labour pain
-
ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవాలంటే ఏం చేయాలి..?
నాకు ఇప్పుడు తొమ్మిదో నెల. నొప్పులు తట్టుకోలేను అనిపిస్తోంది. ఎపిడ్యూరల్ లాంటి ఇంజెక్షన్స్ అంటే భయం. నొప్పులు తట్టుకోవడానికి వేరే మార్గాలు ఉంటే చెప్పండి?– కావేరి, నెల్లూరు. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఈ రోజుల్లో చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగానే ఉంటాయి. కాని, అది వద్దనుకే వాళ్లకి కొన్ని ఆసుపత్రుల్లో కాంప్లమెంటరీ థెరపీస్ లేదా ఎండోక్సాన్ వంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్‌ని సూచిస్తున్నారు. కాంప్లమెంటరీ థెరపీస్ను సంబంధిత ఎక్స్పర్ట్ థెరపిస్ట్లతోనే తీసుకోవాలి. వాటిలో హిప్నోథెరపీ, అరోమాథెరపీ, మసాజ్, రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్ లాంటివి ఉంటాయి. హిప్నోగ్రఫీలో ప్రశాంతమైన ఒత్తిడిలేని ప్రసవం జరిగేటట్టు హిప్నో క్లాసులలో నేర్పిస్తారు. దీంతో ఆందోళన తగ్గి, బర్తింగ్ మజిల్స్ సరిగ్గా పనిచేస్తాయి. అరోమాథెరపీలో శారీరక, భావోద్వేగ ఆరోగ్యానికి అవసరమైన నూనెలు ఉపయోగించడం వలన భయం, ఆందోళన తగ్గుతుంది. కాని, దీనితో అంత పెద్దగా లాభం ఉండదని పరిశోధనల్లో తేలింది. రిఫ్లెక్సాలజీ లేదా మసాజ్‌లో మీ శరీరంలోని కొన్ని ప్రాంతాలు, చేతులు, కాళ్లను మసాజ్ చేయటం వలన లేబర్ పెయిన్ తగ్గుతుంది. వివిధ పరిశోధనల్లో ఇది కూడా పూర్తి ఉపశమనం ఇవ్వదని తేల్చారు. ఇక ఆక్యుపంక్చర్‌లో సన్నని స్టెరైల్ సూదులతో శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన పాయింట్స్‌ని ప్రెస్ చేస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. ఈ సూదులను ఆ నిర్దిష్టమైన స్పాట్స్‌లో ఇరవై నిమిషాల నుంచి మొత్తం కాన్పు జరిగే వరకు ఉంచుకోవచ్చు. ఇది థెరపిస్ట్ మీతోనే ఉండి, చేయాల్సిన చికిత్స. ఎంటోనాక్స్ అనే గ్యాస్‌నే ఒక ఆక్సిజన్ పంపు లాంటి దాని ద్వారా నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిక్స్చర్ని పీల్చుకునే పద్ధతి. దీనితో చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది రోగి సొంతంగానే ఉపయోగించుకోవచ్చు. అంటే నొప్పి మొదలైనప్పుడు ఒక పఫ్ పీల్చుకుంటే ఆ గ్యాస్ ద్వారా నొప్పి ఒక నిమిషం వరకు తగ్గుతుంది. మళ్లీ నొప్పి వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగించాలి. కొంచెం మగతగా ఉంటుంది. యాభై శాతం వరకు నొప్పి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ మార్గాల ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా లేబర్ పెయిన్స్‌ను తగ్గించుకునే అవకాశం ఉంది. వీటిల్లో మీకు అందుబాటులో ఏది ఉంది అని ఆసుపత్రుల్లో పరిశీలించి తీసుకోవాలి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రపంచ వాతావరణ సదస్సు ఎలా ఏర్పాటైందంటే..ఇప్పటికీ 75 ఏళ్లా..?) -
దారుణం: డాక్టర్ నిర్వాకం.. మహిళ కడుపులో టవల్ ఉంచేసి..
ప్రసవ వేదనతో ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేశాడో వైద్యుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే... నజరానా అనే మహిళ ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఐతే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఆమె కడుపులో టవల్ ఉంచేసి ఆపరేషన్ చేశారు డాక్టర్ మత్లూబ్. కానీ ఆ తర్వాత మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు సదరు మహిళని. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ అసలు విషయం తెలుసుకుని బాధితురాలి భర్త ఆలీ తెల్లబోయాడు. బాధితురాలి కడుపులో టవల్ ఉందని, ఆపరేషన్ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు. దీంతో అలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) రాజీవ్ సింఘాల్ ఈ విషయంపై సమగ్ర విచారణ చేయమని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను ఆదేశించారు. ఐతే అలీ ఈ విషయమై లిఖితపూర్వకంగా తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని సీఎంవో అధికారి సింఘాల్ చెప్పడం గమనార్హం. విచారణలో..వైద్యుడు మత్లూబ్ అమ్రోహాలో సైఫీ నర్సింగ్ హోమ్‌ని ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నట్లు తేలింది. (చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ) -
మహిళకు నొప్పులు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఓ మహిళకు విమానంలో ఉండగా దారిమధ్యలో నొప్పులు రావడంతో.. ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 36 ఏళ్ల వయసున్న రేనిన్ అనే ఆ మహిళ ఖతార్ ఎయిర్వేస్ విమానంలో ఖతార్ నుంచి థాయ్‌లాండ్ లోని ఫుకెట్ నగరానికి ప్రయాణిస్తున్నారు. ఆ విమానం చెన్నై సమీపంలో ఉండగా.. ఆమెకు ఉన్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. దాంతో సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి కూడా తెలియజేయడంతో అత్యవసరంగా విమానాన్ని చెన్నైలో దించేశారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యబృందం ఆ మహిళను వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ముందుగా అంబులెన్సులో ఆమెకు ప్రథమ చికిత్స చేశారు.