
దొడ్డబళ్లాపురం: జువెలరీ షాప్‌ల యజమానులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా నగలు, డబ్బు వసూలు చేసి మోసం చేసిన కిలేడీ ఐశ్వర్యగౌడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి వినయ్ కులకర్ణి కారు డ్రైవర్ వీరేశ్ దళవాయిని అరెస్టు చేశారు. ఐశ్వర్యగౌడకు చెందిన బెంజ్ కారు వినయ్ కులకర్ణి ఇంటి ముందు లభించింది. దీంతో డ్రైవర్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేశారు.
వినయ్ కులకర్ణితో ఐశ్వర్యగౌడకు పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసులు గాలిస్తున్నప్పుడు ఆమె మహారాష్ట్రకు వెళ్లే ముందు ధార్వాడలోని వినయ్ కులకర్ణి ఇంటికి వచ్చింది. వెళ్లేటప్పుడు తన కారు అక్కడే వదిలి విమానంలో మహారాష్ట్రకు వెళ్లింది. కేసు కొలిక్కి వచ్చిందని త్వరలో ఛార్జ్ షీట్ సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment