Anthapuram district
-
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎన్నిక బాయ్ కాట్👉వైఎస్సార్ సీపీ ఎమ్పీటీసీలకు భద్రత కల్పించటంలో పోలీసులు విఫలం👉టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులపై పోలీసుల మౌనం👉నిన్న పేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేసిన పరిటాల వర్గీయులు👉గాండ్లపెంట ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలు👉పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహంప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్👉వైఎస్సార్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా పలువురి నేతల హౌస్ అరెస్ట్👉నేడు నిన్న వాయిదా పడిన గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక👉నిన్నటి ఎన్నికకు వైఎస్సార్సీపీ సభ్యులు హాజరుకాకుండా రాళ్ళ దాడి చేసిన ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు👉కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక👉నేడు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు అరెస్టులు👉ఎన్నిక జరగకుండా అడ్డుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ👉వైఎస్సార్సీపీ సభ్యులకు రక్షణ కల్పించి ఎన్నిక సజావుగా జరపడంలో పోలీసుల వైఫల్యం👉దాడులకు దిగుతున్న టీడీపీ వారిని వదిలేసి వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్👉వైఎస్సార్సీపీ సభ్యులకు రక్షణ కల్పించి ఎన్నిక సజావుగా జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్టీడీపీ కుట్ర రాజకీయాలు👉పశ్చిమ గోదావరి జిల్లా: వాయిదా పడిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ స్థానాలకు నేడు ఎన్నికలు👉సంఖ్యాబలం లేకపోయినా.. కుయుక్తులు పన్నుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ👉అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు👉యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినగుంపర్రు ఎంపిటిసి కంబాల సత్య శ్రీనీ అరెస్టు చేసిన పోలీసులు👉ఆమెపై కిడ్నాప్ కేసు పెట్టారంటూ కొత్త డ్రామాలకు తెర లేపిన పోలీసులు👉ఎంపీటీసీ అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులుస్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి కుట్రలు👉అక్రమ కేసులు, కిడ్నాపులను ఎదుర్కొని వైసీపీ విజయకేతనం👉వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేని చోట ఎన్నికలను నేటికి వాయిదా వేయించిన కూటమి నేతలు👉నేడు జరగనున్న ఎంపీపీ ఉప ఎన్నికలు: యలమంచిలి, అత్తిలి, గాండ్లపెంట, రామగిరి👉వైస్ ఎంపీపీ ఎన్నికలు : అత్తిలి, ఏలూరు రూరల్, కైకలూరు, కారంపూడి, నరసరావుపేట, దగదర్తి👉వైఎస్సార్ సీపీ సభ్యులను ఎన్నికలకు హాజరుకాకుండా చేసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం👉అవసరమైతే కోర్టులను ఆశ్రయించే యోచనలో వైఎస్సార్ సీపీ👉ఏమాత్రం బలం లేకపోయినా కుటిల రాజకీయంతో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేశారు. రొద్దంలో వారి పాచిక పారకపోగా.. గాండ్లపెంట, రామగిరి ఎంపీపీలను తమ ఖాతాలోకి వేసుకోవాలని అరాచకానికి తెరతీశారు. ఇందులో భాగంగానే ఆ రెండు ఎన్నికలు నేటికి వాయిదా పడ్డాయి.👉ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక ‘పరిటాల’ కుటుంబం పైశాచిక రాజకీయం చేసింది. రౌడీయిజం చేస్తూ.. దౌర్జన్యకాండ సృష్టించి.. అధికారులను అడ్డు పెట్టుకుని ఎంపీపీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించింది. సజావుగా ఎన్నిక జరిగితే ఓడిపోతామని తెలిసే ఎమ్మెల్యే పరిటాల సునీత దిగజారుడు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అధికారులను పావులుగా వాడుకొని వైఎస్సార్సీపీ సభ్యులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి, పదవులను ఆఫర్ చేసి లాక్కోవాలనే ప్రయత్నం చేశారు. ప్లాన్ ఫలించకపోయేసరికి ఎన్నికను వాయిదా వేయించారు.👉అభ్యర్థి లేకున్నా.. రామగిరి ఎంపీపీ పదవి మహిళకు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరఫున ఒక్క పురుషుడు మాత్రమే గెలిచారు. పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు కూడా పురుషులే కావడంతో రామగిరి నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థి లేరు. అయితే ప్రలోభాలకు గురి చేసి వైఎస్సార్సీపీ సభ్యులను లాక్కొని టీడీపీ కండువా వేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని పరిటాల సునీత వేసిన ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయింది.👉రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. అందులో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ మరణించారు. ఎంపీపీ పదవి దక్కాలంటే కనీసం ఐదుగురు మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున ఐదుగురు సభ్యులు బెంగళూరు క్యాంపులో ఉన్నారు.👉వైఎస్సార్సీపీ సభ్యులు గురువారం బెంగళూరు నుంచి రామగిరికి ఎన్నికల కోసం వస్తుండగా.. బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరి తీసుకెళ్తామని.. మిగతా వాళ్లు రాకూడదని సూచించారు. ఏడు వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యులతో రామగిరికి బయలుదేరారు. అయితే కాన్వాయ్ చెన్నేకొత్తపల్లి దాటే సమయానికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సమయానికి రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి ముగ్గురు సభ్యులు మాత్రమే చేరుకోవడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరింది. దీంతో ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. 👉రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడినట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ సభ్యులను తిరిగి కర్ణాటక సరిహద్దు దాటించే వరకూ పోలీసులు బందోబస్తులో ఉండాలి. అయితే ఎస్ఐ సుధాకర్‌యాదవ్ కల్పించుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో వీడియో కాల్స్ ద్వారా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో మాట్లాడించారు. పదవులు ఆఫర్ చేసి.. డబ్బు ద్వారా ప్రలోభాలకు గురి చేశారు. పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులందరూ ఒకే మాటపై నిలబడి.. పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.👉లీగల్ ప్రొసీజర్ ప్రకారం వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించాలని పోలీసులు సూచించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన టీడీపీ నేతలు వాహనాల్లో వచ్చి పేరూరు –2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచినా పోలీసులు అడ్డుకున్నారు.👉వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. మహిళా అభ్యర్థి ఉంటే.. నామినేషన్ దాఖలు చేసి.. ఏదో విధంగా బెదిరించి పార్టీ మార్చుకోవచ్చనే ఆలోచనతో పరిటాల సునీత దళిత మహిళను ఇరకాటంలో పడేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించారు.👉ఇక.. గాండ్లపెంటలో బలంలేకపోయినా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుటిల యత్నాలకు తెరలేపింది. మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒకచోట మాత్రమే టీడీపీ గెలుపొందింది. అయితే, గురువారం ఎంపీడీఓ కార్యాల యంలో ఎంపీపీ ఎన్నిక కోసం వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కదిరి నుంచి గాండ్లపెంటకు బయలు దేరగా.. మార్గమధ్యలో కదిరి–రాయచోటి ప్రధాన రహదారిలో పోలీసులు సోదాల పేరుతో అడ్డుకున్నారు. దీంతో ఆలస్యం జరిగి ఎన్నికల అధికారి ఎన్నికను నేటికి(శుక్రవారం) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
ముక్క లేనిదే ముద్ద దిగదాయె..
అనంతపురంలోని పాతూరుకు చెందిన షణ్ముగ వయసు 15 ఏళ్లు. చికెన్ అంటే మహా ఇష్టం. ఒక్క రోజులోనే కేజీ చికెన్ ఫ్రైచేసి ఇచ్చినా తినేస్తానంటాడు. నెలలో 10 రోజులు చికెన్ ఉండాల్సిందే అంటున్నాడు.గుంతకల్లుకు చెందిన రోషన్ ఆలీకి ఇరవై ఏళ్లు. తండ్రి మటన్ వ్యాపారం చేస్తాడు. అయినా సరే రోషన్‌కు చికెన్ అంటే ప్రాణం. రోజూ రెండు ముక్కలైనా చికెన్ ఉండాల్సిందే అంటున్నాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: యుక్తవయసు పిల్లలు శాకాహారం కన్నా మాంసాహారానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ పిల్లలు చికెన్ అంటే మరీ లొట్టలేసుకుని తింటున్నారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్, మటన్ తింటున్న వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లా మూడవ స్థానంలో ఉన్నట్టు తేలింది. నేషనల్ న్యూట్రిషనల్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల పిల్లల్లో 75.3 శాతం మంది చికెన్ తింటున్నారు. తర్వాతి స్థానం 51.6 శాతంతో మటన్ ఆక్రమించింది. దేశంలో మాంసాహార వినియోగంఏపీలో ఎక్కువగా ఉండగా, అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువేమీ కాదన్నట్టుంది. కూరగాయలు, పండ్లు తినడంలో వెనుకంజ ఉమ్మడి జిల్లాలో చిన్నారులు, కుర్రాళ్లు చికెన్, మటన్‌ను ఇష్టపడినట్టుగా కూరగాయలు, పండ్లపై మక్కువ చూపడం లేదు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని జిల్లాకు పేరున్నా ఇక్కడ పండ్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. 2–4 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో విటమిన్–ఏతో కూడిన తిండి, కూరగాయలు తినడంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నట్టు తేలింది. పండ్లు, కూరగాయలు తినడంలో కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేపల లభ్యత బాగానే ఉన్నప్పటికీ చికెన్, మటన్‌తో పోలిస్తే తక్కువ వినియోగం ఉన్నట్టు తేలింది.మాంసాహారంపైనే మక్కువ|⇒ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది కుర్రాళ్లు మాంసాహారం తినడానికి రకరకాల కారణాలున్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే... ⇒ కుటుంబ నేపథ్యంలో చిన్నప్పటినుంచే మాంసాహారంపై మక్కువ పెంచుకోవడం. ⇒ చికెన్ ఉత్పత్తులు ఎక్కువగా అందుబాటులో ఉండటం. ⇒ సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కొనుగోలు స్థాయి పెరగడం. ⇒ మాంసాహారాన్ని సాధారణ మెనూగా భావించి వినియోగించడం. ⇒ యువతను ఎక్కువగా ఆకర్షించేలా విభిన్న రుచుల్లో మాంసాహార వంటకాలు ఉండటం. ⇒ మాంసాహార వినియోగం పెరుగుతున్న స్థాయిలో వ్యాయామం చేయడం లేదు. ⇒ వయసుకు మించి బరువు ఎక్కువగా ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఫైబర్ ఆహారం తినడం లేదు⇒ శరీరానికి అత్యవసరమయ్యే ఫైబర్ (పీచు)తో కూడిన ఆహారం కుర్రాళ్లకు రుచించడం లేదు. ⇒ చిక్కుడు, గోరు చిక్కుడు, బీన్స్ వంటి కూరగాయలను పట్టించుకోవడం లేదు. ⇒ చిరుధాన్యాలను దరిచేరనివ్వడం లేదు. ⇒ గోబీ మంచూరియా, పానీపూరీ, కట్లెట్ లాంటి అనారోగ్యకర ఆహారంపై మక్కువ. ⇒ పాలు, పాలపదార్థాలతో కూడిన ఆహారం కూడా తక్కువగా వినియోగిస్తున్నారు. ⇒ ఫ్రైడ్ ఆహారం తినడం వల్ల 30 ఏళ్లకే గ్యా్రస్టిక్, అల్సర్ సమస్యలతో సతమతం. -
గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్
Updates: ►తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహా మనిషి వైఎస్సార్: సీఎం జగన్ ►వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ►ఏ పథకం చూసిన గుర్తుకొచ్చే నేత వైఎస్సార్ ►వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు గుర్తొస్తాయి. ►దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంటబీమా పరిహారం జమ చేస్తున్నాం ►2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం ►రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుంది. ►ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు ►మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు ►గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నాం. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించారు. ►అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. కాసేపట్లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొనున్నారు. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2 లక్షల మందికి రైతులకు లబ్ధి కలిగిస్తూ రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు. తద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,36,950 మంది రైతులకు రూ.212.94 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేతకు నివాళులర్పిస్తారు. 9న గండికోటకు సీఎం జగన్ ఈనెల 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని, రాణితోపులో నగరవనాన్ని, గరండాల రివర్ ఫ్రెంట్ వద్ద కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్–1 పనులను, పులివెందులలో నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏపీ కార్ల్‌లో న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమికి ప్రారం¿ోత్సవం చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు కడపలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కొప్పర్తిలో పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం: శంకర నారాయణ
సాక్షి, అనంతపురం జిల్లా: హంద్రీనీవాను ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. బాబు పూర్తి చేశారని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవాకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికి రైతులు గుర్తొచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం అని దుయ్యబట్టారు. (చదవండి: వారికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు: పేర్ని నాని) టీడీపీ నేతలు డ్రామాలు: తలారి రంగయ్య రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోలేదని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు సీమ ప్రాజెక్టుల భవిష్యత్ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాయలసీమలో తాగు,సాగునీటి కష్టాలు తొలగేలా సీఎం జగన్ పకడ్బందీ చర్యలు చేపట్టారని తలారి రంగయ్య అన్నారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): అనుమతుల్లేకుండా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలంటూ ఉద్దేహాళ్ నుంచి బొమ్మనహాళ్‌కు పాదయాత్ర చేపట్టారు. ఇందుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, అనుచరులతో కలిసి పాదయాత్రగా ఉప్పరహాళ్ క్రాస్ వద్దకు చేరుకున్న కాలవను కళ్యాణ దుర్గం ఇన్చార్జ్ డీఎస్పీ ఆంథోనప్ప, సీఐ రాజా, ఎస్ఐలు రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి కలిసి మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాదయాత్ర చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. విషయం ఏదైనా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేయాలని సూచించారు. దీనిపై హైడ్రామాకు కాలవ తెరలేపారు. ఇష్టం వచ్చిన రీతిలో పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు చేపడతామని, తమను ఎవరూ అడ్డుకోలేరంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో చివరకు అరెస్ట్ చేసి, కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, పాదయాత్రకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తమనుంచి ఎలాంటి అనుమ తులు తీసుకోలేదని డీఎస్పీ ఆంథోనప్ప తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం బొమ్మనహాళ్ ఎస్ఐ రమణారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినతిపత్రాలు అందజేశారని, బొమ్మనహాళ్ మండలంలో ఇందుకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసులును అరెస్ట్ చేసి, సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పురోగతి..
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు. శనివారం ముగ్గురు జేసీ వర్గీయులను అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించి బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో నాగేశ్వర్‌రెడ్డి, సోమశేఖర్,రమేష్‌లను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సహకారంతో ప్రైవేట్ ఆపరేటర్లకు లారీలు విక్రయించారు. నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసి పోలీసుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. (ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్) మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి లను కోర్టు పోలీసు కస్టడీ కి అప్పగించింది. వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. (జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు షాకిచ్చిన కోర్టు!) -
క్వారీ.. కొర్రీ
అనంతపురం టౌన్: క్వారీ నిర్వాహకులు...ప్రభుత్వ ఖజానాకు కొర్రీ పెడుతున్నారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే సహజ వనరులను సరిహద్దు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మైనింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం విజిలెన్సు అధికారులు జిల్లాలో వ్యాప్తంగా క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 60 క్వారీలకు రూ.100కోట్లకుపైగా జరిమానాలు విధించారు. అయినా నేటికీ పైసా వసూలు కాలేదు. దీనిపై దృష్టి సారించాల్సిన గనులశాఖ అధికారులు ఏమాత్రం పట్టిచుకోకపోవడం లేదు. దీంతో క్వారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. వసూళ్లు శూన్యం.. 2018 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 40 క్వారీలపై విజిలెన్సు అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వానికి చెల్లించిన రాయలీ్టకి.. క్వారీల్లో చేపట్టిన తవ్వకాలకు పొంతన లేకపోవడంతో దాదాపు 30 క్వారీలకు రూ.46.84 కోట్లు జరిమానా విధించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 37 కేసులు నమోదు చేసి రూ.32.19 కోట్ల మేర జరిమానా విధించారు. గనులశాఖ అధికారులు నేటికీ పైసా వసూలు చేయలేదు. యథేచ్ఛగా తవ్వకాలు.. క్వారీ నిర్వాహకులు జరిమానాలు చెల్లించకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. జరిమానా కట్టని క్వారీలను సీజ్ చేయాలని గనులశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో గనులశాఖ విజిలెన్స్ అధికారులు నెలరోజులుగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మడకశిర, పెనుకొండ, గోరంట్ల మండలాల క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ వాహనాలను సీజ్ చేశారు. ఇక శెట్టూరు మండలంలోని గ్రానైట్ క్వారీలకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండగా... అక్కడి క్వారీల నిర్వాహకులు తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి అధిక మొత్తంలో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్‌ను తరలిస్తున్నారు. దీంతోపాటు పెనుకొండ నియోజకవర్గంలో రోడ్డు మెటల్ క్వారీలకు దాదాపు రూ.10 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయితే అక్కడ సైతం తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వాహకులు జరిమానా విధించిన క్వారీల్లోనే తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. నోటీసులు జారీ చేశాం జరిమానా విధించిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఇప్పటికే క్వారీ నిర్వాహకులకు నోటీసులను జారీ చేశాం. నిర్ణీత గడువులోగా జరిమాన సొమ్ము చెల్లించకపోతే క్వారీలు సీజ్ చేస్తాం. జరిమానా విధించిన క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులకు సిఫార్సు చేస్తాం. – ఓబుల్‌రెడ్డి, గనులశాఖ ఏడీ -
రేపు వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్
-
తహశీల్దార్ కార్యలయం వద్ద వైఎస్అర్సీపీ నేతలు దర్నా
-
వైఎస్ఆర్సీపీలో చేరిన అనంతపురం జిల్లా టీడీపీ నేతలు
-
సీఎం దిష్టిబొమ్మ దహనం
వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అనంతపురం జిల్లా శెట్టూరు మండలకేంద్రంలో బుధవారం ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ వర్గం ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ నాయకుడు చలమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరో వైపు ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో కూడా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. దళితుల నాయకులకు పదవుల ఆశచూయించి టీడీపీలోకి చేర్చుకుని దళితజాతినంతా మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి శాలెన్ రాజు, జిల్లా కార్యదర్శి జైరాజ్ ఆరోపించారు. -
అనంతపురం జిల్లాలో వైఎస్జగన్