
సాక్షి, చెన్నై: పార్టీ ఏర్పాటుకు ముందే విశ్వనాయకుడు కమల్‌హాసన్ కూటమి ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ప్రధానంగా బిజేపికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లోని లౌకికవాద పార్టీలను ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వస్థలం రామేశ్వరం నుంచి రాష్ట్ర పర్యటనకు కమల్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార పత్రికలో ఆర్టికల్ రాస్తూ వస్తున్న కమల్ తాజాగా శుక్రవారం వెలువడ్డ సంచికలో బిజేపికి వ్యతిరేకంగా కొత్త ప్రయత్నం గురించి స్పందించారు.
అందులో ద్రావిడం అన్నది ఒక్కత మిళనాడుకే పరిమితం కాదని, ఇది దేశవ్యాప్తంగా ముడిపడి ఉన్న పదం అని వివరించారు. దక్షిణ భారతం అంతా ఒకే ద్రావిడం అన్న పదానికి కట్టుబడక తప్పదన్నారు. చంద్రబాబు నాయుడు, పినరయ్ విజయన్, చంద్రశేఖర రావు, సిద్దరామయ్యలూ ద్రవిడులేనని వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ అందరితోఆశల్ని పంచుకోవాల్సి ఉందని, ఇది భవిష్యత్తులో సత్పలితాన్ని ఇవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి తన పయనం మొదలు కానున్నదని, ఆ రోజు నుంచి ప్రజలతో అన్ని విషయాలను పంచుకుంటానని, అందరిలోకి తీసుకెళ్తాననని ఆయన పేర్కొన్నారు. అందరం ఒకే వేదిక మీద, ఒకే వైపు ఉంటే ఫలితం ఉంటుందన్నారు. పరోక్షంగా కేంద్రం వద్ద తలలు దించుకోవాల్సిన అవసరం లేదని, అన్నీ దరి చేరే రీతిలో ఐక్యతతో దక్షిణ భారతంలోని లౌకికవాదులందరూ ముందడుగు వేయడానికి సిద్ధం కావాలని ఆ కాలంలో పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment