Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Trump Tariffs Row: EAM Jaishankar On India China Relations 1
సానుకూల దిశగా చైనా-భారత్‌ సంబంధాలు

న్యూఢిల్లీ, బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్‌ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్‌ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్‌ టారిఫ్‌ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్‌ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్‌ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్‌ చేశారు.

key decision on Union Cabinet meeting today2
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఢిల్లీ : కార్గో,ఎక్స్‌ప్రెస్,ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకల కోసం కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలోని (చిత్తూరు, తిరుపతి) మీదుగా తమిళనాడు (వెల్లూరు) వరకు వెళ్లే రైల్వే లైన్‌లో మరో అదనపు రైల్వే లైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. కేబినెట్‌ సమావేశంలోని నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. తిరుపతి -పాకాల - కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ రూ.1332 కోట్ల రూపాయల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. తద్వారా 400 గ్రామాలు,14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 👉పీఎంకేఎస్‌వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. Union cabinet approves modernization of Command Area Development and Water Management (M-CADWM) as a sub-scheme of Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) for the period 2025-2026 with an initial total outlay of Rs.1600 crore. pic.twitter.com/SB3g4Mcqoq— ANI (@ANI) April 9, 2025

KSR Comments On Nara Lokesh red Book3
అణచివేతలో.. ఇందిరమ్మకు తీసిపోని లోకేశ్‌‌?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ మాటల తీరు, చేష్టలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులు కూడా 1975 నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి రాజ్యమేలిన ఇందిరాగాంధీ అప్పట్లోనూ ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగానే అభివర్ణించారు. పోలీసుల అకృత్యాలకు తట్టుకోలేక ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు చాలా మంది అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్ సారథి. ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారా? అనుకునేంత పవర్ ఫుల్‌. కేంద్ర మంత్రి ఒకరు సంజయ్ గాంధీ చెప్పులు మోశారన్న విమర్శలు వచ్చాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.మీడియాలో అయితే అంతా భజన వార్తలే ఇవ్వాలి. రామ్‌నాథ్‌ గోయాంకాకు చెందిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి పత్రికలే ప్రభుత్వం తప్పులపై విమర్శలతో వార్తలు ఇచ్చేవి. వాటిని కూడా సమాచార శాఖ అధికారులు సెన్సార్ చేసేవారు. దానికి నిరసనగా వార్తల బదులు ఖాళీగా ఉంచి పత్రికలను ముద్రించేవారు. దాదాపు రెండేళ్లపాటు దేశం అంతటా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంది. ఏపీలోనూ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతుందా? అన్న భయం కలుగుతోంది. టీడీపీలో చేరకపోతే వైఎస్సార్‌సీపీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏ జైలు చూసినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అధికంగా కనిపిస్తున్నారట.ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అరాచకాలను తట్టుకోవడం కష్టంగా ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం వారిని నియంత్రించడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. మిగతా నేరాల అదుపు చేయడం సంగతి ఎలా ఉన్నా పోలీసులు బృందాలు, బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారట. ఇదంతా లోకేశ్‌ రెడ్ బుక్ ప్రభావమే. దానిని ఆయన కూడా నిర్ధారిస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు ఎక్కించి వేధిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి అంటుంటే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే ఏపీలో ప్రజలను రక్షించేదెవరన్న ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కన్నా లోకేశ్‌కే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీ వారంతా లోకేశ్‌ దృష్టిలో పడితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. లోకేశ్‌ జోక్యం చేసుకోని ప్రభుత్వ శాఖ ఉండడం లేదట. వేర్వేరు శాఖల మంత్రులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు లోకేశ్‌నే ప్రధాన అతిధిగా పిలుస్తూన్నారు.తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే, ఈయన మంత్రి అయ్యేవారా? ప్రస్తుతం యువరాజు మాదిరి ఇదంతా తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించ గలిగేవారా?. తన ఆదేశాల మేరకే రెడ్ బుక్ పనిచేస్తోందని, తానే దానికి బాధ్యుడనని మరింత ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ఎంత వీక్ అయింది అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పాలన ఇంత అధ్వాన్నంగా లేదు. లోకేశ్‌ అండ్ కో ఆదేశాల మేరకు రాజకీయంగా వ్యతిరేక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు శాఖ దుర్వినియోగం, ఒక కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటే మరికొన్ని కేసులు పెట్టి అరెస్టు చేయడం, రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పడం వంటివి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఏపీలో ఎవరినైనా ఎక్కువగా వేధించాలని అనుకుంటే వెంటనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తితో ఒక కేసు పెట్టిస్తున్నారు.నటుడు పోసాని కృష్ణ మురళి వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాదాపు నెల రోజుల పాటు వందల కిలోమీటర్ల దూరం ప్రతి రోజు తిప్పుతూ వేధించారంటే ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై ఒక ఎస్టీ వ్యక్తితో ఫిర్యాదు చేయించారట. మరో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అదే చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లోకేశ్‌ నేరుగా రెడ్ బుక్ అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఆయన వైఎస్సార్‌సీపీ వారిని ఉద్దేశించి చెప్పినట్లు కనిపించినా, నిజానికి ఆయన బెదిరించింది ప్రజలనే. ఆయా చోట్ల ప్రాజెక్టులు వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. భూముల పరిహారం, కాలుష్యం తదితర సమస్యలు వస్తాయి. వాటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతారు. వారికి రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి. ఆ సమస్యలలో వాస్తవమైనవి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. అంతే తప్ప పోలీసులను పెట్టి కొట్టిస్తామని, వేధిస్తామని అన్నట్లుగా రెడ్ బుక్ తో భయపెడతామన్నట్లుగా స్వయానా ఒక మంత్రి మాట్లాడితే ఏమి చేయాలి? అలాంటివి ఎల్లకాలం సాగవన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే ప్రస్తుతం లోకేశ్‌ ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు గతంలో జగన్ ప్రభుత్వ కాలంలో మంజూరు అయినదే. రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా ఏపీకి వచ్చి జగన్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటూ ప్రసంగించారు. అయినా అవేవో తామే తెచ్చినట్లు లోకేశ్‌ బిల్డప్ ఇచ్చుకున్నారు. అలా చేసినంత వరకు ఆక్షేపించనవసరం లేదు. కానీ, ఆ సందర్భంలో కూడా జగన్ టైమ్ లో పరిశ్రమలు వెళ్లిపోయాయని అంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబును మించి అబద్దాలు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థం అవుతుంది. జగన్ టైమ్‌లో కర్నూలు వద్ద వచ్చిన గ్రీన్-కో ఎనర్జీ ప్లాంట్‌ను ఎద్దేవా చేసింది లోకేశ్‌ కాదా?. దానిని చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు ఎన్ని వ్యతిరేక కథనాలు రాసిందీ ఒక్కసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. ఈయన చెప్పినదాని ప్రకారం అయితే ఆ రెడ్ బుక్ ను ప్రయోగించవలసింది వారిపైనే కదా!.అదానీ, తదితరులు రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అదానికి రాష్ట్రాన్ని రాసిస్తున్నారని మరో టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిందే. తుని వద్ద జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్కుకు అనుమతి ఇవ్వవద్దని లేఖ రాసింది స్వయంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కాదా?. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం గురజాల ఎమ్మెల్యే బెదిరింపులతో రెండు సిమెంట్ పరిశ్రమలు మూతపడ్డాయట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ దావోస్‌ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే అవేం కంపెనీలు అంటూ మాట్లాడిన లోకేశ్‌ తాము అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా దావోస్ వెళ్లి ఉత్తచేతులతో తిరిగి వచ్చారే. పైగా పెట్టుబడుల కోసం వెళ్లలేదని, ఏపీ బ్రాండ్ ప్రచారం కోసమని చెప్పుకున్నారే. ఆ తర్వాత ఆరున్నర లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు అయ్యాయంటూ, అవేమిటో చెప్పకుండానే ప్రచారం ఆరంభించారే. ఇప్పుడేమో కర్నూలు గ్రీన్ ఎనర్జీ కంపెనీని, కడప ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారే. కడపలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ను జగన్ తీసుకువస్తే దానిని అమరావతికి తరలించే యత్నం చేశారా? లేదా?.గతంలో జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వస్తే వాటికి అడ్డు పడడానికి తెలుగుదేశం కాని, ఎల్లో మీడియా కాని చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా పచ్చి అబద్దాలు ప్రచారం చేసిందీ వీరే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరికి బ్యాండ్ వాయించే వారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉంటే కొన్ని వందల కేసులు నమోదై ఉండేవి. ఉదాహరణకు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేశ్‌ ఎందరిని బెదిరించారో అందరికీ తెలుసు. జిల్లా ఎస్పీలను సైతం పేరుపెట్టి హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి మాదిరిగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఉంటే లోకేశ్‌పై ఎన్ని కేసులై ఉండేవి. ఇప్పటం వద్ద అనుమతి లేకుండా కారు పైన కూర్చుని పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. మరోసారి రోడ్డుపై అడ్డంగా పడుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన పవన్‌పై ఆ రోజుల్లో కేసులు పెట్టారా? లేదే!.మహిళలు మిస్ అయ్యారని తప్పుడు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి ఉండవచ్చు కదా?. అయినా అలా చేయలేదే. చంద్రబాబు, లోకేశ్‌లు అప్పటి సీఎం జగన్‌ను సైకో అంటూ, పలు అభ్యంతరకర పదాలు వాడారా? లేదా?. అయినా వారి మీద కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోలీసులు వైఎస్సార్‌సీపీ వారిపై, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారే!. ఏ రాజ్యాంగం వీటికి అనుమతి ఇస్తుంది?. ఈ విషయంలో ఏపీ హైకోర్టు సైతం పలుమార్లు పోలీసులను హెచ్చరించినా వీరి ధోరణి మారడం లేదు. సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతూ ఒక జూనియర్ లెక్చరర్ ప్రశ్నిస్తే ఆయన వద్ద నాటు సారా దొరికిందని కేసు పెట్టారట. ఇలా ఒకటి కాదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చూశాం.ఇవన్నీ రెడ్ బుక్ లో భాగమేనని లోకేశ్‌ గర్వంగా ఫీల్ అవుతుండవచ్చు. కానీ షాడో సీఎం స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలని ఆశపడుతున్న లోకేశ్‌ నిజంగానే ఆ పదవిలోకి వస్తే రాష్ట్రం ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అన్న భయం ప్రజలలో ఏర్పడదా?. నిత్యం అబద్దాలు చెప్పడం కాకుండా, కాస్త నిజాయితీగా మాట్లాడుతూ, హుందాగా వ్యవహరిస్తూ, రెడ్ బుక్ పిచ్చిగోలను వదలి వేయకపోతే రాజకీయంగా లోకేశ్‌కే నష్టం కలుగుతుంది. కక్ష పూరిత రాజకీయాలతోనే అధికారంలో కొనసాగాలనుకుంటే అది ఎల్లకాలం అయ్యే పని కాదని ఎమర్జెన్సీ అనుభవం తెలియచేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Not Shreyas Navjot Singh Names 24 Year Old As A Miracle After Sachin4
సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత అంతటి ‘అద్భుతం’ అతడే!

ప్రియాన్ష్‌ ఆర్య.. 24 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడి పేరు క్రికెట్‌ వర్గాల్లో మారుమ్రోగిపోతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లోనే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.సంచలన ఇన్నింగ్స్‌చెన్నైతో మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్‌ ఆర్య (Priyansh Arya).. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో ఏకంగా 103 పరుగులు సాధించాడు. 245కు స్ట్రైక్‌రేటుతో దంచికొట్టి చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 88 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన సంచలన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత అంతటి ‘అద్భుతం’!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ప్రియాన్ష్‌ ఆర్యను ఆకాశానికెత్తాడు. టీమిండియా దిగ్గజం, బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) తర్వాత అంతటి అద్భుతాన్ని ఇప్పుడే చూశానంటూ అతడిని కొనియాడాడు. మైదానం నలుదిశలా షాట్లతో హోరెత్తించాడని.. సీఎస్‌కేలో ఉన్న ప్రపంచస్థాయి బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు అమోఘమని ప్రశంసించాడు.‘‘ప్రియాన్ష్‌ ఆర్య... టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత.. విపత్కర పరిస్థితుల్లో అంత గొప్పగా ఆడిన రెండో ఆటగాడు ఇతడే. సచిన్‌ తర్వాత నేను చూసిన అద్భుతం ఇతడే.క్లిష్ట పరిస్థితుల్లో మేటి బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇంచుమించు 250 స్ట్రైక్‌రేటుతో శతక్కొట్టడం ఊహకు అందని విషయం. శ్రేయస్‌ అయ్యర్‌, నేహాల్‌ వధేరా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అవుటైన తర్వాత.. ఒంటిచేత్తో పంజాబ్‌ను ఆదుకున్నాడు.ఆకాశమే హద్దుగాపాయింట్‌, కవర్లు.. ఒక్కటేమిటి మైదానం అన్ని వైపులకు బంతిని తరలిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పతిరణ, జడేజా, అశ్విన్‌, నూర్‌ అహ్మద్‌ వంటి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో పంజాబ్‌ను గెలిపించాడు’’ అని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ప్రియాన్ష్‌ ఆర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.వరుసగా నాలుగో ఓటమికాగా ముల్లాన్‌పూర్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత తొలుత బ్యాటింగ్‌ చేసింది. చెన్నై ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించినా.. ప్రియాన్ష్‌ ఆర్య (103), శశాంక్‌ సింగ్‌ (52 నాటౌట్‌), మార్కో యాన్సెన్‌ (34 నాటౌట్‌) దంచికొట్టడంతో.. పంజాబ్‌ 20 ఓవర్లలో 219 పరుగులు స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైపోయింది. ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్‌ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్‌ అవుట్‌), శివం దూబే (42), మహేంద్ర సింగ్‌ ధోని (27) ఓ మోస్తరుగా ఆడారు. అయితే, విజయానికి 18 పరుగులు దూరంలో చెన్నై నిలిచిపోయింది. ఇక ఐపీఎల్‌-2025లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్‌ ఇప్పటికి నాలుగింట మూడు గెలిచింది.ఐపీఎల్‌-2025: పంజాబ్‌ వర్సెస్‌ చెన్నై స్కోర్లుపంజాబ్‌: 219/6 (20)చెన్నై: 201/5 (20)ఫలితం: 18 పరుగుల తేడాతో చెన్నైపై పంజాబ్‌ గెలుపుచదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్‌ వైరల్‌

Masterchef India Ex Contestant Urmila Asher Inspiring Life Story5
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..

జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్‌గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో..అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్‌ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ వచ్చేస్తుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్‌కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్‌ నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్‌చెఫ్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్‌ రణవీర్‌బ్రార్‌ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్‌ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపంతో బయట ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకలప్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్‌ సెంటర్‌ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్‌లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్‌ సెంటర్‌గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్‌ టెడ్‌ఎక్స్‌ స్పీకర్‌గా మారి ఆమె కథ ఎందరినో కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్‌ ట్యూమర్‌తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్‌లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మంచి సక్సెస్‌ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్‌ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తనకొచ్చిన కష్టానికి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?)

Now Chandrababu Got Paradala CM Tag Officially6
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ

అమరావతి, సాక్షి: ఎట్టకేలకు ఏపీలో సొంతింటి నిర్మాణం పనులు చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఉండవల్లిలోని కరకట్టపై ‘అక్రమ’ నివాసంలో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. వరదలు వచ్చిన ప్రతీసారి ఆ నివాసం మునిగిపోతూ వస్తోంది.బుధవారం ఉదయం వెలగపూడిలో పరదాల మాటున సీఎం చంద్రబాబు నివాసానికి భూమి పూజ జరిగింది. సచివాలయం వెనుక.. ఎమ్మెల్యేల క్వార్టర్ల సమీపంలో ఈ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారాయన. ఇందుకోసం ఐదెకరాల భూమిని కొనుగులు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలెవరికీ ఆహ్వానం పంపించలేదు. అలాగే.. ఆ స్థలం వైపుగా ఎవరూ వెళ్లకుండా అధికారులు గ్రీన్‌ పరదాలు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగిన నారా వారి గృహ శంకుస్థాపన మహోత్సవంలో నారా లోకేష్‌ దంపతులు పాల్గొన్నారు. మనవడు దేవాన్ష్‌ను చంద్రబాబు పూజలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి హైదరాబాద్‌లో ప్యాలెస్‌లాంటి ఇల్లు ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ సొంతిల్లు లేకపోవడంతో ఆ మధ్య బాగా విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో ఏపీలో కొత్తింటిని నిర్మించుకోబోతున్నారు. ఐదెకరాల భూమిలో.. 25 వేల గజాల్లో హైదరాబాద్‌ ప్యాలెస్‌ను తలదన్నెలా భవనం నిర్మించబోతున్నట్లు సమాచారం.

Why Congress chief Kharge Demands ballot paper At AICC Meeting Details7
ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లు రావాల్సిందే: ఖర్గే

అహ్మదాబాద్‌: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందని, ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఈ క్రమంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ పేపర్లను తిరిగి తీసుకురావాల్సిందేనని గట్టిగా గళం వినిపించారాయన. బుధవారం ఏఐసీసీ సమావేశంలో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఖర్గే.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఈవీఎంల నుంచి బ్యాలెట్‌ పేపర్ల వైపు మళ్లుతోంది. కానీ, మనం ఇంకా ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాం. ఇదే అతి పెద్ద మోసం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మళ్లీ.. ఈవీఎంల మోసాల్ని నిరూపించాలని వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ విషయంలో యువతరం మేల్కొవాలి. బ్యాలెట్‌ పేపర్లు కావాలని ముందుకు వచ్చి పోరాడాలి. మహారాష్ట్రలో ఏం జరిగింది?. ఈవీఎంలతో అతిపెద్ద మోసం జరిగింది. అక్కడ ఎలాంటి ఓటర్ల జాబితాను రూపొందించారు?. బీజేపీ 90 శాతం సీట్లు ఎలా నెగ్గింది?. ఎన్నికల చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. అసలు మహారాష్ట్ర ఎన్నికలే పెద్ద మోసం. ఈ అంశాన్ని మేం దాదాపు ప్రతీ చోటా ప్రస్తావించాం. రాహుల్‌ గాంధీ గట్టిగా గళం వినిపించారు. హర్యానాలోనూ అదే జరిగింది. మా లాయర్లు, నేతలు.. ఆ దొంగలను దొరకబట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదో ఒకనాటికి వాస్తవాలు బయటపడక తప్పదు.చట్టసభల్లో ప్రతిపక్షంగా మన గళం వినిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏకపక్షంగా కేంద్రం బిల్లులను ఆమోదించుకుంటోంది. అలాంటప్పుడు ప్రజల గొంతుకను ఎలా వినిపిస్తాం?. అమెరికా టారిఫ్‌ల మీద చర్చకు అవకాశం ఇవ్వలేదు. మణిపూర్‌పై వేకువ జామున 4 గంటలకు చర్చిస్తామన్నారు. ఉదయం చర్చించాలని నేను అడిగితే తిరస్కరించారు. ప్రభుత్వం ఏదో దాస్తుందో కాబట్టే ఇలాంటి పనులు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నెమ్మది నెమ్మదిగా అంతం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మీద గత 11 ఏళ్లు దాడి జరుగుతూనే ఉంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ దేశ అభివృద్ధి కోసం పలు సంస్థలను స్థాపించింది. కానీ, ప్రభుత్వ సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్‌ వ్యక్తులపరం చేసింది. జాతి ప్రయోజనాల కంటే.. ప్రైవేట్‌ వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఆఖరికి.. రిజర్వేషన్లనూ ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే దేశాన్ని అమ్మేసే ప్రమాదం లేకపోలేదు. బీజేపీ ఆరెస్సెస్‌లు మతపరమైన అంశాలతో వివాదాలు సృష్టించాలనుకుంటున్నాయి. మసీదుల కింద శివలింగాలను వెతకడం లేదంటూనే ఆ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ మంట పెడితే.. ఆరెస్సెస్‌ దానికి ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్‌ ఆల్వార్‌ ఘటనతో బీజేపీ దళిత వ్యతిరేక ధోరణి బయటపడింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సౌజ్‌ డ్యూటీ సుంకాలు పెంచడం, గ్యాస్‌ ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుంటే.. అమిత్‌ షా కఠిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు?. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ప్రజాహితం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పలు చట్టాలు చేశాయి. భూసేకరణ చట్టం, నిర్భంద విద్య, అటవీ రక్షణ చట్టాలు చేసింది. ఈ అంశాలపై మనం పోరాడాల్సిన అవసరం ఉంది.ఇక డీసీసీలదే పవర్‌ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులకు పవర్స్‌ కట్టబెట్టింది. ఇక నుంచి అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీలదే నిర్ణయమని వెల్లడించింది. ఇది ఏఐసీసీ నిర్ణయంగా ఖర్గే బుధవారం ప్రకటించారు.

YSRCP MP Avinash Reddy Serious Warning To TDP Leaders8
ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్‌ రెడ్డి వార్నింగ్‌

సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. ఏపీలో వైఎస్సార్‌సీపీ కేడర్‌ వినాశమే టార్గెట్‌గా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం అని హెచ్చరించారు.కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషాను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ భాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్‌ భాషాను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్‌ భాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్ భాషాను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్‌ భాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దారుణం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని హెచ్చరించారు.

Tamil Nadu school children dance  video with  100 million views viral 9
శివదర్శిని ఫ్యాన్స్‌ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్‌

పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్‌ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆడా, మగా పిల్లలు గ్రూపుగా కలిసి థాయ్ పాటకు అందంగా నృత్యం చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 10 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. పిల్లల పిల్లల ఉత్సాహం , వారి ఆనందం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు నెటిజన్లు తన బాల్యం సంగతులను గుర్తు చేసుకున్నారు.తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈ థాయ్ పాటకు డ్యాన్స్‌ చేశారు.మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్ , మిడిల్ స్కూల్, తెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ స్టెప్పులేశారు. ఒక అమ్మాయిల బృందం, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ, తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నా సోదరుడిని చూశారా? నాన్నను అడిగారా?) థాయ్ సాహిత్యం అసాధారణంగా తమిళ భాషకు సారూప్యంగా ఉండటంతో విశేషంగా నిలిచింది. "వారు మీనియన్స్ లాగా కనిపిస్తున్నారు" అని ఒక యూజర్, "దేవా, దయచేసి నన్ను నా స్కూల్ రోజులకు తీసుకెళ్లండి" అని యూజర్‌ కమెంట్‌ చేశారు. View this post on Instagram A post shared by Suryan FM (@suryanfm) ఈ టీచర్‌ ఇన్‌స్టాలో ఖాతానిండా పిల్లల యాక్టివిటీస్‌, ఆటలు, పాటల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు వీరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ముఖ్యంగా శివదర్శిని అనే అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇదీ చదవండి: నా సక్సెస్‌ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్‌తమిళ భాషలా ధ్వనించే అనన్ త పద్ చాయే అనే పాట ఇండియాలో చాలా ట్రెండింగ్‌. దీని ఒరిజినల్‌ ట్రాక్‌ను థాయ్ హాస్యనటుడు-గాయని నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. 2019లో ఇండోనేషియా ప్రదర్శనకారిణి నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో దీన్ని పాడినపుడు ఇది ప్రజాదరణ పొందింది.

Thopudurthi Prakash Reddy Strong Counter to Ramagiri SI Sudhakar Yadav10
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?

అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్‌ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. ..సుధాకర్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్‌ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు... ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్‌ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement