ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ | notification for by elections | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

Sep 19 2016 9:20 PM | Updated on Sep 5 2018 3:33 PM

ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ - Sakshi

ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

:జిల్లాలో స్థానిక సంస్థలకు వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

మచిలీపట్నం :జిల్లాలో స్థానిక సంస్థలకు వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పెడన మండల పరిషత్‌ అధ్యక్షులు, పమిడిముక్కల, ఆగిరిపల్లి మండలాల్లో కో–ఆప్టెడ్‌ మెంబర్ల ఎన్నిక 29వ తేదీన జరగనుంది. మండవల్లి జెడ్పీటీసీ సభ్యురాలు మరణించటంతో పాటు వివిధ కారణాలతో జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో టి దామోదరనాయుడు సోమవారం తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబరు 20వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమీషన్‌ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మండవల్లి జెడ్పీటీసీతో పాటు ఖాళీగా ఉన్న ఎంపీటీసీ స్థానాలు నందిగామ (పెడన మండలం), వెంట్రప్రగడ –1, దోసపాడు, వానపాముల (పెదపారుపూడి మండలం), కొండపల్లి–8 (ఇబ్రహీంపట్నం), మెరకనపల్లి (మోపిదేవి), రంగన్నగూడెం (బాపులపాడు), పోలాటితిప్ప (మచిలీపట్నం), వేదాద్రి (జగ్గయ్యపేట), పెనుగొలను–2 (గంపలగూడెం), గొల్లమంద (ఎ.కొండూరు), రమణక్కపేట (ముసునూరు), కనసానపల్లి (ఆగిరిపల్లి), చందర్లపాడు –1 (చందర్లపాడు), గూడవల్లి –2 (విజయవాడ రూరల్‌) స్థానాలకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement