Aishwarya Gowdaa
-
మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: జువెలరీ షాప్‌ల యజమానులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా నగలు, డబ్బు వసూలు చేసి మోసం చేసిన కిలేడీ ఐశ్వర్యగౌడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి వినయ్ కులకర్ణి కారు డ్రైవర్ వీరేశ్ దళవాయిని అరెస్టు చేశారు. ఐశ్వర్యగౌడకు చెందిన బెంజ్ కారు వినయ్ కులకర్ణి ఇంటి ముందు లభించింది. దీంతో డ్రైవర్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. వినయ్ కులకర్ణితో ఐశ్వర్యగౌడకు పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసులు గాలిస్తున్నప్పుడు ఆమె మహారాష్ట్రకు వెళ్లే ముందు ధార్వాడలోని వినయ్ కులకర్ణి ఇంటికి వచ్చింది. వెళ్లేటప్పుడు తన కారు అక్కడే వదిలి విమానంలో మహారాష్ట్రకు వెళ్లింది. కేసు కొలిక్కి వచ్చిందని త్వరలో ఛార్జ్ షీట్ సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. -
‘మాజీ ఎమ్మెల్యేతో నాకు డీల్స్’
మండ్య: బెంగళూరుతో సహా పలుచోట్ల నగలు, నగదు మోసగించిన కేసుల్లో నిందితురాలు ఐశ్వర్యగౌడ సంచలన వ్యాఖ్యలు చేసింది. జిల్లాలోని మళవళ్ళి మాజీ ఎమ్మెల్యే డాక్టర్.కే. అన్నదాని, నా మధ్య ఒక వ్యవహారం జరిగింది. ఇప్పుడాయన నేనెవరో కూడా మరిచిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి డిప్రెషన్లో నన్ను మరిచిపోయారేమో అని హేళన చేశారు. మండ్యలో సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడారు. నాకు– అన్నదానికి కొన్ని వ్యవవహారాలు జరిగాయి. అన్నదాని మంచివారు అని ఆయన అనుచరులు చెప్పుకోనివ్వండి. క్రిమినల్స్, మోసగాళ్లు తప్పుడు మాటలు చెబుతారు. నేను ఎవరు అనేది ఆయన మరిచిపోయారు. అన్నదాని నాకు ఒంటరిగా దొరకాలి, అప్పుడు నేను ఎవరు, ఎలా పరిచయం అయ్యాను, ఆయనకు– నాకు మధ్య జరిగిన డీల్స్ ఏమిటి అని గుర్తు చేస్తాను అని మండిపడింది. దీనిపై కేసు పెట్టినా భయపడను, ఆయనకు ధైర్యం నా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండి అని సవాల్ చేసిం -
ఐశ్వర్య కార్లు.. మాజీ మంత్రి వద్ద!
యశవంతపుర, దొడ్డబళ్లాపురం: మాజీ ఎంపీ డీకే సురేశ్ చెల్లినని చెప్పుకుని బెంగళూరులో నగల షాప్‌ల నుంచి మొదలుకుని అనేక మందికి కోట్లల్లో వంచించిన కిలేడీ ఐశ్వర్య గౌడ కేసులో అనేకమంది నాయకుల పేర్లు బయటపడుతున్నాయి. పోలీసులు ఐశ్వర్యగౌడపై నమోదైన కేసుల్లో ఆమె ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఐశ్వర్యగౌడ పేరుమీద ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే ఆ కార్లు మాజీ మంత్రి, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వినయ్ కులకర్ణి వద్ద ఉండడం చర్చనీయాంశమైంది. ఆమెతో ఆయనకేమిటి సంబంధం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాకు అనేకమంది బడా రాజకీయ నాయకులతో స్నేహాలున్నాయి అని ఆమె చెబుతూ వస్తోంది. ఆ మాటలు నిజమేననిపిస్తోంది. ఐశ్వర్యగౌడ అనేకమంది బడా బాబులను మండ్య జిల్లాలోని ఆమె ఊరికి తీసికెళ్లి వేడుకల్లో ముఖ్య అతిథులుగా సన్మానాలు చేసేది. వినయ్ కులకర్ణి కూడా ఐశ్వర్యగౌడ ఊరికి వెళ్లివచ్చాడని సమాచారం. చీటింగ్ కేసులో ఆమె బెయిలు మీద ఉన్నారు.ఐశ్వర్య వద్ద లగ్జరీ కార్లుఐశ్వర్యగౌడ భర్త హరీశ్ పేరుపై నమోదైన ఖరీదైన బెంజ్ కారును మాజీ మంత్రి వినయ్ కులకర్ణి ఉపయోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. దీనితో పోలీసులు వినయ్‌కు నోటీసులిచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఐశ్వర్యగౌడ నుంచి ఒక బిఎండబ్ల్యూ, ఆడి, ఫార్చూనర్ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పేరుతో మరో రెండు బెంజ్ కార్లు ఉన్నట్లు గుర్తించారు.కారు డ్రైవర్.. హత్యకేసు నిందితుడుధార్వాడలో జరిగిన బీజేపీ జడ్పీటీసీ యోగేశ్‌గౌడ హత్యకేసులో ఐదో నిందితునిగా ఉన్న అశ్వర్థగౌడ ఐశ్వర్యకు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడు ఆమె ఎలా కారు డ్రైవర్ అయ్యాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య కేసులో వినయ్ కులకర్ణి ప్రధాన నిందితుడు కావడం, అతడు ఐశ్వర్యకు కూడా సన్నిహితుడు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.రూ. 5 కోట్లు కొట్టేసిందని కేసుబెంగళూరుకు చెందిన గైనకాలజిస్టు డా.మంజుళా పాటిల్.. ఐశ్వర్యపై ఆర్ఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 5.03 కోట్లు తనను మోసం చేసిందని తెలిపారు. డీకే సురేశ్ సోదరినని చెప్పుకుని భారీ వ్యాపారాలు చేస్తున్నట్లు నమ్మించింది, డబ్బు, బంగారం తీసుకుందని తెలిపారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ‘చార్లీ 777’ చైల్డ్ ఆర్టిస్ట్
చార్లీ 777, జాగ్వార్ లాంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఐశ్వర్య గౌడ..ఇప్పుడు హీరోయిన్గా మారబోతుంది. మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ మరియు రాస్ర ఎంటర్ టైన్మంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ సినిమాలో ఐశ్వర్య హీరోయిన్గా నటించగా.. మరో చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ రామ్(బుర్రకథ, రంగ రంగ వైభవంగా) హీరోగా పరిచయం అవుతున్నాడు. రాజు బొనగాని దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘ఈ డిసెంబర్ నెలలోనే 'ఏ రోజైతే చూశానో నిన్ను' షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ రామ్, ఐశ్వర్య గౌడ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.