ramireddy
-
వాళ్లు తప్పు చేసి.. మాపైనే కేసులు
సాక్షి, అమరావతి: ‘అన్ని తప్పులు వాళ్లే చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దౌర్జన్యాలు, దాడు లు, విధ్వంసాలకు లెక్కే లేదు. ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గుర య్యారు. హత్యలు, దాడులు చేయడానికే టీడీపీ వాళ్లకు లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి నిప్పులు చెరిగారు.తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్.. టీడీపీ కార్యకర్తలపై ఎన్ని కేసులు ఉంటే అంత బాగా పని చేసినట్లు అని ప్రచారం చేశారు. ఎ న్నికల తర్వాత టీడీపీ గెలిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసిన రెడ్ బుక్ ఫొటోలతో కూడిన హో ర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్త లపైకి, ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారు’ అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లో ఉండగా నా పైనే దాడి చేసి, నాపైనే హత్యా నేరం మోపడం దారుణం. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను సమకూ ర్చుకొని ఇంట్లో ఉన్న నా పై దాడి చేశారు. పుంగనూరు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోనిదే. పుంగనూరు నియోజకవర్గానికి మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు. 75 ఏళ్ల వయసున్న మాజీ ఎంపీ రెడ్డె్డప్ప ఒక న్యాయవాది.ఆయన ఇంటిపైనే రాళ్లతో దాడి చేసి, వాహనాలు ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డె్డప్పకు చెందిన వాహ నాన్ని దగ్ధం చేశారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. తిరిగి ఆయనపైనే హత్య నేరం కేసు పెట్టడం దారుణం’ అని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీలో విధ్వంసకాండ, ఆటవిక పాలన గురించి గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నేతలందరినీ ఒకే విధంగా, సమానంగా చూడాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెప్పారన్నారు.వినుకొండలో ‘రషీద్ హంతకుడైన జిలానీ.. లోకేశ్ పుట్టిన రోజున స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలు, ఎమ్మెల్యేతో ఉన్న ఫొటోలను.. రషీద్ తల్లిదండ్రులు చూపారు. అయినా వినుకొండ ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టి జిలానీ గురించి అబద్ధాలు చెబుతున్నారు. ఫొటోల్లో స్పష్టంగా కన్పిస్తుంటే చంద్రబాబు, పవన్‌లు మాట్లాడక పోవటం, ఖండించక పోవటం ఆశ్చర్యకరం అన్నారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిరాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఒక రాజకీయ పార్టీపై జరుగుతున్న దాడిగా కాకుండా, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా దేశ ప్రజలు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో సమావేశం అనంతరం.. ఆ వివరాలను అయోధ్య రామిరెడ్డి మీడియాకు వివరించారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై చేస్తున్న భౌతిక దాడులు, ప్రజల్లో నెలకొన్న భయాందోళల గురించి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. వాటన్నింటినీ పార్లమెంట్‌లోనూ ప్రస్తావించాలని నిర్ణయించామన్నారు. ‘రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండపై ఢిల్లీలో బుధవారం జరిగే ధర్నాలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ అడిగాం. లోక్‌సభ, రాజ్యసభలో పెద్ద ఎత్తున మా వాణి వినిపిస్తాం’ అని చెప్పారు. -
మార్గదర్శి ఫ్రాడ్ కేసులో రామోజీకి శిక్ష తప్పదు : అడ్వకేట్ శివరామి రెడ్డి
-
మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్‌గా డాక్టర్ రామిరెడ్డి
కడప రూరల్: డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (డైరెక్టర్)గా నియమితులయ్యారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రాష్ట్ర స్ధాయి అత్యున్నత పదవిలో వైఎస్సార్ జిల్లాకు చెందిన వారు నియమితులు కావడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఈయన జిల్లా అంధత్వ నివారణ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్‌గా పనిచేశారు. తరువాత పదోన్నతిపై అడిషనల్ డైరెక్టర్‌గా అమరావతికి వెళ్లారు. తాజాగా డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ రామిరెడ్డి నియామకం పట్ల జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. -
'వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం'
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలుగు ప్రజలు ఐక్యత కోసం కర్నూలు రాజధానిని సీమ ప్రజలు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అభివృద్ది విషయాలపైనే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో అభివృద్ధి కేంద్రీకరణ చేయాలన్న చంద్రబాబు డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రామిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని 90 రోజులు న్యాయవాదులు విధులు బహిష్కరించి ఉద్యమాలు చేశారని, హైకోర్టు కావాలని కోరిన వారిని ఆనాడు చంద్రబాబు అవమానించారని తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు మరోచోట ఉన్నాయని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఆలూరి రామిరెడ్డి వెల్లడించారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చిన భార్య
రాజమండ్రి : కుటుంబ వివాదాల నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో సోమవారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. నాలుగేళ్లుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న రియల్ఎసేట్ట్ వ్యాపారిని అతని భార్య, బావ మరిది, ఇద్దరు కుమారులు కలిసి కత్తులతో పొడిచి హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం తాళ్ల ముదునూరుపాడు గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెలగల పట్టాభి రామారెడ్డి (54) ప్రస్తుతం హుకుంపేట గ్రామంలోని బాలాజీటవర్స్లో మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన గిరిజన యువతితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి 12.15 గంటల సమయంలో రామారెడ్డి భార్య సూర్యావాణి, బావ మరిది సత్తిశివకృష్ణా రెడ్డి, కుమారులు యోగాదుర్గాతేజ్ రెడ్డి, డోలాశంకర్తేజ్ రెడ్డి బాలాజీటవర్స్కు చేరుకున్నారు. అక్కడున్న వాచ్మెన్ సాయంతో అతడుండే రెండో ఫ్లోర్లో ఫ్లాట్‌కు వెళ్లి బలవంతంగా తలుపులు పగులగొట్టి రామారెడ్డిపై దాడికి దిగారు. కత్తితో పొట్టపైన, మెడపైన విచక్షణా రహితంగా పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో వేరే గదిలో ఉన్న గిరిజన యువతితోపాటు, మరో మహిళ కూడా భయపడి బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు. నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా రామారెడ్డి నాలుగేళ్ల క్రితం వెలగల పట్టాభిరామారెడ్డికి, భార్య సూర్యావాణికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇంటిలో రూ.15 లక్షల నగదు, పెద్దమొత్తంలో బంగారం చోరీకి గురయ్యాయి. ఆ చోరీ భార్య, బావమరుదులు చేశారని రామారెడ్డి నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య, బావమరుదులు ఆయనను అంతమొందించేందుకు అన్నంలో విషప్రయోగం చేశారు. అప్పటి నుంచి రామారెడ్డి ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో సూర్యావాణి రామారెడ్డిపై 498ఏ కేసు పెట్టింది. రామారెడ్డి ఆమెతో విడిపోవడానికి కోర్టులో విడాకుల కేసు వేశాడు. అప్పటి నుంచి రామారెడ్డి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. తొమ్మిది నెలల క్రితమే హుకుంపేటకు.. కొంతకాలం మారేడుమిల్లిలో ఉన్న రామారెడ్డి, తొమ్మిదినెలల క్రితమే హుకుంపేటలోని బాలాజీ టవర్స్‌లోని ఫ్లాట్‌లోకి అద్దెకు వచ్చారు. అపార్టుమెంటువాసులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని చెప్పినట్టు సమాచారం. మారేడుమిల్లికి చెందిన గిరిజన యువతి చదల దుర్గాదేవి తన మేనకోడలు అని చదివిస్తున్నానని, రాజమహేంద్రవరానకి చెందిన యేరుకొండ శ్రీవిద్య, ఏడాది పాపతో తనతో పాటు తనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుందని తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ.. వెలగల పట్టాభి రామారెడ్డిపై అతడి భార్య సూర్యవాణి, బావమరిది సత్తి శివకృష్ణారెడ్డి, కుమారులు నాలుగేళ్లుగా రెక్కీ నిర్వహిస్తూ వస్తున్నారు. మారేడుమిల్లిలో ఒకసారి అతడిపై హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయమే ఇద్దరు కుమారులు బాలాజీ టవర్స్‌కు వచ్చి తండ్రి రామారెడ్డిని కలిసి వెళ్లినట్టు సమాచారం. అర్ధరాత్రి వచ్చి హత్యకు పాల్పడినట్లు పక్కా ప్రణాళిక ప్రకారమే చేసినట్టు అర్థమవుతోంది. మరోవైపు రామారెడ్డిపై తాడేపల్లిగూడెం పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. అధికారులను ఏసీబీకి పట్టించడంలో దిట్ట. అధికారులను బ్లాక్మెయిల్ చేసేవాడు. హత్య కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. సంఘటన స్థలాన్ని బొమ్మూరు పోలీసులు పరిశీలించి, క్లూస్‌టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ లతామాధురి, తూర్పు మండల డీఎస్పీ, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్
-
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రామిరెడ్డి
సాక్షి, బనగానపల్లె : కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సీపీలో చేరగా, వారందరినీ జగన్... సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామిరెడ్డితో పాటుగా కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్, మాజీ ఎంపీటీసీ కుమార్, మద్దూరు రామసుబ్బారెడ్డి, అలాగే బనగానపల్లె మండలం కైఫా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నడిపెన్న, మహేష్ తో పాటు పలువురు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీలో జెండా మోయని వ్యక్తులకే ప్రాధాన్యం
కోవెలకుంట్ల: టీడీపీలో జెండా మోయని వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, నిస్వార్థంతో సేవలందించిన తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని కోవెలకుంట్లకు చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలో చేరికను పురస్కరించుకుని బుధవారం ఆయన తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, కోవెలకుంట్ల, సంజామల జెడ్పీటీసీ సభ్యులు గాండ్ల పుల్లయ్య, చిన్నబాబు, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశానన్నారు. అధికారంలోకి వచ్చాక పార్టీలో ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా తనను, తన అనుచరులను వేధింపులకు గురిచేశారన్నారు. అనుచరుల సూచనలతో టీడీపీ సభ్యత్వానికి, డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ముఖ్య అనుచరులు గిరిజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్ శ్రీనివాసనాయక్, నాగభూషణంరెడ్డి, నాగేష్, బాలరాజు, వలి, సంజన్న, రఘు, మాలి, చిన్నకొప్పెర్ల, కలుగొట్ల, పెద్దకొప్పెర్ల, వెలగటూరు మాజీ సర్పంచ్‌లు రఘునాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సూర్యశేఖర్‌రెడ్డి, మాధవరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి, ఎల్ఐసీ రామసుబ్బారెడ్డి, మోహన్‌రెడ్డి, గార్లపాటి జగదీశ్వరరెడ్డి, తులసిరెడ్డి, మధుసుధాకర్, నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..
రొంపిచర్ల : గుంటూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం అన్నవదినను ఓ తమ్ముడు నరికి చంపిన దుర్ఘటనను మరిచిపోకముందే, మరో దుర్ఘటన అదే జిల్లాలో చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం వీరపట్నంలో సోదరి సుబ్బమ్మ, బావ రమేష్ రెడ్డిపై రామిరెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దాడిలో రమేశ్‌రెడ్డి, అతడి భార్య సుబ్బమ్మ ఘటనాస్థలంలోనే చనిపోయారు. కాగా ఆస్తి వివాదాలే హత్యలకు కారణమని బంధువులు చెబుతున్నారు. మూడు ఎకరాల పొలం గురించి అక్క సుబ్బమ్మ, ఆమె సోదరుడు రామిరెడ్డి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు, ఆ పొలాన్ని ప్రస్తుతం అక్కా,బావే సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి పథకం ప్రకారం సోదరిని ఇంట్లో, పొలంలో పనిచేసుకుంటున్న బావ రమేష్‌ను దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడి అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడుకు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రత్యర్ధి వర్గం వారే రామిరెడ్డిని హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే, లారీ ఢీ కొట్టడం వల్లే మరణించి ఉంటారని మరో వర్గం వారు చెబుతున్నారు. దీంతో హత్యకు సంబంధించి కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులివెందుల నియోజక వర్గంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు కావడంతో.. అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసి ప్రమాదంలా చిత్రించేందుకు ప్రత్యర్ధులు యత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రామిరెడ్డి మృతి వార్త విన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వేంపల్లి ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
తెలంగాణ పోరాట యోధుడు-పల్వెల
‘....గంజ్‌లో పలానాయన ఉన్నాడు. మీరక్కడ ఉంటారా?’ అని అడిగాడు జైలరు. సంతోషంగా, ఆయన పక్కనైతే గంజ్‌లో ఏమొచ్చె, నరకంలోనైనా ఉంటాననుకున్నాను మనసులో’ (సహచరులు- మనుషులు-1989 జూలై పే.77) ఆయనే పల్వెల రామిరెడ్డి. ఈ (2, అక్టోబర్) ఉదయమే ఆయన కొడుకు ఫోన్ చేసి ‘బాపు చనిపోయాడు. నేను కూడా దుబాయ్ నుంచి వార్త తెలిసే వచ్చాను. ఫలానారోజు సంస్మరణ. రండి’ అని చెప్పాడు. 92 ఏళ్ల యువకుడు రామిరెడ్డి. ఆయన గురించి ‘సహచరులు’లో ఇట్లా రాసుకున్నాను. ‘తెలంగాణ రైతాంగ పోరాటకాలం నుంచి, అంటే 1946 నుంచి 86 దాకా నలభై ఏళ్లుగా జైలుకు వస్తూపోతూ ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మిత్రుడు అందులో ఒక సెల్లో ఉన్నాడు. కార్మిక రంగంలో పనిచేస్తూ, నక్సలైట్ ముద్రతోనే అరెస్ట యిన మరొక యువకుడున్నాడు. ఆయనతో నాకు ఈ జైల్లోనే పరిచయం. ఆ నల్లగొండ మిత్రునితో మాత్రం ఎమర్జెన్సీలో వరంగల్ జైల్లో పరిచయ మైంది. ఈ ఇద్దరితో మొదటి రెండు నెలలు ఒకటి కాలప్రవాహం వలె, రెండవది యవ్వన ప్రవాహం వలె గడిచిపోయాయి. ఆ నల్లగొండ మిత్రుడు విస్తృతంగా దేశం తిరిగాడు. విస్తృతంగా చదివాడు. ఆచరణ నుంచి జ్ఞానం వస్తుందనడానికి ఆయన సజీవ సాక్ష్యం. ఎన్ని అనుభవాలు చెప్పేవాడో. లాకప్ అయ్యేదాకా ఆ అవరణలో ముగ్గురమూ కలసి అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆయన మాటలు వింటుండేవాళ్లం. తిరుగుతూనే పుస్తకాలు చదవడం ఆయనకలవాటు...’ వాళ్లిద్దరూ టాడా కింద అరెస్టయి వచ్చారు. రామిరెడ్డిగారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. నక్సల్బరీ, శ్రీకాకు ళం రైతాంగ పోరాట విస్ఫోటనతో తెలంగాణలో తిరిగి ప్రారంభ మైన విప్లవోద్యమంలో ఆయన మొదట దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశాడు. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే బండ్రు నరసింహులు (ఆలేరు)గారిని అరెస్టు చేసి నేనున్న గదిలోనే పెట్టారు. అప్పుడు రామిరెడ్డిగారితో గాఢా నుబంధం ఏర్పడలేదు. ఎన్‌కె వంటి విప్లవ కవి, చెరుకూరి రాజకుమార్ వంటి రాడికల్ విద్యార్థి నా గదిలోనే ఉండడంవల్ల మా లోకం మాదిగా ఉండేది. రామిరెడ్డిగారు మిగిలినవారి వలె ఏ ప్రజాసం ఘంలోనూ పనిచేసినట్లు లేరు. ఇంగ్లిష్, ఉర్దూ భాష లలో ప్రావీణ్యం వల్ల సీపీ నాయకత్వంలోని పార్టీ ఆయనను బయటి రాష్ట్రాలలో టెక్నికల్ సహాయా లకు వినియోగించుకున్నట్లుంది. ఇంగ్లిష్ నవలలు గురించి, ముఖ్యంగా చార్లెస్ డికెన్స్ ‘రెండు మహా నగరాలు’, నెపోలియన్ జీవితచరిత్రల గురించి మాట్లాడేటప్పుడు యుద్ధనీతి, ఆయుధాల గురించి చెప్పే విషయాలు అందులో ఆయనకు లోతైన జ్ఞానం ఉన్నదని అనిపించేది. బక్క పలచటి మనిషి. ఆరడుగుల పొడవు, ధోతీ, తెల్లటి అంగీ. ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు. సంభాషణాప్రియుడు. మా ఇద్దరి అభిరుచి సాహిత్యం, విప్లవ రాజకీయాలు. మా స్నేహం నేను నల్లగొండ చౌరస్తాలో 2014 జూలై దాకా ఉన్నంతవరకు కొనసాగింది. ఆయన దిల్సు ఖ్నగర్లో ఉండేవారు. చివరిరోజుల్లో చేతికి కర్ర, చెవుడు వచ్చినట్టున్నాయి. కానీ అదే ఉత్సాహం. జర్నలిస్టుగా ఉన్న ఆయన మేనల్లుడు అనుకుం టాను, ఆయన జీవితచరిత్ర, మిత్రుల జ్ఞాపకాలు రాయించే ప్రయత్నం రెండేళ్ల క్రితం చేసినట్టున్నాడు. నా దగ్గరకి కూడా వచ్చారు. చెప్తానన్నాను. కానీ జీవన వ్యాపకాలలో పడిపోయాం. అంతేనా- ముగి సిపోని, కొనసాగుతున్న తెలంగాణ పోరాట చరిత్ర కనుక, ఇంకా నిర్మాణంలోనే ఉన్న అసంపూర్ణ ప్రజా స్వామ్య పోరాట చరిత్ర కనుక అప్పుడు చరిత్ర రచ నకు సమయం చిక్కడం లేదా? లేదా ఇంకా ఎందరో పోరాటయోధులు రక్తంతో చరిత్ర రచన కొనసాగు తున్నదా? బండ్రు నర్సింహులు నూరేళ్ల పండుగ నూటొక్క పాటల సంబురంలో పి.చంద్ రాసిన ‘సాయుధ పోరాటయోధుని కథ’ ఆవిష్కరించుకు న్నాం. రామిరెడ్డిగారంటే, బండ్రు నర్సింహులు వలెనే ఇంచుమించు నూరేళ్ల తెలంగాణ చరిత్ర. ఏడు దశాబ్దాలకు పైగా పోరాట చరిత్ర. జీవితమంతా ప్రజా పోరాటాలతో పరుచుకున్న చరిత్ర. - వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యులు మొబైల్: 96765 41715 -
పిడుగుపాటుతో రైతుకు తీవ్రగాయాలు
న్యాల్కల్ (మెదక్): పొలంలో పని చేసుకుంటుండగా పిడుగుపడటంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా న్యాల్కల్ మండలంలో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మండలంలోని ముంగి గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే రైతు గ్రామం సమీపంలోని పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఇంతలోనే పొలంలో పనిచేసుకుంటున్న రైతు రామిరెడ్డిపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోనే ఉన్న తుకారాం అనే వ్యక్తి గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు క్షతగాత్రుడిని బీదర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. -
నేను బాల్కనీలో దాక్కున్నా...
-
నేను బాల్కనీలో దాక్కున్నా...
హైదరాబాద్ : కళ్ల ఎదుటే అమ్మను, చెల్లిని, నాన్నమ్మను... నాన్న దారుణంగా హతమార్చాడు. తనను కూడా చంపేందుకు వస్తున్న తండ్రి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ చిన్నారి బాల్కనీలోకి పరుగెత్తి తలుపు గడియ పెట్టుకుంది. అదృష్టవశాత్తు తండ్రి బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యూష.. జరిగిన దారుణాన్ని భయం భయంగా వివరించింది. బాలాపూర్‌లోని సాయినగర్‌లో రామిరెడ్డి అనే వ్యక్తి తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతుకోసి హతమార్చిన విషయం తెలిసిందే. (చదవండి: కుటుంబ సభ్యులను హతమార్చిన కిరాతకుడు) ఈ ఘటన నుంచి తప్పించుకున్న రామిరెడ్డి పెద్ద కుమార్తె ప్రత్యూష.. మీడియాతో మాట్లాడుతూ 'నిద్రలో ఉన్నా, అయితే ఏమైందో మమ్మీ పెద్దగా ఒర్లింది. డాడీ బయట నుంచి గొళ్లెం పెట్టిండు.. మళ్లీ అక్షయను పిలిచిండు. లోనికి పిలిచి చున్నీతో చంపిండు. ఏమైంది అని నాన్నమ్మ డాడీని అడిగితే ఏం కాలేదన్నడు. ఆ తర్వాత నాన్నమ్మని చంపిండు. నాకు భయం వేసి బాల్కనీలో దాక్కున్నా. డోర్ పెట్టుకున్నా. డాడీ నన్ను కూడా పిలిసిండు. ప్రత్యూష బయటకు రా అని బెదిరించాడు. నాకు మస్తు భయం వేసింది. కింద నుంచి కత్తి వేశాడు. ఇంతలో పెదడాడీ వచ్చాడు. ఏమైందంటే.. నీవెవడ్రా.. వీళ్లను చంపితే నాకు ఆస్తి వస్తుంది. అందుకే చంపేశా అన్నడు. పెదమమ్మీని కూడా తిట్టాడు. ఆ తర్వాత బయటకు వెళ్లిపోయాడు' అని తెలిపింది. కాగా హత్యల అనంతరం పరారీ అవుతూ ఓ వ్యవసాయ బావిలో పడిపోయిన రామిరెడ్డిని పోలీసులు బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆస్తి తగదాల కారణంగానే అతడు తన కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.