IT CEOs
-
ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్‌కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్ (Bodyguard) సంపాదన కార్పొరేట్ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్డమ్తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్లు, పబ్లిక్ ఈవెంట్లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్ శివరాజ్‌కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్‌గా, యాడ్ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్‌లో బాలివుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు. -
విశాఖ చేరుకున్న చంద్రబాబు నాయుడు
విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన చంద్రబాబు 9.45కి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ 15 నిమిషాల పాటు అధికారులతో సమావేశం అయ్యారు. పది గంటలకు విమానాశ్రయం నుంచి బయల్దేరి 10.30కి మధురవాడ ఐటీ సెట్ హిల్ నంబర్-3కి వెళతారు. అక్కడ సన్‌రైజ్ స్టార్ట్ అప్స్-ట్రిప్‌ను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30కు నోవాటెల్ హోటల్లో ఐటీ సంస్థల సీఈఓలతో భేటీ అవుతారు. మధ్యా హ్నం 2 గంటలకు హోటల్ నుంచి బయల్దేరి 2.30కి విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు.