
శిశువుకు పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
శిశువు బతికున్నా.. చనిపోయిందని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు చెప్పారని వరంగల్ అర్బన్ హసన్‌పర్తి మండలం
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం శిశువును పరీక్షించి, మృతి చెందిందని వైద్యులు పేర్కొని ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తక్కువ బరువుతో శిశువు జన్మించడంతో ఇలా జరిగిందన్న ఆవేదనతో బంధువులు శిశువు మృతదేహాన్ని పెగడపల్లి తీసుకువెళ్లి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే, ఈ సందర్భంగా శిశువులో కదలికలు కనిపించడంతో వారు తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఉలిక్కిపడిన వైద్యులు శిశువుకు మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలో పల్స్ ఆక్సిమీటర్‌తో పరీక్షించడంతో పాటు శిశువుకు ఆక్సీజన్ అందించి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, శిశువు మృతి చెందిందని వైద్యులు స్పష్టం చేశారు.