haki
-
‘చోరీ’ సెర్చ్!
మలక్‌పేట ప్రాంతానికి చెందిన ప్రతాప్ ఆన్లైన్లో ఈ–కామర్స్ సైట్ ద్వారా సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. కూకట్పల్లి నివాసి శ్రీకాంత్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి ఓ ద్విచక్ర వాహనం ఖరీదు చేశాడు. ఈ రెండూ చోరీ సొత్తులే కావడంతో కొన్ని రోజుల తర్వాత వీరి వద్దకు వచ్చిన పోలీసులు రికవరీ చేసుకువెళ్లారు. అవి చోరీ వస్తువులని తెలియక కొన్నామని మొత్తుకున్నా ఫలితం లేదు. దీంతో అటు ఖరీదు చేయడానికి వెచ్చించిన డబ్బు, ఇటు వస్తువు రెండూ నష్టపోవాల్సి వచ్చింది. సెకండ్ హ్యాండ్లో ఏదైనా సెల్‌ఫోన్, వాహనం ఖరీదు చేసే ముందు అవి ఎక్కడైనా చోరీకి గురైనవా? కాదా? అని తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం లేని కారణంగానే ఇలా జరిగింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగం ఓ సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. పోలీసు అధికారిక యాప్ ‘హాక్–ఐ’లో ఈమేరకు ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ పేరుతో లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్త వస్తువుల క్రమవిక్రయాలు ఏ స్థాయిలో జరుగుతాయో... సెకండ్ హ్యాండ్ మార్కెట్ సైతం దాదాపు అదే స్థాయిలో ఉంటోంది. తరచు వాహనం/సెల్‌ఫోన్ మోడల్స్‌ను మార్చడం కొందరికి హాబీ కావడంతో పాటు కొత్తవి కొనుగోలు చేసుకునే స్థోమత లేని వాళ్ళూ సెకండ్ హ్యాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, రామ్‌కోఠి, కింగ్‌కోఠి తదితర ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్లు వెలిశాయి. ఇక్కడకు అనునిత్యం అనేక మంది వచ్చి తాము వినియోగిస్తున్న సెల్‌ఫోన్/వాహనం అమ్మేయడమో, సెకండ్ హ్యాండ్‌కు ఖరీదు చేసుకుని వెళ్ళడమో జరుగుతోంది. దీన్ని చోరులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన వాహనాలు/సెల్ఫోన్లను తీసువచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇలాంటి చోరీ సొత్తును ఖరీదు చేస్తున్న వినియోగదారులు రికవరీల సందర్భంలో నిండా మునుగుతున్నారు. యాప్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు... ఇలాంటి వ్యవహారాలను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం చోరీ అయిన సెల్‌ఫోన్/వాహనాల వివరాలతో పాటు గుర్తుతెలియని వాహనాల జాబితాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ వివరాలు ఏదో ఓ చోట ఉండే ప్రయోజనం శూన్యమని, డేటాబేస్ రూపంలో సెర్చ్ ఆప్షన్‌తో ఆన్లైన్ ఏర్పాటు చేసింది. పోలీసు అధికారిక యాప్ ‘హాక్–ఐ’ ద్వారా ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ పేరుతో ఇది ఏర్పాటైంది. నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుల రూపంలో, పోలీసు యాప్ ‘లాస్ట్ రిపోర్ట్’ ద్వారా తమ దృష్టికి వచ్చిన వాహనం/సెల్‌ఫోన్ చోరీలు, పోగొట్టుకోవడాలకు సంబంధించిన రిపోర్టుల్ని క్రోడీకరిస్తున్నారు. వీటిని వాహనాలకు సంబంధించిన ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు సెల్‌ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నెంబర్లతో ఈ సెర్చ్ విభాగంలో ఏర్పాటు చేశారు. ఖరీదు చేసే ముందు సెర్చ్... మరోపక్క వాహనాలు/సెల్ఫోన్ల పోగొట్టుకున్న వారు సైతం ఈ ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ ద్వారా వాటి వివరాలను డేటాబేస్‌లో పొందుపరచవచ్చు. ఫిర్యాదు చేసినా, ఇలా పొందుపరిచినా తక్షణం ఆ వివరాలు అప్డేట్ అవుతాయి. ఈ డేటాబేస్ హాక్–ఐ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ వ్యాపారులు తమ వద్దకు ఆయా వస్తువుల్ని అమ్మడానికి వచ్చే వారి నుంచి వీలైనంత వరకు గుర్తింపుకార్డు ప్రతులు, సెల్‌ఫోన్ నెంబర్లని తీసుకుంటున్నారు. నేరగాళ్ళు తెలివిగా వ్యవహరిస్తూ ఇవీ నకిలీవి, తాత్కాలికమైనవి ఇస్తుండటంతో ఆనక ఆయా వస్తువులు చోరీ సొత్తని తెలిసినా వ్యాపారులు, ఖరీదు చేసిన వారు ఏమీ చేయలేక మిన్నకుండిపోవాల్సి వస్తోంది. అయితే ఈ యాప్‌లోని లింకును వినియోగించుకోవడం ద్వారా ఏదైనా సెకండ్ హ్యాండ్ వాహనం/సెల్‌ఫోన్ ఎవరైనా అమ్మడానికి వచ్చినప్పుడు దాని వివరాలు సెర్చ్ చేసి చోరీ సొత్తా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. వినియోగదారులు సైతం సెకండ్ హ్యాండ్‌వి కొనేప్పుడు ఈ సెర్చ్ ద్వారా సరిచూసుకుని ఖరీదు చేసే అవకాశం ఏర్పడింది. రానున్న రోజుల్లో దేశ వ్యాప్త లింకేజ్... ప్రస్తుతం ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ లింకులో నగరంలోని చోరీ వాహనాలు/సెల్ఫోన్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు చెందిన వివరాలు పొందుపరచనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు పూర్తయి, లింకేజీ వస్తే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పోలీసుస్టేషన్లలోని వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఓ ప్రాంతం/రాష్ట్రంలో చోరీ చేసి మరో చోట విక్రయించే వారికీ చెక్ చెప్పడానికి అవకాశం లభిస్తుంది. -
అతివలకు అండగా..
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మహిళా రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఓ పక్క షీ–టీమ్స్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అధికారులు... సామాజిక మాధ్యమాల ద్వారానూ సహాయసహకారాలు అందిస్తున్నారు. పోలీసు–ప్రజలకు వారధిగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ‘హాక్–ఐ’లోనూ ఇందుకు సంబంధించి ప్రత్యేక అంశాలను చేర్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఓఎస్... విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్ఓఎస్’ విభాగం ఏర్పాటైంది. ‘హాక్–ఐ’లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’ నొక్కడం ద్వారా దీని షార్ట్‌కట్ మెబైల్ స్క్రీన్‌పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు...జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. పొందుపరిచిన నెంబర్లకూ సమాచారం వెళ్తుంది. ఓసారి ‘ఎస్ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెస్ చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ... ప్రయాణాల్లో మహిళలకు ఉపకరించేందుకు ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ. ప్రయాణం ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత సదరు మహిళ/యువతి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ విభాగం ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. మార్గమధ్యంలో ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. నిరంతర పర్యవేక్షణ పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూ చనలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. మహిళల కోస ం ఏర్పాటు చేసిన విభాగాలను ఐటీ సెల్లో ఉండే సిబ్బ ంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటారు. – ఐటీ సెల్ అధికారులు మూడున్నరేళ్లుగా ‘షీ’ సేవలు... దేశంలోనే తొలిసారిగా షీ–బృందాల కాన్సెప్ట్ 2014 అక్టోబర్ 24న హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. యువతులు, మహిళల రక్షణ కోసం సుశిక్షితమైన కొన్ని బృందాలను పోలీసు విభాగం ద్వారా ప్రభుత్వం రంగంలోకి దింపింది. సాధారణంగా ఎవరైనా మహిళలను వేధిస్తూ దొరికినా అడ్డంగా బుకాయిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు వీడియో ఎవిడెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మాటువేసే షీ–బృందాలు తొలుత ఆకతాయిల వైఖరిపై వీడియో రికార్డింగ్ చేస్తాయి. ఆపైనే వారిని పట్టుకోవడంతో పాటు స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ నగరం దేశంలోనే ఉత్తమం అంటూ ‘నెస్ట్ అవే అనే ఆన్లైన్’ సంస్థ గతేడాది నిర్వహించిన ఆన్లైన్ సర్వే తేల్చింది. ఈ ఘనత సాధించడం వెనుక షీ–టీమ్స్ పాత్ర ఎనలేనిది. వాటి పనితీరు, స్పందనపై అధికారులు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయిస్తూ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తున్నారు. -
కృష్ణాజిల్లా హాకీ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: అనంతపురంలో ఈ నెల 29 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే ఏడవ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హాకీ చాంపియన్‌షిప్, అక్టోబరు 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే సబ్ జూనియర్ రాష్ట్ర బాలుర హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా జట్లను స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎంపిక చేశారు. జట్టు సభ్యుల వివరాలను హాకీ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రామకృష్ణ విడుదల చేశారు. ఎంపికైన జట్టు సభ్యులను శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ అభినందించారు. ఆయన మాట్లాడుతూ, జాతీయ క్రీడ హాకీ అభివృద్ధికి సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ మోనిటరింగ్ అధికారి పి.అజయ్‌కుమార్, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కె.రాజశేఖర్, హాకీ కోచ్ ఎస్.హరికృష్ణ, సీనియర్ క్రీడాకారుడు అబ్దుల్ కరీం పాల్గొన్నారు. బాలికల జూనియర్ జట్టు : ఎస్.కె.సుమియా, ఎల్.విషితా, ఎ.నందిని, పి.ఆశ్రిత, జి.దివ్యశ్రీ, ఎన్.నిఖిత, ఎస్.డి.చాందిని, ఎం.డి.∙హజరా, ఎస్.అపర్ణ, యు.రూప, జి.స్నేహ, ఎం.డి.అసి ఫా, ఎస్.అదిద్యుతి, శ్రీపదలావణ్య, ఇ.యామి ని, పి.రమ్య, ఉమా సుప్రియాంక, ఎస్.సరస్వ తి ఎంపిక కాగా, స్టాండ్‌బైగా ఎం.జోత్సS్న, ఎం.శ్రావణి, బి.పండు, ఎం.మానస ఎంపికయ్యారు. బాలుర స»Œ æజూనియర్ జట్టు: సీహెచ్.అర్యవర్థన్, డి.రవికుమార్, డి.సందీప్, జి.వేణుగోపాల్, కె.నరసింహ, పి.రాఘవేంద్రరావు, జి.శివప్రమోద్, ఎన్.యశ్వంత్‌చౌదరి, ఎస్.డి.మహ్మద్‌బాషా, వి.సాయి, టి.మల్లేష్, జి.వెంకటసాయి, పి.అఖిల్‌బాబు, జి.నిఖిల్‌కుమార్, బి.టి.భరత్, వై.వెంకటేశ్వరరావు, బి.చక్రధర్సాయి ఆదిత్య, పవన్ వెంకటసాయితేజ, ఎంపిక కాగా, స్టాంyŠ బైగా టి.శ్రీను, ఎం.సాయిధీరజ్, పి.బాలశివసాయి, బి.శివచైతన్య ఎంపికయ్యారు. -
క్రీడాభివృద్ధికి కృషి చేస్తా
వనపర్తి : జిల్లా క్రీడాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం స్థానిక డాక్టర్ బాలకిష్టయ్య క్రీడాప్రాంగణంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు హాకీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరెందర్రెడ్డితో కలిసి హాకీస్టిక్స్, క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఇక్కడ నిర్వహించనున్న హాకీ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు తనవంతు సాయం అందిస్తామన్నారు. క్రీడాకారులు మొక్కనాటి పెంచాలని సూచించారు. హాకీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 94 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారని, వారిలో 30 మంది పాలమూరు జిల్లాకు చెందిన వారే ఉండడం గర్వకారణమన్నారు. అనంతరం స్టేడియంలో క్రీడాకారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీడీ బి.కుమార్, కౌన్సిలర్లు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, పీఈటీలు మన్యం, రామ్మోహన్, సీనియర్ క్రీడాకారులు రాముడు, బాసెట్టి శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు డీఎం. రాము, జాతనాయక్ తదితరులు పాల్గొన్నారు.