paritala
-
పెనుకొండ నియోజక వర్గంలో రక్త చరిత్ర మొదలు పెట్టిన పరిటాల రవీంద్ర
-
25 ఏళ్లుగా పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాకు చేసిందేమి లేదు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
అధికారుల నిర్లక్ష్యంతోనే వనరుల దోపిడీ
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంవల్లే ప్రకృతి వనరుల దోపిడి యథేచ్ఛగా సాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూస్తూ ఉండటంవల్లే అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండాపోతోందని తెలిపింది. ప్రధాన కాలువను మూసేసి దానిపై ఏకంగా రోడ్డే వేసేశారంటే అధికారుల చర్యలు ఎంత కఠినంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు రాత్రికి రాత్రే జరగవని తెలిపింది. వీటిపట్ల తాము మౌనంగా ఉండబోమని.. వేగవంతమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన ఈ వ్యాజ్యాన్ని, కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో జతచేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పలువురు ప్రభుత్వాధికారులకు, మైనింగ్ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పరిటాల గ్రామ పరిధిలో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నా, భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించి కొండలను పిండి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పరిటాల గ్రామానికి చెందిన మాగంటి ధర్మారావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అనంత వెంకట దుర్గారావు వాదనలు వినిపిస్తూ.. పరిటాలలో జరుగుతున్న మైనింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ప్రభుత్వమే తెలియజేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. అధికారుల నిర్లక్ష్యంవల్లే యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో తాము తగిన విధంగా స్పందిస్తామని స్పష్టంచేసింది. ఏకంగా ప్రధాన కాలువనే మూసివేశారని, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై దాఖలైన వ్యాజ్యం సెప్టెంబర్ 6న విచారణకు రానున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ వ్యాజ్యంతో జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. రెండింటిని కలిపి ఆ రోజు విచారిస్తామంది. -
పేకాటలో దొరికి యువకుడు ఆత్మహత్య
-
పేకాటలో దొరికి యువకుడు ఆత్మహత్య
సాక్షి, కృష్ణా: జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాలలో విషాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ యువకుడు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు పట్టుబడ్డాడు. విషయం అందరికీ తెలిసిపోవటంతో మనస్తాపం చెందిన రాజశేఖర్‌రెడ్డి నిన్న రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడని పోలీసులు కొట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తల్లి ఆరోపించారు. మరోవైపు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామే తప్ప కొట్టలేదంటున్న పోలీసులు చెప్తున్నారు. (చదవండి: చూస్తుండగానే కృష్ణానదిలో దూకిన డాక్టర్) -
క్వారీ.. ఘోరీ!
సాక్షి, కంచికచర్ల(నందిగామ) : పాపం.. ఆ చిన్నారులకు తెలీదు, అది మృత్యులోయని.. ఆ తల్లికి ఊహకైనా అంది ఉండదు.. అది ప్రాణాలు మింగే అగాధమని.. బట్టలు ఉతుకుదామని వెళ్లారు.. తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. దొనబండ.. ఈ ఘోరానికి సాక్షిగా నిలిచింది. మాటలకందని విషాదం.. వర్ణింప వీలుకాని వేదన.. ఇష్టారీతిన తవ్వి వదిలేసిన ‘క్వారీ’ గొయ్యి ఇద్దరు చిన్నారులతో పాటు, మరో మహిళను బలితీసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంపట్నం మూలపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. నీటి కుంటలో సరదాగా ఆడుకుందామని దిగిన చిన్నారులను అదే నీటికుంట మృత్యుకుహరమై మింగేసింది. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ క్వారీలో ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామానికి చెందిన దేవనం పరమేశ్వరి(ఏలేము జ్యోతి)(38)బడ్డీ కొట్టు పెట్టుకుని బతుకీడ్చుతుంది. భర్త సుబ్రహ్మణ్యం రోజు కూలీగా క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం పరమేశ్వరీ బట్టలు ఉతికేందుకని క్వారీలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు కుమార్తె దేవనం మీనా(5), వరుసకు మనుమరాలు అయిన వల్లెపు దుర్గ(8)లు అక్కడకు వెళ్లారు. పరమేశ్వరి నీటి కుంటలో దిగి బట్టలు ఉతుకుతుండగా ఒడ్డున చిన్నారులు ఆటలు ఆడుకుంటున్నారు. కొంత సమయం అయిన తర్వాత ఉల్లాసంగా ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా నీటికుంటలోకి దిగారు. ఆ నీటి కుంట లోతు ఎక్కువగా ఉండడంతో ముని గిపోతూ కేకలు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న పరమేశ్వరి వారిని కాపాడేందుకు ప్రయత్నించి నీటికుంటలోకి దిగింది. దీంతో చిన్నారులతో పాటు ఆమె కూడా మునిగిపోయి మృత్యువాత పడింది. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.. దేవనం సుబ్రహ్మణ్యం పరమేశ్వరి దంపతులు రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కొండలు పిండిచేసి జీవనం చేస్తున్న నిరుపేద కుటుంబాలు. నిత్యం కాయకష్టం చేసుకుని తమ పిల్లలను పోషించుకుంటున్నారు. అప్పటిదాకా కళ్లముందు ఆడుకున్న ఆ చిన్నారులతోపాటు పరమేశ్వరి కూడా నీటికుంటలో పడి మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. మరో 5నిముషాల్లో బట్టలు ఉతికి చిన్నారులతో సహా ఇంటికి వెళ్లదామనే లోపే ఈ సంఘటన జరగటంతో వారి శోకం వర్ణనాతీతంగా ఉంది. అడ్డదిడ్డంగా క్వారీల తవ్వకాలు.. పరిటాల శివారు దొనబండ క్వారీల్లో కాంట్రాక్టర్లు అడ్డదిడ్డంగా తవ్వకాలు జరపటంతో ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. క్వారీ బ్లాస్లింగ్ సమయంలోనూ ప్రమాదాలు జరిగిన ఘట నలు ఉన్నాయి. ఎక్కువ లోతులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా.. అటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. లోతైన నీటి కుంటల వద్ద ప్రమాద హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. -
చిగురుటాకులా పరిటాల
పరిటాల గుండెల్లో గునపం పోట్లు పడుతున్నాయి. పచ్చని తివాచీ పరుచుకున్నట్టుండే గ్రామ లోగిళ్లు.. నల్లని అక్రమ మైనింగ్ భూతానికి వణికిపోతున్నాయి. రేయింబవళ్లు దఢేల్‌మనే బ్లాస్టింగ్‌లకు ఇళ్ల గోడలు, ప్రజల కర్ణభేరులు పగిలిపోతున్నాయి. క్వారీయింగ్ నుంచి వచ్చే దుమ్మూ, ధూళి దెబ్బకు శ్వాసకోశ వ్యాధులు ఊపిరి తీస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాకు సహజ వనరులు నిలువునా గుల్లవుతున్నాయి. కోట్ల రూపాయల దోపిడీపై ప్రశ్నించిన నోళ్లకు అధికార పార్టీ నేతల బెదిరింపుల తాళాలు పడుతున్నాయి. మైనింగ్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న పరిటాలను చూసి నిక్షేపాలు సైతం గుండె పగిలి రోదిస్తున్నాయి. సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే పంటలతో కళకళలాడే పరిటాల గ్రామం నాలుగేళ్ల నుంచి మైనింగ్ మాఫియా ధాటికి భయం గుప్పిట్లో విలవిల్లాడుతోంది. గ్రామంలో ఉండే మూడు వేలకు పైగా కుటుంబాలకు దాదాపు 10 వేల మంది జనాభా నివసిస్తున్నారు. మెజార్టీ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా మలుచుకొని 6 వేల ఎకరాల భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ పరిధిలో ఉండే భూముల్లో 1,248 ఎకరాలు కొండపోరంబోకు భూమి ఉంది. ఆ భూముల్లో ఉండే కొండల్లో అపారమైన ఖనిజసంపద ఉండడంతో స్థానిక అధికార పార్టీ నేతలకు ఆ సంపదపై కన్ను పడింది. తమ ధనదాహానికి పోరంబోకు భూములను అక్రమ ఆవాసాలుగా మార్చుకున్నారు. అక్కడే 94 క్వారీలు, 72 క్రషర్లు ఏర్పాటు చేసి పెద్ద సామ్రాజ్యాన్నే స్థాపించారు. శ్వాసకోస వ్యాధులతో సతమతం.. క్వారీలు వెదజల్లే కాలుష్యం వల్ల పరిటాల వాసులు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు. పేలుళ్ల శబ్దాలు 150 డెసిబుల్ వరకు వస్తుండడంతో సమీప ప్రాంతాలలో నివసించే వారి కర్ణభేరి దెబ్బతిని వినికిడి లోపాలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెపుతున్నారు. క్వారీల కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, రక్తనాళాలు బిగుసుకు పోవడం, గుండె వ్యాధుల బారిన పడటం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలుష్య ప్రభావంతో 900 మంది బాధపడుతున్నట్లు సమాచారం. కాలుష్యం పడిన నీరు తాగడం వల్ల కీళ్ల వ్యాధులు సోకే అవకాశ ఉందని వైద్యులు అంటున్నారు. గ్రామంలో 2 వేల మందికి వినికిడిలోపం, కీళ్ల వ్యాధులతో సతమతం అవుతున్నారు. నెలలో ఒక్కో కుటుంబం దాదాపు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆసుపత్రులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. పది కిలోమీటర్ల పరిధిలో కంపనాలు... వేలాది మంది కార్మికులతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసి కొండలను తవ్వేస్తున్నారు.. ఎక్కడా నిబంధనలు పాటించటం లేదు. కొండలను తొలచేందుకు అనుమతి లేని రిగ్గు బ్లాస్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బోరు వేసే రిగ్గు బండితో కొండ పై 100 అడుగులు పైనే గోతులు తీసి ప్రమాదకరమైన జెలిటిన్స్టిక్తో పేలుళ్లులకు పాల్పడుతున్నారు. ఈ పేలుళ్ల ప్రభావంతో సుమారు పదికిలో మీటర్ల వ్యవధిలో భూమి సైతం కంపించిపోతుంది. గ్రామంలో ఉండే 3 వేల కుటుంబాలకు గాను 500 పైగా నివాసాలకు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. రేకుల షెడ్లు అడపాదడపా పునాదులు కదిలి నేలకొరిగిపోతున్నాయి. గ్రామంలో నివాస భవనాలు నిర్మించాలంటే పునాదులే పటిష్టంగా నిర్మించుకోవాల్సి వస్తోంది. లేదంటే పదికాలాలపాటు ఉండాల్సిన భవనాలు పదేళ్ల కాలంలోనే ప్రమాదకర పరిస్థితులకు చేరుతున్నాయి. ఎకరాకు రూ.25 వేల నష్టం... పరిటాలలో సాగవుతున్న 6 వేల ఎకరాల భూములకు గాను క్వారీల సమీపంలో ఉండే దాదాపు 2 వేల ఎకరాల భూములు కాలుష్యంలో చిక్కుకొని పంటలకు దూరమవుతున్నాయి. ఆ భూముల్లో కంది, పెసర, మినుము పంటలను సాగుచేస్తున్నారు. భూముల్లో పడే క్వారీల డస్ట్ భూసారంలో కలిసి పోయి మొక్క ఎదుగుదల క్షీణించిపోతుంది. దీంతో రైతులు ఎరువులు వాడినా కూడా మొక్క ఎదుగుదల లేకుండా పోతుంది. గతంలో ఎకరా భూమిసాగు చేస్తే ఖర్చులు పోనూ రూ.20 వేలు వరకు మిగులుదల ఉండేది. ప్రస్తుతం సాగు చేస్తే ఎకరా భూమికి రూ.25 వేలు వరకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో భూముల్లో పంటలు పండించలేక బీళ్లుగా వదిలేస్తున్నామని వాపోయారు. కాలుష్యం కారణంగా పనిచేసేందుకు కూలీలు కూడా రావటం లేదని రైతులు అంటున్నారు. పూడిపోతున్న బోర్లు.... క్వారీల్లో జరిగే ప్రమాదర పేలుళ్ల ప్రభావంతో వ్యవసాయబోర్లు పూడిపోతున్నాయి. బోరులో ఉండే కేసింగ్ పైపులలోపల కూడా భూమి కదిలిపోయి పూడిపోతుందని రైతులు చెబుతున్నారు. -
జెండాపై పరిటాల !
పేదలు ఓ గుడిసె వేసుకుందామనుకునే లోపు అక్కడ ఓ పచ్చని జెండా రెపరెపలాడుతుంది. అందునా దానిమీద పరిటాల పేరు. ఇంకేముంది.. ఆ వైపు వెళ్లేందుకు కూడా సామాన్యులు జంకే పరిస్థితి. నగర శివారులో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూముల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. పోనీ అధికారులకు చెప్పుకుందామంటే వాళ్లూ అందులో భాగస్వాములే. నాయకుల వద్దకు వెళ్దామంటే వ్యవహారమంతా వారి కనుసన్నల్లోనే. విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నా ఫలితం లేకపోతోంది. రాప్తాడులో కబ్జాల రెపరెపలు సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం చుట్టుపక్కల అధికార పార్టీ నేతల భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. రూరల్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాల్లో పాగా వేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అనంతపురం కార్పొరేషన్‌కు అతి సమీపంలోని ఈ భూముల విలువ రూ. కోట్లలో ఉంటోంది. అయితే అధికారులు కూడా ఈ దందాను అడ్డుకోలేకపోతుండటం గమనార్హం. ఇందులో భాగంగా అక్రమార్కులు ముందుగానే అధికారులతో మంతనాలు సాగిస్తున్నారు. ఆ తర్వాత అంతోఇంతో ముట్టజెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు. నగరం చుట్టూ బుక్కరాయసముద్రం మినహా తక్కిన ప్రాంతమంతా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నగర శివారులో ఎక్కడ చూసినా సెంటు స్థలం రూ.7లక్షల నుంచి రూ.15లక్షల పైమాటే. ఆయా ప్రాంతాల్లో ఖాళీ జాగా కనిపిస్తే టీడీపీ నేతలు అక్కడ వాలిపోతున్నారు. ఈ పంచాయతీల పరిధిలోని వీఆర్వోలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఖాళీ స్థలాల సమాచారం పసిగడుతున్నారు. ఆ తర్వాత బడా నేతల ఆశీర్వాదంతో జెండా పాతేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన కబ్జాలన్నీ ఇదే తరహాలోనివే. బీసీ భవన్ తెరమరుగేనా? సోములదొడ్డి ప్రాంతంలో ఓబుళయ్య, తిరుపాలు, నారాయణస్వామి, వెంకటేశ్ అనే నలుగురు వ్యక్తులకు 4.09 ఎకరాల పొలం ఉంది. వీళ్ల పూర్వీకులకు ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది. ఇందుకు పాసు పుస్తకాలను కూడా జారీ చేసింది. సర్వే నెంబర్ 97–1లోని ఈ పొలంలో ఓబుళయ్య, తిరుపాలు పేరుతో 0.82 ఎకరాలు, నారాయణస్వామి, వెంకటేశ్ పేరుతో 1.63 ఎకరాల పొలం ఉంది. ఇళ్లులేని పేద కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం కొందరు గ్రామపెద్దల సమక్షంలో ఈ నలుగురిని సంప్రదించారు. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు లేవని, మీ పొలాలను ఇళ్లస్థలాల కోసం ఇస్తే ఆ భూములను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇందుకు వారు అంగీకరించారు. 2012లో 4.09 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని, ఈ భూమిని తిరిగి ప్రభుత్వానికే స్వాధీనం చేస్తూ పాసుపుస్తకాలు, సంబంధిత రికార్డులు, తహసీల్దార్‌కు సమర్పించారు. ఆ మేరకు 129 మందికి 2013 మార్చి 15న అప్పటి తహసీల్దార్ బలరామిరెడ్డి, ఆర్డీఓ హుస్సేస్సాహెబ్ ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. 4.09 ఎకరాల కొనుగోలు సొమ్మును ఈ 129 మంది కలిసి చెల్లించారు. స్థలాలు రావడంతో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే నిర్మించుకోవచ్చని జన్మభూమిలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ స్థలాన్ని పామురాయి వెంకటేశ్ పేరుతో జెండాలు పాతి స్వాధీనం చేసుకోవాలని యత్నించారు. ఇంతలో ఆ స్థలాన్ని అప్పటి కలెక్టర్ శశిధర్ బీసీ భవన్ నిర్మాణానికి కేటాయించారు. అయితే ప్రభుత్వం బీసీ భవన్ ప్రతిపాదనను పక్కనపెట్టింది. ఈ భూమిలో కొంతమంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని, బీసీ భవన్‌కు మరోచోట స్థలం ఇవ్వొచ్చని ఓ ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇళ్లస్థలాల పేరుతో అస్మదీయులకు స్థలాన్ని కట్టబెట్టేందుకే బీసీ భవన్ ప్రతిపాదనను పక్కనపెట్టినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో మరికొన్ని కబ్జాలు ఇవే.. ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్ భూమిని ఈ గ్రామంలోని దళితులు ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేశారు. ఆ భూమిని తహసీల్దార్‌కు స్వాధీనం చేసి ఆ స్థలంలో పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఈ భూమిలో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి స్థలం కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల పొలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి నారాలోకేశ్‌బాబు కాలనీగా నామకరణం చేశారు. ఈ స్థలం విలువ కోట్లలోనే ఉంటుంది. అనంతపురం సమీపంలోని కక్కలపల్లి వద్దనున్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వారికి పట్టాలిప్పిస్తామని అప్పట్లో పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత 2014లో మొత్తం ఇళ్లను పోలీసుల అండతో కూల్చేశారు. మంత్రి బంధువులు మురళీ, మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో ఇళ్లను కూల్చేసి నీడలేకుండా చేశారని అప్పట్లో బాధితులు ఆరోపించారు. ఈ ఫొటోలో పరిటాల, పామురాయి వెంకటేశ్ పేరుతో కనిపిస్తున్న పచ్చ జెండాలు అనంతపురం రూరల్ పరిధి సోములదొడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఏడాదిన్నర కిందట నాటారు. 2013లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలిచ్చిన 4.90 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఈ కబ్జాకు తెగించారు. ూ కక్కలపల్లిలోని ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో ఏడాది కిందట కొందరు టీడీపీ నేతలు పరిటాల రవీంద్రకాలనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మూడెకరాలను స్వాధీనం చేసుకునే కుట్రతోనే ‘తమ్ముళ్లు’ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. బీసీ భవన్ స్థలాన్ని రద్దు చేయలేదు సోములదొడ్డి రెవెన్యూ గ్రామంలో బీసీ భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేయలేదు. ఆ స్థలాన్ని గతంలో ఇంటి పట్టాలు మంజూరు చేశాం. అయితే నిర్ణీత గడువులోపు ఎవరూ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పట్టాలను రద్దు చేసి ఆ స్థలాన్ని బీసీ భవన్ కోసం కేటాయించాం. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన రైతులు కోర్టులో కేసు వేశారు. విచారణ జరుగుతోంది. – మలోల, ఆర్డీఓ -
వైఎస్సార్ విగ్రహ ధ్వంసానికి యత్నం
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ప్రతిష్టించిన వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్న వారిని స్ధానిక మహిళలు అడ్డుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
భూదాహం
భూదందాలు, కబ్జాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీ నేతలు రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, శ్రీరాం పేరుతో ఆగడాలు మండలాలను విభజించుకుని దందాలు సాగిస్తోన్న అనుచరులు రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం ఇళ్లస్థలాల పేరుతో పేదలకు వంచన పూర్తిగా సహకరిస్తున్న అధికార యంత్రాంగం – ఇది ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టం కాదు! అధికార పార్టీ నేతల భూదాహానికి నిరుపేద కుటుంబాలు బలైన దృశ్యమిది. అనంతపురం శివారులోని కక్కలపల్లిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముండేవి. వీరికి ఇళ్లపట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇప్పటి మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత మొత్తం గుడిసెలను పోలీసుల అండతో గత ఏడాది కూల్చేశారు. మంత్రి సోదరుడు మురళి, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో గుడిసెలను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఒక్కచోటే కాదు..అనంతపురం రూరల్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్భూములు కన్పించినా.. కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ఉపక్రమిస్తున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే ‘పరిటాల’ పేరుతో పచ్చజెండాలు పాతేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రెండున్నరేళ్లుగా ఇది రివాజుగా మారింది. పైగా వారు కన్నేస్తోన్న స్థలాలు ఎక్కడో మారుమూల ఉన్నవి కావు. అనంతపురం నగరానికి అతి దగ్గరగా ఉన్నవే! ఇవి రూ.కోట్ల విలువ చేస్తాయి. నిత్యం ఎక్కడో ఒకచోట భూదందాలు సాగుతోన్న అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. అడ్డు చెబితే బదిలీలు..అవసరమైతే భౌతికదాడులకు దిగుతారనే భయంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు మాత్రం మెప్పుకోసం వారికి సహకరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ నేతలు ప్రతి అంశంలోనూ ఆదాయమార్గాన్ని అన్వేషిస్తూ, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములు, పేదలు పూరి గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. అధికారుల అండతో వీటిని కబ్జా చేస్తున్నారు. వీరిలో ‘పరిటాల’ పేరుతో కబ్జాలు చేసేవారి సంఖ్యే అధికంగా ఉంది. మొదట ఎంతోకొంత చిల్లర విదిల్చి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. కుదరకపోతే కబ్జాలకు తెగిస్తున్నారు. ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌భూమిని ఈ గ్రామ దళితులు దాదాపు 200 మంది ఇళ్లస్థలాల కోసం తులశమ్మ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. ఈ భూమిని తహశీల్దార్‌కు స్వాధీనం చేసి.. ఇళ్ల పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఇందులో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతిల్లు, ఇంటి స్థలం లేనివారికే పట్టాలివ్వాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ బి.యాలేరులో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. దీంతో ఇళ్ల పట్టాలిప్పిస్తామంటూ గ్రామస్తుల్లో చిచ్చురేపి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కక్కలపల్లిలో ఐదెకరాల ప్రభుత్వస్థలంలో ఏడాది కిందట కొంతమంది టీడీపీ నేతలు ‘పరిటాల రవీంద్ర కాలనీ’ పేరుతో బోర్డుపెట్టారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. ఇక్కడ పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మిగిలిన మూడెకరాలను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతోనే 'తమ్ముళ్లు' వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన బోర్డుతో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏడాది కిందట అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఓ స్థల వివాదంలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకున్నారు. ఏ అండా లేని ఓ వ్యక్తికి సంబంధించిన రూ.కోటి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని భావించారు. దీనికి అడ్డొచ్చిన ఓ సీఐని లూప్ లైన్‌కు పంపారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో సర్వే నంబర్ 777లో పదెకరాల చెరువు పొరంబోకు స్థలం ఉంది. ఇందులో చెట్లు పెంచుకునేందుకు స్థానికులైన ఐదుగురికి లీజుకిచ్చారు. అయితే ఇక్కడి టీడీపీ నేతలు ‘ఎన్టీఆర్ కాలనీ’ పేరుతో గుడిసెలు వేశారు. పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.2వేలు వసూలు చేశారు. నిజానికి పట్టాల పేరుతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతోనే ఈ పన్నాగం పన్నారు. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి ‘నారా లోకేశ్‌బాబు కాలనీ’ అని పేరు పెట్టారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది. -
పరుల భూమిలో పరిటాల
దళితులు కొన్న భూమి ప్రభుత్వ స్వాధీనం ఇళ్ల పట్టాలన్నీ అధికార పార్టీ వారికే ! పైగా ‘పరిటాల’ పేరుతో రాతలు బి.యాలేరు దళితుల ఆందోళన సాక్షి టాస్క్‌ఫోర్స్ : నిరుపేద దళితులు నిలువునా మోసపోయిన ఉదంతమిది. ఇంటి స్థలాల కోసం వారు కొన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పోనీ పట్టాలిచ్చిందా అంటే అదేమీ లేదు. అధికార పార్టీ వారికి మాత్రమే పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. పైగా ఆ భూమిలో ‘పరిటాల’ పేరుతో రాతలు రాయడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలం బి.యాలేరు ఎస్సీ కాలనీలో దాదాపు 200 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వీరిలో సగం మందికి పైగా సొంత ఇళ్లు కానీ, ఇంటి స్థలాలు కానీ లేవు. ఈ నేపథ్యంలో 2014 మే ఒకటో తేదీన తులసమ్మ అనే మహిళకు చెందిన సర్వే నంబర్ 207–6లోని 4.40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.90 వేల చొప్పున చెల్లించారు. ఆ మేరకు అగ్రిమెంట్ చేయించుకున్నారు. కొందరు అక్కడ కొన్ని రోజులపాటు కొట్టాలు వేసుకుని నివాసం కూడా ఉన్నారు. అయితే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా ప్రభుత్వ భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వారికి అందులో పట్టాలు ఇస్తామని నమ్మబలికారు. దళితులు చేసేదేమీ లేక పట్టాలు పంపిణీ చేస్తే తమకు కూడా స్థలం వస్తుంది కదా అనుకుని సరిపెట్టుకున్నారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. రెవెన్యూ అధికారులు రూపొందించిన లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేవు. అంతా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారని, అందులోనూ అనర్హులకు చోటు కల్పించారని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో లేని వారికి, ఒక్క రేషన్ కార్డుపై రెండు పట్టాలు ఇచ్చేందుకు సైతం అధికారులు సిద్ధపడ్డారని చెబుతున్నారు. తామంతా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కావడంతోనే అధికార పార్టీ నాయకులే ఈ విధంగా పావులు కదిపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు భూమిలో రాళ్లు పెట్టి.. వాటికి పసుపు రంగు పెయింటుతో ‘పరిటాల’ అని రాసి(చిత్రంలో చూపినట్లు) ఉండటాన్ని మించిన ఆధారం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా, బాధితులు తులసమ్మ వద్దకెళ్లి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని, తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడిగారు. అయితే ఇక్కడ కూడా అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. దళితులకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తే అందుగ్గానూ మరోచోట ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు భూమిని కూడా ఇప్పించినట్లు సమాచారం. తాత్కాలికంగా నిలుపుదల చేశాం : ఈ విషయంపై ఆత్మకూరు తహశీల్దార్ నాగరాజును వివరణ కోరగా.. బి.యాలేరులోని ఎస్సీలకు పంపిణీ చేయాల్సిన ఇళ్ల పట్టాల జాబితాను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. దళితులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : పెన్నోబులేసు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బి.యాలేరులో దళితులకు ఇళ్ల స్థలాల పంపిణీ ఏకపక్షంగా జరుగుతోంది. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత పేరు చెప్పుకొని అధికార పార్టీ నాయకులు దళితులకు అన్యాయం చేస్తున్నారు. వారికి పంపిణీ చేయాల్సిన భూమిలో ‘పరిటాల’ పేరు రాయడం అన్యాయం. దళితులకు న్యాయం జరక్కపోతే రెవెన్యూ అధికారులపై కేసులు పెడతాం. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతాం. -
శతాధిక వృద్ధురాలి మృతి
పరిటాల(కంచికచర్ల) : మండలంలోని పరిటాలకు చెందిన షేక్ అమీన్బీ(110) శతాధిక వృద్ధురాలు అనారోగ్యకారణంతో శుక్రవారం మృతి చెందింది. ఆమెకు నలుగురు కుమార్తెలున్నారు. బతికి ఉన్నంతకాలం గ్రామంతోపాటు ఇతర గ్రామాల్లో మంత్రసానిగా పనిచేసి అనేక సేవలందించేంది అని గ్రామస్తులు కొనియాడారు. ఆరు తరాలను చూసిన బామ్మ కన్నుమూయటంతో ముదిమనుమళ్ల కుమారులు బోరున విలపించారు. కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి. ఆమె భౌతికకాయాన్ని గ్రామానికి చెందిన పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. -
మేనల్లుడి చేతిలో అత్త హతం
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : అల్లుడి చేతిలో అత్త హత్యకు గురైంది. ఈ సంఘటన కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. బొర్రా సత్యవతి(55) అనే మహిళను ఆమె మేనల్లుడు దామోదర రత్నాకర్ చౌదరి(27) బండతో తలపై మోది హత్య చేశాడు. రత్నాకర్‌కు మతిస్థిమితం సరిగ్గా ఉండదు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సంఘటనాస్థలాన్ని నందిగామ సీఐ పచ్చి నారాయణ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద మంగళవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రైవేటు స్కూలుకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం కంచికచర్లలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 22 మంది విద్యార్థులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
జనవరి 1 నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు
-
పరిటాలలో విజిలెన్స్ దాడులు
కంచికచర్ల (కృష్ణా): ఓ పప్పుల మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా వివిధ బృందాలుగా విడిపోయి సోదాలు జరపుతున్న విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లాలో తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాల్లో పరిటాలలోని ఓ పప్పుల మిల్లులో అధికారులు దాడులు చేశారు. దాడలకు సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. -
పరిటాల వర్సెస్ పయ్యపుల