AnnaDMK government
-
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సంచలనం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే,అన్నా డీఎంకేల మధ్య జరిగిన చర్చల్లో చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సార్లు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కోసం చేతులు కలపాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విభేదాలు 1970ల నుండి కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడులో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా, దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ పార్టీలు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పొత్తు జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు అవుతుంది. అయితే, ఇరుపార్టీల కేడర్, నాయకత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. మరోవైపు, కొత్తగా ఎదుగుతున్న పార్టీలు కూడా ఈ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
40 స్థానాలు మావే!
సాక్షి, చైన్నె: రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలు తమవేనని, గెలుపు ప్రకాశవంతంగా ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. సేలం జిల్లా ఆత్తూరులో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే బలం ఏమాత్రం తగ్గలేదని ఽధీమా వ్యక్తం చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో మరింత బలోపేతం దిశగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అని అయితే, ప్రజామద్దతు ముఖ్యం అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ఏ ఒక్కరికీ బానిస కాదని స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్సభ నియోజకవర్గాలలో అన్నాడీఎంకే బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ తమ గెలుపు ప్రకాశవంతంగా ఉందని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేయగా, అవి ఆయన వ్యక్తిగతం అని సమాధానం ఇచ్చారు. 25 స్థానాలను బీజేపీ గురి పెట్టినట్టుందే అని మళ్లీ ప్రశ్నించగా, అమిత్ చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
డీజీపీ ఎవరు?
* ముగియనున్న రామానుజం పదవీ కాలం * రేసులో నలుగురు * కేంద్రానికి జాబితా సాక్షి, చెన్నై: రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ రామానుజం పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి డీజీపీ ఎవరన్న ప్రశ్న పోలీసు వర్గాల్లో మొదలైంది. ఈ పదవికి అర్హులుగా పేర్కొంటూ నలుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా రామానుజంను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రను పోషించారు. అధికార పక్షానికి విధేయతను చాటిన ఆయన 2012 నవంబరులో పదవీ విరమణ పొందారు. దీంతో తదుపరి డీజీపీ చాన్స్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ అప్పట్లో మొదలైంది. అయితే, ఈ చర్చకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేసులో ఉన్న ఇతర అధికారుల్ని నిరాశలో పడేసింది. రామానుజం పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ, ఆయన సేవల్ని మరింతగా వినియోగించుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్లు: రామానుజం పదవీ కాలాన్ని పొడిగించడంపై కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, అవన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ముందుకు చతికిల బడ్డారుు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండా తన పదవిని రామానుజం కొనసాగిస్తున్నారన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. ఇది వరకు ఆయన పదవీ కాలం పొడిగించినప్పుడే కేంద్రం సైతం వ్యతిరేకించింది. ఈ దృష్ట్యా, ఇక, ఆ పదవిలో రామానుజం మళ్లీ కొనసాగే పరిస్థితులు లేవు. దీంతో తదుపరి డీజీపీ ఎవరు అన్న చర్చ పోలీసు వర్గాల్లో బయలుదేరింది. నలుగురితో జాబితా: రామానుజంకు ఇక విశ్రాంతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించే సిఫారసు మేరకు ఒకరిని ఎంపిక చేస్తూ కేంద్రం ఆమోదం తెలపడం సహజం. దీంతో కొత్త డీజీపీ ఎంపికకు సంబంధించి నలుగురి పేర్లను సూచిస్తూ కేంద్రానికి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇందులో ప్రస్తుతం డీజీపీ హోదాతో ఇతర విభాగాల్లో ఉన్న అనూప్ జైశ్వాల్, కె ముత్తుకరుప్పన్, ఆర్ శేఖర్, అశోక్ కుమార్లు ఉన్నారు. అనూప్ జైశ్వాల్ లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా శాంతి భద్రతల పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో అధికార పక్షంతోపాటుగా అన్ని పార్టీలకు చుక్కలు చూపించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ దృష్ట్యా, ఆయన చేతికి శాంతి భద్రతల పగ్గాలు వెళ్లొచ్చన సంకేతాలు ఉన్నా, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.


