తమిళనాట అమ్మ జనసేన పార్టీ | amma janasena party in tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాట అమ్మ జనసేన పార్టీ

Published Sat, Sep 9 2017 10:46 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

తమిళనాట అమ్మ జనసేన పార్టీ

తమిళనాట అమ్మ జనసేన పార్టీ

చెన్నై: తమిళనాట కొత్త రాజకీయ పార్టీ స్థాపించుటకు సన్నాహాలు చేస్తున్నారు.  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అమ్మ జనసేన పార్టీ స్థాపించనున్నారు. అదే విధంగా పార్టీ జండాను కూడా ఖరారు చేశారు. ఈ పార్టీ ఆంధ్ర, తెలంగాణా ,కేరళ. పుదుచ్చేరి, కర్ణాటక ప్రాంతాల్లో స్థాపించబడుతోంది. ‘ దక్షిణాది ని రక్షిద్దాం ’... అనే నినాదం తో ఈ ప్రాంతాల్లో ప్రజల ముందుకు వస్తోంది.

దక్షిణాది లో ప్రధానమంత్రి, వారి మంత్రి వర్గ సహచరుల కార్యాలయాల సాధన, నేలలో 5 రోజులు ఇక్కడ ఉండే విధంగా పోరాటం చేయాలి. విద్యా, వైద్య, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు కు నేలకు 5 వేలు అన్నదాత పేరుతో పెన్షన్ ఇచ్చే విధంగా పోరాటం, పొలం బాటలో మరణించిన వారికి ఆర్ధిక సహాయం ,ఆహార పంటలను పండించే రైతులకు కావాల్సిన విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు ఉచితంగా ఇవ్వటం, రైతు కోఆపరేటివ్ సొసైటీలు పెట్టి వారికి నిత్యవసర వస్తువులను జి.ఎస్.టి లేకుండా ఇవ్వటం, వాణిజ్య పంటలు కాకుండా ఆహార పంటలు పండించే వారికి ప్రభుత్వం అవసరమైన ట్రాక్టర్లు, పంట కటింగ్ మిషన్లను ఎలాంటి అద్దె లేకుండా కేవలం డీజిల్ ధర చెల్లించినచో రైతు కార్పొరేషన్ ద్వారా ఉచితంగా ఇవ్వటం, ప్రతిబిడ్డ పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు పోషణ నిమిత్తం నెలకు రూ. 1,500 చైల్లించాలని, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు నెలకు మందులకు, వారి అవసరాలకు రూ. 3 వేలు చెల్లించుటకు చర్యలు, పిల్లలకు 1వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉచిత విద్య,  

ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు విదేశీ చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులు చైల్లించటం, రూ. 15,000 లోపు జీతం గల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి కత్తిరింపులు లేకుండా నికర జీతాన్ని చెల్లించడం, మల్టిఫ్లెక్స్ సినిమా థియేటర్లలో కచ్చితంగా సగం సీట్లు టికెట్ ధరలు రూ. 50 మించకుండా ఉండటం. ప్రాంతీయ చిత్రాలను విధిగా అన్ని సినిమా హాళ్లలో ప్రదర్శించే విధంగా చర్యలు. సినిమా హాల్స్ నందు పార్కింగ్, తినుబండారాల దోపిడీని నియంత్రించడం. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్ లో 25 శాతం పేదవారికి పుట్టినప్పటి నుండి 5 ఏళ్ల వరకు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు విధిగా ఉచిత వైద్యం అందిచటం. మాతృభాషలో  చదువుకున్న వారికి ఉద్యోగాలో,  కళాశాలలో ప్రవేశానికి స్పెషల్ కోటా. ప్రతి గ్రామీణ విలేకరులకు నెలకు రూ. 5,000 చెల్లించటం, గ్రామీణ విద్యార్థులకు,  ప్రైవేటుగా రూ. 5,000 లోపు జీతం ఉన్న వారికి ఉచిత బస్ ప్రయాణం. ప్రతి ఇంటికీ బాత్రూమ్ నిర్మించకపోతే ప్రభుత్వ రాయితీలు రద్దు చేసే విధంగా చట్టం.

18  నుంచి 50 ఏళ్ల మహిళలకు ఉచితంగా కేర్ ఫ్రీని అందించడం. పుట్టిన ప్రతిబిడ్డకు ఉచితంగా ఒక కిట్టుతో పాటు వెండి మొలతాడు. ప్రతి వికలాంగుడికి ప్రభుత్వ  ఉద్యోగం, లంచగొండి ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ తో పనిలేకుండా కచ్చితంగా నేరుగా ఉద్యోగ విరమణ. మరణించిన పేదల దహన సంస్కారల కొరకు రూ. 5,000  చెల్లించుట. ప్రతి గ్రామానికో గ్రంధాలయం, అందులో ఇంటర్నెట్ సౌకర్యం. పేద వయసు మళ్లిన కళాకారులను వృద్ధాశ్రమంలో చేర్చి వారికి డాక్టర్లతో పర్యవేక్షణ. నెలకు రూ. 5,000 లోపు ఆదాయం ఉన్న సెల్ ఫోన్ వినియోగదారులకు నెలకు 1 జి. బి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం.
 
పట్టణ ప్రాంతాల్లో రద్దీ గా ఉండే ప్రాంతాల్లో నేరుగా ప్రజల వద్దకు పాలన, మీ సమస్య 24 గంటల్లో వెబ్ కెమెరాల ద్వారా మా పరిష్కారం. ‘ సేవ్ దక్షిణ భారత్’ అనే నినాదంతో ఈ పార్టీ పనిచేస్తుందని కేతిరెడ్డి తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ, జయలలిత సమాధి వద్ద ప్రతిన బూని పాదయాత్ర ద్వారా దక్షిణ భారతదేశం మొత్తం తిరిగి ప్రజాధికారం విలువలను ప్రజలకు తెలియ చేయనున్నట్లు.. ఓటుకు ఉన్న సత్తాను, అలాగే తన ఉద్దేశాన్ని ప్రజలకు ఈ పాదయాత్ర ద్వారా తెలుపనున్నట్లు కేతిరెడ్డి చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement