
మెరీనా బీచ్‌లోని జయ సమాధి(ఫైల్)
దివంగత ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత మృతదేహాన్ని మెరీనాబీచ్ నుంచి తొలగించాలని కోరుతూ
- మద్రాస్ హైకోర్టులో పిటిషన్
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత మృతదేహాన్ని మెరీనాబీచ్ నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. ఎస్.దురైస్వామి అనే న్యాయవాది ఇటీవల వేసిన ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) సోమవారం విచారణకు వచ్చింది.
అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ వంటి మహామహుల స్మారకాల సమీపంలో దోషిగా తేలిన జయలలిత సమాధి నిర్మాణం సరికాదని పిటిషనర్ వాదించారు. అంతేగాక బీచ్ తీరం నుంచి 500 అడుగుల్లో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకూడదని పర్యావరణ శాఖ నిషేధాజ్ఞలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయా కారణాల దృష్ట్యా మణిమండప నిర్మాణ పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని బీచ్ నుంచి తొలగించేలా ఆదేశించాలని పిటిషనర్ వాదించారు.