కొడనాడు ప్రాంతాల్లో పోలీసు భద్రత తగ్గించారు. ప్రస్తుతం సిరుదావూరు బంగ్లాలో సాయుధ పోలీసులు మాత్రమే గస్తీ కాస్తున్నారు. ఇలా ఉండగా ఆ ప్రాంతంలో మనిషి అస్తిపంజరం కనిపించింది. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా చెన్నై నగరానికి సుమారు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బంగ్లాకు జయలలిత అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం వెళ్లేవారు. ప్రస్తుతం ఈ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబీకుల ఆధీనంలో ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ బంగ్లాలో ఉంటున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ కుటుంబ సభ్యులు అందులో ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారు. అయితే గత ఏప్రిల్ లో బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన నాటికి దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ప్రమాదంపై అనుమానాలు కలిగాయి. జయలలిత ఆస్తులకు సంబంధించి విలువైన పత్రాలు ఈ బంగ్లాలో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. -
అవన్నీ ఊహాగానాలే: నటి గౌతమి
చెన్నై: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెరవేర్చారని నటి గౌతమి అన్నారు. ఆమె బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ... జయలలిత మరణం తర్వాత ఆమె ప్రవేశపెట్టిన పథకాల అమల్లో స్పష్టత లేదన్నారు. తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు యోగా చాలా ఉపయోగపడిందని గౌతమి తెలిపారు. అలాగే రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తాను స్పందించనని, అవన్నీ ఊహాగానాలే అని ఆమె కొట్టిపారేశారు. దినకరన్ వివాదంపై ప్రజలకు అంతా తెలుసు అని గౌతమి అన్నారు. కాగా జయలలిత చికిత్స, మరణంపై సందేహాలు వ్యక్తం చేసిన గౌతమి ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం రెండు సార్లు లేఖలు రాసిన విషయం విదితమే. మరోవైపు దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటంపై తమిళనాట చర్చ ఊపందుకుని ఉన్న విషయం తెలిసిందే. కథానాయకుడు రాజకీయంగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అమ్మ జయలలిత మరణం తదుపరి తమిళనాట నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రజనీ రాకకు ఇదే మంచి తరుణం అని ఆహ్వానించే వాళ్లు కొందరు అయితే, వ్యతిరేకించే వాళ్లూ అదే స్థాయిలో ఉన్నారు. -
ఇక.. చొరబాటే
► చట్టపరంగా కసరత్తులు ► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే : దీపక్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, మేనల్లుడు మేనత్త ఆస్తుల కోసం మళ్లీ తెర ముందుకు వచ్చారు. పోయెస్ గార్డెన్‌లోకి చొరబడేందుకు సిద్ధమైనట్టు, పార్టీని కైవసం చేసుకునేందుకు చట్టపరంగా కసరత్తులు మొదలెట్టినట్టుగా దీప ప్రకటించారు. మేనత్తకు చెందిన ఆస్తులన్నింటికీ తామే వారసులం అని, చిన్న అత్త శశికళ కుటుంబీకులు తప్పుకుంటే మంచిదని దీపక్ హెచ్చరించారు. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత ఆస్తులకు తామే వారసులం అని ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఐక్యత లేని దృష్ట్యా, తరచూ వివాదం బయలుదేరుతోంది. గత ఆదివారం పోయెస్ గార్డెన్ వేదికగా, అక్క, తమ్ముడు కయ్యానికి కాలు దువ్వుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం దీప మీడియా ముందుకు వచ్చారు. అలాగే, దీపక్ మరో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆస్తులన్నీ తమదేనని, తామిద్దరికీ అన్ని హక్కులు అంటూ వ్యాఖ్యానించారు. అయితే, దీపక్ వ్యాఖ్యలు ఓ రకంగా సాగితే, దీప వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. గార్డెన్‌ను కైవసం చేసుకుంటా: టీ.నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక, ఎవర్నీవదలి పెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని అందుకున్నారు. పోయేస్ గార్డెన్‌ను కైవశం చేసుకుంటానని, ఎవరు అడ్డు వచ్చినా, ఎదురించి చొరబడటమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆస్తుల కైవశం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. పోయేస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం కల్గుతోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరనీ, వివాదం సాగగానే, లోపలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఆరోపించారు. శశికళ ఫోటోను తాను బయటపడేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆ వ్యక్తులు చొచ్చుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని పోయేస్ గార్డెన్ ఇంటినే కాదు, పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తంచేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురుచూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నం రక్షిస్తానని, పార్టీలోకి అడుగుపెట్టి, మేనత్త స్థానాన్ని భర్తీ చేస్తానని వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే, తన వైపునకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్ తనకు మరింత సమయాన్ని కేటాయిస్తూ మరో రెండు లక్షల అంశాలతో కూడిన ప్రమాణ పత్రం దాఖలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. జయ పేరవై తరహాలో అన్నాడీఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందని పేర్కొన్నారు. ఆస్తులన్నీ మావే ఓ మీడియాతో ప్రత్యేకంగా దీపక్ మాట్లాడుతూ తమ అవ్వ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసినట్టు, అవన్నీ మేనత్త పేరుతోనే ఉన్నాయని వివరించారు. గతంలో రాసిన వీలునామా మేరకు, మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తుల మేరకు ప్రస్తుతం తాను తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవనీ, చిన్నత్త శశికళ ఫోటోను బయటకుపడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకు ముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే, చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేదని స్పష్టంచేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తులు గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నాననీ.. అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురుకాలేదని స్పష్టంచేశారు. ఈ ఆస్తులన్నీ చిన్నత్త శశికళ కుటుంబీకుల చేతిలో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయని, దయచేసి వారుగా ముందుకు వచ్చి తమకు అప్పగించాలని కోరారు. -
జయలలిత ఆస్తులన్నీ మావే
► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే :దీపక్ చెన్నై : మేనత్త ఆస్తి కోసం మేనకోడలు, మేనల్లుడు పోటీ పడుతున్నారు. అత్తమ్మ ఆస్తులకు తామే అసలైన వారసులమంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం ఆమె సోదరుడి సంతాపం అయిన దీపక్, దీపలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం టీ నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని సంధించారు. పొయస్ గార్డెన్‌ను కైవసం చేసుకుంటానని, ఎవరు అడ్డొచ్చినా ఎదిరించి చొరబడటమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆస్తుల కైవసం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. పొయస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం వస్తోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరని, శశికళ ఫోటోను తాను బయట పడేయడానికి ప్రయత్నించిన సమయంలో లోపలి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానని, ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని, పొయస్ గార్డెన్‌నే కాదు పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురు చూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నాన్ని రక్షిస్తానని చెప్పారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే తన వైపుకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జయ పేరవై తరహాలో అన్నాడిఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందన్నారు. ఆస్తులన్నీ మావే మరోవైపు జయ మేనల్లుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ తమ నానమ్మ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసిందని, అవన్నీ అత్త జయలలిత పేరుతోనే ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో రాసిన వీలునామా మేరకు మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తులకు ప్రస్తుతం తాను,తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని, చిన్నత్త శశికళ ఫోటోను బయట పడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకుముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే తాను ఏమి చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడు, ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేరని స్పష్టం చేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తుల గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నట్టు, అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురు కాలేదని స్పష్టం చేశారు. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు. -
‘మోదీ’ ఆశ పడ్డారు ...!
► విలీనంపై పన్నీరు వ్యాఖ్య ►పళనిస్వామితో ఫలితం శూన్యం ► అన్నీ నాటకాలే సాక్షి, చెన్నై : ముక్కలైన అన్నాడీఎంకే మళ్లీ ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ పడ్డారని అన్నాడిఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన సూచనతో విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నానని పేర్కొన్నారు. అయితే, అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా రాజకీయాల్లో రావొచ్చని, అయితే, ప్రజాభీష్టం మేరకే నాయకుడిగా అవతరించాల్సి ఉంటుందని రజనీ రాజకీయంపై వ్యాఖ్యానించారు. అన్నాడిఎంకే అమ్మతో ఇక, విలీనం ప్రసక్తే లేదని పురట్చి తలైవీ శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చర్చలకు ఎంపిక చేసిన కమిటీనీ కూడా రద్దుచేశారు. రెండు రోజుల క్రితం తాను తీసుకున్న నిర్ణయంపై బుధవారం మద్దతు నేతలు, ఎమ్మెల్యేలతో పన్నీరు సెల్వం చర్చించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సమీక్షించుకున్నారు. ఈసందర్భంగా విలీనం విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందంటే.. అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పన్నీరు స్పందించారు. మోదీ ఆశపడ్డారు : దివంగత నేతలు ఎంజియార్, అమ్మ జయలలిత చేతుల మీదగా మహా శక్తిగా అన్నాడిఎంకే అవతరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ముక్కలు కావడం వేదన కల్గించినా, పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. అమ్మ ఆశయ సాధనతో పాటుగా, ఆమె గతంలో తనకు అప్పగించిన బాధ్యతల మేరకు పార్టీని రక్షించుకునేందుకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోక తప్పలే దని వివరించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడిఎంకే ముందుకు సాగాలని, అవినీతి రహిత పాలన సాగాలంటే, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని మోదీ సూచించారని వివరించారు. అవినీతి అన్నది బయట పడ్డ పక్షంలో ప్రభుత్వం పని పడుతానన్న హెచ్చరికను సైతం ఆయన చేశారని పేర్కొన్నారు. అన్నాడిఎంకే ఒకే వేదికగా సాగాలని మోదీ ఆశ పడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తు చేశారు. నాటకాలు రక్తికట్టాయి విలీన నినాదంతో ప్రయత్నాలు సాగిన సమయంలో అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టాయని ఆరోపించారు. ప్రధానంగా తనను మోసం చేయడం, ఒంటరిని చేయడం, తన పేరుకు కళంకం తీసుకు రావడం లక్ష్యంగా ఆ నాటకాల్ని ఎంత అద్భుంతంగా అంటే, అంతగా...రక్తి కట్టించారని మండి పడ్డారు. విలీనానికి తాను మొగ్గు చూపినా, ఈ నాటకాలతో అస్సలు విషయాన్ని గ్రహించి వెనక్కు తగ్గక తప్పలేదని స్పష్టంచేశారు. శశికళ, దినకరన్ చెప్పినట్టుగానే పళని స్వామిలు నాటకాలు రచించారన్నది తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నాటకాల్లో కొన్ని ఆథ్యాత్మికంగాను, మరికొన్ని భావోద్వేగంగాను, ఇంకా చెప్పాలంటే, ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగాయని వివరించారు. దినకరన్ నాటకం నమ్మకాన్ని కల్గించ లేదని, పళని తృప్తి పరచలేదని ఎద్దేవా చేస్తూ, అందుకే విలీనంకు ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్నాడిఎంకే ముక్కులైనా కేడర్ చెల్లా చెదరు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన వైపు కింది స్థాయి కేడర్, ద్వితీయ శ్రేణి వర్గాలతో పాటుగా ప్రజలు ఉన్నారని, వారి వైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల బలం ఉందని వ్యాఖ్యానించారు. అందరూ తలా ఓ దిక్కున ఉన్నారేగానీ, మరో పార్టీలోకి వెళ్ల లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్నాడిఎంకే బలం అన్నాడిఎంకేదేనని, ఇతరులు ఎవ్వరూ కేడర్‌ను తమ వైపుకు తిప్పుకోవడం ఇక్కడ వీలు కాదన్నారు. రజనీ రాజకీయాలపై స్పందిస్తూ, ఎవరైనా రావొచ్చని, అయితే, ప్రజల ఆదరణ, అభిష్టం ఉంటే తప్ప, నాయకుడిగా ఎదగలేడని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై శరవణన్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఇందులో తమ వాళ్లెవ్వరూ లేరని అన్నారు. ముడుపుల వ్యవహారాల్ని ఉపేక్షించకూడదన్నారు. చివరగా, సంధించిన ప్రశ్నకు, చిన్నమ్మ శశికళ చేతిలో పళని స్వామి రిమోట్టే అంటూ, ఆమె కంట్రోల్లోనే ఇక్కడ వ్యవహారాలు సాగుతున్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు. -
కల్లోల దీపం
♦ దీపక్ పిలుపుతో వేద నిలయంలోకి ♦ ఆ అరగంట ఏం జరిగింది ♦ కాసేపటికి ఉత్కంఠ – ముష్టియుద్ధం ♦ హతమార్చేందుకు ప్రయత్నంగా ఆరోపణలు ♦ మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారు ♦ దీప వ్యాఖ్యలతో ఉత్కంఠ వేద నిలయం వేదికగా దివంగత సీఎం జయలలిత మేనల్లుడు, మేన కోడలు మధ్య వివాదం చెలరేగింది. సోదరుడు దీపక్ పిలుపుతో మేనత్త ఇంట్లోకి సోదరి దీప ఆదివారం అడుగుపెట్టారు. అర్ధగంట సజావుగా సాగినా, తదుపరి ఏమైందో ఏమో క్షణాల్లో కల్లోలం బయలు దేరింది. తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్టుగా దీప ఆరోపణలు గుప్పించారు. మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలతో క్షణాల్లో పోయెస్‌గార్డెన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాక్షి, చెన్నై: జయలలిత మరణం తదుపరి ఆమె ఆస్తులకు తాను, తన సోదరి దీప మాత్రమే వారసులం అని దీపక్ వ్యాఖ్యానిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం దీప, దీపక్‌ల మధ్య చోటుచేసుకున్న సమరం ఉత్కంఠకు దారి తీసింది. జయలలిత మరణం, చిన్నమ్మ శశికళ జైలు జీవితం తదుపరి కొన్ని నెలలుగా పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం నిర్మానుష్యంగా మారిన విషయం తెలిసిందే. భద్రత కూడా ఇక్కడ కరువైంది. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు ఏదో అరుపులు కేకలు వినిపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీప రూపంలో కల్లోలం బయలు దేరడంతో ఆ పరిసరాల్లో ఉత్కంఠ బయలు దేరడం గమనార్హం. వేద నిలయంలోకి దీప : తమ్ముడు దీపక్ పిలుపు మేరకు మిత్రుడు రాజాతో కలిసి దీప ఉదయం పోయెస్‌గార్డెన్‌కు వచ్చారు. అక్కడ భద్రత సిబ్బంది ఎవ్వరూ లేని దృష్ట్యా లోనికి వెళ్లారు. అర్ధగంట పాటు అక్కడే ఆమె ఉన్నారు. తదుపరి ఏమి జరిగిందో ఏమో వేదనిలయంలో అరుపులు కేకలు, వివాదం సాగుతున్నట్టుగా ఉత్కం ఠ. ఈ సమాచారంతో ఓ మీడియా వేదనిలయంలోకి ప్రవేశించింది. వెళ్లిన కాసేపటికి ఆ మీడియా ప్రతినిధులు బయటకు పరుగులు పెట్టడంతో పోయెస్‌గార్డెన్ పరిసరాల్లో క్షణాల్లో ఉద్రిక్తతను రేపింది. లోపల ఏమి జరుగుతోందో అన్న ఉత్కంఠ తప్పలేదు. ఇంతలో లోపల నుంచి చెదిరిన జుట్టు, నీరసంగా దీప, ఆమె వెంట భర్త మాధవన్, మిత్రుడు రాజా బయటకు పరుగెత్తుకు వచ్చారు. ఇంతలో అక్కడికి దీప మద్దతు దారులు తరలి రావడం, క్షణాల్లో పోలీసు భద్రత కట్టుదిట్టం కావడం వంటి పరిణామాలు సినీ ఫక్కీలో సాగాయి. దీప మీద దాడి జరిగిందంటూ ఆమె మద్దతుదారులు ఆగ్రహంతో ఊగి పోవడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. హతమార్చేందుకు కుట్ర : ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన నీళ్లు తాగి, కుదటపడ్డ అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. నాలుగైదు రోజులుగా వేద నిలయానికి రావాలని దీపక్ పదేపదే తనకు ఒత్తిడి తెచ్చినట్టు వివరించారు. తనకు ఇక్కడకు రావడం ఇష్టం లేదని, సోమవారం చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సమయంలో ఉదయాన్నే పదేపదే ఫోన్ చేసి ఇక్కడకు రావాలని, మేనత్త కోసం పూజలు చేయాల్సి ఉందని సూచించి రప్పించినట్టు తెలిపారు. తాను, తన మిత్రుడు రాజా ఇక్కడికి వచ్చామని, దీపక్ వెంట రౌడీల్లా ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు చెప్పారు. హఠాత్తుగా తన మీద ఆ వ్యక్తులు దాడికి ప్రయత్నించారని, రాజా అడ్డుకునే క్రమంలో వివాదం ముదిరిందని, ఇంతలో తన భర్త మాధవన్‌కు ఫోన్‌చేసి పిలిపించడంతో బయట పడ్డానని తెలిపారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ మీడియా ప్రతినిధి, కెమెరామెన్ మీద కూడా ఆ వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. పథకం ప్రకారం తనను ఇక్కడకు పిలిపించి హతమార్చేందుకు కుట్ర చేసినట్టుందని ఆరోపించారు. తనకు, తన భర్త మాధవన్‌కు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజా మీద తప్పుడు కేసులు వేసి కక్ష సాధింపు చర్యలకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారని ఆరోపిస్తూ, దీపక్‌ను కూడా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం. దినకరన్ గురించి మాట్లాడ వద్దని బెదిరించారని, క్షణాల్లో పోలీసులు అక్కడకు రావడం బట్టి చూస్తే, ముందస్తు పథకం వేసినట్టు అనుమానాలు కల్గుతోందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ వ్యవహారాలపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయనున్నట్టు, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. దీపక్‌పై దీప ఫైర్ : మీడియాకు చిక్కిన వీడియో మేరకు దీపక్‌పై దీప తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దీప, దీపక్ జయలలిత ఫొటో వద్ద పుష్పాంజలి ఘటించారు. తదుపరి వేద నిలయంలోకి దీప వెళ్లారు. అర్ధగంట లోపల ఏమి జరిగిందో ఏమోగానీ, కాసేపటికి వెలుపల ఉత్కంఠ తప్పలేదు. ఓ పోలీసు అధికారి రంగంలోకి దిగి దీపను వారిస్తున్నారు. దీపక్‌ను ఉద్దేశించి దీప అనుచిత వ్యాఖ్యలు గుప్పించారు. పొకిరి, రాస్కెల్..మాధవన్ మీద చేయి చేసుకుంటావా, నాకు నీ ముఖం ఇక చూపించ వద్దు అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆ పోలీసు అధికారి మాధవన్‌కు ఏమి కాదు, తాను చూసుకుంటానని సమాధానం ఇస్తుండగా, అందరూ సమాధానం చెప్పే రోజు త్వరలో వస్తుందని దీప మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ దృశ్యాల్లో కనిపించారు. పూజ అని పిలిపించి, హతమార్చేందుకు కుట్ర చేస్తారా, ఇంతసేపు ఎంతకు తనను వెయిట్ చేయించారంటూనే, ఇతనే... ఇతనే అంటుండగా ఓ వ్యక్తి అక్కడి నుంచి జారుకుంటూ వేద నిలయంలోకి వెళ్లడం ఆ మీడియాకు చిక్కిన దృశ్యాల్లో ఉండడం గమనార్హం. ఇక వేద నిలయంలో తమ్ముడు, అక్కయ్య మధ్య ఏమి జరిగిందోనన్న ఉత్కంఠ తప్పలేదు. వారసులు ఆస్తుల కోసం తన్నుకున్నారేమో...అని వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లు పెరిగారు. మీడియాపై దాడి జరగడంతో జర్నలిస్టులు ఆందోళన చేశారు. నేనే రప్పించాను – దీపక్ : దీపను తానే పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయానికి రప్పించానని దీపక్ పేర్కొన్నారు. వి వాదంపై ఓ మీడియాకు ఆయన స్పం దిస్తూ దినకరన్ మనుషులు ఎవ్వరూ ఇక్కడ లేరన్నారు. ఇక్కడ ఏమీ జరగలేదని, నాకు, దీపకు మధ్య ఎలాంటి గొడవ లేదని స్పందించడం గమనార్హం. ఇక, ఈ వివాదం పుణ్యమా, ఇన్నాళ్లు నిర్మానుష్యంగా ఉన్న వేద నిలయం పరిసరాల్ని, ప్రస్తుతం నిఘా నీడలోకి తీసుకు వచ్చారు. -
జయలలిత ఆస్తుల జప్తు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన ఆస్తుల జప్తుకు ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకూడి, తంజావూరు జిల్లాల్లోని వీరి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక అవినీతి నిరోధక, నిఘా విభాగ డైరెక్టర్ మంజునాథ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 6 జిల్లాల కలెక్టర్లకు ఆస్తుల జప్తుకు ఆదేశాలిచ్చారు. 68 ఆస్తులను జప్తు చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఈ ఆస్తులకు తమిళనాడు ప్రభుత్వమే పూర్తి హక్కుదారుగా ఉంటుంది. అవసరమైతే శాఖాపరమైన అవసరాలకు వాడుకోవచ్చు లేదా బహిరంగవేలం వేయొచ్చు. అయితే నలుగురు దోషులకు కోర్టు విధించిన జరిమానాకు, ఈ ఆస్తుల జప్తునకు సం బంధం లేదని, అక్రమాస్తులుగా పరిగణించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు చెప్పారు. జయS నివసించిన చెన్నైలోని పోయెస్‌గార్డెన్ ఇల్లు, కొడనాడు ఎస్టేట్ జప్తు ఆస్తుల జాబితాలో లేకపోవడం గమనార్హం. 1991–96 మధ్య జయ సీఎంగా ఆస్తులను కూడబెట్టినట్లు అప్పటి జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. జయ, ఆమె మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ, శశికళ బంధువు ఇళవరసిలను ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చడం తెలిసిందే. ప్రస్తుతం శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. -
పట్టు వీడండి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నో ఆశలతో ఢిల్లీకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు నిరాశే ఎదురైంది. పన్నీర్ రాజకీయ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ తన పక్షం అని ధీమాతో ఉన్న పన్నీర్ సెల్వం డీలాపడిపోయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలమయ్యా యి. జయలలిత అభిమానాన్ని చూరగొన్న నేతగా పేరుగాంచిన పన్నీర్‌సెల్వంను ప్రధాని చేరదీసి శశికళ వర్గాన్ని దూరం పెట్టారు. తదనంతర పరిణామాల్లో శశికళ, దినకరన్ జైలు పాలుకాగా, సీఎంగా ఎడపాడి ఎన్నికై పాలన సాగిస్తున్నారు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి చేరువయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం లేదన్న సామెతను ప్రధాని మోదీ మరోసారి రుజువుచేస్తూ ఎడపాడి పట్ల సానుకూల వైఖరిని ప్రారంభించారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న పన్నీర్‌సెల్వం ఢిల్లీ విమానం ఎక్కారు. సుమారు 45 నిమిషాలపాటు ప్రధానితో జరిగిన సంభాషణల్లో పన్నీర్‌కు ఊరట లభించకపోగా ఉసూరుమంటూ బైటకు వచ్చారు. ‘శశికళ కుటుంబీకులు పాలనకు మాత్రమే తాను వ్యతిరేకం, మరెవరైనా తనకు అభ్యంతరం లేదు, సీఎం ఎడపాడి వైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు గణనీయమైన సంఖ్యలో ఉండగా, మీ వద్ద నామమాత్రం ఉన్నారు. సీఎం, ప్రధాన కార్యదర్శి పదవులే మీకు ముఖ్యం, పార్టీ ఏమై పోయినా ఫరవాలేదు. పట్టువిడుపులు ప్రదర్శించి విలీనంపై దృష్టిపెట్టండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ పన్నీర్‌సెల్వంను తూర్పారపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఊహించని ఈ పరిణామంతో బిక్కచచ్చిపోయిన పన్నీర్‌సెల్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై పునరాలోచనలో పడ్డారు. బీజేపీతో కలిసి పోటీచేస్తామని గతంలో ప్రకటించిన పన్నీర్ సెల్వం శనివారం తన ట్విట్టర్లో మాటమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాతనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి ప్రధాని మోదీపై తనకున్న కోపాన్ని చాటుకున్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం అన్నాడీఎంకేలోని ఇరువర్గాలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో పన్నీర్‌సెల్వం చేదు అనుభవాలను అందిపుచ్చుకున్న సీఎం ఎడపాడి మేట్టుపాళయంలో శనివారం జరిగిన సభలో విలీనంపై మళ్లీ ఆహ్వానం పలికారు. తమ ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చలేరు, నాలుగేళ్లు కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. శశికళ, దినకర్లు జైలు నుంచే ఎడపాడి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, అందుకే విలీనంపై వెనకడుగు వేశామని పన్నీర్వర్గంలోని మధుసూదనన్ విమర్శించారు. -
వంతెనలకు ఎంజీఆర్, జయలలిత పేర్లు
మదురైలో రెండు వంతెనలు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి కేకేనగర్ : మదురైలో కొత్తగా నిర్మించిన రెండు వంతెనలను ఎంజీఆర్, జయలలిత పేర్లతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు. మదురై వైగై నది మీదుగా రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం 2014లో ప్రారంభమైంది. వీటి నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత రూ.30.47కోట్లను కేటాయించారు. అరబ్ పాలయం, అరుళ్ దాస్పురం, సెల్లూర్, తిరుముల్లై రాయర్ పట్టిదురై ప్రాంతాలను కలిపే విధంగా నదిపై వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఆరబ్ పాళయం – అరుళ్దాస్ పురం వంతెనకు జయలలిత పేరు, సెల్లూర్ – తిరుమలైరాయర్ పట్టిదురై వంతెనకు ఎంజీఆర్ పేరు పెట్టారు. మదురైలో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించే దిశగా ఈ కొత్త వంతెనలను ప్రారంభిచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, మదురైలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వంతెనలను ప్రారంభించారు. అనంతరం రూ.22.25 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ సహాయకాలను అందజేసి ప్రసంగించారు. విమానం ద్వారా ఆయన శుక్రవారం మధ్యాహ్నం మదురై చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, వాచ్‌మన్ హత్య
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం గుట్టుచప్పుడు కాకుండా ముందుగా ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ మాయం చేస్తున్నారు. అందులోభాగంగా సోమవారం తెల్లవారుజామున కొడనాడులో జయలలితకు అత్యంత ఇష్టమైన ఎస్టేట్‌లో దోపిడీ జరిగింది. అక్కడున్న ఇద్దరు వాచ్‌మన్‌లపై తీవ్రంగా దాడిచేసి వారిలో ఒకరిని చంపి ఎస్టేట్‌లో ఉన్న కీలకమైన పత్రాలను తీసుకెళ్లిపోయారు. సుమారు వారం రోజుల క్రితమే చెన్నై శివార్లలోని సిరుతాపూర్ బంగ్లాకు నిప్పు పెట్టినప్పుడు కూడా అందులో కొన్ని పత్రాలు కాలిపోయాయి, మరికొన్ని మాయమయ్యాయి. ఇప్పుడు కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ జరిగినా.. అందులో పత్రాలు తప్ప మరేమీ పోలేదు. ఈ ఎస్టేట్‌లో జయలలితకు అత్యంత నమ్మకస్తుడైన ఓం బహదూర్ అనే నేపాలీ వ్యక్తి గత 30 ఏళ్లుగా కాపలా ఉంటున్నాడు. అతడిని హతమార్చి, అతడితో పాటు ఉన్న మరో వాచ్‌మన్‌ను తీవ్రంగా గాయపరిచిన దుండగులు.. ఎస్టేట్‌లో జయలలిత ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ తీసుకెళ్లిపోయారు. జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి చాలా వర్గాలు ప్రయత్నించాయి. కొన్ని ఆస్తులు ప్రస్తుతం శశికళ వర్గీయుల చేతుల్లో ఉన్నాయి. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోటలు, సిరుతాపూర్ బంగ్లా, చెన్నై పోయెస్ గార్డెన్స్.. వీటన్నింటి విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఇప్పుడు వీటిమీద హక్కుల కోసం తెరవెనక చాలా కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వరుసపెట్టి దాడులు, పత్రాల చోరీ జరుగుతున్నట్లు జయలలిత సన్నిహితులు చెబుతున్నారు. -
జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, వాచ్‌మన్ హత్య
-
కమలనాథుల కనుసన్నల్లోనే!?
తమిళ పోరులో గెలుపు ఓపీఎస్దా బీజేపీదా? - కేంద్రంలోని బీజేపీ వ్యూహం ప్రకారమే తమిళనాట పరిణామాలు - ఓటుకు నోట్లు.. ఈసీకి ప్రలోభాలు... కేసులు కేంద్ర సంస్థలవే - ఆకస్మిక పరిణామాలతో అన్నాడీఎంకే శశికళ వర్గంలో గుబులు - అది కేంద్రం నుంచి పరోక్ష హెచ్చరికలేనంటున్న పరిశీలకులు - కనుకే చిన్నమ్మ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం నుంచి ఉద్వాసన? - పన్నీర్‌తో రాజీకి పళని వర్గం సై... అధికార పంపిణీయే సమస్య (సాక్షి నాలెడ్జ్ సెంటర్): అమ్మ జయలలిత సమాధి వేదికగా రెండు నెలల కిందట చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఒ.పన్నీర్‌సెల్వం తన పోరాటంలో గెలుస్తున్నట్లు కనిపిస్తోంది. శశికళ వర్గంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పళనిస్వామి మంత్రివర్గం.. శశికళ మేనల్లుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న టి.టి.వి.దినకరన్ కుటుంబాన్ని పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా శశికళను కూడా వెలివేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. దీంతో.. ఓపీఎస్ వర్గం, శశికళ వర్గంగా చీలిపోయిన అన్నా డీఎంకే మళ్లీ ఏకమయ్యేందుకు మార్గం సుగమమయింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ రెండు వర్గాలూ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. శశికళ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన ఓపీఎస్ అంతిమ విజయం సాధించినట్లు తమిళనాడు ప్రజలు భావిస్తుండవచ్చు. నిజానికి ఈ నాటకీయ పరిణామాలన్నిటికీ సూత్రధారి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనేతా పార్టీయేనని.. ఢిల్లీలోని కమలనాథుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోందని.. కాబట్టి వాస్తవమైన విజేత బీజేపీయే అవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ప్రోద్బలం ప్రోత్సాహం లేకుండా ఓపీఎస్ తిరుగుబాటు చేసేవారు కాదని.. ఒకవేళ చేసినా ఆ పార్టీ అండదండలు లేనిదే ఈ విజయం సాధించగలగటం సంగతి తర్వాత.. ఇంతకాలం తిరుగుబాటు నేతగా మనగలగడం కూడా సాధ్యం కాదని ఆ వర్గాలు ఉద్ఘాటిస్తున్నాయి. ఆకస్మిక పరిణామాలు..: చీలిక వర్గాలు రెండూ అకస్మాత్తుగా విలీనం దిశగా అడుగులు వేయడానికి కారణం.. దినకరన్ మీద ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత సోమవారం నాడు నమోదు చేసిన ఒక కేసు. అన్నా డీఎంకే చీలిక నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ‘రెండు ఆకుల’ ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆ గుర్తును తమ వర్గానికి కేటాయించేలా చూడాలంటూ ఈసీ అధికారులకు దినకరన్ లంచం ఇవ్వజూపారనే ఆరోపణతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందే.. జయలలిత మరణం వల్ల ఖాళీ అయిన ఆర్.కె.నగర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలోనూ దినకరన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఎన్నికల్లో శశికళ వర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు దాదాపు రూ. 89 కోట్లు ఖర్చు చేశారని ఆదాయ పన్ను శాఖ అంచనా. అసలు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీని, ప్రభుత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలకు తమిళ ప్రజలు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఈ రెండు ఉదంతాలతో ఆ వర్గం, ఆ వర్గ ప్రభుత్వంపై ప్రజల్లో అప్రదిష్ట ఇంకా పెరిగిపోయింది. కేంద్ర సంస్థల కేసులే..: ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక వాయిదాకు కారణమైన ఓట్ల కొనుగోలు వ్యవహారం గానీ.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఎన్నికల చిహ్నం కోసం ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు గానీ.. రెండూ కేంద్ర సంస్థలే బయటపెట్టడంలో ఏదో మతలబు ఉందనేది తమిళనాడులోని శశికళ వర్గం రాజకీయ నాయకులే కాదు, పలువురు రాజకీయ పరిశీలకుల సందేహం. నిజానికి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభానికి గురిచేయడం కొత్త విషయం కాకపోయినా.. ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో అది అసాధారణ స్థాయిలో సాగడం.. దానిపై ఈసీ తదితర కేంద్ర సంస్థలు తీవ్రంగా స్పందించడం సరైన చర్యే అయినా.. దాని వెనుక ఏవైనా రాజకీయ శక్తులు పనిచేసి ఉండొచ్చనే అంశాన్ని కొట్టి వేయలేమని వారు అంటున్నారు. ఇక దినకరన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణల తీరుతెన్నులు విచిత్రంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలు చేసిన ‘మధ్యవర్తి’ ఒక చిన్నపాటి మోసగాడని.. అత్యున్నతస్థాయిలోని ఈసీ అధికారులను ప్రలోభపెట్టడానికి దినకరన్ నిజంగా సదరు వ్యక్తి ద్వారానే ప్రయత్నించారంటే ఆశ్చర్యం కలిగిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అది పరోక్ష హెచ్చరిక..: ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక విషయంలో పరిణామాలు, దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం తదితర పరిణామాలు.. శశికళ వర్గానికి కేంద్రం నుంచి వచ్చిన పరోక్ష హెచ్చరికగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. శశికళ కుటుంబాన్ని దూరం పెట్టి.. ఓపీఎస్‌తో రాజీపడి పార్టీని కలిపేయాలన్నది ఆ హెచ్చరిక సారాంశంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళ గ్రూపులోని చాలా మంది నాయకులు కూడా ఆమె కుటుంబానికి విధేయతను కొనసాగిస్తే.. తమపైనా ‘దాడులు, సోదాలు’ జరుగుతాయని.. మొత్తంగా పార్టీయే కూలిపోయే పరిస్థితి రావచ్చని ఆందోళన చెందున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌తో చేతులు కలపడం మినహా ప్రత్యామ్నాయం లేదని.. అది జరగాలంటే ఓపీఎస్ షరతులు విధించినట్లు శశికళ, దినకరన్‌లను దూరం పెట్టకతప్పదని పరిశీలకులు వివరిస్తున్నారు. అయితే.. శశికళ, ఆమె కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పార్టీ టికెట్లు పొంది, ఎన్నికల్లో గెలుపొందిన చాలా మంది నాయకులు తక్షణమే ఆమెతో విభేదించే పరిస్థితి లేదని.. అందువల్ల ఆమె పేరును ప్రస్తావించకుండానే.. ఆరోపణలు, కేసులతో అప్రదిష్ట పాలైన దినకరన్ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారని చెప్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్షకు గురై ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో క్రియాశీలంగా జోక్యం చేసుకునే అవకాశం లేనందున ప్రస్తుతం ఆమె వల్ల రాగల ఇబ్బందులు కూడా పెద్దగా లేవన్నది ఆ వర్గం అంచనాగా భావిస్తున్నారు. ఓపీఎస్‌తో రాజీ తప్పనిసరి..: శశికళ జైలులో ఉండటం, దినకరన్‌ను పదవి నుంచి తప్పించడంతో.. అన్నా డీఎంకేలో కుల వర్గాల కుమ్ములాటలు తీవ్రమవుతాయని పరిశీలకులు జోస్యం చెప్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రస్తుతం ప్రముఖ నాయకులుగా ఉన్న మాజీ సీఎం ఓపీఎస్, సీఎం పళనిస్వామి, ఎంపీ ఎం.తంబిదురై వంటి వారి మధ్య అధికార పంపిణీ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. పళనిస్వామి సీఎంగానే కొనసాగే అవకాశముందని, పన్నీర్‌సెల్వం పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టవచ్చునని, తంబిదురై పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఢిల్లీలో చక్రం తిప్పవచ్చునని పళనివర్గం భావిస్తోంది. అలాగే ఓపీఎస్ సహచరుడు కె.పాండ్యరాజన్‌కు కోల్పోయిన పదవులు తిరిగి దక్కే అవకాశముందనీ చెప్తున్నారు. అయితే.. జయలలిత పరోక్షంలో సీఎంగా ఉన్న ఓపీఎస్‌నే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, పళనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పన్నీర్ వర్గం డిమాండ్‌గా చెప్తున్నారు. రాష్ట్రంలో బలమైన థేవర్ వర్గానికి చెందిన పన్నీర్‌కి.. డిప్యూటీ సీఎం పదవి అంటే డిమోషన్ వంటిదేనని, దానిని ఆయన అంగీకరించకపోవచ్చునని చెప్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ మరో బలమైన గౌండర్ల వర్గానికి చెందిన పళని మాత్రం డిమోషన్‌కు అంగీకరిస్తారా అనేది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో అధికార పంపిణీలో ఎలా రాజీపడతారన్నది వేచిచూడాల్సిందే. శశికళ పట్టు సడలినట్లే..: ఇక దినకరన్‌కు ఉద్వాసన పలకడం, శశికళను కూడా పరోక్షంగానే అయినా దూరంగా పెట్టిన చర్యలకు అన్నాడీఎంకే కార్యకర్తలు, సాధారణ ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తుందని పరిశీలకుల అంచనా. నిజానికి పార్టీ మద్దతుదారులు శశికళను సహజంగా ఎన్నుకోలేదు. అలాగని ఆమెను జయలలిత తన వారసురాలిగా ప్రకటించనూ లేదు. తనకు నమ్మకస్తులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ద్వారా ఆమె పార్టీని తన చేతుల్లోకి తీసుకోగలిగారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆమె ద్వారానే సీట్లు సంపాదించారన్నది బహిరంగ రహస్యం. సాధారణ పరిస్థితుల్లో అయితే ఆమె పార్టీపై తన పట్టును బిగించేందుకు అవకాశం ఉంటేది. అయితే.. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లడం.. ఆమె తన ప్రతినిధిగా పార్టీ పగ్గాలు అప్పగించిన మేనల్లుడు దినకరన్ సైతం ఓటుకు నోట్లు ఆరోపణలు, ఈసీని ప్రలోభానికి గురి చేసే ప్రయత్నాల కేసులతో ఆ పదవి కోల్పోవడం.. వారి కుటుంబాన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఆమె వర్గమే వెలివేయడం పరిణామాలతో శశికళ వ్యూహం బెడిసికొట్టిందని.. ఆమె పార్టీపైనా ఇతర నాయకులపైనా తన పట్టును కోల్పోతారన్నది పరిశీలకుల అంచనా. వాళ్లది దొడ్డిదారిలో పాగా వేసే వ్యూహం: అళగురాజ్ కేంద్రంలోని బీజేపీ తమిళనాడులో రాజకీయంగా బలపడేందుకు ఓపీఎస్‌ను పావుగా వాడుకుంటోందని.. ఆయనకు బీజేపీతో రహస్య సంబంధాలు ఉన్నాయని శశికళ వర్గం ఆరోపిస్తోంది. బీజేపీ దొడ్డిదారిన రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఆ పార్టీ వలలోకి ఓపీఎస్ నడుచుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోందని అన్నా డీఎంకే అధికార పత్రిక డాక్టర్ నామాధు ఎంజీఆర్ సంపాదకుడు మరుదు అళగురాజ్.. ఇటీవలే పార్టీ పత్రికలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నపుడు ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం తెలుసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఆమె మరణం వెనుక ఏదో రహస్యం ఉందంటూ సందేహాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడటం ద్వారా రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడమే ఆ ఆరోపణల లక్ష్యమని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్ సాయంతో.. అన్నా డీఎంకే ఎన్నికల గుర్తును చీలిక వర్గాల్లో ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేసిందని తన వ్యాసంలో ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ కూడా ఓపీఎస్‌ను తమిళనాడు రక్షకుడిగా అభివర్ణించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి బీజేపీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని కూడా ఆరోపించారు. రెబల్ రాజ్యసభ సభ్యుడు వి.మైత్రేయన్, మాజీ మంత్రి కె.పాండ్యరాజన్ల మూలాలు బీజేపీలోనే ఉన్నాయని.. వారు బీజేపీకి సాయం చేయడానికే ఓపీఎస్ శిబిరానికి మారారని ధ్వజమెత్తారు. ఇక తమిళ కమలం వికసిస్తుంది: బీజేపీ అన్నా డీఎంకేలో అంతర్గత సంక్షోభంతో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ‘‘బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారు మాతో టచ్‌లో ఉన్నారు’’ అని రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్‌రావు ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక రద్దుకు సంబంధించిన మొత్తం వ్యవహారం మీద, ఈసీకి దినకరన్ లంచం ఇవ్వజూపిన ఉదంతం మీద సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడంలేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించి ప్రజల్లో అనుమానాలు ఉన్నాయంటూ.. దానికి సంబంధించిన వాస్తవాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలు.. రాజకీయ దుష్ప్రచారమని కొట్టివేశారు. అయితే.. తమిళనాడులో బీజేపీ వికసించడానికి పరిస్థితి సానుకూలంగా ఉందని.. ఈ రాష్ట్రంలో పార్టీ గణనీయంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అయితే.. జయలలిత మరణం, క్రియాశీల రాజకీయాలకు కరుణానిధి దూరం కావడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో ఒక రకమైన నాయకత్వ శూన్యత ఏర్పడిందని.. దానిని బీజేపీ విస్తరణకు వినియోగించుకోవడంలో తప్పు ఏమిటని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.గణేశన్ వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ తన 92 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో అత్యున్నత స్థాయి ప్రతినిధుల సభ సమావేశాన్ని నిర్వహించడం కూడా.. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడే వ్యూహంలో భాగమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
జయలలిత బంగ్లాలో అగ్నిప్రమాదం.. అనుమానాలు!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు తన గెస్ట్‌హౌస్‌గా ఉపయోగించుకున్న సిరుతాపూర్ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది చెన్నై నగరానికి సుమారు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కువగా పోయెస్ గార్డెన్స్‌లోనే ఉండే జయలలిత, అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం ఈ బంగ్లాకు వెళ్లేవారు. ప్రస్తుతం ఈ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబీకుల ఆధీనంలో ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ బంగ్లాలో ఉంటున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ కుటుంబ సభ్యులు అందులో ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారు. పార్టీ నుంచి కూడా దినకరన్ కుటుంబాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ప్రమాదంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆ బంగ్లాలోనే జయలలిత ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. జయలలితకు ఉన్న మొత్తం ఆస్తులలో పోయస్ గార్డెన్ బంగ్లాతో పాటు సిరుతాపూర్ బంగ్లా కూడా చాలా ఖరీదైనది. ఇందులో ఇప్పుడు భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తుల వివరాలు బయటకు రాకుండానే ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
జయలలిత బంగ్లాలో అగ్నిప్రమాదం.. అనుమానాలు!
-
జయ వీలునామా రాశారా? ఆస్తి ఏం కానుంది?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగతంగా వీలునామా రాశారంటూ అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా స్పష్టత వచ్చింది. జయలలిత ఎలాంటి వీలునామా రాసినట్టు అధికారికంగా నమోదు కాలేదని తాజాగా ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇటీవల జయలలిత వీలునామా గురించి సమాచారం తెలుపాలంటూ సమాచార కార్యకర్త ఎస్ భాస్కరన్ తమిళనాడు వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ (సీటీడీఆర్)కు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. అధికారికంగా వీలునామాల నమోదును సీటీడీఆర్ చేపడుతుంది. ఈ నేపథ్యంలో సీటీడీఆర్ స్పందిస్తూ జయలలిత వీలునామా గురించి ఎలాంటి పత్రాలుగానీ, సమాచారంగానీ తమ వద్ద లేదని తెలియజేసింది. గత ఏడాది డిసెంబర్ 5న జయలలిత మరణించినప్పటి నుంచి ఆమె చట్టబద్ధ వారసుడు ఎవరు? పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం సహా ఆమె ఆస్తులు ఎవరి పరం అవుతాయనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జయలలిత పేరిట సుమారు. రూ. 113.72 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తన వారసుడి గురించి, తన ఆస్తులు ఎవరికి చెందాలనే దాని గురించి జయలలిత వీలునామా రాసినట్టు గతంలో కథనాలు వచ్చాయి. అయితే, జయలలిత వీలునామా రాసినట్టు తమకు తెలియదని ఆమె వ్యక్తిగత లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించిన అన్నాడీఎంకే న్యాయవాదులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం కూడా ఇలాంటి సమాచారమే ఇవ్వడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనే మిస్టరీ కొనసాగుతూనే ఉంది. -
రోడ్డెక్కిన దీప, మాధవన్‌ల పోరు
∙ దీప డౌన్ డౌన్ అంటూ నినాదాలు ∙ ఇరువర్గాల ఘర్షణలతో ఉద్రిక్తత చెన్నై: ఎంజీఆర్ అమ్మ దీప పేరవైలోని విభేదాలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి. దీప, ఆమె భర్త మాధవన్ వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జయలలిత వారసురాలిగా రాజకీయ తెరపైకి వచ్చిన దీప ఆ పార్టీని స్వాధీనం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే తాను సొంతగా పేరవైని స్థాపించి అధ్యక్షురాలిగా తన డ్రైవర్ భార్యను, ప్రధాన కార్యదర్శిగా డ్రైవర్ ఏవీ రాజాను నియమించారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని కోపగించుకున్న దీప భర్త మాధవన్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పార్టీ పెద్దలు సమాధానపరచడంతో మళ్లీ కలిశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త కాలమ్‌ను ఖాళీగా పెట్టడం మాధవన్‌ను మళ్లీ ఆగ్రహానికి గురిచేయడంతో మళ్లీ వెళ్లిపోయారు. ఒక దశలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది. దంపతుల మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం దీప ఇంటి ముందు అంబేడ్కర్ జయంతికి ఏర్పాట్లు జరిగాయి. మాధవన్ అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచెను కట్టుకుని వేడుకల్లో పాల్గొనేందుకు అనుచరులతో హాజరయ్యారు. దీప రాకకోసం మాధవన్ ఇంటి బైటే వేచి చూసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో ఆయన అనుచరులు దీప అనుచరులతో వాగ్విదానికి దిగి గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. వీరిని డ్రైవర్ ఏవీ రాజా, అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు మంచినీళ్ల బాటిళ్లు, రాళ్లు విసురుకున్నారు. ఘర్షణ పడవద్దని దీప కేకలు వేసినా ఎవ్వరూ వినిపించుకోలేదు. పేరవైలో గొడవలన్నింటికీ నీవే కారణమని కొందరు ఏవీ రాజాను దూషించగా, దీప డౌన్ డౌన్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించేశారు. -
జయ మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు
-
జయ మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు
చెన్నై: జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్.. శశికళ వర్గంపై సంచలన ఆరోపణలు చేశారు. శశికళ బంధువు, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దినకరన్ పెద్ద మోసగాడని చెప్పారు. జయలలితకు శశికళ స్నేహితురాలు మాత్రమేనని, రాజకీయ వారసురాలు కాదని అన్నారు. సాక్షి ప్రతినిధితో దీపక్ మాట్లాడుతూ.. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపించే అధికారం శశికళ వర్గానికి లేదని చెప్పారు. జయకు నిజమైన రాజకీయ వారసులు పన్నీరు సెల్వం, మధుసూదనన్ మాత్రమేనని అన్నారు. జయలలిత ఎప్పుడూ వారసురాలను రాజకీయాల్లోకి తీసుకురాలేదని, ఆమెకు వారసత్వ రాజకీయాలు ఇష్టంలేదని చెప్పారు. జయ ఫొటోతో ప్రచారం చేసుకునే అర్హత దినకరన్‌కు లేదని పేర్కొన్నారు. అధికారం చేపట్టాలని భావిస్తున్న దినకరన్ కలలు కల్లలవుతాయని చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అమ్మ విశ్వాసపాత్రులు గెలుస్తారని దీపక్ ధీమా వ్యక్తం చేశారు. -
అమ్మ ఆస్తులు ఎవరికో?
♦ బెంగళూరు కోర్టు ఆధీనంలో కోట్లాది ఆస్తులు ♦ పోయెస్‌గార్డెన్ భవనం ఖరీదు రూ.90 కోట్లు ♦ రూ.113 కోట్లపై చర్చోపచర్చలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషని సుప్రీంకోర్టు తీర్పుతో రూ.113 కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, జయ అన్న సంతానమైన దీప, దీపక్ సొంతం చేసుకుంటారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ నిందితులుగా ఆస్తుల కేసుపై 18 ఏళ్లపాటు విచారణ జరిగి ఎట్టకేలకూ 2014లో తీర్పు వెలువడింది. పై నలుగురికి నాలుగేళ్లపాటు జైలు శిక్ష, జయలలితకు రూ.100 కోట్ల జరిమానా, మిగిలిన ముగ్గురికి రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి నలుగురూ నిర్దోషులుగా బైటపడ్డారు. అయితే బెంగళూరు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. వాదోపవాదాలు ముగిసిన పిమ్మ ట బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది. జయలలిత మరణించినందున శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత మరణించినా కింది కోర్టు విధించిన రూ.100 కోట్ల జరిమానా చెల్లించి తీరాలని ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ వందకోట్లు రాబట్టుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేసింది. జయలలితను దోషిగా ప్రకటించాలని, రూ.100 కోట్ల జరిమానా ఎలా వసూలు చేయాలో మార్గదర్శకాలు జారీచేయాల్సిందిగా కోరుతూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారణర్హత లేదని వ్యాఖ్యానిస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు పినాకీ సుందరేష్, అమీద్వాయ్ రాయ్ ఈనెల 4వ తేదీన కొట్టివేశారు. అంతేగాక జయలలితను మాత్రం నిర్దోషిగా ప్రకటించడాన్ని పునఃపరిశీలించలేమని, అంతేగాక జయలలితకు విధించిన రూ.100 కోట్ల అపరాధ రుసుము కట్టాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. బెంగళూరు కోర్టు ఆధీనంలో అమ్మ ఆస్తులు: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బెంగళూరు న్యాయస్థానం ఆధీనంలోని జయకు చెందిన 10,500 చీరలు, 750 జత చెప్పులు, రూ.3.5కోట్ల విలువైన బంగారు నగలు, 44 ఎయిర్ కండిషన్ మెషీన్లను తిరిగి అప్పగించకతప్పదు. అయితే ఈ ఆస్తులను అప్పగించాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి పొందాల్సి ఉండగా, జయ వారసులుగా పిటిషన్ వేసేవారెవరు అనే ప్రశ్న తలెత్తింది. అలాగే జయలలితకు చెందిన రూ.113 కోట్ల స్థిర, చరాస్థులు ఎవరికి అనే సందేహం కూడా ఉత్పన్నమైంది. జయలలితకు నేరుగా వారసులు ఎవ్వరూ లేరు. ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ తామే వారసులమని ముందుకు వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం తలచుకుంటే పోయెస్‌గార్డెన్‌లోని ఇంటిని జయలలిత స్మారక నిలయంగా మార్చివేసి స్వాధీనం చేసుకోవచ్చు. అంతేగాక కర్ణాటక న్యాయస్థానం ఆధీనంలోని ఆస్తులను తమకు అప్పగించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం, దీప, దీపక్ వేర్వేరుగా బెంగళూరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఆస్తుల చిక్కుముడిపై బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది మాట్లాడుతూ, జయలలిత పేరున ఉన్న మొత్తం రూ.113.72 కోట్ల ఆస్తుల్లో రూ.41.64 కోట్ల చరాస్థి, రూ.72.09 కోట్ల స్థిరాస్తి ఉందని తెలిపారు. జయలలిత ఆస్తుల్లో అత్యంత ఖరీదైనది పోయెస్‌గార్డెన్‌లోని ఆమె ఇల్లు అని చెప్పారు. ప్రస్తుతం ఈ ఇంటి ఖరీదు మార్కెట్ ధర ప్రకారం రూ.90 కోట్లు, ప్రభుత్వ రేటు ప్రకారం రూ.43.96 కోట్లని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లాలో 14.50 ఎకరాల్లో ఫాంహౌస్, మధురాంతకం సమీపం సెయ్యూరు గ్రామంలో 3.43 ఎకరాల భూమి, అనేక బ్యాంకుల్లో జయలలిత పేరున రూ.10.63 కోట్ల నగదు ఉన్నట్లు తెలిపారు. అంతేగాక రూ.42.25 లక్షల విలువైన రెండు టయోటా కార్లు, ఒక టెంపో ట్రావలర్, రెండు టెంపోట్రక్స్, రెండు మహేంద్రా వ్యాన్లు, ఒక స్వరాజ్‌మజ్దా కారు, ఒక అంబాసిడర్, ఒక కాంటెస్సా కారు ఉన్నట్లు చెప్పారు. అలాగే కొడనాడు ఎస్టేట్, బంగ్లా, శ్రీవిజయ పబ్లికేషన్, శశి ఎంటరప్రైజస్, గ్రీన్ టీ ఎస్టేట్ సహా రూ.24.44 కోట్ల విలువైన ఈ ఐదు ఆస్తుల్లో జయ భాగస్వామిగా ఉన్నారు. జయ గనుక వీలునామా రాసి ఉంటే వారికే చెందుతుంది, లేకుంటే రక్తసంబంధీకులు పొందవచ్చని ఆయన అన్నారు. జయను నిర్దోషిగా ప్రకటించినందున ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫొటోలను పెట్టుకోవచ్చని, భారతరత్న బిరుదుకు సిఫార్సు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. -
జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసులో జయలలితను దోషిగా తేల్చాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. జయలలితను దోషిగా ప్రకటించలేమని సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటక సర్కార్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు... జయలలిత మినహా శశికళతో పాటు మిగతావారిని దోషులుగా తేల్చిన విషయం విదితమే. కాగా జయలలిత అక్రమాస్తుల కేసులో రూ.100 కోట్ల అపరాధ సొమ్మును వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అనారోగ్యంతో జయలలిత మృతి చెందడంతో ఆమె శిక్షను రద్దు చేసున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు అదే సమయంలో అపరాధ రుసుం రూ.100 కోట్లను వేరే రూపంలో వసూలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇదిలావుండగా ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముద్దాయి చనిపోయిన నేపథ్యంలో జయలలితకు విధించిన అపరాధ రుసుం వసూలు చేసేందుకు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదనేది ఈ పిటిషన్ సారాంశం. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాగా జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకు జయలలిత, శశికళ, ఇళవరసి, దివాకరన్ల నుంచి కర్ణాటక ప్రభుత్వం రూ. 130 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలి. అలాగే శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి రూ.30 కోట్ల అపరాధరుసుం వసూలు చేయాలి. మరోవైపు ఈ కేసులో దోషిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నారు. -
అమ్మ నియోజకవర్గంలో ఈసీ రికార్డు
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లకు భారీగా డబ్బు పంచుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈసీ ఏకంగా ఐదుగురు పరిశీలకులను నియమించింది. దేశ ఎన్నికల చరిత్రలో ఓ స్థానానికి ఇంతమంది పరిశీలకులను నియమించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ఇదివరకే ముగ్గురు పరిశీలకులను నియమించింది. కాగా ఓటర్లకు పెద్ద ఎత్తును డబ్బు పంచుతున్నారని డీఎంకే, సీపీఎం తదితర పార్టీలు ఫిర్యాదు చేయడంతో.. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఈసీ మరో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఉమేష్ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డబ్బు పంపణీకి సంబంధిన ఫిర్యాదులను పరిశీలించేందుకు 12 మందికిపైగా ఆదాయ పన్ను శాఖ అధికారులను ఈసీ నియమించింది. ఉప ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఎన్నికలు జరిగే మొత్తం 256 పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక 25 ఫ్లయింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించనున్నారు. -
ఆర్కేనగర్ రేసులో 62 మంది
►ఈవీఎంలతో ఓటింగ్ ►పది కంపెనీల పారా మిలటరీ ►ఆర్కేనగర్లో ప్రచార హోరు ►పన్నీరు, దీప శ్రీకారం ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో 62 మంది అభ్యర్థులు నిలిచారు. బహుముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. భద్రత నిమిత్తం పది కంపెనీల పారా మిలటరీ రంగంలోకి దిగనుంది. ఓట్ల వేటలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, జయలలిత మేన కోడలు దీప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై: జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. అన్నాదీఎంకేలో ఏర్పడ్డ చీలికల పుణ్యమా ఈ సారి ఆ పార్టీ గుర్తు రెండాకుల్ని ఎన్నికల యంత్రాంగం సీజ్ చేయక తప్పలేదు. అన్నాడీఎంకే గుర్తు లేని ఎన్నికలుగా సాగుతున్న సమరంలో గెలుపు కోసం తీవ్ర కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఎన్నికల బరిలో నిలబడేందుకు 127 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో ఓటింగ్ బ్యాలెట్ ద్వారా జరపక తప్పదన్న ప్రశ్న బయల్దేరింది. అయితే, పరిశీలన, ఉప సంహరణ పర్వాలతో సోమవారం నాటికి చివరకు రేసులో 62 మంది నిలిచారు. రేసులో ఉన్న అభ్యర్థులు తుది జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రకటించడంతో ప్రచారం మరింతగా ఊపందుకుంది.రేసులో 62 మంది:డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. డీఎంకే అభ్యర్థి ఓట్లు చీల్చే దిశగా గణేష్ పేరు వచ్చే రీతిలో పలువురు నామినేషన్లు దాఖలు చేసినట్టు సమాచారం. తుది జాబితా ప్రకటనతో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టింది. 63 మందికి పైగా అభ్యర్థులు రేసులో ఉంటే బ్యాలెట్ నిర్వహించాల్సి ఉంటుందని తొలుత నిర్ణయించారు. అయితే, సంఖ్య ప్రస్తుతం 62కు పరిమితం కావడం, నోటా చిహ్నం ఒకటిని కలుపుకుంటూ, ఒక్కో పోలింగ్ బూత్‌కు నాలుగు ఈవీఎంలను ఉపయోగించేందుకు తగ్గ చర్యల్లో అధికార వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గంలో నగదు బట్వాడా అడ్డుకట్ట, మద్యం తదితర తాయిలాల పంపిణీని అడ్డుకునే విధంగా తనిఖీల ముమ్మరం అయ్యాయి. పది కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాలు ఒకటి రెండు రోజుల్లో చెన్నైకు రానున్నాయి. తనకు వయసు లేదన్న కారణంతో నామినేషన్ తిరస్కరించినట్టు ఎన్నికల యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వయసు 23 సంవత్సరాలు అని, అయితే, తనకు 25 సంవత్సరాలు రాలేదన్న ఒక్క కారణంతో నామినేషన్ తిరస్కరించారని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమైన ఆర్కేనగర్కు చెందిన సౌమ్య పిటిషన్లో వివరించారు. ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించినప్పుడు, అదే ఎన్నికల్లో నిలబడేందుకు వయస్సు 25గా నిర్ణయించడం ఏమిటోనని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన తమకు అన్ని హక్కులు ఉన్నప్పుడు, ఎన్నికల్లో మాత్రం నిలబడే హక్కు ఎందు లేదని సౌమ్య ప్రశ్నించడం గమనార్హం. ప్రచారంలో నేతలు: మధుసూదనన్‌కు మద్దతుగా మాజీ సీఎం పన్నీరు సెల్వం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓపెన్ టాప్ వాహనంలో ఆయన సుడిగాలి పర్యటనతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. టీటీవీ దినకరన్ సైతం ప్రచారంలో ఉరకలు తీశారు. సీఎం ఎడపాడి పళనిస్వామి, మంత్రులతో కలిసి ఏకంగా ఆర్కేనగర్కు ఓ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ జయలలిత మేనకోడలు దీప ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ అభ్యర్థికి మద్దతుగా డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రచారం రద్దు కాగా, ఆయన స్థానంలో ప్రేమలత విజయకాంత్ ఓటర్ల వద్దకు బయల్దేరారు. బీజేపీ అభ్యర్థి గంగై అమరన్కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ప్రచారం నిర్వహించారు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్ ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఆయనకు మద్దతుగా మంగళవారం ఆ పార్టీ నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ప్రచారం చేపట్టనున్నారు. దీపకు పడవ: ఎంజీయార్, అమ్మ, దీప పేరవై అభ్యర్థి, జయలలిత మేన కోడలు దీపకు ఎన్నికల యంత్రాంగం పడవ చిహ్నంగా కేటాయించింది. ఆర్కేనగర్ రేసులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీప ప్రచార పయనానికి శ్రీకారం చుట్టారు. ఆమెకు పడవ చిహ్నం రావడంతో అందుకు తగ్గ ప్లకార్డులను చేత బట్టి మద్దతుదారులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
టీనేజ్‌లో జయలలిత అంటే పడిచచ్చేవాణ్ని!
ఏ మోహమాటం లేకుండా మనస్సులో మాట సూటిగా చెప్పడం జస్టిస్ మార్కండేయ కట్జూ శైలి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. గతంలో ఆమెను రెండుసార్లు తాను కలిసినప్పటి జ్ఞాపకాలను ఫేస్బుక్లో నెమరు వేసుకున్నారు కట్జూ. జయలలిత పక్కన తాను కూర్చున్న ఫొటోను ఎఫ్బీలో పెట్టి.. 'షేర్నీ ఔర్ షేర్' (పులి-పులి) అంటూ కామెంట్ చేశారు. జయలలిత మీద అపారమైన గౌరవాన్ని చూపెట్టిన ఆయన తాజాగా ఫేస్బుక్లో ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని వెల్లడించారు. తాను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే పడిచచ్చేవాడినంటూ ఇన్నాళ్లు దాచిన ఆ రహస్యాన్ని బయటపెట్టేశారు. 'నేను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేదని అనుకునేవాడిని. మనస్సులో ఉండిపోయిన ఆ ప్రేమ గురించి జయలలితకు తెలియదు. ఆమె 1948 ఫిబ్రవరిలో జన్మించగా, నేను 1946 సెప్టెంబర్‌లో పుట్టాను. 2004 నవంబర్‌లో చెన్నై రాజ్‌భవన్‌లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నా ప్రమాణం సందర్భంగా ఆమెను తొలిసారి కలిశాను. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి. అప్పటికీ అందంగా ఉంది. నా యవ్వనంలో కలిగిన భావనను అప్పుడు ఆమెకు చెప్పడం సరికాదని అనిపించింది' అని కట్జూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జయలలిత సినిమా పాటను కూడా షేర్ చేశారు.