40 స్థానాలు మావే! | - | Sakshi
Sakshi News home page

40 స్థానాలు మావే!

Published Mon, Jun 19 2023 9:42 AM | Last Updated on Mon, Jun 19 2023 9:45 AM

మీడియాతో మాట్లాడుతున్న పళనిస్వామి  - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న పళనిస్వామి

సాక్షి, చైన్నె: రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలు తమవేనని, గెలుపు ప్రకాశవంతంగా ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. సేలం జిల్లా ఆత్తూరులో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే బలం ఏమాత్రం తగ్గలేదని ఽధీమా వ్యక్తం చేశారు.

దివంగత నేతలు ఎంజీఆర్‌, జయలలిత మార్గంలో మరింత బలోపేతం దిశగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అని అయితే, ప్రజామద్దతు ముఖ్యం అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ఏ ఒక్కరికీ బానిస కాదని స్పష్టం చేశారు.

తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో అన్నాడీఎంకే బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ తమ గెలుపు ప్రకాశవంతంగా ఉందని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేయగా, అవి ఆయన వ్యక్తిగతం అని సమాధానం ఇచ్చారు. 25 స్థానాలను బీజేపీ గురి పెట్టినట్టుందే అని మళ్లీ ప్రశ్నించగా, అమిత్‌ చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement