దక్షిణాది, ఉత్తరాది అంటూ సినిమా ఇండస్ట్రీలో భేదాలు చూపడం సరికాదంటున్నాడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. సినిమా పట్ల వివక్ష చూపడం సరికాదని సూచించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ..
మనం ఎక్కువ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం. దక్షిణాది సినిమాలకు ఉత్తర భారత దేశంలోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవల రిలీజ్ అయ్యిన పుష్ప 2 దక్షిణాది కంటె ఉత్తరాదిలోనే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.
భారతదేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలో మొత్తం 6,877 థియేటర్లు ఉండగా, అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు 1,097 ఉన్నాయి. ఏపీ తర్వాత తమిళనాడులో 943, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703, తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి.
టాప్ 5లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే చోటు దక్కడం విశేషం. దక్షిణాదిలో దాదాపు 3,700 థియేటర్లు ఉన్నప్పటికీ ..రెవెన్యూ పరంగా 3,200 థియేటర్స్ ఉన్న ఉత్తరాదిన ఎక్కువ గా వసూళ్లు వచ్చాయి. ఇది మనం గమనించాలి.
సినిమా పరిశ్రమ అంటేనే ప్రేక్షకులకు వినోదం పంచడం. దక్షిణాది, ఉత్తరాది అంటూ వేరు వేరుగా చూడకూడదు. సౌత్, నార్త్ సినిమాలన్నీ భారతీయ చిత్ర పరిశ్రమలో భాగమని గుర్తించాలి అని కోరారు
Comments
Please login to add a commentAdd a comment