bhagya
-
ఒంటి కాలితో సాధించింది
గూడూరు: ప్రతిభకు పేదరికం.. అంగవైక ల్యం అడ్డుకాదని నిరూపించింది ఓ యువతి. చిన్నప్పటి నుంచి ఆట, పాటలు, క్రీడలపై మ క్కువ పెంచుకొని రాణిస్తోంది. దివ్యాంగురా లైనా పారా త్రోబాల్ క్రీడలో అత్యంత ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తె చ్చుకుంది. గతేడాది కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్ క్రీడలో దేశం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గొల్లగూడెంకు చెందిన దయ్యాల కొమురయ్య, కొమురమ్మ కూతురు భాగ్య. ఒకే కాలుతో పుట్టి.. కొమురయ్య, కొమురమ్మలది పేద కుటుంబం. వారికి కొడుకు, కూతురు భాగ్య ఉన్నా రు. భాగ్య ఒంటికాలుతో పుట్టింది. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. ఆమెకు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. దీంతో డిగ్రీ పూర్త యిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎంఏ చేస్తోంది. ఫోకో ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపద గేయాలు, కర్రసాము, చెక్కభజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకుంది. బతుకమ్మ పాటలను సేకరించి పాడటం అలవాటుగా మార్చుకుంది.ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శనతో...ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలి టీస్ అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని 2022, డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల ముందు నుంచి ఆటలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. భాగ్య డ్యాన్స్ చేయగా ఫొటోలు పేపర్లో వచ్చాయి. ‘అప్పుడు నేను చదువుతున్న పొట్టిశ్రీరాము లు యూనివర్సిటీ వీసీ కిషన్‌రావు సర్ నన్ను పిలిపించి మాట్లాడారు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి, పింఛన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నాననే విషయం తెలుసుకొని చలించిపోయారు. వెంటనే ఎవరితో మాట్లా డారో తెలియదు కానీ జర్మనీ నుంచి డ్యాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఆ తర్వాత ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేశాను’ అని భాగ్య వివరించింది. రాజరాజేశ్వరుడి ఆశీర్వాద బలంతో.. మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ రాజరాజేశ్వరుడి గుడిలో భాగ్య నాట్యం చేసింది. ఈక్రమంలో ఆమె నాట్యం చూసిన ఓ వ్యక్తి ఆమెకు దివ్యాంగులు ఆడే సిట్టింగ్ వాలీబాల్ గురించి తెలియజేశాడు. అయితే ఆ ఆటకు ఇక్కడ ఆదరణ లేదని, రాజస్తాన్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలో ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలిపాడు. దీంతో ఆమె ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఆ ఆటలో శిక్షణ పొంది ఆ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని గెలిచింది. ఆ తర్వాత దేశం తరఫున థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలో ఆడే అవకాశం వచ్చింది. కానీ 2019లో కరోనా కారణంగా పోటీలు రద్దయ్యాయి. అయితే ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పటికీ ఆమె క్రీడను వదిలిపెట్టలేదు. నేషనల్ పారా ఒలింపిక్ సంస్థ ఆధ్వర్యంలో 2024, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు జార్ఖండ్‌లో జరిగిన పారా త్రోబాల్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటింది. అనంతరం అదే సంవత్సరం డిసెంబర్ 2 నుంచి 5 వరకు కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో పాల్గొని దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టింది. ఈమేరకు తనకు కొందరు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారని, వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారా త్రోబాల్, వాలీబాల్ క్రీడలను ప్రోత్సహించి, తనలాంటి దివ్యాంగులకు చేయూతనందించి, ముందుకు నడిపించాలని భాగ్య కోరుతోంది.ఎమ్మెల్యేలతో సీఎంను కలిసినా ఫలితం లేదుపారా త్రోబాల్ క్రీడలో దేశానికి బంగారు పతకం తీసుకొచ్చిన తన గురించి తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ నన్ను సీఎం రేవంత్‌రెడ్డిని కలిపించారు. నా గురించి చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. దేశానికి బంగారు పతకం తీసుకొచ్చినా, ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. – భాగ్య, దివ్యాంగురాలు, క్రీడాకారిణి -
పనికెళ్లి తిరిగొస్తుండగా..
పెద్దపల్లి రూరల్: కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే ఇద్దరు అభాగ్యులను కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రంగంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌కు సోమవారం రాత్రి ఓ విందు పనికి వెళ్లిన కుక్క భాగ్య (46), కుక్క అమృత (48), కుక్క పద్మ, కుక్క కాంత పని ముగించుకుని మంగళవారం వేకువజామున తమ ఇళ్లకు బయలుదేరారు. కాలినడకన రాజీవ్ రహదారి పక్కనుంచి వస్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాగ్య, అమృత ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పద్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాంత గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరంతా పెద్దపల్లి ఉదయ్‌నగర్‌కు చెందిన పాలెవాళ్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భాగ్యకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురికి వివాహమవగా, దివ్యాంగురాలైన మరో కూతురు నవ్య ఇంటి వద్దే ఉంటోంది. భర్త కనకయ్య హమాలీగా పనిచేస్తున్నాడు. అమృత భర్త నర్సయ్య కూడా హమాలీగా పనిచేస్తున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏసీసీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌కుమార్ సందర్శించారు. -
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలించింది..
సాక్షి, సిద్దిపేట: తల్లిదండ్రులు దూరమై, తోబుట్టిన వారికి భారంగా మారిన బాలికకు అన్నీ తానై అండగా నిలిచారు మంత్రి హరీశ్‌రావు. విద్యాబుద్ధులు నేర్పించి, ఉపాధి కల్పించారు. భాగస్వామితో కలసి ఏడడుగులు వేసేదాకా వెన్నంటే ప్రోత్సహించారు. గురువారం సిద్దిపేటలో బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది. (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) అన్ని తామై..: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కసూ్తరిపల్లికి చెందిన భాగ్య తల్లిదండ్రులు 2016లో మృతి చెందారు. తోబుట్టువులకు భారంగా మారి భాగ్య నిరాదరణకు గురైంది. ఈ క్రమంలో తనను ఆదుకోవాలని అప్పట్లో ప్రజావాణిలో ఆమె దరఖాస్తు చేసుకుంది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు స్పందించారు. భాగ్యకు విద్య, వసతి సౌకర్యంతోపాటు బాగోగులు చూడాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి సూచించారు. అప్పటికే ఇంటర్ చదువుతోన్న ఆమెను డీఎడ్ చేయించారు. ప్రస్తుతం ఆమె కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్‌డబ్లు్య (డిస్టెన్స్) చేస్తోంది. అలాగే.. 2018 నుంచి జిల్లా బాల ల పరిరక్షణ విభాగంలో ఫీల్డ్ వర్కర్‌గా పని చేస్తోంది. పెళ్లి వయస్సు వచ్చిన భాగ్యకు గురువారం ఇబ్రహీంనగర్‌కు చెందిన యువకుడితో స్థానిక టీటీసీ భవన్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహం జరిపించారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దగ్గరుండి పెళ్లి తంతును పర్యవేక్షించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
బిర్యానీ కోసం... 42 బస్సులు తగలబెట్టింది
కేవలం ఒక ప్లేటు బిర్యానీ, వంద రూపాయల డబ్బులు ఇస్తే చాలు.. ఎంతటి ఘాతుకానికైనా పాల్పడతారు. అయితే ఈసారి ఇలా చేసింది మాత్రం ఒక యువతి కావడం విశేషం. కావేరీ జలాల కోసం ఆందోళన జరిగినప్పుడు.. కేపీఎన్ ట్రావెల్స్‌కు చెందిన 42 వోల్వో బస్సులను ఒకేసారి తగలబెట్టారు. ఆ పని చేసినది 22 ఏళ్ల యువతి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 11 మందిని పోలీసులు అరెస్టు చేయగా, వారిలో సి. భాగ్య కూడా ఒకరు. ఈనెల 12వ తేదీన జరిగిన ఈ దాడి తాలూకు సీసీటీవీ ఫుటేజిని సంపాదించిన పోలీసులు.. అందులోని దృశ్యాల ఆధారంగా అనుమానితులను అరెస్టు చేశారు. వీళ్లు కేపీఎన్ సిబ్బందిపై కూడా డీజిల్ పోసి, వాళ్లను కూడా తగలబెట్టేస్తామని బెదిరించారు. దాంతో అప్పటికి ఏమీ చేయలేక ఊరుకున్న సిబ్బంది.. తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లతో అక్కడ జరిగిన ఘాతుకాన్ని వీడియో తీశారు. అందులో కూడా భాగ్య తనతో పాటు వచ్చినవాళ్లను రెచ్చగొట్టి బస్సులను తగలబెట్టించినట్లు కనిపిస్తోంది. తన కూతురికి కొంతమంది స్నేహితులు బిర్యానీ పెట్టించి, వంద రూపాయలు ఇచ్చి నిరసనలలో పాల్గొనేందుకు రావాల్సిందిగా తీసుకెళ్లారని భాగ్య తల్లి ఎల్లమ్మ చెబుతున్నారు. కేపీఎన్ గ్యారేజికి సమీపంలోని గిరినగర్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి భాగ్య నివసిస్తుంటుంది. వాళ్లు రోజుకూలీలుగా పనిచేస్తూ పొట్ట నింపుకొంటున్నారు. ఆరోజు ఆమె అప్పుడే పని నుంచి ఇంటికి వచ్చిందని, మధ్యాహ్నం సమయంలో కొంతమంది వచ్చి నిరసనల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లారని ఎల్లమ్మ చెప్పారు. అక్కడ మరికొందరు మహిళలు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది గానీ, వాళ్లు కూడా ఈ విధ్వంస కాండలో ఉన్నారో లేదో మాత్రం తెలియలేదు. బెంగళూరులో సెప్టెంబర్ 12 నాటి విధ్వంసాలకు సంబంధించి మొత్తం 400 మందికి పైగా ఇప్పటివరకు అరెస్టు కాగా, వాళ్లలో భాగ్య ఒక్కరే మహిళ.