సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలుగు ప్రజలు ఐక్యత కోసం కర్నూలు రాజధానిని సీమ ప్రజలు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అభివృద్ది విషయాలపైనే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.
అమరావతిలో అభివృద్ధి కేంద్రీకరణ చేయాలన్న చంద్రబాబు డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రామిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని 90 రోజులు న్యాయవాదులు విధులు బహిష్కరించి ఉద్యమాలు చేశారని, హైకోర్టు కావాలని కోరిన వారిని ఆనాడు చంద్రబాబు అవమానించారని తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు మరోచోట ఉన్నాయని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఆలూరి రామిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment