
సాక్షి, కృష్ణా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 137వరోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్‌ఆర్ కాలనీ నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం అంబాపురం, జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్ చేరుకుని రాజన్న బిడ్డ పాదయాత్రను ముగించారు. రాత్రికి ఆయన అక్కడే బసచేస్తారు. నేడు వైఎస్ జగన్ 14.4 కిలోమీటర్లు నడిచారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు బంద్‌లో పాల్గొనేందుకు వీలుగా రేపు పాదయాత్రకు వైఎస్ జగన్ విరామం ప్రకటించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఏప్రిల్ 17న ఉదయం యథాప్రకారం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment