
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే శనివారం జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించి అక్కడి నుంచే తన పొలిటికల్ రీ ఎంట్రీపై చినమ్మ ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, అక్టోబర్ 17కి అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చదవండి: (నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం)
అయితే జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment