విశాఖ చేరుకున్న చంద్రబాబు నాయుడు | Chandrababu naidu Invites IT Companies to Invest in andhra pradesh | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న చంద్రబాబు నాయుడు

Published Mon, Sep 29 2014 10:41 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Chandrababu naidu Invites IT Companies to Invest in andhra pradesh

విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు.  ఈరోజు ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన చంద్రబాబు 9.45కి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ 15 నిమిషాల పాటు అధికారులతో సమావేశం అయ్యారు. పది గంటలకు విమానాశ్రయం నుంచి బయల్దేరి 10.30కి మధురవాడ ఐటీ సెట్ హిల్ నంబర్-3కి వెళతారు.

అక్కడ సన్‌రైజ్ స్టార్ట్ అప్స్-ట్రిప్‌ను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30కు నోవాటెల్ హోటల్‌లో ఐటీ సంస్థల సీఈఓలతో భేటీ అవుతారు. మధ్యా హ్నం 2 గంటలకు హోటల్ నుంచి బయల్దేరి 2.30కి విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement