తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయాలని ఆపార్టీ సీనియర్ నేత ఆమోస్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయాలని ఆపార్టీ సీనియర్ నేత ఆమోస్ పరోక్షంగా డిమాండ్ చేశారు. పార్టీ బలోపేతానికి కొత్త పీసీసీని పునర్వస్థీకరించాలని ఆయన సూచించారు. కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమోసు తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పొన్నాల లక్ష్మయ్యకు పంపారు.