జయ వీడియో.. ఇంత దిగజారుడు రాజకీయమా? | The death of Jayalalithaa has been politicised, says MK Stalin | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 20 2017 3:01 PM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

The death of Jayalalithaa has been politicised, says MK Stalin - Sakshi

సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో తాజాగా వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. జయలలిత సొంత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఈ వీడియోలు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. పలు అనుమానాల నడుమ జయలలిత మృతి మిస్టరీగా మారగా.. ఇప్పుడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ వీడియో, ఫొటోలు విడుదల కావడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. ' ఇప్పటికే జయలలిత మృతి మిస్టరీగా మారింది.  ఇప్పుడు ఈ వీడియోలు విడుదల చేసి ఆమె మృతిపై రాజకీయం చేస్తున్నారు. ఇంతకన్నా దిగజారడం ఉండదు. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికపై ఈ ఈ వీడియో ప్రభావం ఉండదు' అని ఆయన అన్నారు.

అయితే, ఈ వీడియో విడుదలను శశికళ, దినకరన్‌ వర్గం సమర్థించుకుంటోంది. అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందించిన చికిత్సపై కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి ఆరోపణలను కొట్టిపారేసేందుకే ఈ వీడియోను విడుదల చేశామని దినకరన్‌ వర్గం నేత టీ సెల్వన్‌ పేర్కొన్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఎలాంటి కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధమని చెప్పారు. కాగా, సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక గురువారం జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement