new general secretary
-
రేసులో ఎంఎ బేబి, అశోక్ ధవాలే
మదురై(తమిళనాడు): దేశంలోనే అతిపెద్ద వామపక్ష పార్టీగా కొనసాగుతున్న సీపీఎం పార్టీకి నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్న నేపథ్యంలో ఆ పదవిలో ఎవరు కూర్చోబోతున్నారన్న చర్చ మొదలైంది. పార్టీ పగ్గాలు ప్రధానంగా ఎంఏ బేబీ, అశోక్ ధవాలేల్లో ఒకరికి దక్కే వీలుందని వార్తలు వినవస్తున్నాయి. ఎంఏ బేబీ గత 13 సంవత్సరాలుగా పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యునిగా సేవలందిస్తున్నారు. ఎంఏ బేబికి ముఖ్యంగా కేరళ రాష్ట్ర నాయకత్వం నుంచి దాదాపు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత విస్తరించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా రైతాంగ సమస్యలు దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కాయి. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధర అంశంపై రైతు ఉద్యమం ఉధృతంగా కొనసాగిన నేపథ్యంలో ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధవాలేను తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటే పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుందని ముఖ్యనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బీజేపీ విధానాలపై పోరాటంలో భాగంగా వామపక్ష పార్టీల మధ్య సఖ్యత సాధించే, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటి మీదకు తెచ్చే బలమైన నేతను పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టాలని పార్టీ ముఖ్యులు యోచిస్తున్నారు. ధవాలేకు పశ్చిమబెంగాల్ ప్రాంతం నుంచి బలమైన మద్దతు ఉంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగల సత్తా ధవాలేకు ఉందని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా తాజా లోక్‌సభ ఎన్నికల వేళ విపక్షాలు ‘ఇండియా’కూటమిగా ముందుకొచ్చి ఘోర వైఫల్యాన్ని చవిచూసిన నేపథ్యంలో మళ్లీ పార్టీల మధ్య సఖ్యత సాధించడంలో కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగించడంలో నిష్ణాతుడైన నేత కోసం పార్టీ వేట మొదలెట్టడం తెల్సిందే. తెరమీదకు బీవీ రాఘవులు పేరు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యంత సీనియర్ పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సైతం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు బృందా కారత్ను జనరల్ సెక్రటరీగా చూడాలని మరికొందరు నేతలు భావిస్తున్నారు. 75 ఏళ్లు దాటిన నేతను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకూడదనే నిబంధనను పార్టీ అమల్లోకి తెచ్చింది. అయితే అరుదైన, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనను పక్కనబెట్టే వీలుందని తెలుస్తోంది. అగ్రనేతను ఎన్నుకునే క్రమంలో గతంలో కేరళ, పశ్చిమబెంగాల్ వర్గాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. 1996లో పశ్చిమబెంగాల్ నుంచి జ్యోతిబసు ప్రధానమంత్రి పదవికి అర్హుడని భావించినవేళ కేరళ వామపక్ష వర్గం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది. 2007లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలోనూ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. 2015లో సీతారాం ఏచూరిని ప్రధా న కార్యదర్శిగా ఎన్నుకుంటే ఆనాడు కేరళ ముఖ్యనేతలు ఎస్ఆర్ పిళ్లైకు మద్దతు పలికారు. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ 24వ మహాసభలు మదురైలో జరుగుతున్న తరుణంలో ఆదివా రం పార్టీ కేంద్ర కమిటీ తదుపరి పార్టీ ఎన్నికల కోసం అభ్యర్థుల పేర్లను ప్రకటించే వీలుంది. -
శ్రామిక కార్మిక పాలన తీసుకురావడమే లక్ష్యం
-
మళ్లీ ఏచూరినే...
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి (65) మరో దఫా ఎన్నికయ్యారు. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరి రోజు(ఆదివారం) జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు 92 సభ్యులున్న కేంద్ర కమిటీ సంఖ్యను 95కు పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తమ్మినేని, వీరయ్యలు కొనసాగుతుండగా.. ఇప్పుడు నాగయ్య(తెలంగాణ)కు చోటు దక్కింది. ఇక భేటీ అనంతరం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. సమావేశ వివరాలను వివరించిన ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు.. సీపీఎంలో నెలకొన్న విభేదాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అయితే తామంతా ఏకతాటిగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఐదు రోజులపాటు జరిగిన హైదరాబాద్‌లో జరిగిన జాతీయ మహాసభల్లో ఆఖరి రోజైన నేడు పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నేటి సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుండగా.. కాసేపట్లో మలక్‌పేట్ నుంచి సభ వేదిక వరకు రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు కొనసాగనుంది. -
కొత్త సీఎస్ టక్కర్
♦ నేడు పదవీ బాధ్యతల స్వీకరణ ♦ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఐవైఆర్ ♦ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి ♦ ట్రస్టు చైర్మన్‌గానూ నియామకం సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సత్యప్రకాశ్ టక్కర్ నియమితులయ్యారు. 1981 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి అయిన టక్కర్‌ను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టక్కర్ ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో టక్కర్ శనివారం సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఆగస్టు వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఆగస్టు నెలాఖరుకు పదవీ విరమణ చేస్తారు. సీనియారిటీ ప్రకారం చూస్తే ఐవైఆర్ తరువాత 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వనికుమార్ పరీడా సీఎస్ అవ్వాల్సి ఉంది. అయితే బాక్సైట్ వ్యవహారంలో ప్రభుత్వంలోని ‘ముఖ్య’ నేతకు పరీడా అనుసరించిన వైఖరి నచ్చలేదు. దీనికితోడు సీఎం పదవి చేపట్టినప్పటినుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్న గ్రిడ్లు, మిషన్లు, డబుల్ డిజిట్ గ్రోత్లపై టక్కర్ తొలినుంచీ ప్రెజెంటేషన్లను రూపొందించి ఆయనకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ పదవికి టక్కర్వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఐవైఆర్ సేవలకు గుర్తుగా... మరోవైపు నెలాఖరుకు సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న ఐ.వై.ఆర్. కృష్ణారావును బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే రాష్ట్ర దేవాదాయశాఖ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి ట్రస్టు చైర్మన్‌గానూ నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ శుక్రవారం రెండు జీవోలు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐవైఆర్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్ హోదాలో ఐవైఆర్‌కు నెలసరి అలవెన్సులు, సిబ్బంది సంఖ్యను కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించడంలో సీఎస్ హోదాలో కృష్ణారావు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్నే కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.