krishna dist
-
‘శ్రీ విశ్వశాంతి’ : చేతిలో చిల్లిగవ్వ లేకుండానే కల సాకారం!
‘నీ దగ్గర ఏముంది?’ అనే ప్రశ్నకు తిరుగులేని జవాబు... ‘నా దగ్గర కల ఉంది!’ఆ కలే చేతిలో చిల్లిగవ్వ లేని ఎంతోమందిని విశ్వ విజేతలను చేసింది.‘శ్రీ విశ్వశాంతి’ కల కూడా అలాంటిదే. కొన్ని దశాబ్దాల క్రితం... పేదింటి బిడ్డ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు కన్న కల... శ్రీ విశ్వశాంతి. రవీంద్రుడి ‘విశ్వభారతి’లాంటి విలువైన కల అది. ‘ప్రపంచమంతా ఒకే గూడులో’ అనే నినాదం పునాదిపై ఏర్పాటైన ‘విశ్వభారతి’ తనకు స్ఫూర్తి. ఆరుగురు విద్యార్థులతో మొదలైన విశ్వశాంతి గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగింది. 16 రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ విజయ ప్రస్థానం మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాటల్లోనే...కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నా దగ్గర కరెన్సీ నోట్లు లేవు. కల మాత్రమే ఉంది. అయినా సరే, చిన్న గుడిసెలో ‘శ్రీ విశ్వశాంతి పాఠశాల ప్రారంభించాను. ఆరుగురు విద్యార్థులతో మొదలైన ఆ పాఠశాల ‘ఇంతింతై వటుడింతై...’ అన్నట్లుగా ఎదిగిపోయింది. బలమైన విద్యా వ్యవస్థగా నిర్మాణం అయిన ‘శ్రీ విశ్వశాంతి గ్రామీణ విశ్వ విద్యాలయం’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది.ఆరోజుల్లో...నేను, మా ఆవిడ ప్రమీలారాణి టీచర్లుగా పనిచేసేవాళ్లం. మా నెల జీతం నూట ఇరవై రూపాయలు. ‘మేము కొత్త స్కూలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పినప్పుడు విన్నవారు ‘ఎందుకొచ్చిన రిస్కు...వచ్చిన జీతంతో సర్దుకు పోకుండా’ అని సలహా ఇస్తారేమో?...ఇలాంటి సందేహాలు ఎన్నో వచ్చాయి.‘చాలా విజయాలు భద్ర జీవితాల్లోనే ఆగిపోతాయట!’ అనే మాట గుర్తుకు వచ్చింది. ‘నాకు ఇక్కడ సుఖంగానే ఉంది కదా... రిస్కు తీసుకోవడం ఎందుకు’ అనుకునే చాలామందిలో నేను ఉండపోదల్చుకో లేదు. నాకు ఇష్టమైన నాయకుడు జవహర్లాల్ నెహ్రు. ఆ మహనీయుడు చెప్పిన విలువైన మాట – ‘అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పుకు భయపడుతుంది’ అయితే నేను మార్పుకు భయపడే రకం కాదు. అందుకే ధైర్యంగా నా కలకు శ్రీకారం చుట్టాను. 1975 ఫిబ్రవరి 22న ఉయ్యూరు పట్ట ణంలో ఒక తాటాకు ΄ పాకలో ‘శ్రీ విశ్వశాంతి’ పాఠశాలను ప్రారంభించాం.‘ఎంతో ఊహిస్తే ఆరుగురు విద్యార్థులేనా!’ అని మేము నిరాశపడిపోలేదు. ‘ఈరోజు ఆరుగురు...రేపు నూరు మంది’ అనుకున్నాము. అది వృథా పోలేదు. మరుసటి ఏడాది నుంచే హాస్టల్‌ను కూడ ప్రారంభించాము. అక్కడ మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ఉయ్యూరు (గండిగుంట) పరిధిలో సువిశాలమైన 80 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన భవన సముదాయంతో విస్తరించింది. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంది. ఎల్కేజీ నుంచి ప్లస్ 2 వరకూ విద్యాబోధన అందిస్తున్నాం. ‘మాదల ప్రమీలారాణి మెమోరియల్ జూనియర్ కళాశాల’ ఏర్పాటు చేశాం. దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 6500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మా గ్రామీణ యూనివర్శిటీపై ప్రత్యక్షంగా 768 మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆరుగురితో మొదలైన విద్యాసంస్థ అందనంత ఎత్తు ఎదగడానికి కారణం ఏమిటి? ‘మన ఆదర్శాలు, అంకితభావాన్ని మరచిపోయినప్పుడు మాత్రమే అపజయం ఎదురవుతుంది’ అంటారు నెహ్రు. పేద విద్యార్థులకు అండగా ఉండాలి అనే ఆదర్శాన్ని, సంస్థ కోసం క్షణక్షణం కష్టపడాలి అనే అంకితభావానికి నేను ఎప్పుడూ దూరం కాలేదు. అదే శ్రీ విశ్వశాంతి విజయ రహస్యం. ‘శ్రీ విశ్వశాంతి ‘గుడ్‌విల్’కు గుడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచినా ‘పక్కా కమర్షియల్’ దారిలోకి ఎప్పుడూ వెళ్లలేదు. ఏ ప్రాంతంలో ప్రాంరంభమైందో ఆ ప్రాంతంలోనే పెరిగి, పెద్దై వటవృక్షమై ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులకు నీడను ఇస్తోంది. విద్యాసంస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి సింగిల్ బ్రాంచ్గానే నడుపుతున్నాం. సేవాపథంలో...గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి చేయూతఅందించాలనేది మాదల ప్రమీలారాణి కోరిక. ఆమె కోరిక మేరకు ఏటా 300 మందికి పైగా విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీ విశ్వశాంతి నిర్వహిస్తోంది. ‘50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ అంతర్జాతీయ ప్రమాణాలు, అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనతో విద్య అందించటం కోసం పాటుపడుతున్నాం. కుమారులు, కోడళ్లు అంతా పాఠశాలలోనే ఉంటూ విద్యా ప్రగతిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చక్కగా చదివితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా దేశ ప్రగతి సాధ్యమవుతుంది’ అంటున్నారు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఫేస్ ప్రోగ్రాంఅధునాతన సౌకర్యాలు, వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల్యాబ్‌లు, లైబ్రరీలు గ్రామీణ యూనివర్శిటీలో అందుబాటులో ఉన్నాయి. ‘ఫేస్ప్రోగ్రాం’ పేరుతో విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఐఐటీ, జెఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఎన్డీఏ, నీట్, ఒలంపియాడ్లకు కోచింగ్‌లను అందిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విశ్వశాంతిలో శిక్షణ పొదిన ఎంతోమంది విద్యార్థులు నేవీ, ఆర్మీలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎన్సీసీలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విధానం ఎన్నో ప్రశంసలు అందుకునేలా చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, జెఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది శ్రీవిశ్వశాంతి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ విద్యారత్న’ పురస్కారాన్ని ‘శ్రీవిశ్వశాంతి’ ఫౌండర్ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు అందుకున్నారు. సొంతంగా పాల డైరీచదువుపై మాత్రమే కాదు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా శ్రీ విశ్వశాంతి గ్రామీణ యూనివర్శిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. విద్యార్థులు ఆహ్లాదభరిత వాతావరణంలో గడిపేలా ప్రాంగణం అంతా పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు. యూనివర్శిటీ సొంతంగా పాల డైరీ నిర్వహిస్తోంది. సమర్థంగా డెయిరీ నిర్వహణకు ‘బెస్ట్ డెయిరీ ఫామ్ ఆఫ్ ఏపీ అవారుర్డును అందుకున్నారు. ఈ యూనివర్శిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.ఇష్టంగా కష్టపడాలిప్రతి విద్యార్థికీ లక్ష్యశుద్ధి ఉండాలి. అప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించు కుంటూ ఇష్టమైన పాఠ్యాంశాలను కష్టంతో కాకుండా ఇష్టంగా చదువుకోవాలి. సమయ పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. తమకు అనువైన, ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో నైపుణ్యం సాధించి స్థిరపడాలి. అందుకు సూక్ష్మమైన, సున్నితమైన మార్గాలను అన్వేషించి సాధించుకోవటం అలవర్చుకోవాలి. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని ఇష్టంతో సాధించేందుకు ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా కష్టం అనిపించదు. విజయం సాధించటం సులువు అవుతుంది. ఎవరూ పుట్టుకతోనే ఉన్నతులు కారు. జీవితంలో చూపిన అచంచలమైన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రమే ప్రతి ఒక్కరినీ ఉన్నతులను చేస్తుంది. విద్య నేర్పే గురువులు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే... గురువు అంటే నిరంతర విద్యార్థి అని అర్థం. గురువు అనే అర్థం చాలా విస్తృతమైనది. ఇది అర్థం కావాలంటే మన పూర్వ అపూర్వ శాస్త్రాలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ నేను లైబ్రరీల్లో అనేక పుస్తకాలను చదవటం వల్ల తెలుసుకున్నదే. యుద్ధ అశాంతి నుంచి శ్రీ విశ్వశాంతి చదువుకునే రోజుల్లో లైబ్రరీకి ఎక్కువగా వెళ్లేవాడిని. జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలు చదవటం అంటే ఇష్టం. ఆయన జీవితం స్పూర్తిదాయకంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా మా సోదరుడు కృష్ణమూర్తి 18వ ఏట ఆర్మీలో చేరాడు. అప్పుడు యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. ఎందరో సైనికులు చనిపోయారంటూ వార్తలు విని చాలా కలత చెందేవాణ్ణి. యుద్ధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోదనకు, వేదనకు గురవుతున్నాయి. అసలు యుద్ధం ఎందుకు? ఇరు వర్గాల నేతలు కూర్చుని సంప్రదించుకుంటే విశ్వశాంతి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఆ ఆకాంక్ష నుంచే పుట్టిందే శ్రీ విశ్వశాంతి. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలనే తలంపుతో విద్యాసంస్థను నడుపుతున్నాను.– మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా -
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
కృష్ణా జిల్లాలో దొంగల బీభత్సం
-
137వ రోజు ముగిసిన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 137వరోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాలనీ నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం అంబాపురం, జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్ చేరుకుని రాజన్న బిడ్డ పాదయాత్రను ముగించారు. రాత్రికి ఆయన అక్కడే బసచేస్తారు. నేడు వైఎస్ జగన్ 14.4 కిలోమీటర్లు నడిచారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు బంద్‌లో పాల్గొనేందుకు వీలుగా రేపు పాదయాత్రకు వైఎస్ జగన్ విరామం ప్రకటించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఏప్రిల్ 17న ఉదయం యథాప్రకారం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నందిగామలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
జనపథం - దివిసీమ గ్రామాలు
-
గన్నవరంలో భూప్రకంపనలు
-
చదువు రాదని బాబా చెప్పాడంటూ..
► సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య ► కృష్ణా జిల్లా కోడూరులో ఘటన సాక్షి, అవనిగడ్డ: తనకు చదువు రాదని ‘బాబా’ చెప్పాడంటూ ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా కోడూరులో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మందపాకల గ్రామానికి చెందిన అద్దేపల్లి శేష వెంకటరామకృష్ణ కుమారుడు శివసాయి మణికంఠ(17) కోడూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా, తనకు చదువు ఇష్టం లేదంటూ మణికంఠ గత నెల 12న ఇంట్లో నుంచి పారిపోయాడు. దీనిపై అతని తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై వై.సుధాకర్ విజయవాడలో మణికంఠ ఆచూకీ కనుగొని.. తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంపీసీ గ్రూప్ చదవలేనని చెప్పడంతో.. తల్లిదండ్రులు అతన్ని సీఈసీకి మార్చారు. ఈనేపథ్యంలో మణికంఠ రెండు రోజుల నుంచి కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో మణికంఠ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మణికంఠ వద్ద కుటుంబసభ్యులకు ఓ సూసైడ్‌నోట్ లభించింది. ‘అమ్మనాన్న చదువుకోమని చెబుతున్నారు. కానీ నాకు చదువు రాదని ఓ బాబా చెప్పాడు. దీంతో ఇటు చదువుకు, అటు పనికి దూరమవుతున్నానన్న మనస్తాపంతో చనిపోతున్నాను..’ అంటూ మణికంఠ సూసైడ్ నోట్లో రాశాడు. -
కృష్ణా జిల్లాలో టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
► రాజీనామాకు సిద్దమంటున్న ముద్రబోయిన వర్గం నూజివీడు: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వస్తున్న కాపా శ్రీనివాసరావుకు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం గత కొంతకాలంగా రెండు గ్రూపుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. తాజాగా కాపా శ్రీనివాసరావుకు నూజివీడు ఏఎంసీ పదవి ఇవ్వాలని పార్టీ అథినేత నిర్ణయించినట్లు సమాచారం. అయితే కాపాకు పదవి ఇవ్వడాన్ని ముద్రబోయిన వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రస్తుతం పరిస్థతి రసవత్తరంగా మారింది. పదవిని దక్కించుకుకోవడానికి ఇరువర్గాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకున్నాయి. అందులో ముద్రబోయిన వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాపా శ్రీనివాసరావుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని ముద్రబోయిన వర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
కృష్ణా జిల్లాలో వర్షం
విజయవాడ: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కాగా తాజాగా కృష్ణా జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. విజయవాడ, గొల్లపూడి, గన్నవరం, గుడ్లవల్లేరు, హనుమాన్ జంక్షన్, నందివాడ, గుడివాడల్లో వర్షం కురిసింది. పలు రోడ్లు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి ప్రారంభంలోనే విపరీత ఎండలతో సతమతమవుతున్న జిల్లా వాసులకు కొంత చల్లదనం పలకరించనట్లు ఉపశమనం పొందారు. -
కృష్ణా జిల్లాలో వేధింపులకు కేరాఫ్‌గా మారిన బాస్
-
కృష్ణా జిల్లాలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా
-
వర్దా’ ఎఫెక్ట్
దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన ఆకాశం మేఘావృతం కావటంతో రైతుల్లో ఆందోళన తీరంలో పెరిగిన అలల ఉధృతి చేపల వేటకు విరామం అప్రమత్తమైన అధికార యంత్రాంగం సకాలంలో సాగునీరు అందలేదు. పాలకులు పట్టించుకోలేదు. వరుణుడు కరుణించడంతో నారుపోశారు. ఆ తర్వాత కూడా కాలువలకు నీరు విడుదల చేయలేదు. నారు ముదిరిపోతుండడంతో పుడమితల్లిని నమ్ముకుని నాట్లు వేశారు. నానా పాట్లు పడి ఇంజిన్ల ద్వారా నీరు పెట్టారు. పంట చేతికొచ్చింది. ఆనందంగా కోతలకు సిద్ధమవుతున్న వేళ అన్నదాతల గుండెల్లో ‘తుఫాన్’ మొదలైంది. మచిలీపట్నం/కోడూరు : ఆకాశంలో కమ్ముకొస్తున్న కారుమేఘాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రంలో ఉధృతంగా ఎగసిపడుతున్న అలలు తీర ప్రాంతావాసులను వణికిస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన చల్లగాలులకు జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ‘వర్దా’ పెను తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వర్షం కురుస్తుందేమోనని రైతులు అల్లాడిపోయారు. వర్షం కురిస్తే చేతికందే దశలో ఉన్న వరిపంట నీట మునుగుతుందనే భయంతో రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఇప్పటికే వరికోత కోసి ఉన్న పైరును కుప్పలు వేయటం, నూర్పిడి చేసే పనులను హడావుడిగా చేపట్టారు. కుప్పల నూర్పిడి అనంతరం ధాన్యాన్ని త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. వరికోతలను వాయిదా వేశారు. మరికొందరు భారీ వర్షం కురిస్తే పంట దెబ్బతింటుందనే భయంతో యంత్రాల ద్వారా కోతలు పూర్తిచేస్తున్నారు. జిల్లాపై సోమవారం తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తుఫాన్ ప్రభావంతో పాలకాయతిప్ప వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆదివారం ఉదయం వరకు సముద్రంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి పూర్తిగా మారిపోయింది. అలలు ఉధృతి పెరగడంతోపాటు సముద్రం కొంతమేర ముందుకు చొచ్చుకువచ్చింది. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు విరామం ప్రకటించారు. ఫైబర్ బోట్లు, వలలను భద్రపరుచుకున్నారు. రేపటి వరకు ప్రభావం ‘వర్దా’ పెను తుఫాన్ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రకటించిన వాతావరణ శాఖ... ఈ నెల 13 వరకు తుపాను ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని 7 నుంచి 19 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే తుఫాన్ గమనం చెన్నై వైపు ఉన్నప్పటికీ జిల్లాలో కొద్దిపాటి వర్షం కురిసినా వరి దెబ్బతినే ప్రమాదం ఉంది. -
కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: అనంతపురంలో ఈ నెల 29 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే ఏడవ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హాకీ చాంపియన్‌షిప్, అక్టోబరు 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్ర బాలుర హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా జట్లను స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎంపిక చేశారు. జట్టు సభ్యుల వివరాలను హాకీ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రామకృష్ణ విడుదల చేశారు. ఎంపికైన జట్టు సభ్యులను శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ అభినందించారు. ఆయన మాట్లాడుతూ, జాతీయ క్రీడ హాకీ అభివృద్ధికి సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ మోనిటరింగ్ అధికారి పి.అజయ్‌కుమార్, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కె.రాజశేఖర్, హాకీ కోచ్ ఎస్.హరికృష్ణ, సీనియర్ క్రీడాకారుడు అబ్దుల్ కరీం పాల్గొన్నారు. బాలికల జూనియర్ జట్టు : ఎస్.కె.సుమియా, ఎల్.విషితా, ఎ.నందిని, పి.ఆశ్రిత, జి.దివ్యశ్రీ, ఎన్.నిఖిత, ఎస్.డి.చాందిని, ఎం.డి.∙హజరా, ఎస్.అపర్ణ, యు.రూప, జి.స్నేహ, ఎం.డి.అసి ఫా, ఎస్.అదిద్యుతి, శ్రీపదలావణ్య, ఇ.యామి ని, పి.రమ్య, ఉమా సుప్రియాంక, ఎస్.సరస్వ తి ఎంపిక కాగా, స్టాండ్‌బైగా ఎం.జోత్సS్న, ఎం.శ్రావణి, బి.పండు, ఎం.మానస ఎంపికయ్యారు. బాలుర స»Œ æజూనియర్ జట్టు: సీహెచ్.అర్యవర్థన్, డి.రవికుమార్, డి.సందీప్, జి.వేణుగోపాల్, కె.నరసింహ, పి.రాఘవేంద్రరావు, జి.శివప్రమోద్, ఎన్.యశ్వంత్‌చౌదరి, ఎస్.డి.మహ్మద్‌బాషా, వి.సాయి, టి.మల్లేష్, జి.వెంకటసాయి, పి.అఖిల్‌బాబు, జి.నిఖిల్‌కుమార్, బి.టి.భరత్, వై.వెంకటేశ్వరరావు, బి.చక్రధర్సాయి ఆదిత్య, పవన్ వెంకటసాయితేజ, ఎంపిక కాగా, స్టాంyŠ బైగా టి.శ్రీను, ఎం.సాయిధీరజ్, పి.బాలశివసాయి, బి.శివచైతన్య ఎంపికయ్యారు. -
ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
మచిలీపట్నం :జిల్లాలో స్థానిక సంస్థలకు వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పెడన మండల పరిషత్ అధ్యక్షులు, పమిడిముక్కల, ఆగిరిపల్లి మండలాల్లో కో–ఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక 29వ తేదీన జరగనుంది. మండవల్లి జెడ్పీటీసీ సభ్యురాలు మరణించటంతో పాటు వివిధ కారణాలతో జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు జెడ్పీ ఇన్చార్జి సీఈవో టి దామోదరనాయుడు సోమవారం తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబరు 20వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మండవల్లి జెడ్పీటీసీతో పాటు ఖాళీగా ఉన్న ఎంపీటీసీ స్థానాలు నందిగామ (పెడన మండలం), వెంట్రప్రగడ –1, దోసపాడు, వానపాముల (పెదపారుపూడి మండలం), కొండపల్లి–8 (ఇబ్రహీంపట్నం), మెరకనపల్లి (మోపిదేవి), రంగన్నగూడెం (బాపులపాడు), పోలాటితిప్ప (మచిలీపట్నం), వేదాద్రి (జగ్గయ్యపేట), పెనుగొలను–2 (గంపలగూడెం), గొల్లమంద (ఎ.కొండూరు), రమణక్కపేట (ముసునూరు), కనసానపల్లి (ఆగిరిపల్లి), చందర్లపాడు –1 (చందర్లపాడు), గూడవల్లి –2 (విజయవాడ రూరల్) స్థానాలకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. -
మద్యం అలవాటును ప్రోత్సహిస్తున్న సర్కారు
-
సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లిం మైనార్టీల ర్యాలీ