క్రీడాభివృద్ధికి కృషి చేస్తా
Published Thu, Jul 28 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
వనపర్తి : జిల్లా క్రీడాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం స్థానిక డాక్టర్ బాలకిష్టయ్య క్రీడాప్రాంగణంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు హాకీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరెందర్‌రెడ్డితో కలిసి హాకీస్టిక్స్, క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఇక్కడ నిర్వహించనున్న హాకీ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు తనవంతు సాయం అందిస్తామన్నారు. క్రీడాకారులు మొక్కనాటి పెంచాలని సూచించారు. హాకీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 94 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారని, వారిలో 30 మంది పాలమూరు జిల్లాకు చెందిన వారే ఉండడం గర్వకారణమన్నారు. అనంతరం స్టేడియంలో క్రీడాకారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీడీ బి.కుమార్, కౌన్సిలర్లు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, పీఈటీలు మన్యం, రామ్మోహన్, సీనియర్ క్రీడాకారులు రాముడు, బాసెట్టి శ్రీనివాసులు, టీఆర్‌ఎస్ నాయకులు డీఎం. రాము, జాతనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement