కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక | krishna haki team | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక

Published Tue, Sep 20 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక

కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక

విజయవాడ స్పోర్ట్స్‌: అనంతపురంలో ఈ నెల 29 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే ఏడవ రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల హాకీ చాంపియన్‌షిప్, అక్టోబరు 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే సబ్‌ జూనియర్‌ రాష్ట్ర బాలుర హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా జట్లను స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం ఎంపిక చేశారు. జట్టు సభ్యుల వివరాలను హాకీ జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.రామకృష్ణ విడుదల చేశారు. ఎంపికైన జట్టు సభ్యులను శాప్‌ ఓఎస్‌డీ పి.రామకృష్ణ అభినందించారు.  ఆయన మాట్లాడుతూ, జాతీయ క్రీడ హాకీ అభివృద్ధికి సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్‌ మోనిటరింగ్‌ అధికారి పి.అజయ్‌కుమార్, అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి కె.రాజశేఖర్, హాకీ కోచ్‌ ఎస్‌.హరికృష్ణ, సీనియర్‌ క్రీడాకారుడు అబ్దుల్‌ కరీం పాల్గొన్నారు. 
బాలికల జూనియర్‌ జట్టు : ఎస్‌.కె.సుమియా, ఎల్‌.విషితా, ఎ.నందిని, పి.ఆశ్రిత, జి.దివ్యశ్రీ, ఎన్‌.నిఖిత, ఎస్‌.డి.చాందిని, ఎం.డి.∙హజరా, ఎస్‌.అపర్ణ, యు.రూప, జి.స్నేహ, ఎం.డి.అసి ఫా, ఎస్‌.అదిద్యుతి, శ్రీపదలావణ్య, ఇ.యామి ని, పి.రమ్య, ఉమా సుప్రియాంక, ఎస్‌.సరస్వ తి ఎంపిక కాగా, స్టాండ్‌బైగా ఎం.జోత్సS్న, ఎం.శ్రావణి, బి.పండు, ఎం.మానస ఎంపికయ్యారు. 
బాలుర స»Œ æజూనియర్‌ జట్టు: సీహెచ్‌.అర్యవర్థన్, డి.రవికుమార్, డి.సందీప్, జి.వేణుగోపాల్, కె.నరసింహ, పి.రాఘవేంద్రరావు, జి.శివప్రమోద్, ఎన్‌.యశ్వంత్‌చౌదరి, ఎస్‌.డి.మహ్మద్‌బాషా, వి.సాయి, టి.మల్లేష్, జి.వెంకటసాయి, పి.అఖిల్‌బాబు, జి.నిఖిల్‌కుమార్, బి.టి.భరత్, వై.వెంకటేశ్వరరావు, బి.చక్రధర్‌సాయి ఆదిత్య, పవన్‌ వెంకటసాయితేజ, ఎంపిక కాగా, స్టాంyŠ  బైగా టి.శ్రీను, ఎం.సాయిధీరజ్, పి.బాలశివసాయి, బి.శివచైతన్య ఎంపికయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement