![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/8/22_0.jpg.webp?itok=Pxo7yG3n)
సాక్షి, చైన్నె : దివంగత సీఎం జయలలితకు సంబంధించిన అటాచ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమవుతోంది. బెంగళూరు కోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారాల పర్యవేక్షణకు న్యాయ వాదిని శుక్రవారం నియమించింది. అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, ఇలవరసి, సుధాకరన్ దోషులుగా తేలిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడే సమయానికి జయలలిత అనంత లోకాలకు వెళ్లారు. దీంతో ఆమె నెచ్చెలి, బంధువులు జైలు శిక్షను అనుభవించి ప్రస్తుతం బయటకు వచ్చారు.
అయితే, అక్రమాస్తుల కేసులో పెద్ద ఎత్తున జయలలితకు సంబంధించిన ఆస్తులు, వస్తువులను సీబీఐ జప్తు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని గత నెల బెంగళూరు కోర్టు ఆదేశించింది. అయితే, ఇంత వరకు ఎలాంటి చర్యలను కర్ణాటక ప్రభుత్వం చేపట్ట లేదు. ఈ పరిస్థితులలో ఈ కేసు మరలా ఈనెల 11వ తేదీ విచారణకు రానుంది. కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా కిరణ్ ఎస్ జౌహిని నియమించారు. వేలంలో ఈ ఆస్తులను మళ్లీ చేజిక్కించుకునేందుకు చిన్నమ్మ బృందం వ్యూహాలు పన్నేనా అన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment