సాక్షి, సిద్దిపేట: తల్లిదండ్రులు దూరమై, తోబుట్టిన వారికి భారంగా మారిన బాలికకు అన్నీ తానై అండగా నిలిచారు మంత్రి హరీశ్‌రావు. విద్యాబుద్ధులు నేర్పించి, ఉపాధి కల్పించారు. భాగస్వామితో కలసి ఏడడుగులు వేసేదాకా వెన్నంటే ప్రోత్సహించారు. గురువారం సిద్దిపేటలో బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది. (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం)
అన్ని తామై..:
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కసూ్తరిపల్లికి చెందిన భాగ్య తల్లిదండ్రులు 2016లో మృతి చెందారు. తోబుట్టువులకు భారంగా మారి భాగ్య నిరాదరణకు గురైంది. ఈ క్రమంలో తనను ఆదుకోవాలని అప్పట్లో ప్రజావాణిలో ఆమె దరఖాస్తు చేసుకుంది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు స్పందించారు. భాగ్యకు విద్య, వసతి సౌకర్యంతోపాటు బాగోగులు చూడాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి సూచించారు. అప్పటికే ఇంటర్ చదువుతోన్న ఆమెను డీఎడ్ చేయించారు.
ప్రస్తుతం ఆమె కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్‌డబ్లు్య (డిస్టెన్స్) చేస్తోంది. అలాగే.. 2018 నుంచి జిల్లా బాల ల పరిరక్షణ విభాగంలో ఫీల్డ్ వర్కర్‌గా పని చేస్తోంది. పెళ్లి వయస్సు వచ్చిన భాగ్యకు గురువారం ఇబ్రహీంనగర్‌కు చెందిన యువకుడితో స్థానిక టీటీసీ భవన్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహం జరిపించారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దగ్గరుండి పెళ్లి తంతును పర్యవేక్షించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment