new team
-
YSRCP: 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త టీమ్ రెడీ
అనుభవానికి అగ్రతాంబూలం ఇచ్చారు. సీనియార్టీకి ప్రాధాన్యత పెంచారు. సమన్వయ పరచడంలో, విజయ సాధనలో తిరుగులేని వ్యూహకర్తలను జిల్లాల రథసారథులుగా నియమించారు. వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేస్తూ సరికొత్త టీమ్‌ను సిద్ధం చేశారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2024 ఎన్నికల్లో పార్టీ మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): పాలనా పరంగా నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం పార్టీ నూతన అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రీజినల్ కో– ఆర్డినేటర్లు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీకి మరింత బలం కర్నూలు, నంద్యాల జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనను రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియమించడం పార్టీకి మరింత బలం చేకూర్చనుంది. గతంలో కూడా ఉమ్మడి జిల్లా బాధ్యతలు నిర్వహించి, అందరినీ సమన్వయం చేస్తూ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ గెలుపొందేలా సజ్జల రామకృష్ణారెడ్డి కృషి చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగిండంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీకి ప్రాధాన్యం జిల్లా అధ్యక్షుల నియామకంలో వైఎస్సార్సీపీ సీనియార్టీకి ప్రాధాన్యత ఇచ్చింది. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మంత్రాలయం ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత వై. బాలనాగిరెడ్డిని నియమించింది. ఈయన మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిగా ఉంటూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నారు. వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, విశేష ప్రజాదరణ పొందారు. సీనియర్ నేత అయిన బాలనాగిరెడ్డికి జిల్లాలో మంచి పేరుంది. అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఈయన కర్నూలు జిల్లా అధ్యక్షుడు కావడంతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం కానుంది. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నేత, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. ఈయన పాణ్యం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజాభిమానాన్ని పొందారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో ఈయనకు విశేష అనుభవం ఉంది. ఇది వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. పరుగులు పెట్టనున్న ప్రగతి కర్నూలు జిల్లాపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు. ఈయన డోన్ నుంచి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్థికశాఖ మంత్రిగా సమర్థవంతగా బాధ్యతలను నిర్వర్తించి రెండోసారి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గంలో స్థానం సాధించారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ఆరోపణలను తనౖదైన శైలిలో తిప్పుకొడుతూ, పార్టీ కేడర్‌కు అండగా నిలుస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి కావడంతో జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ ఆంజాద్ బాషాను నంద్యాల జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉండి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉప ముఖ్యమంత్రిగా, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ఈయన ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా... ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా కొత్తగా నియమితులైన ఇన్చార్జ్ మంత్రులు పనిచేయనున్నారు. అలాగే పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ముందుకు వెళ్లనున్నారు. రెండు జిల్లాలకు సుపరిచితులైన వీరు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండడంతో పాటు వారిని మరింత సమన్వయపరుస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీకి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పూర్తి స్థాయి బలం ఉంది. 2014లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన టీడీపీ, 2019లో అన్ని స్థానాల్లో ఓటమి పాలై పూర్తిగా చతికిల పడింది. 2019 ఎన్నికల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, కొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొంది జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో అత్యధిక శాతం కైవసం చేసుకొని నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఈ నేపథ్యంలో ఎంతో వ్యూహంతో ముందుకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరంలో జిల్లాల పునర్విభజన, మంత్రివర్గ విస్తరణతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. తాజాగా రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, జిల్లా అధ్యక్షుల నియామకంతో పార్టీ కేడర్‌లో నూతన జోష్ ఏర్పడిందని చెప్పవచ్చు. -
‘మేం దూరదృష్టితో ఆలోచిస్తాం’
ముంబై: ఐపీఎల్లో తాము ఆటగాళ్లను కొనుగోలు చేసే సమయంలో రాబోయే సీజన్లను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. తమ కొత్త జట్టు ముంబై అభిమానులకు కూడా నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. జోఫ్రా ఆర్చర్ 2022లో ఆడలేడని తెలిసినా ముంబై భారీ మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది. ‘ముంబై ఇండియన్స్ టీమ్‌ను నిర్మించడంలో మేం స్వల్ప కాలిక లక్ష్యాలను పెట్టుకుంటూనే దూరదృష్టితో కూడా ఆలోచిస్తాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే వేలంలో కొందరు ఆటగాళ్లను తీసుకున్నాం. అభిమానుల నమ్మకం వమ్ము కాకుండా మా జట్టు లీగ్‌లో ఆడుతుందని ఆశిస్తున్నాం. నిజానికి మెగా వేలం అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఇన్నేళ్లుగా మాతో ఉన్న ఆటగాళ్లను వదిలేయడానికి మనసొప్పదు. కానీ తప్పదు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, డి కాక్, బౌల్ట్‌లను మా జట్టులోకి తీసుకునేందుకు చివరి వరకు ప్రయత్నించాం. అయితే ఇప్పుడు ఉన్న టీమ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం’ అని నీతా స్పష్టం చేసింది. మాకూ సంతోషమే... వేలంలో తాము తీసుకున్న ఆటగాళ్ల పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. డు ప్లెసిస్ రాకతో తమ టాపార్డర్ మెరుగైందని, కెప్టెన్‌గా అతనికి ఉన్న విశేష అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తుందని ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. మరోవైపు బలమైన భారత ఆటగాళ్లతో జట్టును రూపొందించాలనే ఉద్దేశంతో వేలం బరిలోకి దిగామని, ఈ విషయంలో విజయవంతమయ్యామని రాజస్తాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే చెప్పాడు. సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌లతో పాటు అశ్విన్, చహల్, కరుణ్ నాయర్, సైనీ, దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణవంటి ఆటగాళ్లు రాయల్స్‌ను గెలిపించగలరని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. -
NASA: నాసా కొత్త టీంలో అనిల్ మీనన్
నాసా.. అమెరికా స్పేస్ ఏజెన్సీ. కానీ, ప్రపంచం దృష్టిలో అత్యున్నతమైన అంతరిక్ష ప్రయోగాలకు ఇది నెలవనే అభిప్రాయం ఉంది. అందుకే నాసాలో పని చేయడానికి దేశాలకతీతకంగా సైంటిస్టులు, రీసెర్చర్లు ఉవ్విళ్లూరుతుంటారు. అదే టైంలో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో నాసా ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త ఆస్ట్రోనాట్ టీంను ప్రకటించింది. సోమవారం కొత్తగా పది మందితో కూడిన ఆస్ట్రోనాట్ బృందాన్ని ప్రకటించింది నాసా. మొత్తం 12,000 అప్లికేషన్లు రాగా, అందులోంచి ఈ పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీళ్లంతా నాసా భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాల్గొననున్నారు. ఇక ఈ టీంలో భారత మూలాలున్న అనిల్ మీనన్ ఇందులో ఒకరు. We're honored to announce the 2021 class of NASA Astronaut Candidates! Get to know them: https://t.co/NbU6BlaTQK. All 10 of these individuals are taking YOUR #askNASA questions, right here on this thread. What do you want to ask them about becoming a NASA Astronaut? pic.twitter.com/byeGl8yphh — NASA Astronauts (@NASA_Astronauts) December 6, 2021 ►45 ఏళ్ల అనిల్ మీనన్.. నాసా ఫ్లయిట్ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు. ►ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డిప్యూటీ క్రూ సర్జన్‌గా వ్యవహరించారు కూడా. ►డాక్టర్ అనిల్ మీనన్ భారత మూలాలున్న వ్యక్తే. ►నాసాలోని బయోడేటా ప్రకారం.. అనిల్ మీనన్.. ఉక్రెయిన్-భారత సంతతికి చెందిన పేరెంట్స్‌కి జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియాపొలిస్(మిన్నెసోటా)లో. ►1999లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ అందిపుచ్చుకున్నారు. ►2004లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ►2009 స్టాన్‌ఫర్డ్ మెడికల్ స్కూల్ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్ పూర్తి చేశారాయన ►యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కొంతకాలం విధులు నిర్వహించారు ►2018లో స్పేస్ఎక్స్లో చేరిన అనిల్.. కంపెనీ ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్ ప్రిపరేషన్లో పాలుపంచుకున్నాడు. ►స్పేస్ఎక్స్ ఐదు లాంఛ్లకు సంబంధించి.. ఫ్లైట్ సర్జన్‌గా విధులు నిర్వహించారు. ►కాలిఫోర్నియా ఎయిర్ నేషనల్ గార్డ్‌లో చేరిన మీనన్, అడవుల్లో సంచరించేవాళ్లు హఠాత్తుగా గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించడంలో నేర్పరి కూడా. ►ఎమర్జెన్సీ మెడిసిన్, స్పేస్ మెడిసిన్ మీద ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ ప్రచురించారాయన. ►ప్రస్తుతం ఆయన ఫ్లయిట్ సర్జన్‌గా నాసాలో పని చేస్తూ.. హోస్టన్‌లో ఉంటున్నారు. భార్య అన్నా మీనన్‌తో అనిల్ ►నాసా ప్రొఫైల్ ప్రకారం.. అనిల్ మీనన్ 2010 హైతీ భూకంప సమయంలో, 2015 నేపాల్ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్‌షో ప్రమాద సమయంలో ముందుగా స్పందించారు. ►భార్య అన్నా మీనన్‌తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ►నాసా అడ్మినిస్ట్రేటర్ బిల నెల్సన్.. ఆస్ట్రోనాట్ బృందాన్ని స్వయంగా ప్రకటించారు. వీళ్లను ఐదు కేటగిరీల శిక్షణ ఇప్పిస్తారు. అందులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారం, స్పేస్‌వాక్ శిక్షణ, సంక్షిష్టమైన రొబోటిక్ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవడం, టీ-38 ట్రైనింగ్ జెట్‌ను సురక్షితంగా ఆపరేట్ చేయడం, చివరగా.. రష్యన్ లాంగ్వేజ్ స్కిల్స్ శిక్షణ. ► 2022 జనవరిలో అనిల్ మీనన్ నాసా ఆస్ట్రోనాట్ టీంలో చేరి.. శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. చదవండి: ఐఎంఎఫ్‌లో నెంబర్ 2 మన ఆడపడుచు -
కొత్త టీమ్ సిద్ధం: పార్టీపై పట్టు పెంచుకుంటున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త రూపునిచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. టీపీసీసీ కార్యవర్గానికి నేతల ఎంపికలో సామాజిక సమీకరణలను ప్రాధాన్యతగా ఎంచుకోవాలని, అదే సమయంలో తనదైన మార్కు వేయాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నట్టు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షుల జాబితాను ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించగా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకంపై రేవంత్ దృష్టిపెట్టారు. నేడో, రేపో పార్టీ అధికార ప్రతినిధుల జాబితా రానుండగా, మిగిలిన పదవులను నెలలో భర్తీ చేస్తారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అధికార ప్రతినిధుల కుదింపు గత కమిటీల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 25 మంది వరకు ఉండేవారు. తాజాగా ఈ సంఖ్యను 20కి కుదించాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 70-80 మంది వరకు అధికార ప్రతినిధులుండేవారు. వీరిని 15–20 మందికి పరిమితం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. వాక్పటిమ, విషయ పరిజ్ఞానం, సమయానుకూలంగా స్పందించగలిగే వారినే ఈ జాబితాలో ఉంచాలని ఆయన కసరత్తు చేస్తున్నారు. -
Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మూడో ఒలింపిక్ పతకం సాధించాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి టోర్నమెంట్ అయిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ టోర్నీ మే 6 నుంచి 9 వరకు బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతుంది. ► 74 కేజీల విభాగంలో భారత్ తరఫున ఆసియా మాజీ చాంపియన్ అమిత్ ధన్కర్ బరిలోకి దిగనున్నాడు. మార్చి 16న నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ టోర్నీకి పూర్తిస్థాయి ఫిట్నెస్ లేని కారణంగా సుశీల్ కుమార్ దూరంగా ఉన్నాడు. ఆ ట్రయల్స్ టోర్నీలో 74 కేజీల విభాగంలో సందీప్ సింగ్ మాన్ విజేతగా నిలువగా... అమిత్ ధన్కర్ రన్నరప్‌గా నిలిచాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల ప్రకారం ఒలింపిక్ బెర్త్ సాధించిన రెజ్లరే ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీకి సుశీల్ ఎంపిక కాకపోవడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 37 ఏళ్ల సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం (66 కేజీలు), 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం (66 కేజీలు) సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సుశీల్‌కు పోటీపడే అవకాశం రాలేదు. ‘ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. జట్టు ఎంపిక గురించి నేను డబ్ల్యూఎఫ్ఐతో ఇంకా మాట్లాడలేదు. త్వరలోనే ఈ విషయంపై వారితో చర్చిస్తాను’ అని సుశీల్ వ్యాఖ్యానించాడు. ► ట్రయల్స్ టోర్నీ విజేతగా నిలిచిన సందీప్ సింగ్‌ను కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి, ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేశారు. అయితే ఈ రెండు టోర్నీలలో సందీప్ సింగ్ విఫలమయ్యాడు. దాంతో వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం సందీప్ సింగ్‌ను పక్కనబెట్టి సెలక్షన్ టోర్నీ రన్నరప్ అమిత్ ధనకర్‌కు ఎంపిక చేశారు. ►వాస్తవానికి వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భావించింది. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా శిక్షణ శిబిరాలు మూతబడ్డాయి. దాంతో ట్రయల్స్ లేకుండానే తొలి ట్రయల్స్ టోర్నీ ఆధారంగా అమిత్‌కు అవకాశం ఇచ్చారు. ►74 కేజీల విభాగంలో మరో స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ట్రయల్స్ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోవడంతో అతను కూడా టోక్యో ఒలింపిక్స్ అవకాశాలు కోల్పోయాడు. ►ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఇప్పటికే మూడు ఒలింపిక్ బెర్త్‌లు (రవి–57 కేజలు; బజరంగ్–65 కేజీలు; దీపక్ పూనియా–86 కేజీలు) ఖరారయ్యాయి. మరో మూడు బెర్త్‌లు (74 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) మిగిలి ఉన్నాయి. 97 కేజీల విభాగంలో సత్యవర్త్... 125 కేజీల విభాగంలో సుమిత్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ లో పోటీపడనున్నారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు ఖాయమవుతాయి. ►వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత గ్రీకో రోమన్ పురుషుల జట్టును కూడా ప్రకటించారు. సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ కుమార్ (130 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ►మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు ఒలింపిక్ బెర్త్‌ల కోసం సీమా (50 కేజీలు)... నిషా (68 కేజీలు)... పూజా (76 కేజీలు) పోటీపడతారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
ముక్కోణపు టి20 టోర్నీకి భారత జట్టు
-
కోహ్లి, ధోనీలకు విశ్రాంతి
ముంబై: సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్లలో ఆడిన నలుగురు భారత క్రికెటర్లకు తర్వాతి టోర్నమెంట్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే ముక్కోణపు టి20 టోర్నీ ‘నిదాహస్ ట్రోఫీ’ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. వీరితో పాటు మహేంద్ర సింగ్ ధోని, కుల్దీప్ యాదవ్‌లను కూడా పక్కన పెట్టారు. స్వయంగా ధోని తనకు విశ్రాంతి కావాలని కోరగా... కుల్దీప్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ‘రాబోయే సిరీస్‌ల షెడ్యూల్, పని భారాన్ని దృష్టిలో ఉంచుకుంటూ నిదాహస్ ట్రోఫీ కోసం జట్టును ఎంపిక చేశాం. ముఖ్యంగా పేస్ బౌలర్లు గాయాలపాలు కాకుండా ఉండేందుకు, మరింత మెరుగైన ప్రదర్శన కోసం తగినంత విశ్రాంతి అవసరమని హై పెర్ఫార్మెన్స్ బృందం సూచించింది. ధోని తనకు విశ్రాంతి కావాలని కోరడం వల్లే అతడిని ఎంపిక చేయలేదు’ అని ఎమ్మెస్కే వెల్లడించారు. విశ్రాంతినిచ్చిన ఆటగాళ్ల స్థానంలో వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, దీపక్ హుడా, రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేకపోయిన సిరాజ్... విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌లలో కేవలం 15.65 సగటుతో 23 వికెట్లు పడగొట్టి బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో సుందర్ కూడా ఆడగా, హుడాకు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ఎంపికైనా విజయ్ శంకర్‌కు తుది జట్టులో స్థానం దక్కకపోగా... పంత్ భారత్ తరఫున 2 టి20లు ఆడాడు. మరోవైపు ఈ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2 వేలకు పైగా పరుగులు చేసిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దేశవాళీ క్రికెట్లో బాగా ఆడినా... కనీసం ఇండియా ‘ఎ’ తరఫున రాణించిన తర్వాతే ఆటగాళ్లను సెలక్షన్ కోసం పరిశీలించడం రివాజుగా పెట్టుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మార్చి 6 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటాయి. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్ (వైస్ కెప్టెన్), రాహుల్, రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చహల్, అక్షర్, విజయ్ శంకర్, శార్దుల్, ఉనాద్కట్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సిరాజ్. -
దక్షిణాది రాష్ట్రాల్లోని లౌకికవాద పార్టీలతో కూటమి!
సాక్షి, చెన్నై: పార్టీ ఏర్పాటుకు ముందే విశ్వనాయకుడు కమల్‌హాసన్ కూటమి ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ప్రధానంగా బిజేపికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లోని లౌకికవాద పార్టీలను ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వస్థలం రామేశ్వరం నుంచి రాష్ట్ర పర్యటనకు కమల్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార పత్రికలో ఆర్టికల్ రాస్తూ వస్తున్న కమల్ తాజాగా శుక్రవారం వెలువడ్డ సంచికలో బిజేపికి వ్యతిరేకంగా కొత్త ప్రయత్నం గురించి స్పందించారు. అందులో ద్రావిడం అన్నది ఒక్కత మిళనాడుకే పరిమితం కాదని, ఇది దేశవ్యాప్తంగా ముడిపడి ఉన్న పదం అని వివరించారు. దక్షిణ భారతం అంతా ఒకే ద్రావిడం అన్న పదానికి కట్టుబడక తప్పదన్నారు. చంద్రబాబు నాయుడు, పినరయ్ విజయన్, చంద్రశేఖర రావు, సిద్దరామయ్యలూ ద్రవిడులేనని వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ అందరితోఆశల్ని పంచుకోవాల్సి ఉందని, ఇది భవిష్యత్తులో సత్పలితాన్ని ఇవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి తన పయనం మొదలు కానున్నదని, ఆ రోజు నుంచి ప్రజలతో అన్ని విషయాలను పంచుకుంటానని, అందరిలోకి తీసుకెళ్తాననని ఆయన పేర్కొన్నారు. అందరం ఒకే వేదిక మీద, ఒకే వైపు ఉంటే ఫలితం ఉంటుందన్నారు. పరోక్షంగా కేంద్రం వద్ద తలలు దించుకోవాల్సిన అవసరం లేదని, అన్నీ దరి చేరే రీతిలో ఐక్యతతో దక్షిణ భారతంలోని లౌకికవాదులందరూ ముందడుగు వేయడానికి సిద్ధం కావాలని ఆ కాలంలో పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ సిద్దం..!
-
కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: అనంతపురంలో ఈ నెల 29 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే ఏడవ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హాకీ చాంపియన్‌షిప్, అక్టోబరు 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్ర బాలుర హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా జట్లను స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎంపిక చేశారు. జట్టు సభ్యుల వివరాలను హాకీ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రామకృష్ణ విడుదల చేశారు. ఎంపికైన జట్టు సభ్యులను శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ అభినందించారు. ఆయన మాట్లాడుతూ, జాతీయ క్రీడ హాకీ అభివృద్ధికి సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ మోనిటరింగ్ అధికారి పి.అజయ్‌కుమార్, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కె.రాజశేఖర్, హాకీ కోచ్ ఎస్.హరికృష్ణ, సీనియర్ క్రీడాకారుడు అబ్దుల్ కరీం పాల్గొన్నారు. బాలికల జూనియర్ జట్టు : ఎస్.కె.సుమియా, ఎల్.విషితా, ఎ.నందిని, పి.ఆశ్రిత, జి.దివ్యశ్రీ, ఎన్.నిఖిత, ఎస్.డి.చాందిని, ఎం.డి.∙హజరా, ఎస్.అపర్ణ, యు.రూప, జి.స్నేహ, ఎం.డి.అసి ఫా, ఎస్.అదిద్యుతి, శ్రీపదలావణ్య, ఇ.యామి ని, పి.రమ్య, ఉమా సుప్రియాంక, ఎస్.సరస్వ తి ఎంపిక కాగా, స్టాండ్‌బైగా ఎం.జోత్సS్న, ఎం.శ్రావణి, బి.పండు, ఎం.మానస ఎంపికయ్యారు. బాలుర స»Œ æజూనియర్ జట్టు: సీహెచ్.అర్యవర్థన్, డి.రవికుమార్, డి.సందీప్, జి.వేణుగోపాల్, కె.నరసింహ, పి.రాఘవేంద్రరావు, జి.శివప్రమోద్, ఎన్.యశ్వంత్‌చౌదరి, ఎస్.డి.మహ్మద్‌బాషా, వి.సాయి, టి.మల్లేష్, జి.వెంకటసాయి, పి.అఖిల్‌బాబు, జి.నిఖిల్‌కుమార్, బి.టి.భరత్, వై.వెంకటేశ్వరరావు, బి.చక్రధర్సాయి ఆదిత్య, పవన్ వెంకటసాయితేజ, ఎంపిక కాగా, స్టాంyŠ బైగా టి.శ్రీను, ఎం.సాయిధీరజ్, పి.బాలశివసాయి, బి.శివచైతన్య ఎంపికయ్యారు.