మహిళకు నొప్పులు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ | Woman gets labour pain mid-air, flight makes emergency landing | Sakshi
Sakshi News home page

మహిళకు నొప్పులు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Published Thu, May 7 2015 5:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Woman gets labour pain mid-air, flight makes emergency landing

ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఓ మహిళకు విమానంలో ఉండగా దారిమధ్యలో నొప్పులు రావడంతో.. ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 36 ఏళ్ల వయసున్న రేనిన్ అనే ఆ మహిళ ఖతార్ ఎయిర్వేస్ విమానంలో ఖతార్ నుంచి థాయ్లాండ్ లోని ఫుకెట్ నగరానికి ప్రయాణిస్తున్నారు. ఆ విమానం చెన్నై సమీపంలో ఉండగా.. ఆమెకు ఉన్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి.

దాంతో సిబ్బంది వెంటనే పైలట్ను అప్రమత్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి కూడా తెలియజేయడంతో అత్యవసరంగా విమానాన్ని చెన్నైలో దించేశారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యబృందం ఆ మహిళను వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ముందుగా అంబులెన్సులో ఆమెకు ప్రథమ చికిత్స చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement